Avantika Dassani: హీరోయిన్‌గా భాగ్యశ్రీ కుమార్తె  | Avantika Dassani to make her Telugu Debut with Ganesh Bellamkonda | Sakshi
Sakshi News home page

Avantika Dassani: హీరోయిన్‌గా భాగ్యశ్రీ కుమార్తె 

Published Mon, Oct 10 2022 11:31 PM | Last Updated on Tue, Oct 11 2022 2:01 AM

Avantika Dassani to make her Telugu Debut with Ganesh Bellamkonda - Sakshi

అవంతిక 

‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) అంటూ 30 ఏళ్ల క్రితం హిందీ తెరపై సల్మాన్‌ ఖాన్‌తో భాగ్యశ్రీ కురిపించిన ప్రేమను అప్పటి తరం అంత సులువుగా మరచిపోదు. ఈ మధ్యే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ–ఎంట్రీ ఇచ్చారామె. ఇప్పుడు భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నారు. బెల్లంకొండ గణేష్‌ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ ద్వారా అవంతిక పరిచయం కానున్నారు.

రాఖీ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నాంది’ చిత్రనిర్మాత సతీష్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో శ్రుతీ వాసుదేవన్‌ అనే కాలేజీ స్టూడెంట్‌గా నటించారు అవంతిక. సినిమా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: అనిత్‌ మధాడి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement