ప్రకృతి ఒడిలో ఒకప్పటి హీరో కొత్తిల్లు.. 'నీకంత డబ్బు ఎక్కడిది?' | Imran Khan Shuts Down To Trolls Who Questions Where He Gets Money From | Sakshi
Sakshi News home page

ప్రకృతి అందాల నడుమ కొత్తిల్లు.. ఇంత డబ్బు ఎక్కడిదన్న నెటిజన్‌.. హీరో ఆన్సరిదే!

Published Mon, Jun 3 2024 11:02 AM | Last Updated on Mon, Jun 3 2024 11:15 AM

Imran Khan Shuts Savage Reply to Troll Who Questions Where He Gets Money From

ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్టుగా, తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇమ్రాన్‌ ఖాన్‌. అయితే ఈ గ్లామర్‌ ప్రపంచంలో ఎక్కువకాలం ఉండలేకపోయాడు. 2015లో కట్టి బట్టి అనే చిత్రంలో చివరిసారిగా కనిపించాడు. దాదాపు తొమ్మిదేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. తను ప్రేమించి పెళ్లాడిన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు.

ప్రకృతి ఒడిలో ఇల్లు
ఇటీవల అతడు ఓ ఇల్లు కట్టాడు. కొండకోనల నడుమ ప్రకృతి ఒడిలో ఆ ఇల్లు ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తూ..  'నేను కొన్ని సినిమాల్లో ఆర్కిటెక్ట్‌గా పని చేశాను. కానీ నాకు దానిపై ఎటువంటి అవగాహన లేదు. అయితే తెలియనివాటి గురించి తెలుసుకోవడమన్నా, కొత్తవి నేర్చుకోవడమన్నా నాకు భలే ఇష్టం. ఫోటోలో కనిపిస్తున్న ప్రదేశం చాలా స్పెషల్‌గా అనిపించింది. అందుకే దీన్ని ఎంచుకున్నాను. కొండవాలు ప్రదేశంలో సూర్యోదయాన్ని ఆస్వాదించేందుకు ఇంతకంటే మంచి ప్లేస్‌ మరొకటి ఉండదనిపించింది. 

విల్లా కాదు షెల్టర్‌..
ఇక్కడ నేను విలాసవంతమైన విల్లా కట్టాలనుకోలేదు. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఒక షెల్టర్‌ ఉంటే చాలనుకున్నాను. మొదట ఇక్కడికి వెళ్లి సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూస్తూ ఉండిపోయేవాడిని. అన్ని సీజన్లలోనూ అక్కడికి వెళ్లి పరిస్థితులను గమనించాను. వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు ఎటువైపు వెళ్తుంది. మట్టి ఎటు కొట్టుకుపోతుంది? ఇలా అన్నీ దగ్గరుండి పరిశీలించాను. ఆ తర్వాతే నా పని మొదలుపెట్టాను. 

తక్కువ ఖర్చు..
కాంక్రీట్‌ బిల్డింగ్‌కు బదులుగా దగ్గరి గ్రామాల్లోని ప్రజల ఇళ్లలా సింపుల్‌గా నిర్మించాలనుకున్నాను. విల్లా కంటే కూడా ఇది చాలా తక్కువలోనే అయిపోయింది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు ఇమ్రాన్‌ ఖాన్‌ ఇల్లు చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్‌ మాత్రం నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని అడిగాడు. అందుకు ఇమ్రాన్‌.. నేను గతంలో కొన్ని సినిమాలు చేశాను కదా.. అని ఆన్సరిచ్చాడు.

 

 

చదవండి: ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్‌ మూవీ.. అఫీషియల్‌ ఫ్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement