Krishnam Raju Comments On Prabhas Marriage And Radhe Shyam Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Krishnam Raju: 'ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటే చూడాలనుంది...పిల్లలతో ఆడుకోవాలి'

Published Tue, Mar 15 2022 9:14 AM | Last Updated on Tue, Mar 15 2022 9:55 AM

Krishnam Raju Reacted On Prabhas Marraige And Radhe Shyam Movie - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్‌. కె. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్‌ చేసింది రాధేశ్యామ్‌. ఈ సినిమా విజయం పట్ల సీనియర్‌ హీరో, ప్రభాస్‌ పెదనాన్న కృష్ణం రాజు స్పందించారు. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందన్నారు. చదవండి: కృష్ణంరాజు హోంటూర్‌ చూశారా? ఇల్లంతా బంగారమే

అలాగే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రాధేశ్యామ్‌పై ప్రశంసలు కురిపించినట్లు తెలిపారు. మరోవైపు డార్లింగ్‌ పెళ్లి గురించి కూడా కృష్ణంరాజు స్పందించారు. ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని, ప్రభాస్‌కు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టారు. కాగా రాధేశ్యామ్‌ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి, చెల్లెలు ప్రసీద సైతం స్పం‍దించిన సంగతి తెలిసిందే. చదవండి: బాహుబలి-3 ఉంటుంది, వర్క్‌ చేస్తున్నాం : రాజమౌళి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement