Bhagya Sri
-
ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...
‘30 అండర్ 30 ఆసియా’ తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ విభాగంలో మన దేశం నుంచి ఈవీ చార్జింగ్ కంపెనీ ‘స్టాటిక్’ ఫౌండర్స్ అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోర, ‘ది డిస్పోజల్ కంపెనీ’ ఫౌండర్ భాగ్యశ్రీ జైన్లు చోటు సాధించారు..బాల్యస్నేహితులైన అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరాలు పట్టణ వాయు కాలుష్యం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకునేవారు. కాలుష్య స్థాయిలను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ప్రధానపాత్రపోషించడంపై కూడా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)కి సంబంధించిన మౌలిక చార్జింగ్ సదు΄ాయాలపై దృష్టి పెట్టారు. తమ పొదుపు మొత్తాలను ఉపయోగించి 2019లో ఇంట్లో తొలి ఈవీ చార్జర్‌ను తయారుచేయడంతో ‘స్టాటిక్’ ప్రయాణంప్రారంభమైంది.వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడానికి సమీపంలోని చార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడానికి ‘స్టాటిక్’ యాప్ ఉపయోగపడుతుంది. అగ్రశ్రేçణి ఈవీ చార్జర్లు, అడ్వాన్స్డ్ మొబైల్ అప్లికేషన్లను కూడా ‘స్టాటిక్’ డెవలప్ చేసింది. ఈ స్టార్టప్ కార్పొరేట్ ఆఫీసులు, రెసిడెన్సెస్, హోటల్స్, సినిమా హాలు...మొదలైన వాటికి సంబంధించిన యజమానులతో టై అప్ అయింది. ఈప్రాపర్టీ వోనర్స్ను ‘చార్జర్ హోస్ట్స్’గా వ్యవహరిస్తారు.హరియాణాలోని హిసార్‌లో పుట్టి పెరిగిన అక్షిత్ బన్సాల్ మణి΄ాల్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో 2018లో ‘డెలాయిట్‌లో’ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్నేహితుడు రాఘవ్ అరోర అతడికి వెయ్యి ఏనుగుల బలం అయ్యాడు. ‘వి్ర΄ో’లో డేటా సైంటిస్ట్‌గా పనిచేసిన రాఘవ్ బాల్య స్నేహితుడికి తోడుగా నిలిచాడు. ఇద్దరి కృషి ‘స్టాటిక్’కు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.‘స్టాటిక్’ యూఎస్పీలలో ఒకటి...సింగిల్ రెవెన్యూ మోడల్‌పై మాత్రమే కంపెనీ దృష్టి పెట్టక΄ోవడం. సొంతంగా చార్జర్స్‌ను ఇన్స్టాల్ చేయడంతోపాటు. హెచ్‌పీసీఎల్, షెల్లాంటి పెద్ద కంపెనీల కోసం చార్జర్లను బిల్డ్ చేయడం, ఇన్స్టాల్, మెయింటెయిన్ చేయడం లాంటివి చేస్తోంది స్టాటిక్.వివిధ బ్రాండ్లు ‘ప్లాస్టిక్ న్యూట్రల్’గా మారడానికి తన స్టార్టప్ ‘ది డిస్పోజల్ కంపెనీ’తో సహాయపడుతోంది దిల్లీకి చెందిన భాగ్యశ్రీ జైన్. ఈ స్టార్టప్ ద్వారా ఏడాదికి 750 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేస్తున్నారు. నోయిడా యూనివర్శిటీలో బిబిఏ చేసిన భాగ్యశ్రీ కొన్ని సంవత్సరాలు వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసింది. వివాహానంతరం రాజస్థాన్‌కు మకాం మార్చింది. వేస్ట్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఒక్క రీసైక్లింగ్ యూనిట్ లేదనే విషయం గ్రహించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి పెట్టి ‘ది డిస్పోజల్ కంపెనీ’ అనే రీసైకిలింగ్ కంపెనీ మొదలుపెట్టింది.ఏదైనా బ్రాండ్ తమ కంపెనీలో క్లయింట్‌గా సంతకం చేసిన తరువాత ఆ బ్రాండ్‌కు సంబంధించిన ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్‌ను అంచనా వేయడానికి వన్–టైమ్ వేస్ట్ ఆడిట్ నిర్వహిస్తారు. ‘ది డిస్పోజల్ కంపెనీ’కి దేశవ్యాప్తంగా రీసైక్లర్పాట్నర్స్, రాగ్‌పికర్స్, ఆగ్రిగేటర్స్ ఉన్నారు. 75 లక్షల రూ΄ాయల పెట్టుబడితో ఈ రీసైక్లింగ్ యూనిట్నుప్రారంభించారు. ఎక్సెంచర్, సస్టైనబిలిటీ, యాక్సిలరేటర్ ్ర΄ోగ్రామ్కు ఎంపికైన ఈ స్టార్టప్‌కు 60 లక్షల రూ΄ాయల సీడ్ ఫండ్ లభించింది.పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం చూపుతున్న ప్రభావం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకునే పద్ధతుల గురించి రచనలు, ఉపన్యాసాల రూపంలో ప్రజలకు అవగాహన కలిగిస్తోంది భాగ్యశ్రీ జైన్. -
Avantika Dassani: హీరోయిన్గా భాగ్యశ్రీ కుమార్తె
‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) అంటూ 30 ఏళ్ల క్రితం హిందీ తెరపై సల్మాన్ ఖాన్‌తో భాగ్యశ్రీ కురిపించిన ప్రేమను అప్పటి తరం అంత సులువుగా మరచిపోదు. ఈ మధ్యే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ–ఎంట్రీ ఇచ్చారామె. ఇప్పుడు భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నారు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సార్!’ ద్వారా అవంతిక పరిచయం కానున్నారు. రాఖీ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నాంది’ చిత్రనిర్మాత సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ వర్మ మాట్లాడుతూ – ‘‘ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో శ్రుతీ వాసుదేవన్ అనే కాలేజీ స్టూడెంట్‌గా నటించారు అవంతిక. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: అనిత్ మధాడి. -
బాలీవుడ్ నటికి ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్!
Bhagyashree: ప్రభాస్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్ చేస్తుంటాడు. సెట్లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్ సరదాగా, స్నేహంగా మెదులుతాడు. ఏదైనా పండుగలు, పుట్టినరోజులతో పాటు సాధారణ సమయాల్లోనూ వారికి ఏవైనా స్పెషల్ గిఫ్ట్‌లు పంపుతూ సర్ప్రైజ్ చేస్తుంటాడు. తాజాగా అతడు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇంటికి ఓ గిఫ్ట్ పంపి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇది చూసిన భాగ్యశ్రీ దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేఇసంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనుకుంటున్నారు? నోరూరించే పూత రేకులు. తన సహనటి భాగ్యశ్రీకి పూతరేకులు గిఫ్ట్‌గా పంపాడు. ఇవి అందుకున్న ఆమె "ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్ ప్రభాస్, మొత్తానికి నా అభిరుచినే మార్చేశావు" అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌లో భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇందులో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. Another stack of the tasty hyderabadi sweets #pootharekulu Thank you #Prabhas ... you spoil me. pic.twitter.com/em1A6RbGpE — bhagyashree (@bhagyashree123) July 1, 2021 చదవండి: మన స్టార్ హీరోహీరోయిన్లు ఏం చదివారో తెలుసా? Aha OTT Releases: ఆహాలో ఒకేరోజు ఏకంగా 15 సినిమాలు విడుదల -
లవ్ ఇన్ యూరప్
యూరప్ చుట్టేయడానికి రెడీ అయ్యారు ప్రభాస్. తనతో పాటు పూజా హెగ్డే కూడా తోడయ్యారని సమాచారం. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్). యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ తల్లి పాత్రలో ‘మైనే ప్యార్ కియా’ నటి భాగ్యశ్రీ నటిస్తున్నారు. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ చిత్రకథ ఉండబోతోందట. ప్రస్తుతం యూరప్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించనున్నారు. ఈ ఏడాది దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
మూడు కోట్ల సెట్లో...
‘బాహుబలి, సాహో’ చిత్రాల యాక్షన్ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్‌లోకి మారిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారాయన. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇది పీరియాడికల్ మూవీ కాదట. ప్రేమకథల్లోనే ఇదో కొత్త తరహా చిత్రమని, ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా ఉంటుందని చిత్రదర్శకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో జరుగుతోంది. ఈ సెట్‌ను మూడుకోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి, ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఆస్ట్రియా షెడ్యూల్ ప్లాన్ చేశారట. 2021 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
మళ్లీ మురిపి'స్టారు'
ఇదండీ విషయం! అభినయానికి వయసుండదు.వయసుకి అందం ఉంటుంది.తారలు... నిజమే తారలు మాసిపోరు.నాటి తారలే నేటి అభినయ తారలు.అపుడు మెరిశారు ఇప్పుడు మురిపిస్తారు. గ్లామర్ ఇండస్ట్రీలో స్పాట్లైట్ ఎప్పుడూ ఒకరి మీదే ఉండదు. ఫోకస్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ. హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా చిన్నది. ఐదూ పదేళ్ల తర్వాత తెరమరుగవుతుంటారు. కొందర్ని ఇండస్ట్రీ దూరం జరిపితే, కొందరేమో ఇండస్ట్రీకే దూరం జరుగుతారు. కేవలం కొందరు హీరోయిన్లు మాత్రమే దీనికి మినహాయింపు. కాలానుగుణంగా సీతాకోక చిలుకలో మార్పులొచ్చినట్టు వీళ్ల కెరీర్ సైకిల్లో మార్పులొస్తుంటాయి. పాత్రలకు ప్రమోషన్లు వస్తుంటాయి. గ్యాప్‌కి గ్యాప్ ఇచ్చి ఈ యాక్టర్స్ ఎప్పుడు తిరిగొచ్చినా కెమెరాలు మరింత ఫోకస్‌తో వీళ్ల మీద దృష్టి పెడతాయి. ప్రేక్షకుడి కళ్లు మరింత మెరుపుతో వీళ్లను చూస్తాయి. ఈ నటీమణులు మళ్లీ తిరిగి రావడానికి.. స్క్రిప్ట్ కారణం కావొచ్చు, సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని దర్శక–నిర్మాతలు అనుకోవచ్చు. మరే కారణం అయినా కావచ్చు. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు తిరిగి తెర మీద కనిపించడానికి రెడీ అవుతున్నారు. అలా చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ మెరవడానికి సిద్ధమైన నటీమణులపై స్పెషల్ స్టోరీ. సౌందర్య లహరి ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ స్వప్న సుందరిగా నటించారు దీప్తీ భట్నాగర్. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా స్వప్న సుందరిగా మారిపోయారామె. అ సినిమా తర్వాత ‘ఆటో డ్రైవర్, మా అన్నయ్య, కొండవీటి సింహాసనం’ సినిమాల్లో కనిపించారామె. 2002 తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు దీప్తి. ఇçప్పుడు నూతన దర్శకుడు పవన్ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ‘కిట్టీ పార్టీ’ సినిమాతో కమ్‌బ్యాక్ చేస్తున్నారు. ఇది దీప్తీకి తెలుగులోనే కమ్‌బ్యాక్ కాదు యాక్టర్‌గానే కమ్‌బ్యాక్. 2004 తర్వాత ఏ భాషలోనూ ఆమె సినిమా చేయలేదు. ఫిర్ ప్యార్ కరేంగే మైనే ప్యార్ కియా అని సల్మాన్, భాగ్యశ్రీతో చెప్పారు. సినిమా బ్లాక్‌బస్టర్. హిందీ రానీ వాళ్లు కూడా భాగ్య శ్రీతో మైనే ప్యార్ కియా అన్నారు. ఆ సినిమా నార్త్, సౌత్‌లో సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది భాగ్యశ్రీకి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఓంకారం’ (కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ఓం’ తెలుగు రీమేక్) చేశారు. ఆ వెంటనే బాలకృష్ణతో ‘రాణా’ సినిమా చేశారు. ఇప్పుడు సుమారు 21ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో కనిపించబోతున్నారు భాగ్యశ్రీ. ‘కిట్టీ పార్టీ’ చిత్రంలో భాగ్యశ్రీ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రైలు పట్టాల మీద పరిగెడుతూ ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో...’ అని పాట పాడిన లైలా అందరికీ గుర్తే. ‘ఎగిరే పావురమా’ సినిమాలో ఓ సూపర్ హిట్ సాంగ్ ఇది. చిన్న పిల్లలాంటి గొంతు ఆమె ప్రత్యేకం. తెలుగులో ‘ఉగాది, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర ప్రేమ’ వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు లైలా తెలుగుకు తిరిగొస్తున్నారా? అంటే దానికి కొంచెం టైమ్ ఉన్నట్టుంది. ప్రస్తుతానికి తమిళంలో రీ–ఎంట్రీ ఇస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తున్నారు లైలా. ‘అలీసే’ అనే క్రైమ్ డ్రామాలో కీలక పాత్రలో కనిపించనున్నారు లైలా. ఈ సినిమాకు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాత. రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో తెలుగు స్క్రీన్‌పైన జయప్రదను ప్రేక్షకులు మిస్ అయ్యారు. 2007లో బాలకృష్ణ ‘మహారథి’ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలేవీ చేయలేదు. తమిళ, హిందీ, కన్నడంలో ఒకటీ అరా సినిమాలు చేశారు కానీ తెలుగు తెరపై కనిపించలేదామె. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ‘శరభ’ సినిమాలో కీలక పాత్రతో రీ–ఎంట్రీ ఇచ్చారు జయప్రద. ఇటీవల రిలీజైన ‘సువర్ణ సుందరి’లో కూడా కీలక పాత్ర చేశారామె. 18 ఏళ్లకు మళ్లీ ‘20వ శతాబ్దం, పద్మావతి కల్యాణం, బావ నచ్చాడు’ సినిమాల్లో కనిపించిన సుమన్ రంగనాథ్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు కనిపించడానికి రెడీ అయ్యారు. ‘బావ నచ్చాడు’ తర్వాత సుమన్ రంగనాథ్ మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కానీ కన్నడ, తమిళ, హిందీల్లో సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘కిట్టీ పార్టీ’లో సుమన్ రంగనాథ్ కీలక పాత్ర చేస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో తెలుగు తెరపై కనిపించనున్నారు. ఎటూ వెళ్లిపోలేదు ‘గ్రీకువీరుడు...’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో కాబోయే వాడి కోసం పాడిన టబు మనందరికీ గుర్తే. గర్వం అణచడానికి గణపతి విగ్రహాన్ని తనతో మోయించిన ‘కూలీ నెం 1’ కూడా గుర్తే. ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ కవ్వించిన సిసింద్రీని కూడా మరచిపోలేం. పుండరీక రంగనాథుడిని మోహంలో ముంచెత్తిన మోహినిని మరచిపోవడం సాధ్యమా? ఇలా వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ అందరితో కథానాయికగా నటించిన టబు దర్శనాలు ఈ మధ్య తెలుగు తెరకు తగ్గాయి. 2008లో చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో చేసిన ‘ఇదీ సంగతి’ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదామె. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున పాడిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ని టబు ఫ్యాన్స్ ‘ఎటో వెళ్లిపోయింది టబు’ అని పాడుకున్నారు. కానీ జస్ట్ బాలీవుడ్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు టబు. ఎటూ వెళ్లిపోలేదు. ఇంతకీ సంగతేంటంటే... సుమారు పదకొండేళ్ల తర్వాత త్రివిక్రమ్– అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నారామె. తన సినిమాల్లో కీలక పాత్రల కోసం ఒకప్పటి హీరోయిన్లని తీసుకోవడం త్రివిక్రమ్ స్టైల్ అనుకోవచ్చు. ‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ‘ఖుష్బూ’ని చాలా గ్యాప్ తర్వాత నటింపజేశారు త్రివిక్రమ్. తాజాగా అల్లు అర్జున్ సినిమాతో టబుని తిరిగి తీసుకొచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి తల్లిగా లేక అత్తయ్య పాత్రలో టబు కనిపిస్తారని సమాచారం. ఫైర్ బ్రాండ్ ఈజ్ బ్యాక్ తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పాపులారిటీ తీసుకొచ్చిన ఫైర్ బ్రాండ్ హీరోయిన్ విజయశాంతి. యాక్షన్, రివల్యూషనరీ సినిమాలతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. విజయ్‌శాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చూడటం తమ ‘కర్తవ్యం’గా భావించి థియేటర్స్‌వైపు వెళ్లారు ప్రేక్షకులు. 2006లో చేసిన ‘నాయుడమ్మ’ తర్వాత విజయశాంతి సినిమాలకే బ్రేక్ ఇచారు. పాలిటిక్స్‌లో బిజీగా మారారు. మళ్లీ 13 ఏళ్ల విరామం తర్వాత స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ద్వారా విజయశాంతి మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి తొలి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో హీరో కృష్ణ. ఇప్పుడు రీ–ఎంట్రీ చేస్తున్న సినిమాలో హీరో ఆయన తనయుడు మహేశ్ కావడం విశేషం. కృష్ణ దర్శకత్వం వహించి, నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో విజయశాంతి హీరోయిన్. అందులో మహేశ్ బాలనటుడిగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సరి లేరు నీకెవ్వరు’లో మహేశ్ పాత్రతో సమానంగా ఆమె పాత్ర కూడా ట్రావెల్ అవుతుందని తెలిసింది. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
అవును.. మైనే ప్యార్ కియా
తెలుగు నేల మీద ఆ పావురం మురిపెంగా వాలింది.‘పావురమా హే.. హే.. హే... పావురమా హే..హే..హే’డబ్బింగ్ పాటైనా యువలోకమంతాకాలేజీ దారుల్లో హమ్ చేసింది.అమ్మాయిలు ఇలాంటి సౌందర్యానికి అసూయ పడ్డారు.అబ్బాయిలు పోస్టర్లను గోడల మీద గుండెల మీద అంటించుకున్నారు.భాగ్యశ్రీ ‘మైనే ప్యార్ కియా’తో దేశాన్ని ఒక వూపు ఊపింది.దేశం ఆమెను ప్రేమించింది.కాని ఆమె మాత్రం కెరీర్ కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించింది.ఆ ప్రేమ కథే ఈ మాటాముచ్చటా. 20 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలు చేస్తున్నారు.. పైగా హైదరాబాద్‌తో మీ ‘లవ్ లైఫ్’కి ఓ స్పెషాల్టీ ఉంది కదా? భాగ్యశ్రీ: (నవ్వేస్తూ). అవును. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని హిమాలయ్ నాతో చెప్పింది హైదరాబాద్‌లోనే. మేమప్పుడు ముంబై నుంచి స్కూల్ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చాం. అప్పటికే మేం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. కానీ బయటకు చెప్పుకోలేదు. చివరికి హైదరాబాద్ సాక్షిగా మా లవ్ గురించి మాట్లాడుకున్నాం. చార్మినార్ సాక్షిగా హిమాలయ్ చెప్పారా? లేక వేరే ఏదైనా ప్లేస్‌లోనా? ఇప్పుడంటే లవ్ ప్రపోజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ చూసుకుంటున్నారు. మూన్ లైట్లో చెబుతుంటారు. రోజా పువ్వులు ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. 30 ఏళ్ల క్రితం ఇలా లేదు. ట్రిప్‌లో మేమిద్దరం పక్క పక్కన కూర్చున్నాం. అప్పుడు తను నాతో చెప్పాడు. అప్పటికే మేం ఇక్కడ బోలెడన్ని హిస్టారికల్ ప్లేసెస్‌ని సందర్శించాం. ఇక ఇంతకంటే మంచి ప్లేస్ ఏం ఉంటుందని ఇప్పుడు అనిపిస్తోంది. అప్పుడు మీరిద్దరూ ఏం చదువుకుంటున్నారు? చదువు విషయంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారా? అసలు మీ మధ్య ప్రేమ ఎలా మొదలైంది? టెన్త్ స్టాండర్డ్‌లో ఉన్నాం. నేను లెక్కల్లో బాగా వీక్. హిమాలయ్ సూపర్. తను నాకు లెక్కలు నేర్పించేవాడు. తను మ్యాథ్స్ బాగా నేర్పించాడు కాబట్టే నేను బోర్డ్ ఎగ్జామ్ పాస్ కాగలిగాను. ఇద్దరం కలిసి చదువుకునేవాళ్లం కాబట్టి మా మధ్య ప్రేమ మొదలైంది. టెన్త్ అయ్యాక ఇద్దరం వేరే వేరే కాలేజీలకి వెళ్లిపోవాలి. అలా అయితే దూరం అవుతాం. ‘ఈ వ్యక్తిని వదులుకోకూడదు’ అనే ఫీలింగ్ ఇద్దరిలోనూ ఉంది. అప్పుడు తను ప్రపోజ్ చేయడం, నేను ఒప్పుకోవడం జరిగింది. మీది రాయల్ మరాఠీ ఫ్యామిలీ అంటే రాజుల కుటుంబం కదా... మరి ఇంట్లో ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఇంట్లోవాళ్లను ఎదిరించాలని మాకూ లేదు. అప్పుడు హిమాలయ్ చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. అదే సమయంలో నాకు ‘మైనే ప్యార్ కియా’లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అమ్మానాన్న కూడా ఓకే అన్నారు. అంటే.. ఆకర్షణకి, ప్రేమకీ తేడా తెలియని వయసు కాబట్టి మీ ఇంట్లోవాళ్లు మీ ఇద్దరి ప్రేమను కాదన్నారా? మా మధ్య ఉన్నది ఆకర్షణ కాదు... ప్రేమే. అదే విషయం నాన్నతో చెబుతూ ‘మాది ట్రూ లవ్’ అన్నాను. అయితే అతను అమెరికా నుంచి వచ్చాక కూడా నిన్ను కలవడానికి వస్తాడేమో చూద్దాం. ఒకవేళ వస్తే మాకేం అభ్యంతరం లేదన్నారు. హిమాలయ్ అమెరికా నుంచి రాగానే మేం కలిశాం. వెళ్లేముందు నా మీద ఎంత ప్రేమ ఉందో తిరిగొచ్చాక కూడా అంతే ఉంది. అమెరికాలో ఒక్కడే ఉన్నాడు. కావాల్సినంత స్వేచ్ఛ. పడాలనుకుంటే ఏదైనా అమ్మాయితో రిలేషన్ మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ హిమాలయ్‌కి నేనంటే ప్రేమ. అది మా పెద్దలకు కూడా అర్థమైంది. దాంతో మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పటి యూత్ లవ్‌లో ఉంటే రెస్టారెంట్లు, సినిమాలంటూ తిరుగుతుంటారు. అప్పట్లో సూర్యాస్తమయం కాకముందే మీరు ఇంట్లో ఉండాలనే నిబంధన ఉండేదట? అవును. స్కూల్ ఫినిష్ కాగానే ఇంటికి వెళ్లిపోవాలి. దాంతో మేమిద్దరం ఎక్కడా బయటకు వెళ్లింది లేదు. స్కూల్లో మాట్లాడుకోవడమే. అసలు పబ్బులు, డిస్కో థెక్‌లు పెళ్లయ్యాకే చూశాను. అలాగే డిన్నర్ డేట్, నైట్ పార్టీలన్నీ కూడా పెళ్లయ్యాక చేసుకున్నవే. పెళ్లి కాకముందు పుట్టింట్లో చాలా పట్టింపుల మధ్య పెరిగాను. ప్రపంచం చూడ్డానికి కుదిరేది కాదు. కట్టుబాట్లు ఉండేవి. బట్.. నేనో కంప్లైంట్లా ఇది చెప్పడంలేదు. ఓ పెద్ద ఫ్యామిలీలో అలా కట్టుబాట్లు ఉండటం సహజమే కదా. ‘మైనే ప్యార్ కియా’లో సల్మాన్ ఖాన్ కోసం స్వెటర్ కుట్టారు. మరి రియల్ లైఫ్ లవర్ హిమాలయ్‌కి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి? మేం చదువుకున్న రోజుల్లో మాకు ప్యాకెట్ మనీ ఇచ్చేవారు కాదు. కానీ ఏం కావాలన్నా కొనిపెట్టేవారు. ఇంట్లో నాకిది కావాలని అడిగితే, ‘అది ఎంత’ అనడిగేవారు. సరిగ్గా ఆ డబ్బు ఇచ్చేవారు. దాంతో ఏం మిగిలేవి కావు. ఒకవేళ హిమాలయ్‌కి ఏమైనా ఇవ్వాలంటే.. ఒకరోజు రిక్షాలో స్కూల్‌కి వెళ్లడం మానేసేదాన్ని. అలాగే ఒకరోజు స్కూల్ క్యాంటీన్లో తినడం మానుకునేదాన్ని. ఆ డబ్బుతో గ్రీటింగ్ కార్డులు కొనిచ్చేదాన్ని. అంతకుమించి వచ్చేవి కావు (నవ్వుతూ). ‘మైనే ప్యార్ కియా’ తర్వాత అప్పటి కుర్రకారుకి మీరు డ్రీమ్ గర్ల్ అయిపోయారు. ఆ సినిమా తర్వాతే మీ పెళ్లయింది. మరి అభిమానులు రాసిన లవ్ లెటర్స్‌కి హిమాలయ్ అసూయపడేవారా? లేదు. కానీ భార్య అంటే తను చాలా పొసెసీవ్. చెబితే నమ్మరేమో కానీ రోజుకి మూడు బస్తాల లెటర్స్ వచ్చేవి. పోస్ట్‌మేన్ అయితే అన్నేసి లెటర్లు తీసుకొస్తున్నందుకు ఎక్స్ట్రా మనీ అడిగేవారు (నవ్వుతూ). వీలైనన్ని ఉత్తరాలు చదివేదాన్ని. అంత అభిమానాన్ని సంపాదించుకుని సినిమాలు వదులుకున్నప్పుడు మీ ఫ్యాన్స్ ఫీలయ్యారు. అలా సినిమాలు వదులుకున్న విషయంలో ఇప్పుడేమైనా పశ్చాత్తాపపడుతుంటారా? లేదు. మీరు చెప్పండి? నేనెందుకు పశ్చాత్తాపపడాలి? హిమాలయ్తో నా మ్యారీడ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకేం తక్కువైందని రిగ్రెట్ అవ్వాలి. ఫ్యాన్స్ నన్ను ఎక్కువ సినిమాల్లో చూడాలని కోరుకోవడం సహజం. అయితే నాకు పర్సనల్ లైఫ్ ముందు ప్రొఫెషనల్ లైఫ్ పెద్దదిగా అనిపించలేదు. ఐయామ్ హ్యాపీ. అంటే.. జీవితం ఓ ‘అందమైన కల’లా బ్రహ్మాండంగా ఉందన్నమాట...నెవర్. జీవితం ఎప్పుడూ అలా ఉండదు. ఇద్దరు కలిసి జీవించడం మొదలుపెట్టాక లైఫ్ ‘ఫెయిరీ టేల్’లా ఉండదు. ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. చిన్న చిన్న కుదుపులను తట్టుకోవాలి. అన్నింటినీ దాటుకుంటూ జీవించినప్పుడే ఆ ప్రేమ ఇంకా పెరుగుతుంది. మా బంధం మొదలై 30 ఏళ్లు. ఇంకా మా ప్రేమ బలంగా ఉందంటే కారణం మా జీవితం ‘ఫెయిరీ టేల్’ కాకపోవడమే. అన్ని కుటుంబాల్లో అప్పుడప్పుడూ ఉండే సహజమైన ఇబ్బందులు ఉండేవి. వాటిని పరిష్కరించుకోవడానికి మేం ఇద్దరు చేసిన కృషి మా బంధాన్ని ఇంకా బలపరిచింది. బాగుంది... కానీ అమ్మాయిలే కెరీర్‌ని ఎందుకు త్యాగం చేయాలి? 30 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు. ఇప్పుడు లైఫ్ చాలా సింపుల్ అయింది. అత్తామామలు కూడా కోడళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉద్యోగం చేయమంటున్నారు, ఫ్యామిలీ అంతా అర్థం చేసుకుంటున్నారు. అప్పట్లో అర్థం చేసుకునేవాళ్లు లేరని కాదు.. అయితే అమ్మాయి ఇంటినీ, జాబ్‌నీ బ్యాలెన్స్ చేసే పరిస్థితి ఉండేది కాదు. నా మటుకు నేను చెప్పాలంటే.. నేను త్యాగం చేసినట్లుగా ఫీలవ్వడంలేదు. కెరీర్ వదిలేయడం రాంగ్ డెసిషన్ కాదు. ఎందుకంటే నా పిల్లల ఎదుగుదలను చూశాను. ఇవాళ మా అబ్బాయి, అమ్మాయి.. మంచివాళ్లగా ఎదిగారంటే కారణం నేను చాలా ఫోకస్డ్గా ఉండటంవల్లే. మంచీ చెడూ నేర్పించగలిగాను. ఇప్పుడు వాళ్లిద్దరూ ‘అమ్మా.. మమ్మల్ని ఇంతవాళ్లను చేశావ్. ఇక నీ బాధ్యత అయిపోయింది. నువ్వు హ్యాపీగా సినిమాలు చేసుకో’ అని ఎంకరేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీ అబ్బాయి అభిమన్యు ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ ద్వారా హీరో అయ్యారు. తల్లిగా మీ ఫీలింగ్? నేను థియేటర్‌కి వెళ్లి చూశాను. కొన్ని సీన్లకు ఆడియన్స్ చప్పట్లు కొట్టడం చూసి ఎమోషనల్ అయ్యాను. అప్పట్లో నా ఫస్ట్ మూవీ ‘మైనే ప్యార్ కియా’ని థియేటర్లో చూడలేదు. నా ఒడిలో ఆడుకుని, నా వేలి పట్టుకుని నడిచిన నా చిన్ని అభిమన్యు ఇవాళ ఇంత ఎత్తుకు ఎదిగాడనే ఫీలింగ్‌తో నోట మాట రాలేదు. అభిమన్యు ఏదో ఆషామాషీగా ఈ సినిమా చేయలేదు చాలా ఫోకస్డ్గా చేశాడు. రిస్కీ ఫైట్స్ డూప్ లేకుండా చేశాడట కదా? అవును. అసలైతే నన్ను లొకేషన్‌కి రావద్దన్నాడు. అయినా ఒకరోజు నేను షూటింగ్ స్పాట్‌కి వెళ్లాను. అభిమన్యు పైనుంచి దూకే సీన్ తీస్తున్నారు. ‘ఏంటిది? డూప్ పెట్టి తీయొచ్చు కదా’ అని కంగారుపడుతూ యూనిట్‌ని అడిగాను. ‘మేం అలానే అన్నాం కానీ మీ అబ్బాయే చేస్తానన్నారు’ అన్నారు. ఆ తర్వాత అభిమన్యుని ఎందుకింత రిస్క్ అని అడిగితే – ‘‘డూప్‌తో అంటే లాంగ్ షాట్స్ తీస్తారు. ఫేస్ బాగా చూపించరు. అదే నేనే చేస్తే ఫేస్ కూడా చూపిస్తారు. లాంగ్ షాట్స్ అంటే నేను చేయలేదని తెలిసిపోతుంది. అది నాకిష్టం లేదు’’ అన్నాడు. ఈ ప్రపంచంలో నేను, హిమాలయ్ మోస్ట్ లక్కీయస్ట్ పేరెంట్స్. అలా ఎందుకు అంటున్నానంటే.. మేం దేనికీ మా పిల్లలను ఫోర్స్ చేయాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా అభిమన్యు అయితే చాలా ఫోకస్డ్గా ఉంటాడు. చదువుకునే రోజుల్లో, చదువు.. చదువు అని తన వెంటపడాల్సిన అవసరం రాలేదు. ‘ఇక చదివింది చాలు.. వెళ్లి ఆడుకో’ అని మా అంతట మేమే చెప్పాల్సి వచ్చేది. అంతలా చదువుకునేవాడు. తను మంచి స్పోర్ట్స్‌మేన్ కూడా. ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకుంటాడు. మీ అమ్మాయి అవంతిక గురించి? అవంతిక లండన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసింది. మంచి విజన్ ఉన్న అమ్మాయి. నేను యాక్ట్ చేస్తున్న ఓ సినిమా సెట్స్‌కి వచ్చింది. ‘మామ్.. నేనిలా చేయగలనని అనుకుంటున్నావా?’ అనడిగింది. ‘ఒకవేళ నువ్వు చెయ్యాలనుకుంటే మాత్రం చాలా హార్డ్‌వర్క్ చేయాలి. యాక్టింగ్ క్లాసెస్‌కి వెళ్లాలి. పోటీని తట్టుకోవాలి. ఇంకా చేయడానికి ఏమీ లేదు అన్నంతగా హండ్రెడ్ పర్సంట్ వర్క్ చెయ్యాలి’ అన్నాను. హార్డ్‌వర్క్ చేసే మనస్తత్వం తనది. ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే మాకేం అభ్యంతరం లేదు. ఓకే.. మీ సినిమాల విషయానికొద్దాం.. తెలుగులో చేస్తున్న సినిమా ‘కిట్టీ పార్టీ’ గురించి? నేను మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ఒకటి బలంగా నిర్ణయించుకున్నాను. మంచి పాత్ర అయితేనే చేయాలనుకున్నాను. ‘కిట్టీ పార్టీ’లో దీప్తీ భట్నాగర్, మధుబాల.. ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. వాళ్లందరితో కలిసి సినిమా చేయడం హ్యాపీ. ఇందులో నాది చాలా మంచి పాత్ర. అక్క, వదిన, అత్త, అమ్మ పాత్రలకు రెడీయేనా? చూడండీ.. మన జీవితంలో మనం ఎవరికో ఒకరికి అక్కగా, వదినగా, అత్తగా, అమ్మగా ఉంటాం. వయసుతో సంబంధం లేదు. మనం టీనేజ్‌లో ఉన్నప్పుడే మనల్ని అత్తా అని పిలవడానికి బంధువుల్లో ఎవరో ఒకరి పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు స్క్రీన్ మీద ఆ పాత్రలు చేయడానికి వెనకాడటం ఎందుకు? అయితే ఆ పాత్రలో స్టఫ్ ఉండాలి. ఏదో అలా వచ్చామా? నాలుగు డైలాగులు చెప్పామా... అన్నట్లు ఉండకూడదు. మరి నెగటివ్ రోల్ చేయాలని లేదా? అసలు మీరు అలాంటి పాత్రలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా? నెగటివ్ రోల్స్ చేయాలని ఉంది. అయితే మీరన్నట్లు సూట్ అవుతానా? అనే సందేహం ఉంది. అందుకే లుక్స్‌తో కాకుండా మైండ్ గేమ్ ఆడే విలనీ క్యారెక్టర్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను. ఆర్టిస్ట్‌గా నాలో ఇంకో కోణం చూపించాలంటే నెగటివ్ రోల్స్ చేయాలి. రియల్ లైఫ్‌లో మీలో నెగటివ్ యాంగిల్‌ని తీసిన సందర్భాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఎవరైనా మిస్‌బిహేవ్ చేసినప్పుడు? సినిమా ఇండస్ట్రీలో నాకెలాంటి చేదు అనుభవం లేదు. ‘మైనే ప్యార్ కియా’ తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నా భర్త హిమాలయ్తో కలిసి నటించాను. ఏ ప్రొడక్షన్ హౌన్లో చేసినా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. ఒకవేళ ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవరిస్తే ఎదుర్కొనేంత ధైర్యం మీలో ఉందా? అప్పుడు నేను రెండో బేబీతో ప్రెగ్నెంట్. మా పెద్దబ్బాయ్ అభిమన్యు, నేను థియేటర్‌కి వెళ్లాం. వెనక సీట్లోని వ్యక్తి నన్ను తాకడం మొదలుపెట్టాడు. చెంప చెళ్లుమనిపించాను. చుట్టూ ఉన్నవాళ్లు నాకు సపోర్ట్ చేశారు. ఒకవైపు నేను ప్రెగ్నంట్ అని కనబడుతోంది. ఈ స్థితిలో ఉన్న ఏ స్త్రీ గురించి అయినా ఏ మగవాడూ అభ్యంతరకరంగా ఆలోచించడని మనం నమ్ముతాం. ఎక్కడో కొందరు ఇలాంటి మృగాలు ఉంటారు. హిమాలయ్‌కి ఫోన్ చేస్తే వచ్చాడు. అతడ్ని పోలీసులకు అప్పగించాం. తాకాడు కదా అని ఊరుకుంటే అతను ఇంకో అమ్మాయి దగ్గర కూడా ఇలానే చేస్తాడు. అందుకే నలుగురిలో పరువు తీసేయాలి. భాగ్యశ్రీ అందంగా ఉంటుంది, బాగా నటిస్తుంది, ఫ్యామిలీ లైఫ్‌లో చక్కగా సెటిలైంది.. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ అవసరమైతే భాగ్యశ్రీ ఇలానూ చేయగలుగుతుంది (నవ్వుతూ). మీ మాటలు అమ్మాయిలకు ధైర్యం చెబుతున్నట్లు ఉన్నాయి. ఏదైనా సినిమాలో మగవాడి మీద తిరగబడే పాత్రలు చేశారా? పేరు గుర్తు లేదు.. శివరాజ్‌కుమార్ సరసన ఒక కన్నడ సినిమా చేశాను. ఆ సినిమాలో నా అక్క పాత్ర తన భర్త పెట్టే బాధలు భరించలేక చనిపోతుంది. దాంతో నేను పురుష ద్వేషిని అవుతాను. వాళ్లను హింసించాలనే ధ్యేయం ఉంటుంది. శివరాజ్‌కుమార్‌తో పెళ్లవుతుంది. ఒక భర్త తన భార్యను ఏ విధంగా హింసపెడతాడో అవన్నీ ఇతడ్ని పెడతాను. ఇంటి పనులు చేయించడం, కొట్టడం.. ఇలా అన్నమాట. శివరాజ్‌కుమార్ ఆ క్యారెక్టర్ చేయడం గ్రేట్. భర్తని అలా బాధపెట్టాలని చెప్పడంలేదు కానీ మిమ్మల్ని బాధపడితే ఊరుకోవద్దు. డి.జి. భవాని ఫ్యామిలీ ట్రిప్స్ వెళుతుంటారా? ఇంట్లో అందరం బిజీ, అందుకే ఏడాదికి రెండు ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటాం. ఒకటి వీకెండ్ షార్ట్ ట్రిప్. ఇది లోకల్ ట్రిప్. ఒకటి లాంగ్ ట్రిప్. విదేశాలు వెళుతుంటాం. పది రోజులు ఫుల్‌గా ఎంజాయ్ చేసి, ముంబై వస్తాం. అలాగే నలుగురం ముంబైలో ఉన్నప్పుడు ఇంట్లో అందరం కలిసి ఒక పూట భోజనం అయినా చేయాలన్నది రూల్. ఆ సమయంలో ఫోన్లు పక్కన పెట్టేస్తాం. కెరీర్ గురించి, పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటాం. -
ఫీమేల్ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’
ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, హర్షవర్ధన్ రాణే, పూజా జవేరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు సుందర్ పవన్ మాట్లాడుతూ ‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్, సుమన్ రంగనాథ్, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’ అన్నారు. భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ... మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా హాలీవుడ్లో వచ్చిన ‘డెస్పరేట్ హౌస్‌వైఫ్స్’, ‘సెక్స్ అండ్ ది సిటీ’ సినిమాల తరహాలో ఉంటుంది. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు.’ అన్నారు. మధుబాల మాట్లాడుతూ ‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో... హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఇంటర్వ్యూలలో మెరిల్ స్ట్రీప్ వంటి హాలీవుడ్ తారలు మెయిన్ లీడ్స్‌గా సినిమాలు చేస్తున్నారని చెబుతుంటాం. మేముందుకు అటువంటి సినిమాలు, అటువంటి అద్భుతమైన పాత్రల్లో నటించలేం? ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో నేనొక మెయిన్ లీడ్‌గా, పూజా జవేరికి తల్లిగా నటిస్తున్నా. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు సుమన్, భాగ్య శ్రీతో నటిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. దీప్తీ భట్నాగర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్ లవ్. నాకింకా ‘పెళ్లి సందడి’ సినిమా షూటింగ్ చేసిన రోజులు గుర్తున్నాయి. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. చాలా విరామం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిండచం సంతోషంగా ఉంది’ అన్నారు. సుమన్ రంగనాథ్ మాట్లాడుతూ ‘నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను. మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథే హీరో’ అన్నారు. హరితేజ మాట్లాడుతూ ‘నిజంగానే పార్టీలా ఉంటుందీ సినిమా. చక్కగా, హాయిగా మూడు గంటలు ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక అమ్మాయి జీవితంలో పార్టీలు, సరదాలు, ఫన్ ఒక స్టేజ్ తర్వాత అయిపోయాక... బాధ్యతలు పెరిగాక... వాటి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోకి వచ్చే స్టోరీ ఎంత గమ్మత్తుగా ఉంటుందో? అక్కడ స్నేహితులు ఎలా ఉంటారో? అనే విషయాలు సినిమాలో చూడొచ్చు. నేను చెప్పింది సినిమాలో ఇసుక రవ్వంతే. ఇంకా చాలా ఉంది’’ అన్నారు. -
భాగ్యశ్రీ మళ్లీ వస్తోంది
ప్రేమ పావురాలు ఫేం భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే నటి. బాలీవుడ్ సినిమా ‘ మైనే ప్యార్ కియా’ ఎంతటి హిట్టో అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సెషన్. అందులో భాగ్యశ్రీ నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. తరువాత ఒకటి రెండు సినిమాలు తెలుగులో చేసినా..అవి తనకు కలిసిరాలేదు. కానీ ఇన్నేళ్ల తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. చేతన్‌భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన 2స్టేట్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అడివి శేష్, శివాని ( జీవిత రాజశేఖర్ కుమార్తె) జంటగా నటించబోతున్నారు. హీరో తల్లి పాత్రకు భాగ్యశ్రీ న్యాయం చేయగల్గుతుందని తనను తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. -
విషాదాంతంగా ముగిసిన ప్రేమ వ్యవహారం
హైదరాబాద్ : హైదరాబాద్ తిరుమలగిరిలో ఓ ప్రేమ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. లోతుకుంటలోని సరస్వతీనగర్ నివాసి భాగ్యశ్రీ రెడ్డి ఓ ప్రయివేట్ పాఠశాలలో టీచర్. సంవత్సర కాలంగా ఆమె వైజాగ్‌కు చెందిన గీతాకృష్ణతో ప్రేమ వ్యవహారం కొనసాగింది. భాగ్యశ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతుండగా.. గీతాకృష్ణ ఎంటెక్ చేస్తున్నాడు. అయితే వీరి ప్రేమను గీతాకృష్ణ పేరెంట్స్ అంగీకరించలేదు. ఆరు నెలలుగా తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై భాగ్యశ్రీ ఒత్తిడి తీసుకు రావటంతో గీతాకృష్ణ కనిపించకుండా పోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటానన్న గీతాకృష్ణ మాట మార్చడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపించారు. గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీతాకృష్ణ తనను మోసం చేశాడంటూ భాగ్యశ్రీరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.