హీరో మోహన్‌ రీఎంట్రీ, ఈసారి యాక్షన్‌తో.. | Actor Mohan Re entry With Action Movie Hara, Shooting Starts in Chennai | Sakshi
Sakshi News home page

Actor Mohan: హీరో మోహన్‌ రీఎంట్రీ, ఈసారి యాక్షన్‌తో..

Published Sat, Mar 26 2022 8:32 AM | Last Updated on Sat, Mar 26 2022 8:32 AM

Actor Mohan Re entry With Action Movie Hara, Shooting Starts in Chennai - Sakshi

ఒకప్పుడు ప్రేమకథా చిత్రాల కథానాయకుడిగా రాణించిన మోహన్‌ చాలా గ్యాప్‌ తర్వాత హరా అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. దాదా 87 ఫేమ్‌ విజయ్‌ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్‌పీ మోహన్‌రాజ్‌, జీ స్టూడియోస్‌ జయశ్రీ విజయ్‌ కలిసి నిర్మిస్తున్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌ల గురించి బోధించినట్లే ఐపీసీ చట్టం రూల్స్‌ గురించి కూడా భోధించాలని చెప్పే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం అని దర్శకుడు తెలిపారు. ఇప్పటి వరకు ప్రేమకథా చిత్రాల్లో నటించిన మోహన్‌ ఈ చిత్రంలో యాక్షన్‌ హీరోగా కనిపించబోతున్నారు. చెన్నైలో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసి అనంతరం కోయంబత్తూరు, ఊటీ ప్రాంతాల్లో చిత్రీకరణ చెస్తామని దర్శకుడు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement