ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలిరోజే దాదాపు రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టి మరోసారి ప్రభాస్ సత్తా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపించింది. ఇక ఈ సినిమా విజయం పట్ల సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ప్రభాస్ కలిసి ఇంతకుముందు నటించాం. ఈ సారి మా అమ్మాయి ప్రసీద కూడా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను 'పరమహంస' పాత్రలో కనిపిస్తాను.ఈ పాత్రను చూస్తే వివేకానందుడు .. రామకృష్ణ పరమహంస మాదిరిగా అనిపిస్తుంది. అంతటి నిండుదనం ఉన్న పాత్రను చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆ పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను.
'పరమహంస' పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్టుగా ఉందని ప్రభాస్ ఒక ఇంటార్వ్యూలో చెప్పాడు. నిజంగా అది నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా నేను భావిస్తున్నాను. ప్రభాస్ కెరియర్ అంచనాలను దాటుకుని వెళుతోంది. అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమానే చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ‘రాధేశ్యామ్' కూడా ఇంత ఆలస్యమై ఉండేది కాదు. కరోనా ప్రభావం వలన కలిగిన ఆటంకాల వలన ప్రేక్షకుల ముందుకు రావడానికికి చాలా సమయం పట్టేసింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పాడు’అని కృష్ణంరాజు చెపుకొచ్చాడు.అలాగే రాధేశ్యామ్ చిత్రాన్ని బాహుబలితో చూసి పోల్చొద్దని చెప్పారు. ఇక ప్రభాస్ ఏ సినిమా రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు అని అడిగితే.. ‘మనవూరి పాండవులు’అయితే బాగుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment