భాగ్యశ్రీ మళ్లీ వస్తోంది | Bhagya Sri Acts In telugu Movie After Longtime | Sakshi
Sakshi News home page

టూ స్టేట్స్‌ రీమేక్‌లో భాగ్యశ్రీ

Published Mon, Mar 12 2018 1:10 PM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

Bhagya Sri - Sakshi

అలనాటి అందాల తార భాగ్యశ్రీ

ప్రేమ పావురాలు ఫేం భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే నటి.  బాలీవుడ్‌ సినిమా ‘ మైనే ప్యార్‌ కియా’  ఎంతటి హిట్టో అందరికీ తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌, భాగ్యశ్రీ జంటగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సెషన్‌. అందులో భాగ్యశ్రీ నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. తరువాత ఒకటి రెండు సినిమాలు తెలుగులో చేసినా..అవి తనకు కలిసిరాలేదు. కానీ  ఇన్నేళ్ల తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది.

చేతన్‌భగత్‌ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన 2స్టేట్స్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అడివి శేష్‌, శివాని ​( జీవిత రాజశేఖర్‌ కుమార్తె) జంటగా నటించబోతున్నారు. హీరో తల్లి పాత్రకు భాగ్యశ్రీ న్యాయం చేయగల్గుతుందని తనను తీసుకున్నట్లు సమాచారం. వెంకట్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement