సినిమాలకు హీరో గుడ్‌బై.. నాలుగురోజులే ఉండే కూతురు.. తనకోసం అన్నీ చేస్తా! | Imran Khan Says He Doesn't Have A Nanny For His Daughter | Sakshi
Sakshi News home page

హీరో లవ్‌ మ్యారేజ్‌- విడాకులు.. వారానికి నాలుగురోజులు ఉండిపోయే కూతురు

Published Sat, May 11 2024 4:53 PM | Last Updated on Sat, May 11 2024 5:25 PM

Imran Khan Says He Doesn't Have A Nanny For His Daughter

నా బిడ్డ ఇమారా కోసం నేను ఏదైనా చేస్తాను. తనను చూసుకునేందుకు ఏ మనిషినీ పెట్టుకోలేదు. నేనే తనకు వంట చేసి పెడతాను.

ఇమ్రాన్‌ ఖాన్‌.. ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్టుగా, తర్వాత హీరోగా హిందీలో సినిమాలు చేసిన ఈయన తర్వాత ఉన్నట్లుండి గ్లామర్‌ ప్రపంచానికి గుడ్‌బై చెప్పేశాడు. 2015లో కట్టి బట్టి అనే మూవీలో చివరిసారిగా కనిపించాడు. అతడికి ఏడాదిన్నర వయసున్నప్పుడు పేరెంట్స్‌ విడాకులు తీసుకున్నారు. తర్వాత తల్లి రాజ్‌ జుట్షి అనే నటుడిని రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2006లోనే విడాకులు తీసుకున్నారు.

ప్రేమ పెళ్లి
పెద్దయ్యాక ఇమ్రాన్‌ పరిస్థితి కూడా అదే అయ్యింది. అవంతిక అనే అమ్మాయిని ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2014లో ఓ పాప పుట్టింది. ఆమెకు ఇమారా మాలిక్‌ అని నామకరణం చేశారు. ఏమైందో ఏమో కానీ తర్వాత భార్యాభర్తల మధ్య బంధం బలహీనం కాసాగింది. 2019లో అవంతిక తన కూతుర్ని తీసుకుని భర్త ఇంటి నుంచి వెళ్లిపోయింది. అలా విడివిడిగా జీవించిన ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఏదైనా చేస్తా
తాజాగా ఇమ్రాన్‌ ఖాన్‌ తన కూతురి గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ ఇమారా కోసం నేను ఏదైనా చేస్తాను. తనను చూసుకునేందుకు ఏ మనిషినీ పెట్టుకోలేదు. నేనే తనకు వంట చేసి పెడతాను. స్కూల్‌లో డ్రాప్‌ చేస్తాను. బడి అయిపోగానే తీసుకొస్తాను. నిద్రపుచ్చుతాను. మళ్లీ సినిమాల్లో ప్రయత్నించడం కంటే నా కూతుర్ని బాధ్యతగా, జాగ్రత్తగా చూసుకోవడమే బాగుంది.

వారంలో నాలుగు రోజులు
మరీ ముఖ్యంగా తను పెద్దయ్యాక.. మా నాన్న చిన్నప్పుడు నన్నిలా చూసుకున్నాడు, నాకోసం ఈ పని చేశాడు, తనే స్కూలు దగ్గర దిగబెట్టేవాడు అని చెప్పుకోవడానికి జ్ఞాపకాలను కూడబెడుతున్నాను. తన కస్టడీని ఇద్దరం తీసుకున్నాం. వారంలో నాలుగు రోజులు నా దగ్గర, తర్వాతి రోజులు నా మాజీ భార్య దగ్గర ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement