షూటింగ్‌కు ప్రభాస్‌ రెడీ | Prabhas Radhe Shyam is likely to resume in October | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో ఆరంభం

Published Sat, Aug 22 2020 1:08 AM | Last Updated on Sat, Aug 22 2020 8:12 AM

Prabhas Radhe Shyam is likely to resume in October - Sakshi

ప్రభాస్‌ మళ్లీ షూటింగ్‌ చేయడానికి ప్లాన్‌ సిద్ధం అయిందట. అక్టోబర్‌ నుంచి ‘రాధే శ్యామ్‌’ చిత్రీకరణలో పాల్గొనాలని ప్రభాస్‌ అనుకుంటున్నారని సమాచారం. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 60 శాతం పూర్తయిందని సమాచారం.

లాక్‌డౌన్‌ ముందు వారమే జార్జియాలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని వచ్చింది చిత్రబృందం. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూట్‌ చేయడం ఇబ్బందే అని హైదరాబాద్‌లోనే వీలైనంత భాగాన్ని సెట్స్‌ వేసి చిత్రీకరించనున్నారని తెలిసింది. అక్టోబర్‌ మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందట. ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలన్నది ప్లాన్‌. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement