
Radha Krishna Kumar Respond to Controversial Comments: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ప్రేమకథ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాల మధ్య మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదట్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజే ఓ వర్గం ప్రేక్షకులు మూవీ ప్లాప్ అంటూ ప్రచారం చేయగా మరో వర్గం ప్రేక్షకులు మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అన్నారు. రాధేశ్యామ్ పిరియాడికల్ లవ్‌స్టోరీ అని ముందు నుంచి డైరెక్టర్, మూవీ టీం చెబుతూనే ఉంది.
చదవండి: ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!
దీంతో పూర్తి ప్రేమకథ అని భావించిన వారిని ఈ మూవీ ఆకట్టుకోగా.. మరికొందరిని మాత్రం నిరాశ పరిచింది. దీనికి కారణంగా రాధేశ్యామ్‌లో ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా లేకపోవడమే. అంతేకాదు పాన్ ఇండియా చిత్రం, రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ మూవీ, పైగా ప్రభాస్ సినిమా.. అందులో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ లేదు, ఓ కామెడీ లేదంటూ మాస్ ఆడియన్స్ అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాధేశ్యామ్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న డైరెక్టర్ రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ లేవని వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు.
చదవండి: సూపర్ హిట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న రాధేశ్యామ్
వెజిటేరియన్ హోటల్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు? అని ప్రశ్నించాడు. అంతేకాదు రాధేశ్యామ్ ఇంటెన్సీవ్ లవ్‌స్టోరీ అని ముందు నుంచే చెబుతున్నామని, ఓ ప్రేమకథ నుంచి ఇంకేం ఆశిస్తారంటూ మండిపడ్డాడు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించగా, పూజా డాక్టర్ ప్రేరణ పాత్ర పోషించింది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రేమకథ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల కలెక్షన్ రాబట్టి క్రియేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment