మూడు కోట్ల సెట్లో... | Pooja Hegde To Romance With Prabhas In Radha Krishna Kumar | Sakshi
Sakshi News home page

మూడు కోట్ల సెట్లో...

Published Thu, Jan 23 2020 12:24 AM | Last Updated on Thu, Jan 23 2020 12:24 AM

Pooja Hegde To Romance With Prabhas In Radha Krishna Kumar - Sakshi

ప్రభాస్‌

‘బాహుబలి, సాహో’ చిత్రాల యాక్షన్‌ మూడ్‌ నుంచి రొమాంటిక్‌ మూడ్‌లోకి మారిపోయారు ప్రభాస్‌. ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారాయన. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇది పీరియాడికల్‌ మూవీ కాదట.

ప్రేమకథల్లోనే ఇదో కొత్త తరహా చిత్రమని, ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా ఉంటుందని చిత్రదర్శకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో జరుగుతోంది. ఈ సెట్‌ను మూడుకోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ తల్లి పాత్రలో బాలీవుడ్‌ నటి, ‘మైనే ప్యార్‌ కియా’ ఫేమ్‌ భాగ్యశ్రీ నటిస్తున్నారు. హైదరాబాద్‌ షెడ్యూల్‌ తర్వాత ఆస్ట్రియా షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారట. 2021 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement