radha krishna kumar
-
‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం
Radha Krishna Kumar Respond to Controversial Comments: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ప్రేమకథ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాల మధ్య మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజే ఓ వర్గం ప్రేక్షకులు మూవీ ప్లాప్ అంటూ ప్రచారం చేయగా మరో వర్గం ప్రేక్షకులు మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అన్నారు. రాధేశ్యామ్ పిరియాడికల్ లవ్‌స్టోరీ అని ముందు నుంచి డైరెక్టర్, మూవీ టీం చెబుతూనే ఉంది. చదవండి: ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! దీంతో పూర్తి ప్రేమకథ అని భావించిన వారిని ఈ మూవీ ఆకట్టుకోగా.. మరికొందరిని మాత్రం నిరాశ పరిచింది. దీనికి కారణంగా రాధేశ్యామ్‌లో ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా లేకపోవడమే. అంతేకాదు పాన్ ఇండియా చిత్రం, రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ మూవీ, పైగా ప్రభాస్ సినిమా.. అందులో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ లేదు, ఓ కామెడీ లేదంటూ మాస్ ఆడియన్స్ అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాధేశ్యామ్ సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ లేవని వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. చదవండి: సూపర్ హిట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న రాధేశ్యామ్ వెజిటేరియన్ హోటల్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు? అని ప్రశ్నించాడు. అంతేకాదు రాధేశ్యామ్ ఇంటెన్సీవ్ లవ్‌స్టోరీ అని ముందు నుంచే చెబుతున్నామని, ఓ ప్రేమకథ నుంచి ఇంకేం ఆశిస్తారంటూ మండిపడ్డాడు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించగా, పూజా డాక్టర్ ప్రేరణ పాత్ర పోషించింది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రేమకథ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల కలెక్షన్ రాబట్టి క్రియేట్ చేసింది. -
రాధేశ్యామ్‌కు పోటీ ఇవ్వనున్న చిత్రం ఇదేనా !
Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'రాధేశ్యామ్'. చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే ప్రభాస్ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్‌తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్'. తర్వాత మిక్స్డ్ పబ్లిక్ టాక్‌తో రోజురోజూకీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్ మాత్రం మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. #RadheShyam AP/TS Box Office Biz stays STRONG despite mixed response. Day 1 - ₹ 37.85 cr Day 2 - ₹ 21.48 cr Day 3 - ₹ 19.31 cr Total - ₹ 78.64 cr#Prabhas — Manobala Vijayabalan (@ManobalaV) March 14, 2022 చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. #TheKashmirFiles shows PHENOMENAL GROWTH… Grows 325.35% on Day 3 [vis-à-vis Day 1], NEW RECORD… Metros + mass belt, multiplexes + single screens, the *opening weekend biz* is TERRIFIC across the board... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr. Total: ₹ 27.15 cr. #India biz. pic.twitter.com/FsKN36sDCp — taran adarsh (@taran_adarsh) March 14, 2022 కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్ ఫైల్స్' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్'ను 'ది కశ్మీర్ ఫైల్స్' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్‌స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్ స్టార్డమ్, వరల్డ్‌వైడ్‌గా డార్లింగ్ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్ ఫైల్స్' రీచ్ అవుతుందా ?.. లేదా బీట్ చేస్తుందా ? చూడాలి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
రాధేశ్యామ్: 'నిన్నేలే' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Ninnele Full Video Song Out Now: ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ చిత్రం నుంచి నిన్నేలే నిన్నేలే అనే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. 'నిన్నేలే నిన్నేలే.. నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే' అంటూ ఎంతో భావోద్వేగంతో ఈ సాంగ్ సాగుతుంది. Come and fall in love 💕 with melodious songs from blockbuster, #RadheShyam #MusicalOfAges#Ninnele (Telugu): https://t.co/ow8TLqHQbH#Unnaalae (Tamil): https://t.co/NDDX3Xq6eu#Ninnalle (Kannada): https://t.co/e1aCqRN8nP#Ninnaale (Malayalam): https://t.co/KfCGZw2rTG pic.twitter.com/r2yyUEdLed — Radhe Shyam (@RadheShyamFilm) March 13, 2022 -
‘రాధేశ్యామ్’మూవీ జెన్యూన్ రివ్యూ..
-
ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా ??
-
రాధేశ్యామ్: అందుకే యూరప్‌లో షూట్ చేశాం
‘‘రాధేశ్యామ్’ చిత్రకథను ప్రభాస్‌గారిని దృష్టిలో పెట్టుకునే రాశాను. రెండున్నర గంటలు ఈ కథ విన్న ఆయన చాలా ఎగై్జట్ అయ్యి, సినిమా చేద్దామన్నారు. సెట్లో ఆయన చిన్నపిల్లాడిలా ఉంటారు.. ప్రతిదీ నేర్చుకుంటారు. ప్రభాస్ లాంటి మంచి ఫ్రెండ్‌తో పాన్ ఇండియా సినిమా చేయడం నా అదృష్టం’’ అని రాధాకృష్ణ కుమార్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ కుమార్ చెప్పిన విశేషాలు. ∙జ్యోతిష్య శాస్త్రంపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. జ్యోతిష్యం నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ కథ అనుకున్నాక చాలా అధ్యయనాలు చేశాను.. కొందరు జ్యోతిష్కులను కలిసి, వారి అనుభవాలు తెలుసుకున్నాను. జ్యోతిష్యం అంటే నమ్మకమా? నిజమా? అనేదానికి నేను ఇచ్చిన ముగింపు ఏంటో మా సినిమా చూస్తే తెలుస్తుంది. యూనివర్సల్ పాయింట్‌తో తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. ఇతర భాషల ప్రేక్షకులకూ కనెక్ట్ అవుతుంది. ∙నా దర్శకత్వంలో వచ్చిన ‘జిల్’ (2015) తర్వాత ‘రాధేశ్యామ్’ అనుకున్నాను. నిజానికి ‘బాహుబలి’ చిత్రం కంటే ముందే ‘రాధేశ్యామ్’ కథని మొదలుపెట్టాం. ‘బాహుబలి’ విడుదల తర్వాత కథలో ఎలాంటి మార్పులూ చేయలేదు.. ఎందుకంటే ‘బాహుబలి’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ‘రాధేశ్యామ్’ని కూడా పెద్ద సినిమాగా అనుకున్నాం. ‘సాహో’ టైమ్‌లోనే ‘రాధేశ్యామ్’ కూడా కొంత షూటింగ్ జరిగింది. కానీ కోవిడ్ వల్ల కొంత ఆలస్యం అయింది. ∙గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేయడం నిజంగా నా అదృష్టం. ఈ కథను మొదట మన దేశంలోనే ఏదైనా ఒక ప్రాధాన్యత ఉన్న ప్లేస్‌ను బేస్ చేసుకుని చేద్దామనుకున్నాను. కానీ ప్రభాస్ సూచన మేరకు యూరప్ బ్యాక్‌డ్రాప్‌గా మారింది. ఇటలీ, ఆస్ట్రేలియా, జార్జియాలో షూటింగ్ చేశాం. కోవిడ్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోందనే చిన్న టెన్షన్ తప్ప నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.. ఫుల్ క్లారిటీతో సినిమా తీశాను. నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఒత్తిడి లేకుండా పనిచేశా. లాక్డౌన్ వల్ల యూరప్ షెడ్యూల్‌ను మధ్యలోనే ఆపేసి వేరే దేశాల మీదుగా ఇళ్లకు చేరుకున్నాం. క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో చేశాం. ∙ఈ చిత్రంలో కృష్ణంరాజుగారు ప్రత్యేక పాత్ర చేశారు. ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అని ప్రభాస్ గారే చెప్పారు. రెండు తరాల హీరోలతో ఒకేసారి పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. పూజా హెగ్డే కథ వినగానే ఓకే అన్నారు. నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఆమెది. ప్రభాస్, పూజా హెగ్డేల జంట చూడముచ్చటగా ఉంటుంది. ‘రాధేశ్యామ్’ కథ నచ్చడం, పైగా ప్రభాస్గారిలాంటి సినిమాతో రీ ఎంట్రీ అంటే బాగుంటుందని భాగ్యశ్రీగారు చేశారు. ∙‘రాధేశ్యామ్’కి బలమైన కథ కుదిరింది.. అందుకే తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, తమన్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటి భారీ సినిమాలకు గ్రాఫిక్స్ ప్రాణం. కమల్ కణ్ణన్‌గారు దాదాపు 12 దేశాల్లోని టెక్నీషియన్స్‌ను కో ఆర్డినేట్ చేసుకుని విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా శ్రమించారు. ∙సోషల్ మీడియా వల్ల సినిమా అనేది ఇంటర్నేషనల్ అవుతోంది. నాకు ఫలానా జోనర్లో సినిమా తీయాలనే ఆసక్తి లేదు.. అన్ని జోనర్స్ ఇష్టం. అయితే చాలెంజింగ్ కథలంటే ఇంకా ఇష్టం. ప్రస్తుతానికి కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. కొందరు నిర్మాతలు సంప్రదించారు. కానీ ఏ సినిమానీ ఓకే చేయలేదు. ‘రాధేశ్యామ్’ విడుదల తర్వాత వివరాలు చెబుతాను. -
Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ..
Director Radha Krishna Kumar Indirectly Hints Radhe Shyam Will Be Postponed: అందరూ ఊహించిందే జరిగింది. ‘రాధేశ్యామ్’ ప్రేక్షకులకు భారీ షాక్ ఇస్తూ దర్శకుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పరిస్థితులు బాగా లేవు అందరూ అప్రమత్తంగా ఉండండి, ఏది మన చేతిలో లేదంటూ దర్శకుడు రాధ కృష్ణ చేసిన అభిమానుల్లో గందగోళాన్ని సృష్టింస్తోంది. ఈ ట్వీట్ దేనికి సంకేతం, అందరూ ఊహించినట్టే రాధేశ్యామ్ కూడా వాయిదానా? అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు దర్శకుడు. ఇక ఈ సారి సంక్రాంతి పండగ పెద్ద సినిమాలతో సందడి చేయబోతుందని ఆశించిన ప్రేక్షకులకు ఇప్పటికే నిరాశ ఎదురైంది. చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్ జనవరి 7న వస్తుందనుకున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. దీంతో రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందని అందరూ అభిప్రాయ పడగా.. మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఏదేమైనా ఈ సంక్రాంతికి రాధేశ్యామ్ రావడం ఖాయమంటూ ప్రకటించడంతో సినీ ప్రేక్షకులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన రాధేశ్యామ్ మాత్రం వినోదం పంచేందుకు వస్తుందని అందరూ ఆనందంలో మునిగితేలుతున్న నేపథ్యంలో తాజాగా దర్శకుడు చేసిన ట్వీట్ ప్రేక్షక్షులను కలవరపెడుతోంది. చదవండి: అత్యంత ఆప్తుడిని కోల్పోయా: సూపర్ స్టార్ కృష్ణ ‘సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి- టీమ్ రాధేశ్యామ్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌డైరెక్టర్‌గా ‘రాధేశ్యామ్’ వాయిదా పడుతోందని మేకర్స్ తెలుపుతున్నట్లుగా కనిపనిస్తోంది ఈ ట్వీట్. ఎదైనా ఉంటే నేరుగా చెప్పండి.. ఇదేంటి డైరెక్టర్ గారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయినా దీనిపై చిత్ర బృందం నోరు విప్పడం లేదు. వీరు తీరు చూస్తుంటే ఈ సంక్రాంతికి కూడా చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతవరకు రాధేశ్యామ్ టీం ప్రమోషనస్ కార్యక్రమాలు కానీ, ఇంటర్య్వూలు కానీ ఇవ్వడం లేదు. ఇవన్నీ లేకుండా సినిమాను ఎలా విడుదల చేస్తారని నెటిజన్లు ముందునుంచే అనమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి అనుమానాన్ని నిజం చేసేలా డైరెక్టర్ ట్వీట్ చేశారు. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. Times are tough, hearts are weak, minds in mayhem. Whatever life may throw at us - Our hopes are always High. Stay safe, stay high - Team #radheshyam — Radha Krishna Kumar (@director_radhaa) January 4, 2022 -
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఎవరికి రాసి పెట్టుందో.. 'రాధేశ్యామ్' గురించి పలు ఆసక్తికర విషయాలు
Radhe Shyam Movie Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే జనవరి 14న విడుదలవుతోంది. గురువారం (డిసెంబర్ 23) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా ‘రాధేశ్యామ్’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘నేను రెబల్‌స్టార్.. రెబల్‌స్టార్ ఎప్పుడూ రెబల్గానే ఉంటాడు. లేదంటే రెబల్‌ని కల్పిస్తాడు. ఈ రెబల్ (ప్రభాస్‌ని ఉద్దేశించి) మరో 50 ఏళ్లు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. 55ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) పరిగెత్తుకుంటూ వచ్చి కలవాలని, కౌగిలించుకోవాలని ఉంది. ఈ వేదికపైకి వచ్చి సరదాగా డ్యాన్స్ వేసి, ఎంజాయ్ చేద్దామనుకున్నాను. కానీ మరో వారం పదిరోజుల పాటు నిలబడలేను. ఆ తర్వాత డ్యాన్స్ చేద్దాం.’’ అని అన్నారు. చిన్న సైజు దేవుడిలా ఉన్నారు కదా.. ‘‘రాధేశ్యామ్’ ట్రైలర్‌ని మీరు (అభిమానులు) లాంచ్ చేశారు.. మీకు నచ్చిందనుకుంటున్నాను. పెదనాన్నగారి (కృష్ణంరాజు) లుక్ చూశారుగా.. ఎలా ఉన్నారు. చిన్న సైజు దేవుడిలా ఉన్నారు కదా. గోపీకృష్ణా మూవీస్‌లో ‘మన ఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు’ వంటి పెద్ద సినిమాలు తీశారు. ఆ బ్యానర్ అంటే కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. మేమిద్దరం కలిసి ‘బిల్లా’ చేశాం. బాగానే ఆడింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’. ఈ చిత్రం లవ్‌స్టోరీనే కానీ ఇంకా చాలా ఉన్నాయి. రాధాకృష్ణ ఐదేళ్లు ఈ సినిమాకు పని చేయడం అంటే జోక్ కాదు. ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లు, టర్నింగ్స్ ఉన్నాయి. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ హైలైట్ అవుతుంది. ‘సాహో’ సమయంలో ఇండియా మొత్తం తిరిగినప్పుడు సిగ్గు పోయి బాగా మాట్లాడేస్తాననుకున్నాను కానీ పోలేదు. ఇది అంతేనేమో (నవ్వుతూ). ఈసారి ఎలాగైనా మాటలు ఇరగదీసేద్దామనుకున్నా.. బట్ కుదర్లేదు’’ అని ప్రభాస్ తెలిపారు. స్టార్ హీరోకు కావాల్సింది అదే: దిల్ రాజు ‘‘ఇది అందమైన ప్రేమకథ. ఈ సినిమాలో కొత్త ప్రభాస్, కొత్త పూజాహెగ్డేలను చూస్తారు.’’ అని పూజా హెగ్డే పేర్కొంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌తో నాకున్న ప్రయాణం గురించి మీకు తెలుసు. ‘రాధేశ్యామ్’ ట్రైలర్ చూస్తే ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది. ‘డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఇద్దరి మధ్య ఓ చిన్న చర్చ జరిగింది. మాస్ హీరోని ఇంత క్లాస్‌గా ఎవరు చూస్తారు? అని. ఆ రెండు సినిమాలు సూపర్‌హిట్ అయిన తర్వాత ప్రభాస్ ‘మిర్చి, రెబల్, బాహుబలి, సాహో’లతో ఆకాశానికి వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్ అయిపోయాక మళ్లీ ‘రాధేశ్యామ్’ లాంటి ఎంత క్లాస్ లవ్‌స్టోరీ చేశారో చూడండి. స్టార్ హీరోకు కావాల్సింది అదే.. ఎప్పుడూ కమర్షియల్‌తో పాటు కొత్తగా ప్రయత్నం చేస్తూ మనల్ని అలరించాలి. ‘రాధేశ్యామ్’ ట్రైలర్ చూశాక చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. 18 ఏళ్లు పట్టింది.. ‘‘రాధేశ్యామ్’ తీయడానికి నాలుగేళ్లు పట్టింది.. కానీ కథ రాయడానికి 18ఏళ్లు పట్టింది. ఫస్ట్ టైమ్ ఈ పాయింట్‌ని నేను మా గురువు చంద్రశేఖర్ యేలేటి వద్ద విన్నాను. 18 ఏళ్లు ఇండియాలోని పెద్ద పెద్ద రచయితలను పిలిపించి రాయించాం. కానీ, కథకు కన్‌క్లూజన్ దొరకలేదు.. ముగింపు కుదరడం లేదు. ఆ సమయంలో యేలేటిగారు ‘ఇది జాతకాల మీద రాస్తున్నావ్.. ఎవరికి రాసి పెట్టుందో అని’ అన్నారు. ఇది ప్రభాస్‌గారికి రాసిపెట్టి ఉంది. ఆయనతో సినిమా అనుకున్నప్పుడు కథతో కాదు ఓ ఛాలెంజ్‌తో చేయాలనుకుని మా గురువుని అడిగి ఈ పాయింట్‌ని తీసుకుని ఒక ఫిలాసఫీని ఒక లవ్‌స్టోరీలాగా చేసి, కథ రాసి ప్రభాస్‌గారికి చెప్పాను. ఆయనకు నచ్చింది. ఈ సినిమాలో ఫైట్స్ ఉండవు. అమ్మాయికీ, అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలుంటాయి. ఇదొక ప్రేమకథ. వంశీ, ప్రమోద్, విక్కీగార్లు లేకుంటే ఈ సినిమా లేదు. ప్రభాస్‌ని ఇంతకంటే నేనేం అడగను. మీలాంటి ఫ్రెండ్, గురువు అందరికీ ఉండాలి’’ అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్, కెమెరామేన్ మనోజ్ పరమహంస, డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, ఓం రౌత్, టి. సిరీస్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్‌కు హోస్ట్‌గా జాతి రత్నం.. -
షూటింగ్ సంగతి తర్వాత... సాయం ముఖ్యమనుకున్నాం
కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’ యూనిట్ ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అది కూడా ఈ సినిమా కోసం వేసిన ఆస్పత్రి సెట్‌కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సెలైన్ స్టాండ్లు.. ఇలా సెట్లో భాగంగా వేసినవన్నీ కూడా ఇచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ‘రాధేశ్యామ్’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భారీ ఆస్పత్రి సెట్ వేశారు. వీటినే ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి ఇచ్చారు. ఈ విషయం గురించి రవీందర్ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ఆస్పత్రి డాక్టర్ నా ఫ్రెండ్. బెడ్లు కొరత ఉందంటే.. ఓ పది ఎరేంజ్ చేశాను. అయితే అవి ‘రాధేశ్యామ్’ సెట్వి కాదు. ఆ తర్వాత ఇంకా కావాలని అడిగితే, ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు నా వైఫ్ సంధ్య సినిమా సెట్లోవి ఇవ్వొచ్చు కదా అంది. ఆస్పత్రివాళ్లతో అంటే.. ‘సినిమాకి వేసినవి కదా.. పేషెంట్లకు సౌకర్యంగా ఉంటాయో? లేదో’ అన్నారు. ఫొటో పంపించాను. నిజానికి నేను అచ్చం ఆస్పత్రికి వాడే బెడ్లులాంటివే సెట్ వేశాను. బెడ్ హైట్ ఎంత ఉండాలి? పొడవు వంటివన్నీ ముందే తెలుసుకుని వేశాను. పైగా 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కాబట్టి, అప్పటి బెడ్లు కొంచెం పెద్దగా ఉంటాయి. అలానే తయారు చేశాం. ఆస్పత్రివారికి బాగా అనిపించడంతో.. అన్నింటినీ శానిటైజ్ చేసి, 13 ట్రక్కుల్లో మొత్తం 50 బెడ్లు, ఇతర పరికరాలు పంపించాం. ఆ తర్వాత ఇంకోటి చూడండి అని ఫోన్ చేసినప్పుడు, చాలా బాధ అనిపించింది. అది మాత్రమే కాదు.. ట్రక్కులు బయలుదేరాక... ఇంకో అరగంట పడుతుందా? గంటలో చేరతాయా? అంటూ... ఆస్పత్రివారు ఆదుర్దాగా ఫోన్ చేశారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోండి. ఆ తర్వాత ఇంకో బెడ్ ఉందా? అని అడిగితే, రెండు పంపించాం’’ అన్నారు. ఈ సెట్లో షూటింగ్ పూర్తయిందా? అంటే ‘లేదు. ప్రభాస్ మీద ఒక భారీ సీన్ తీయాలి. కానీ మా నిర్మాతలు అదేం ఆలోచించలేదు. ఈ సమయంలో హెల్ప్ చేయాలి. తర్వాత సంగతి తర్వాత అన్నారు. హ్యాపీగా ఇచ్చేశాం. మా యూనిట్ నుంచి ఈ విధంగా హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. -
ప్రభాస్ అభిమానులకు ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ హామీ
సాక్షి, హైదరాబాద్: ‘బాహుబలి’, ‘సాహో’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఇటలీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్, టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘డార్లింగ్’ అభిమానులకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఓ ప్రామిస్ చేశాడు. (చదవండి: రాధే శ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ ప్రకటించే యోచన) ‘టీజర్ అప్డేట్ త్వరలోనే మీ ముందుకు రానుంది. అంతవరకూ కాస్తా ఓపిక పట్టండి. మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఇది మీ మొహంలో చిరునవ్వులు చిందిస్తుందని ఆశిస్తున్న’ అంటూ ట్వీట్ చేశాడు. అత్యధిక భారీ బడ్జేట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజ హేగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: సంక్రాంతికి సర్ప్రైజ్) Teaser update is on the way guys!! Very very soon, till then just be patient!!! I promise your wait be worth a million smiles. #radheshyam — Radha Krishna Kumar (@director_radhaa) January 5, 2021 -
నీలి రంగు తెరపై రాధేశ్యామ్ మేకింగ్ వీడియో
సాక్షి, హైదరాబాద్: బాహుబలి ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియోను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ గురువారం షేర్ చేశారు. అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫీల్మ్ సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ గురువారం మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నీలిరంగు స్ర్కీన్‌లో ఉన్న ఈ వీడియోకు ‘మా చిత్ర బృందంతో నీలి రంగు తెరపై’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి సినిమాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నా వారందరిని ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఉన్నది కొద్ది సెకండ్లే అయినా బ్లూ స్ర్కీన్‌పై సరికొత్తగా తీసిన ఈ మేకింగ్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాపై ‘డార్లింగ్’ ప్రభాస్ అభిమానుల అంచనాలు మరింత పెరిగాయనిపిస్తోంది. (చదవండి: ముప్పై కోట్లతో సెట్) View this post on Instagram A post shared by Radha Krishna Kumar (@director_radhaa) అయితే గత నెల ఇటలీలో షూటింగ్ జరుపుకున్న ‘రాధేశ్యామ్’ చిత్ర బృందం ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్ సీన్లన రూపొందిస్తున్నారు. అయితే క్లైమాక్స్ సీన్ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ‘రాధేశ్యామ్’కు వర్క్ చేస్తుండటం విశేషం. యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు ఇటీవల ఓ సందర్భంలో ప్రభాస్ పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. అంతేగాక సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ శర్మ, సత్యన్ శివకూమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ షూటింగ్ పూర్తిగానే ప్రభాస్ తర్వాతి చిత్రం ‘అదిపురుష్’ షూటింగ్ పాల్గొననున్నట్లు సినీ వర్గాల సమాచారం. (చదవండి: ‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?) -
ప్రభాస్ ఫస్ట్‌లుక్ రిలీజ్‌కు కుదిరిన ముహూర్తం
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదని నిరాశపడిపోతున్న అభిమానులకు అమృతం లాంటి వార్త! ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 20వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే బాహుబలి పక్కన జోడీ కట్టింది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. మొన్నటివరకు కరోనా వల్ల షూటింగ్స్‌కు బ్రేక్ పడటంతో డార్లింగ్ మూవీ ఇంకెంత ఆలస్యం అవుతుందోనని అతడి అభిమానులు తెగ భయపడిపోయారు. (ప్రభాస్-అశ్విన్ చిత్రం : విలన్ అతడేనా?) కానీ ప్రభుత్వం ఇటీవలే సినిమా షూటింగ్స్‌కు ఓకే చెప్పడంతో చిత్రయూనిట్ ఈ నెల రెండో వారం నుంచి రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించిందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెగ ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమనేది శుక్రవారం తేలనుంది. అవును.. ప్రభాస్ 20వ సినిమా యూనిట్.. జూలై 10న ఉదయం 10 గంటలకు టైటిల్‌తోపాటు, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనకు కూడా పీరియాడికల్ లుక్ వచ్చేలా టచ్ ఇచ్చింది. రోమన్ అంకెలున్న గడియారం, దాని చుట్టూ పువ్వులు అలంకరించినట్లుగా కనిపిస్తూ కొంత కొత్తగా, మరికొంత భిన్నంగా ఆకట్టుకుంటోంది. (నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ – ప్రభాస్) -
ఇటలీ పార్ట్.. హైదరాబాద్‌లోనే!
ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జార్జియా షెడ్యూల్ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. యూరప్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ షూటింగ్ కొంత భాగం ఇటలీలో జరగాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటలీలో చిత్రీకరించారు. కానీ ఇటలీలో ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. పైగా కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా ఆయా ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత ఇటలీ షెడ్యూల్ కొనసాగించాలన్నా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సరిగ్గా సమకూరుతాయా? లేదా అనే సందేహం చిత్రబృందంలో ఉందట. అందుకని ఇటలీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరపాలనుకుంటున్నారట. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఇటలీ లొకేషన్స్‌కు సంబంధించిన డిజైన్స్, సెట్ వర్క్ వంటివాటిపై ఇప్పటికే దృష్టి సారించారని తెలిసింది. లాక్డౌన్ తర్వాత హైదరాబాద్‌లోనే ఇటలీ సెట్ వేసి, చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. -
మూడు కోట్ల సెట్లో...
‘బాహుబలి, సాహో’ చిత్రాల యాక్షన్ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్‌లోకి మారిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారాయన. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇది పీరియాడికల్ మూవీ కాదట. ప్రేమకథల్లోనే ఇదో కొత్త తరహా చిత్రమని, ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా ఉంటుందని చిత్రదర్శకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో జరుగుతోంది. ఈ సెట్‌ను మూడుకోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి, ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఆస్ట్రియా షెడ్యూల్ ప్లాన్ చేశారట. 2021 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
ప్యారిస్ ట్రిప్
‘సాహో’ తర్వాత కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొంచెం విరామం తీసుకుంటున్నట్లున్నారు ప్రభాస్. అందుకే చిన్న బ్రేక్ కోసం ప్యారిస్ ప్రయాణమయ్యారని తెలిసింది. కొన్ని రోజుల పాటు ప్యారిస్‌లో ప్రభాస్ రిలాక్స్ కాబోతున్నారట. వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. -
మరో దర్శకుడిని లైన్లో పెట్టాడు
ఇప్పటికీ బాహుబలి సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. యంగ్ డైరెక్టర్లతో స్టైలిష్ ఎంటర్టైనర్లకు రెడీ అవుతున్నా.. ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో మాత్రం అర్ధం కావటంలేదు. ఇంకా బాహుబలి 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ అయితే గాని ప్రభాస్ మరో సినిమా మొదలు పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పటికే 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు ప్రభాస్. ఈ సినిమా కోసం వేరే ప్రయత్నాలేవి చేయకుండా వెయిట్ చేస్తున్నాడు సుజిత్. అయితే తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. సుజిత్‌ను పరిచయం చేసిన యువి క్రియేషన్స్ బ్యానర్ ద్వారానే దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు ప్రభాస్. తొలి సినిమా జిల్‌తో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధకృష్ణ ప్రభాస్‌తోనూ అదే తరహా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలి 2 తరువాత ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి ముందుగా ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అయితే దర్శకుడు ఎవరైన ఆ సినిమాను నిర్మించేది మాత్రం యువి క్రియేషన్స్ సంస్థే అన్న టాక్ వినిపిస్తోంది. ఏ సినిమా అయిన 2016లో అయితే తెర మీదకు వచ్చే అవకాశం మాత్రం కనిపించటం లేదు. -
ఆ సీన్ పబ్లిసిటీ కోసం చేయలేదు!
‘‘ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మా నాన్నగారు (టి. కృష్ణ) తన సినిమాల్లో చర్చించిన అంశాలు నేటి సమాజంలోనూ ఉన్నాయి. అలాంటి అంశాలతో విప్లవాత్మక సినిమాలు చేసే అవకాశం వస్తే, చేయడానికి నేను రెడీగా ఉన్నా’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఓ డిఫరెంట్ లుక్‌లో ఫైర్ ఆఫీసర్గాగోపీచంద్ నటించిన ‘జిల్’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘‘దర్శకుడు రాధాకృష్ణకుమార్ చెప్పిన కథను నమ్మి నేనీసినిమా చేశా. నా నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయలేదు’’ అని గోపీచంద్ అన్నారు. మరిన్ని విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు. నా గత చిత్రం ‘లౌక్యం’ ఫుల్కామెడీ మూవీ. మళ్లీ అలాంటి సినిమాయే చేస్తే రొటీన్‌గా ఉందంటారు. అందుకే ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ఉన్న కథను రాధాకృష్ణకుమార్ చెప్పడంతో అంగీకరించాను. ‘జిల్’ అంటే ఓ ఎక్స్ప్రెషన్. రకరకాల సందర్భాల్లో ఆ సందర్భాన్ని బట్టి ‘జిల్లుమనిపించింది’ అంటుంటాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల అలా అనుకుంటాం. వాస్తవానికి ఇప్పటివరకూ నేను పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదు. ‘జిల్’ ఆ కొరత తీర్చింది. అలాగే, నాకు తెలిసి ఈ తరంలో తెలుగులో ‘ఫైర్ ఆఫీసర్’ పాత్రతో సినిమాలు రాలేదు. సినిమా మొత్తం చక్కని ఎమోషన్‌తో ఉంటుంది. అది బాగా నచ్చింది. ఈ చిత్రంలో ఓ ముద్దు సన్నివేశం ఉంది. కానీ, దాన్ని ప్రాపర్ ‘లిప్ లాక్’ అనలేం. అప్పటికీ ఈ సీన్ అవసరమా? అనడిగాను. కానీ, అది లేకపోతే సీన్ పండదని దర్శకుడు అన్నాడు. అందుకని చేశాను. పబ్లిసిటీ కోసం చేసిన సీన్ కాదది. గత పదిహేనేళ్లుగా నా లుక్‌లో నేనెలాంటి మార్పు చేయలేదు. అందుకే, ఈ చిత్రం చూసినవాళ్లు ముందు నా లుక్ గురించి మాట్లాడుతున్నారు. అదే సినిమా నచ్చకపోతే, లుక్ డిఫరెంట్‌గా ఉన్నా ఆదరించరు. వాస్తవానికి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లుక్ మార్చాలని చెబితే, నేను సంశయించాను. దాంతో ప్రభాస్‌తో చెప్పించారు. తనేమో ‘రేయ్... లుక్ మార్చరా.. బాగుంటుంది’ అన్నాడు. సరే.. మార్చాను. లుక్ టెస్ట్ చేసినప్పుడే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకం కుదిరింది. ఇప్పటివరకూ నీ కెరీర్లో ఇదే ‘బెస్ట్ లుక్’ అని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమా చూసి, ‘లుక్ అదిరింది.. ఫైట్స్, డాన్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగుంది’ అన్నాడు. నేను, ప్రభాస్ మంచి స్నేహితులం. మా ఇద్దరికీ తగ్గ కథ కుదిరితే చేయాలనుకుంటున్నాం. కానీ, ఇప్పటివరకూ కథ దొరకలేదు. వాస్తవానికి మనకు కథల కొరత ఉంది. తెలుగు పరిశ్రమలో రచయితలు తక్కువయ్యారు. ఎవరైనా కథలు రాయాలనుకుంటే, ఏ హాలీవుడ్ సినిమానో, వీడియోనో చూస్తే సరిపోదు.. సమాజాన్ని చదవాలి. సమాజంలో జరుగుతున్న సమస్యలను తెలుసుకోవాలి. జనాల్లోకి వెళితే బోల్డన్ని కథలు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా విప్లవాత్మక చిత్రాలు చేయాలంటే మాత్రం జనాలను పరిశీలించాల్సిందే. ఇప్పడీ తరహా చిత్రాల కొరత ఉంది కాబట్టే, చేస్తే మాత్రం హిట్ గ్యారంటీ అనొచ్చు. ఒకసారి కథ విని, ఓకే చెప్పిన తర్వాత షూటింగ్ స్పాట్లో మార్పులు చెప్పడం నాకిష్టం ఉండదు. అలాగే, నా కారణంగా నిర్మాణ వ్యయం పెరగకుండా జాగ్రత్తపడతాను. అయితే, ఒక సినిమా బడ్జెట్ పరిధులు దాటకుండా ఉండటం అనేది నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. దేనికి ఎంత ఖర్చుపెట్టాలనే విషయం మీద నిర్మాతకు నియంత్రణ ఉండాలి. ప్రస్తుతం బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. భూపతి పాండ్యన్ దర్శకత్వంలో అంగీకరించిన చిత్రం కాదిది. ఇది వేరే కథతో రూపొందిస్తున్నాం. వక్కంతం వంశీ కథ ఇచ్చారు. ఇది మంచి లవ్ మరియు ఫ్యామిలీ మూవీ. అన్నీ కుదిరితే ఈ జూలైలో విడుదల ఉంటుంది. ఈ చిత్రం తర్వాత భవ్య క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నా. మంచి కథలు కుదిరితే ఏడాదికి మూడు సినిమాలు చేయొచ్చు. కానీ, కథలు కుదరడంలేదు. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత జీవితం ఒకేలా ఉంది. అయితే అంతకు ముందు పెద్దగా బాధ్యతలు ఉండేవి కాదు. ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నాను. దూర ప్రాంతాలకు షూటింగ్‌కి వెళ్లినప్పుడు, మా అబ్బాయి విరాట్ కృష్ణ గుర్తొస్తుంటాడు. ‘ఇప్పుడేం చేస్తున్నాడో’ అని ఆలోచించుకుంటుంటా. -
కొత్త లుక్... సరికొత్త కథాంశం...
ఈ వేసవికి ‘జిల్’ అంటూ ప్రేక్షకులను పలకరించనున్నారు గోపీచంద్. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. రాశీ ఖన్నా నాయిక. రాధాకృష్ణ కుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, వి. వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ పాటలు స్వరపరిచారు. ఈ నెల 12న పాటలను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
థ్రిల్ కలిగించే జిల్
‘‘యాక్షన్ స్టార్ గోపీచంద్ సినిమాకు ‘జిల్’ టైటిల్ అన్నప్పుడే అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది. రేపు సినిమా చూసి ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు’’ అని నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు తెలిపారు. ప్రభాస్‌తో‘మిర్చి’, శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసిన యు.వి. క్రియేషన్స్ సంస్థలో ఇది మూడో చిత్రం. రాధాకృష్ణకుమార్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా కథానాయిక. జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘యాక్షన్ ఎపిసోడ్లు బాగా వచ్చాయి. ‘ఐ’, హిందీ ‘కిక్’ చిత్రాలకు ఫైట్‌మాస్టర్‌గా పనిచేసిన అణల్ అరుసు దీనికి పనిచేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు. -
గోపీచంద్ ఫుల్ యాక్షన్
ప్రభాస్‌తో ‘మిర్చి’ వంటి బ్లాక్‌బస్టర్ తీసిన యువి క్రియేషన్స్ సంస్థ, గోపీచంద్‌తో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి శిష్యుడైన రాధాకృష్ణకుమార్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి ప్రభాస్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత ‘దిల్’రాజు క్లాప్ ఇచ్చారు. చంద్రశేఖర్ యేలేటి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మాట్లాడుతూ -‘‘భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వాణిజ్య హంగులతో యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా ఉంటుంది. జూన్ 6 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు’’ అని తెలిపారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్షన్: అనల్ అరసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఎమ్. అశోక్ కుమార్రాజు, ఎన్. సందీప్.