Producer SR Prabhu Shocking Comments On Samantha About Rainbow Movie - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: సమంతకు షాక్‌.. ఆమె స్థానంలో ప్రాజెక్ట్‌ దక్కించుకున్న రష్మిక

Published Tue, Apr 4 2023 8:52 AM | Last Updated on Tue, Apr 4 2023 9:38 AM

Producer Prabhu Shocking Comments On Samantha About Rainbow Movie - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీల్లో క్రేజీ హీరోయిన్‌గా సత్తా చాటుతుంది. ఈ క్రమంలో ఆమె తొలిసారిగా ఫీమెల్‌ సెంట్రిక్‌ మూవీలో నటిసస్తుంది. ఈ చిత్రానికి రెయిన్‌బో అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రష్మికకు జోడీగా శాకుంతలం హీరో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. అయితే నిజానికి ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్‌గా అనౌన్స్‌ చేశారు. మరి ఏమైందో ఏమో కానీ ఊహించని విధంగా ఆమె స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీంతో అసలు సామ్‌ ప్లేస్‌లో రష్మిక రావడం ఏంటని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని నిర్మాతను అడగ్గా ఆయన మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్‌కు ఎవరు సరిపోతారో వాళ్లనే ఎంపిక చేసుకుంటాం.

ఆ ఫ్లోని మేం మార్చాలనుకోవడం లేదు. కంటెంట్‌, కర్మ అలా జరుగుతూ వెళ్తుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు' అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సమంతను అనౌన్స్‌ చేసి ఇప్పుడు మరో హీరోయిన్‌ను తీసుకోవడమే కాకుండా, కర్మ వల్ల ఇలా జరుగుతుందటూ నిర్మాత ప్రభు కామెంట్స్‌పై సామ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement