Is Imran Khan and Avantika Malik Will Take Divorce? - Sakshi
Sakshi News home page

Imran Khan: విడాకుల బాటలో బాలీవుడ్‌ దంపతులు!

May 19 2022 12:01 PM | Updated on May 19 2022 12:56 PM

Bollywood Couple Imran Khan, Avantika Malik Decide Its Over, Report - Sakshi

ఎంతోమంది వీరిని కలపడానికి ట్రై చేసినా ఇమ్రాన్‌ మాత్రం ఒక్క మెట్టు కూడా తగ్గడం లేదట. పెళ్లి అనేది తన జీవితంలో ముగిసిన అధ్యాయమని భావిస్తున్నాడట. అతడి మనసు మారదని అర్థమైన అవంతిక బంధాన్ని

ప్రేమలో ఉన్న అనురాగం పెళ్లి చేసుకున్నాక ఎక్కువ కాలం నిలవట్లేదు. ఈ ధోరణి సెలబ్రిటీల జీవితాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏళ్లపాటు ప్రేమగీతాలు పాడుకున్న తారలు పెళ్లయ్యాక మాత్రం కొన్ని సంవత్సరాలకే ముఖం చాటేస్తున్నారు. దారులు వేరంటూ విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా మరో బాలీవుడ్‌ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి వీరు చాలాకాలంగా విడివిడిగానే జీవిస్తుండగా తాజాగా తమ బంధానికి శాశ్వతంగా ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది.

కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు ఎంతోమంది వీరిని కలపడానికి ట్రై చేసినా ఇమ్రాన్‌ మాత్రం ఒక్క మెట్టు కూడా తగ్గడం లేదట. పెళ్లి అనేది తన జీవితంలో ముగిసిన అధ్యాయమని భావిస్తున్నాడట. అతడి మనసు మారదని అర్థమైన అవంతిక బంధాన్ని తెచ్చుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఇమ్రాన్‌, అవంతికలు ఎనిమిదేళ్లపాటు డేటింగ్‌ చేసిన అనంతరం 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇమారా అనే ఏడేళ్ల కూతురు ఉంది. ఇదిలా ఉంటే ఇమ్రాన్‌ ఖాన్‌ 'జానే తు యా జానే నా' సినిమాతో 2008లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కిడ్నాప్‌, ఢిల్లీ బెల్లీ, ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌, గోరీ తేరే ప్యార్‌ మే వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఆయన చివరగా 2015లో కట్టి బట్టి సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాడు.

చదవండి 👇

 నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా..

ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement