శివానీ రాజశేఖర్, అడవి శేష్
చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘2 స్టేట్స్’. అడవి శేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లు. వెంకట్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విజయదశమికి విడుదల చేస్తున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘అందమైన రొమాంటిక్ ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే కోల్‌కతాలో రెండు షెడ్యూల్స్, హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం.
వెంకట్‌రెడ్డిగారు ఈ సినిమాను ఆద్యంతం చక్కగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆహ్లాదకరంగా సాగిపోయే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఈ నెల 22 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ఓ పెళ్లి పాటను జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తాం. తర్వాత విదేశాల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దీంతో టాకీ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు వెంకట్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: షానియల్ డియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్.
Comments
Please login to add a commentAdd a comment