
దేవ్ మోహన్, రష్మికలపై క్లాప్ ఇస్తున్న అమల
హీరోయిన్ రష్మికా మందన్నా లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘రెయిన్‌బో’ చిత్రం షురూ అయింది. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటి అమల అక్కినేని క్లాప్ కొట్టారు. నిర్మాత సురేష్‌బాబు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు.
రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘రెయిన్‌బో’ చేస్తు్తన్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 7న ప్రారంభం అవుతుంది’’ అన్నారు ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్. ప్రభు. ‘‘రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రమిది’’ అన్నారు శాంతరూబన్. ఈ ప్రారంభోత్సవానికి నిర్మాతలు కేకే రాధామోహన్, దామోదర్ ప్రసాద్, పి. కిరణ్, శరత్ మరార్, సుప్రియ అక్కినేని, దర్శకులు వెంకీ కుడుముల, శశికిరణ్, హీరో సందీప్ కిషన్ తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కేఎం భాస్కరన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగ ప్రభాకరన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ భాస్కరన్.
Comments
Please login to add a commentAdd a comment