పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్‌ బ్యాక్ ఇస్తాడా? | Venu Thottempudi, Avantika Mishra Athidhi Movie Streaming On Disney+ Hotstar From September 19 - Sakshi
Sakshi News home page

Venu: రీ ఎంట్రీతో భయపెడతానంటోన్న వేణు .. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published Fri, Sep 8 2023 3:35 PM | Last Updated on Fri, Sep 8 2023 5:25 PM

Venu Thottempudi and Avantika Mishra Athidhi Streaming On September 19 - Sakshi

స్వయంవరం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటుడు వేణు తొట్టెంపూడి. ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన  తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించిన వేణు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గతేడాది రవితేజ నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. తెలుగులో చెప్పవే చిరుగాలి, పెళ్లాం ఊరెళితే, దమ్ము, గోపి గోపిక గోదావరి, హనుమాన్ జంక్షన్, శ్రీకృష్ణ 2006, చిరునవ్వుతో లాంటి చిత్రాల్లో నటించారు.

(ఇది చదవండి: 'జవాన్‌' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే)

అయితే ఈ ఏడాది ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. 2013 తర్వాత ఏ చిత్రంలోనూ లీడ్‌ రోల్‌లో కనిపించని వేణు.. ప్రస్తుతం గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా వేణు ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  చివరగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో పోలీస్ అధికారిగా కనిపించిన వేణు 'అతిథి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో అతనికి జోడీగా అవంతిక మిశ్రా నటిస్తోంది.

(ఇది చదవండి: షారుఖ్‌ ఖాన్‌ మేనేజర్‌ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!)

అయితే ఈ సిరీస్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. తాజాగా అతిథి వెబ్‌ సిరీస్‌ను రిలీజ్‌ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్‌ తేదీని రివీల్ చేశారు. ఈనెల 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అయితే హీరోగా ఎమోషనల్, కామెడీ తరహా సినిమాలు చేసిన వేణు.. ఇప్పుడు మాత్రం సరికొత్తగా హారర్ కాన్సెప్ట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement