సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్‌డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా.
2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
(ఇది చదవండి: పవర్‌ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?)
ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్‌గా
సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్‌లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు.
అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment