Two states
-
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం(ఆగస్టు 16) మళ్లీ ఎన్నికల నగారా మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్ముకు అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. -
Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
ఒకే ఓటరుకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే... 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి కూడా వస్తాయి! సర్పంచ్‌లూ ఇద్దరు పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్‌లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి. రెండువైపులా ఓటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు! ఒకచోట తొలగించండి...! ఇలా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు. ‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’ – ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకే ఇల్లు.. 4 గదులు తెలంగాణలో, 4 గదులు మహారాష్ట్రలో..
ముంబై/హైదరాబాద్: ఒక్క ఇంట్లో రెండు రాష్ట్రాలకు పన్ను కట్టాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే ఇంట్లో నివసిస్తూ ఒక రాష్ట్రంలో భోజనం చేసి మరో రాష్ట్రంలో నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వినడాకిని వింతగా ఉన్నా.. ఇలాంటి ఇల్లు నిజంగానే ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా మహారాజగూడ గ్రామంలో ఈ ఇల్లు ఉంది. పవార్ బ్రదర్స్ దీని యజమానులు. 13 మంది కుటుంబసభ్యులు ఇందులో నివసిస్తున్నారు. మొత్తం 10 గదులున్నాయి. నాలుగు గదులు మహారాష్ట్ర కిందకి, మరో నాలుగు గదులు తెలంగాణ కిందకు వస్తాయి. అందుకే రెండు రాష్ట్రాలకు ఈ కుటుంబం పన్ను కడుతోంది. అయితే పన్ను ఎక్కువ కట్టాల్సి వస్తోందని వీళ్లు బాధపడటం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను వీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాహనాల రిజిస్టేషన్లను ఎంహెచ్, టీఎస్‌తో ఇనీషియల్స్‌తో చేయించుకుంటున్నారు. 1969 మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించినప్పుడు తమ ఇళ్లు రెండు రాష్ట్రాల కిందకు వచ్చిందని యజమానులు ఉత్తమ్ పవార్, చందు పవార్ చెబుతున్నారు. అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. Maharashtra | A house in Maharajguda village, Chandrapur is spread b/w Maharashtra & Telangana - 4 rooms fall in Maha while 4 others in Telangana Owner, Uttam Pawar says, "12-13 of us live here. My brother's 4 rooms in Telangana&4 of mine in Maharashtra, my kitchen in Telangana" pic.twitter.com/vAOzvJ5bme — ANI (@ANI) December 15, 2022 ఇప్పటివరకు మహారాజగూడ గ్రామానికి మాత్రమే తెలిసిన ఈ ఇల్లు గురించి ఇప్పుడు దేశంలో అందిరికీ తెలిసింది. తమ ఇల్లు రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల తమకెలాంటి ఇబ్బంది అన్పించడంలేదని పవార్ సోదరులు చెబుతున్నారు. తన నాలుగు గదులు మహారాష్ట్రలో, తన సోదరుడు చందు కుటుంబం నివసించే మరో నాలుగు గదులు తెలంగాణలో ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు. తన కిచెన్ మాత్రం తెలంగాణలోనే ఉందన్నారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
సీనియర్ నటుడు కన్నుమూత, ప్రముఖుల సంతాపం
బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రమణియన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు దృవీకరించారు. అయితే సుబ్రమణియన్ మరణానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక సుబ్రమణియన్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఆశోక్ పండిత్ ట్వీట్ చేస్తూ.. 'నా స్నేహితుడు, గొప్ప నటుడు, అంతకంటే మంచి మనిషి శివ సుబ్రమణియన్ మరణవార్త విని చాలా షాక్ అయ్యాను. ఆయన భార్య దివ్యకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.ఈ విషాదాన్ని తట్టుకునేంత శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. 1989లో పరిండా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. స్టాన్లీ కా డబ్బా, తు హై మేరా సండే, ఉంగ్లీ, నెయిల్ పాలిష్ మరియు 2 స్టేట్స్లో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. స్క్రీన్ రైటర్‌గానే కాకుండా పలు టీవీ షోలలో కూడా నటించారు. చివరగా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో వచ్చిన మీనాక్షి సుందరేశ్వర్ సినిమాలో ఆయన కనిపించారు. ఇందులో సన్యా మల్హోత్రా తండ్రిగా నటించాడు. Extremely shocked and pained to know about the tragic demise of our dear friend, a great actor and a brilliant human being Shiv Subramaniam. My heartfelt condolences to his wife Divya. May God give you enough energy to face this tragedy . ॐ शान्ति ! 🙏 pic.twitter.com/LvTM0mZhFi — Ashoke Pandit (@ashokepandit) April 11, 2022 Terrible news to wake up to. Shiv Subramaniam gone. Heartbreaking. — Hansal Mehta (@mehtahansal) April 11, 2022 -
ఒక తెలివైన ప్రేమ కథ
ప్రేమ గుడ్డిది.. అని అంటుంటారు. అన్ని ప్రేమల సంగతి ఏమిటో కానీ కొన్ని ప్రేమలు చాలా తెలివైనవి. అలాంటి ప్రేమ కథల్లో ఒకటి ‘టూ స్టేట్స్’. సంస్కృతి, సంప్రదాయాలపరమైన తేడాను, కులం గోడలను దాటి ప్రేమను విజయవంతం చేసుకొన్న ఒక తెలివైన జంట కథ ఇది. ప్రపంచమంతా ప్రేమ పెళ్లిళ్లు సులభంగా జరిగిపోతాయి. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొంటారు. భారతదేశంలో మాత్రం ఇంకొన్ని మెట్లు ఉంటాయి. అబ్బాయి అమ్మాయిని, అబ్బాయిని అమ్మాయి ప్రేమించిన తర్వాత అమ్మాయి కుటుంబం అబ్బాయిని ప్రేమించాల్సి ఉంటుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమించాల్సి ఉంటుంది. ఇలాంటి దశల వారీ ప్రక్రియలా జరిగే ప్రేమ కథే 2 స్టేట్స్. చేతన్‌భగత్ నవలగా రచించిన తన సొంత ప్రేమ కథ చాలా భాషల్లో సినిమాగా కూడా తెరకెక్కింది. సినిమా కమ్ నవల కథ మన సంస్కృతిలో ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించే జంటలకు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమించడానికి రెండు మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కలవాలి. అలా కలవని సందర్భాల్లో... ఒకవైపు పరువు హత్యలు మరోవైపు పెద్దలను ఎదురించి చేసుకొని పెళ్లిళ్లు చేసుకొనే జంటలు.. ఇటువంటి పరిణామాల మధ్య పెద్దలను ఒప్పించి, రెండు కుటుంబాలను కలిపి ఒక్కటయ్యే జంట కమ్మని కథ ఇది. తన నవల 90 శాతం వినోదాన్ని 10 శాతం సొసైటీ రీఫార్మింగ్కోసం సందేశాన్ని ఇస్తుందని చేతన్‌భగత్ అంటాడు. కాలేజీలో ఎంపిక చేసుకొన్న అమ్మాయికి ఎదురుపడితే ఎలా ఉంటుంది? అది కూడా తరచూ! ఆ ఎదురుపడటం యాదృచ్ఛికంగా జరిగిందని అవతలి వారికి అనిపించి కళ్లూకళ్లూ కలిశాయంటే సమ్మోహనం మొదలయినట్టే. ఇలాంటి సమ్మోహనమే మొదలవుతుంది అనన్య, క్రిష్‌ల మధ్య. ఐఐఎమ్‌లో ఇంటరాక్షన్ క్లాస్‌లోనే వారి పరిచయం మొదలవుతుంది. మనిషి మనసులో ప్రేమ పుట్టడం అనేది హార్మోన్ల ప్రభావం అని, లవ్ ఈజ్ కెమిస్ట్రీ అని అంటారు శాస్త్రజ్ఞులు అయితే ఒక అమ్మాయి, అబ్బాయి చూపుల మధ్య ఒకేసారి అలాంటి కెమిస్ట్రీ వర్కవుటవ్వడం మాత్రం చాలా కష్టమైన పని. దాన్ని సాధించాలంటే చాలా కష్టమే ఉంటుంది. దానికి చొరవ కూడా ముఖ్యం. క్రిష్‌లో చొరవ ఉన్న దాన్ని ఎప్పటికప్పుడు రెసిస్ట్ చేస్తూ వచ్చిన ఆమె అప్పటికప్పుడు కన్విన్స్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకేముంది వర్సిటీ డార్మ్రూమ్లోనే రొమాన్స్ మొదలు! అంత వరకూ వాళ్లిద్దరికీ ఉన్న పరిచయం వేరు, పెళ్లి ఆలోచన వచ్చాక కలిగే పరిచయం వేరు. అబ్బాయి పంజాబీ హిందూ, అమ్మాయి తమిళ బ్రాహ్మణకుటుంబానికి చెందిన యువతి... సంప్రదాయాల్లోని సవాలక్ష తేడాలు. ఇరు కుటుంబాల పెద్దల అభ్యంతరాలు. కుటుంబాల మధ్య స్పర్థలతో పెళ్లి వద్దు, అనుకొనేంత వరకూ వెళుతుందామె. కానీ చివరకు తమ పెళ్లిని కాదన్న పెద్దలను ఒప్పించి, మెప్పించి పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. మనది కులాల, మతాల, సంప్రదాయాల తేడాతో రంగురంగులుగా మెరిసే సీతాకోకచిలుక లాంటి సమాజం. ఇలాంటి వ్యవస్థలో ప్రేమ వ్యవహారాలు రక్తసిక్తవర్ణాలకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కులాంతర, ప్రాంతాంతర వివాహం చేసుకొని ఆ విషయాన్ని తన వాళ్ల చేత ఒప్పించి, దాన్ని నవలగా గ్రంథస్థం చేసి సమాజం చేత కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడు చేతన్‌భగత్. ఆ ప్రయత్నం సినిమాగా కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇలాంటి కథలు కొన్ని పరువు హత్యలను నివారించినా, కొందరు ప్రేమికులను తెలివైన వారిగా తీర్చిదిద్దినా మంచిదే కదా! - జీవన్ రెడ్డి.బి -
చిక్కుల్లో ‘2 స్టేట్స్’.. ఆగిపోయిన షూటింగ్
చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘2 స్టేట్స్’. అడవి శేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లు. వెంకట్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ అర్థాంతరంగా ఆగిపోయింది. స్టోరి విషయంలో దర్శకునికి, నిర్మాతకు మధ్య విబేధాలు తలెత్తడంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ రెడ్డి.. చిత్ర నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణపై కోర్టులో కేసు వేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన నేను ‘2స్టేట్స్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాను. షూటింగ్ ప్రారంభిచడానికి ముందే హీరో, హీరోయిన్, నిర్మాతకు కథను పూర్తిగా వినిపించి అందరి అనుమతి తీసుకున్నాను. ఆ తర్వాతే షూటింగ్ మొదలు పెట్టాను. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్‌పుట్ విషయంలో మా టీం చాలా సంతృప్తిగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ పేపర్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేశారు’ అన్నారు. అయితే ‘సినిమా బాగా వస్తున్న సమయంలో కథలో మార్పులు చేయాల్సిందిగా నిర్మాత నన్ను కోరాడు. అందుకు నేను తిరస్కరించాను. దాంతో ఈ ప్రాజెక్ట్ నుంచి నన్ను తప్పించేందుకు నిర్మాత నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి నన్ను తొలగించే ప్రయత్నం జరుగుతుందని తెలిసి నేను నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణపై కోర్టులో కేసు వేశాను. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు నిర్మాతను ఆదేశించింది. ఈ సినిమాకు నేను దర్శకత్వంతో పాటు.. భాగస్వామి, ప్రాఫిట్ హోల్డర్ని కూడా. ‘2స్టేట్స్’ రిమేక్ రైట్స్‌లో భాగంగా చేసుకున్న అగ్రిమేంట్ ప్రకారం ఈ సినిమాకు దర్శకత్వం వహించే హక్కులు పూర్తిగా నాకే ఉన్నాయ’న్నారు. మిగిలిన 30 శాతం షూటింగ్‌ను తాను కాకుండా.. మరేవరైనా పూర్తి చేయాలని ముందుకు వస్తే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కోర్టుతో సంప్రదించిన తర్వాత మిగతా విషయాలు బయటపెడతానని దర్శకుడు వెంకట్ రెడ్డి తెలిపారు. -
అందమైన ప్రేమకథ
చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘2 స్టేట్స్’. అడవి శేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లు. వెంకట్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విజయదశమికి విడుదల చేస్తున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘అందమైన రొమాంటిక్ ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే కోల్‌కతాలో రెండు షెడ్యూల్స్, హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. వెంకట్‌రెడ్డిగారు ఈ సినిమాను ఆద్యంతం చక్కగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆహ్లాదకరంగా సాగిపోయే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ నెల 22 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ఓ పెళ్లి పాటను జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తాం. తర్వాత విదేశాల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దీంతో టాకీ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు వెంకట్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: షానియల్ డియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్. -
కోలీవుడ్ కాలింగ్
ఇంకా సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వలేదు. హీరోయిన్గా చేస్తున్న సినిమా ఆన్ సెట్స్‌లో ఉంది. కానీ కోలీవుడ్ నుంచి శివానీకి కబురొచ్చింది. జీవితా రాజశేఖర్ల కుమార్తె శివానీ హిందీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ ఆఫర్ గురించి చెప్పాలంటే... విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులోనే కథానాయికగా చాన్స్‌ను దక్కించుకున్నారు శివానీ. ఈ సినిమా షూట్లో పాల్గొనడానికే ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నారని సమాచారం. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపిస్తారట శివానీ. ఇదిలా ఉంటే మన తెలుగమ్మాయి శివానీ ఈ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు వెళుతుంటే, ఈ చిత్ర కథానాయకుడు విష్ణు విశాల్.. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్యం’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం కానున్నారు. -
అందమైన ప్రేమకథ
అడవి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘2 స్టేట్స్’ (వర్కింగ్ టైటిల్). చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. వెంకట్ రెడ్డి కుంచం దర్శకత్వంలో ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కోల్‌కత్తాలో ముగిసింది. ఈ సందర్భంగా ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ– ‘‘బ్యూటిఫుల్, క్యూట్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్, కోల్‌కత్తాలో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశాం. అడవి శేష్, శివానీ, భాగ్యశ్రీ, రజిత్ కపూర్, లిజి, ఆదిత్య మీనన్ కాంబినేషన్లో కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరించాం. పూర్తయినంత వరకు రషెస్ చూశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఈ నెల 7న మూడో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘2 స్టేట్స్’ నవల చదువుతున్నంతసేపు పాఠకుడు ఎంతగా ఆస్వాదిస్తాడో, మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ అంతకు రెట్టింపు ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకట్ రెడ్డి కుంచం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: షానియల్ డియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్. కుమార్. -
భాగ్యశ్రీ మళ్లీ వస్తోంది
ప్రేమ పావురాలు ఫేం భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే నటి. బాలీవుడ్ సినిమా ‘ మైనే ప్యార్ కియా’ ఎంతటి హిట్టో అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సెషన్. అందులో భాగ్యశ్రీ నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. తరువాత ఒకటి రెండు సినిమాలు తెలుగులో చేసినా..అవి తనకు కలిసిరాలేదు. కానీ ఇన్నేళ్ల తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. చేతన్‌భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన 2స్టేట్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అడివి శేష్, శివాని ( జీవిత రాజశేఖర్ కుమార్తె) జంటగా నటించబోతున్నారు. హీరో తల్లి పాత్రకు భాగ్యశ్రీ న్యాయం చేయగల్గుతుందని తనను తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. -
బెస్ట్ చాయిస్
‘‘మంచి సినిమాతో పరిచయం చేయాలని ఉంది. సరైన కథ కోసం చూస్తున్నాం’’ అని రెండు మూడు నెలల క్రితం జీవిత ‘సాక్షి’తో అన్నారు. పెద్ద కుమార్తె శివానీ సినీ రంగప్రవేశం గురించి మాట్లాడినప్పుడు ఆమె అలా అన్నారు. ఆ టైమ్ వచ్చేసింది. రాజశేఖర్–జీవితలకు మంచి కథ దొరికింది. కూతురి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ఇది కరెక్ట్ మూవీ అని ఫిక్స్ అయ్యారు. యస్.. శివానీ ఎంట్రీ షురూ అయింది. హిందీ హిట్ మూవీ ‘2 స్టేట్స్’ రీమేక్ ద్వారా శివానీ తెలుగు తెరపై మెరవనుంది. అర్జున్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘2 స్టేట్స్’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అడవి శేష్ హీరోగా నటించనున్న ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో శివానీ హీరోయిన్గా దాదాపు ఫిక్స్ అయింది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. నూతన దర్శకుడు వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘2 స్టేట్స్’ కథ విషయానికొస్తే.. ఓ తమిళ బ్రాహ్మణ యువతి, పంజాబీ యువకుడు ప్రేమలో పడతారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి, ఎలా పెళ్లి చేసుకున్నారు? అనేది కథ. లైన్ సింపుల్ అయినా తీసిన విధానం బాగుంటుంది. అందుకే కుమార్తె ఎంట్రీకి ఇదే ‘బెస్ట్ చాయిస్’ అని రాజశేఖర్ దంపతులు అనుకుని ఉంటారు. -
‘ఉమ్మడి’గా విద్యుత్ ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుమారు 600 మేర అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి త్వరలో ఉమ్మడి ప్రకటన జారీ కానుంది. రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంతకుముందు విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ కోసం ఒకేసారి వేర్వేరుగా నియామక ప్రకట నలు జారీ చేయడం పలు సమస్యలకు దారి తీసింది. దాంతో ఉమ్మడి నియామక ప్రకటనల ద్వారా ఏఈ పోస్టుల భర్తీ చేపట్టాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయిం చాయి. తమ పరిధిలోని ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో ఏఈ పోస్టుల ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఏఈ మిగులు పోస్టుల భర్తీ పూర్తి రాష్ట్ర విద్యుత్ సంస్థలు రెండేళ్ల కింద 1,427 ఏఈ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ల కింద నియామకాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. తెలంగాణ జెన్కోలో 856, ట్రాన్స్‌కోలో 206, ఎన్పీడీసీఎల్లో 164, ఎస్పీడీసీఎల్లో 201 పోస్టులు కలిపి మొత్తం 1,427 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా విద్యుత్ సంస్థలు ఒకేసారి వేర్వేరుగా నియామక ప్రకటనలు జారీ చేశాయి. అయితే కొందరు అభ్యర్థులు రెండు, మూడు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాంటివారు ఏదో ఒక సంస్థలో చేరగా.. మిగతా సంస్థల్లో వారికి సంబంధించిన పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. టీఎస్ఎన్పీడీసీఎల్లో నియామకాలు ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఇతర సంస్థల్లో చేరిపోయారు. దాంతో ఇందులోని 164 ఏఈ పోస్టులకుగాను ఏకంగా 107 పోస్టులు ఖాళీగా మిగిలాయి. ట్రాన్స్‌కోలో 206 పోస్టులకుగాను 59, టీఎస్ఎస్పీడీసీఎల్లో 201 పోస్టులకుగాను 73 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన 239 పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం వివాదాలకు దారితీసింది. దాంతో సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక మినహాయింపు పొంది ఈ 239 పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేయాల్సి వచ్చింది. ఇందులోనూ కొందరు ఉద్యోగంలో చేరేందుకు ముందుకు రాకపోవడంతో మూడో మెరిట్ జాబితాను ప్రకటించారు. ఎట్టకేలకు రెండో, మూడో మెరిట్ జాబితాల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ట్రాన్స్‌కో గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉభయ రాష్ట్రాల తీరును తప్పుబట్టిన హైకోర్టు
► ఏకీకృత సర్వీసుపై తీర్పును అమలు చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారంలో ఏకీకృత సర్వీసు నిబంధనలను రద్దు చేస్తూ కేశవుల కేసులో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో తెలుగు రాష్ట్రాల తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. కేశవుల కేసులో హైకోర్టు తీర్పును అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినందున అధికారుల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వడం లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారంలో ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం 1998లో జారీ చేసిన జీవోలు 505, 538లను సవాలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, జిల్లా విద్యాధికారులు మొదటి పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో కేశవులు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు జీవో 538ని పూర్తిగా, 505 జీవోను పాక్షికంగా కొట్టేస్తూ 2003లో తీర్పునిచ్చింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులతో ప్రభుత్వ టీచర్లను ఏకీకృత చేయడం రాజ్యాంగ విరుద్ధమే కాక, రాష్ట్రపతి ఉత్తర్వులకు సైతం విరుద్ధమని తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా పంచాయతీరాజ్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చుకుంటూ వెళ్లింది. 2015లో సుప్రీంకోర్టు కేశవుల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేశవుల కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం పంచాయతీరాజ్ టీచర్ల పదోన్నతులకు గత ఏడాది జీవో 10 జారీ చేసింది. దీనిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు మరో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. -
సమైక్యతను ముంచుతున్న ‘నీరు’
ఈ జలవివాదం చాలా చిన్నది, పరిష్కారానికి అనువైనదని నేను చిరకాలంగా వాదిస్తున్నాను. ఆ రెండు రాష్ట్రాలలోను సజావుగా ఆలోచించే ప్రజలు, మేధావులు, రైతు సంఘాలు ఇప్పుడు తమ తమ ప్రభుత్వాలను చర్చలకు ప్రోత్సహించాలి. అది జాతీయ సమైక్యతకు వేసే సరైన అడుగు అవుతుంది. ఒక విచిత్రమైన కాలంలో మనమంతా జీవి స్తున్నాం. ప్రస్తుతం యావద్దేశం ఒక నాదంతో ఊగిపోతోంది. అదే జాతీయవాదం. మన జాతీయవాదానికి కీలకం ఏమిటంటే– జాతీయ సమైక్యత. అయితే ఆ విషయంలో మాత్రం ఎవరికీ పెద్దగా పట్టింపు ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకటి కాదు, పలు తీవ్ర వివాదాలతో ఈ దేశం సతమతమవుతోంది. వాటి గురించి ఏ జాతీయవాది అయినా తల మునకలై యోచించాలి. అది కూడా అత్యవసరమే అయినప్పటికీ ప్రస్తుతం నేను హిందూ–ముస్లిం ఘర్షణల గురించి, మైనారిటీ మతస్తుల స్థితిగతుల గురించి మాట్లాడడం లేదు. జాతీయ సమైక్యతకు గొడ్డలిపెట్టుగా పరిణమించిన తీవ్ర స్థాయి ప్రాంతీయ సంఘర్షణల గురించి నేను చెబుతున్నాను. ఒకవైపున తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య మండుతున్న నదీజలాల వివాదాన్ని మనం చూస్తున్నాం. ఇంకోపక్కన పంజాబ్, హరియాణా రాష్ట్రాల నడుమ సాగుతున్న నదీజలాల రగడను కూడా గమనిస్తున్నాం. ఇక విశాల నాగాలాండ్ నినాదం మణిపూర్, నాగాలాండ్ మధ్య చిచ్చు రేగడానికి కారణమైంది. కానీ జాతీయవాదం గురించి గొంతెత్తి మాట్లాడేవారు ఎవరూ కూడా ఈ వివాదాలను పట్టించుకోవడం లేదు. పైగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వాటికి ఆజ్యం పోస్తున్నది. పంజాబ్, హరియాణాల మధ్య రగులుతున్న నదీజలాల వివా దాన్నే తీసుకోండి! సుదీర్ఘంగా సాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరిం చేందుకు ఈమధ్య ఒక అవకాశం అందివచ్చింది. రావీ–బియాస్ నదుల నీళ్ల పంపకానికీ, హరియాణా వాటాను పంపిణీ చేయడానికి వీలుగా సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణానికీ అనుకూలంగా వచ్చిన సదవకాశమది. సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పంజాబ్ ఆశిస్తున్నదని కొత్త ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మే 12వ తేదీన ప్రకటించారు. ఉత్తర ప్రాంత మండలి సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అంటే దశాబ్దకాలంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు ఈ అంశం మీద అనుసరిస్తున్న ధోరణి నుంచి ఒక మెట్టు దిగివచ్చినట్టే. ఒక చుక్క నీటిని కూడా ఇతరులతో పంచుకునే అవకాశం పంజాబ్‌కు లేదని ఇంతకాలం ఆ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పక్షాలు పేర్కొంటూ వచ్చాయి. హరియాణా, రాజస్తాన్‌లకు నీటిని పంచే వీలు లేదని చెప్పడమే దీని అంతరార్థం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కావచ్చు, ఇంతకాలానికైనా కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి పాత వైఖ రిని సడలించడం ఆహ్వానించదగినది. హరియాణా ప్రభుత్వం ఈ అవ కాశాన్ని అందుకుని, వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించి ఉండ వలసింది. దురదృష్టవశాత్తు అదేమీ జరగలేదు. ఎందుకంటే, న్యాయ పోరాటంలో పరిస్థితి తనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ అంశంపై చర్చలు అవసరం లేదని హరియాణా భావించింది. చర్చల అవకాశాన్ని జారవిడుచుకుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్చలకు వచ్చిన సదవకాశాన్ని వదులుకుని మళ్లీ పాత ధోరణిని ఆశ్రయించాయి. ఇక రాజకీయ పార్టీలు కూడా యథాప్రకారం తమ తమ రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరినే సమర్థించాయి. పరిస్థితి మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింది. ఇదంతా దూరదృష్టి లేమితో వచ్చిన సమస్య. అవాంఛనీయం కూడా. సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణం వివాదం మీద వచ్చే నెల సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులో హరియా ణాకు అనుకూలమైన ఫలితం రావచ్చు. అయినా రాష్ట్రంలోని రాజ కీయ పార్టీల మద్దతుతో పంజాబ్ ప్రభుత్వం ఆ కాలువ నిర్మాణానికీ, హరియాణాకు నీటి పంపిణీ అడ్డుకోవడానికీ కనిపించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇదో ఆరని రాజకీయ వివాదంగా అవతరిం చవచ్చు. నిజానికి నదీజలాల వాటాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నలభై ఏళ్ల క్రితం ఇచ్చిన తొలి అవార్డు ఇదే. ఇప్పుడు హరియాణా ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగా తలెత్తే రాజకీయ ఘర్షణ ఇంకొన్నేళ్లు సమస్య సాగేందుకే ఉపయోగపడుతుంది. పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న ఈ జలవివాదం చాలా చిన్నది, పరిష్కారానికి అనువైనదని నేను చిరకాలంగా వాదిస్తున్నాను. ఈ సందర్భంలో ఒక ప్రతిపాదన చేస్తూ, రెండు రాష్ట్రాల ప్రజలు దానిని పరిగణనలోనికి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రతిపాదన సారాంశం ఏమిటంటే–హరియాణా ప్రభుత్వం పూర్వం నుంచీ కోరు తున్నట్టు కాకుండా, కొంత తక్కువ వాటాను స్వీకరించడానికి అంగీ కరించాలి. కాలువ నిర్మాణంతో సహా హరియాణా ప్రతిపాదనను అమలు చేయడానికి పంజాబ్ ప్రభుత్వం వెనువెంటనే ఆమోదించాలి. ఇదొక సాంకేతికపరమైన వివాదం. ప్రస్తుతం రావి–బియాస్ నదీజలాల పంపిణీ వ్యవహారాల మీద పనిచేస్తున్న ట్రిబ్యునల్ ఎందుకు పరిష్కరించలేకపోతున్నదో అంతుపట్టదు. అయితే ఒకటి. ఈ ట్రిబ్యు నల్ పదవులను భర్తీ చేయకపోవడం వల్ల దశాబ్దకాలంగా పనిచేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసి ఈ వివాదం మీద తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశాన్ని కల్పించాలి. ఇక రెండో వివాదం– లభ్యమవుతున్న జలాలలో పంజాబ్ వాటా. 1976లో ఇచ్చిన ఇందిరా గాంధీ అవార్డ్ ప్రకారం పంజాబ్‌కు 22 శాతం జలాలను కేటాయించారు. ఇది అన్యాయమని ఇంతవరకు ఆ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు వాదిం చాయి. 1981లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందం మేరకు పంజాబ్ వాటాను 22 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. మళ్లీ 1987లో ఎరాది ట్రిబ్యునల్ తన తొలి నివేదికలో ఈ వాటాను 28 శాతానికి పెంచింది. దీనిని రాజకీయ పార్టీలు నిరాకరించాయి. మాల్వా ప్రాంత రైతులు మిగులు జలాల మీద ఆధారపడుతున్నారు. ఈ జలాల మీద హరియాణాకు చట్టబద్ధమైన హక్కు ఉంది. కానీ పరిస్థితిని బట్టి ఐదు శాతం వాటాను పంజాబ్‌కు ఇవ్వడానికి హరియాణా అంగీకరిం చాలి. ఇందుకు ప్రతిగా సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణా నికి పంజాబ్ అడ్డంకులు లేకుండా చూడాలి. ఈ విషయాన్ని పంజాబ్ సుప్రీంకోర్టులో అంగీకరించాలి. ఆ రెండు రాష్ట్రాలలోను సజావుగా ఆలో చించే ప్రజలు, మేధావులు, రైతు సంఘాలు ఇప్పుడు తమ తమ ప్రభు త్వాలను చర్చలకు ప్రోత్సహించాలి. అది జాతీయ సమైక్యతకు వేసే సరైన అడుగు అవుతుంది. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 ‘ Twitter : @_YogendraYadav -
సచివాలయంలో వైభవంగా బోనాలు
-
సచివాలయంలో వైభవంగా బోనాలు
రెండు రాష్ట్రాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సచివాలయం రెండు రాష్ట్రాల ఉద్యోగుల కోలాహలంతో కళకళలాడింది. ప్రాంగణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఉద్యోగులు బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఉద్యోగులు పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఏపీ ఉద్యోగులు అమరావతికి వెళ్లిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి.. ఏపీ ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉద్యోగులను ఇదే వేదికపై సన్మానించారు. ఉద్యోగరీత్యా ఇన్నేళ్లు ఒకేచోట పని చేసి ఇప్పుడు విడిపోవడం బాధగా ఉందన్నారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. జీఏడీ కార్యదర్శులు అదర్ సిన్హా, వెంకటేశ్వరరావు, ఏపీ నుంచి పాణిగ్రాహి, ప్రేమ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. రిటైరయ్యాక ఇక్కడే ఉంటాం హైదరాబాద్‌లోనే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఉద్యోగ విరమణ తర్వాత ఇక్కడే సెటిలవుతామని కొందరు ఏపీ ఉద్యోగులు చెప్పారు. ప్రాంతాలు విడిపోయినా అన్నాదమ్ముళ్లుగా కలసి ఉందామన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో మొదటి స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉంటుందని, ఎక్కడి నుంచి వచ్చినవారైనా ఈ ప్రాంతాన్ని తమ సొంత ప్రాంతంగా భావిస్తారని లింగరాజు పాణిగ్రహి అభిప్రాయపడ్డారు. అనంతరం ఇరు రాష్ట్రాల ఉద్యోగులు కలసి సామూహిక భోజనాలు చేశారు. ఏటా బోనాలకు ఆహ్వానిస్తాం ప్రతి ఏటా ప్రాంతాలకతీతంగా బోనాల పండగను నిర్వహించుకునే వారమని, రెండు రాష్ట్రాల ఉద్యోగులు విడిపోయినందున వచ్చే ఏడాది ఏపీకి వెళ్లి ఉద్యోగులను ఆహ్వానిస్తామని, బోనాల పండగను నిర్వహించుకుంటామని నరేందర్‌రావు చెప్పారు. -
వాహనాల విడుదలను వ్యతిరేకించమనండి
♦ అన్ని కోర్టుల పీపీలు, ఏపీపీలను ఆదేశించండి ♦ ఢిల్లీ సర్కార్ తరహాలో సర్క్యులర్ ఇవ్వండి ♦ ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు స్పష్టీకరణ.. విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: జంతువుల అక్రమ రవాణా అరికట్టే విషయంలో కీలక ఆదేశాల జారీకి హైకోర్టు నిర్ణయించింది. జంతువులను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహన యజమానులు వాటి విడుదలకు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తే, వాటిని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ సర్కార్ మాదిరిగానే ఓ సర్క్యులర్ జారీ చేయాలని సూచించింది. జంతువులతో సహా వాహనాల విడుదలకు పిటిషన్లు దాఖలైనప్పుడు, యథావిధిగావాటి విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేయకుండా కిందిస్థాయి న్యాయాధికారులకు తగిన మార్గనిర్దేశం చేస్తామని తెలిపింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిఠాపురం మునిసిపాలిటీలోని పశువుల మార్కెట్లో జంతువులను హింసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, జంతు హింస నిరోధానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా అధికారులను ఆదేశించాలంటూ జంతు రక్షణ సంఘం, గో సంరక్షణ ఫెడరేషన్, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ, జంతు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను విడుదల చేయించేందుకు వాటి యజమానులు కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, కోర్టులు జంతువులతో సహా ఆ వాహనాలను విడుదల చేస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, వాహనాల విడుదలకు ఎలా పిటిషన్లు దాఖలు చేస్తారని, వాటి విడుదలకు ఎలా ఉత్తర్వులు పొందుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదనలు వినిపిస్తూ అక్రమ కట్టడాల విషయంలో ఎలాంటి ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయరాదని కింది కోర్టులకు గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అదేవిధంగా జంతు అక్రమ రవాణా విషయంలో ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. -
రాష్ట్రాల మధ్య జలజగడం
- ‘పాలమూరు’కు అడ్డొస్తే పట్టిసీమను ఎత్తిచూపాలని తెలంగాణ నిర్ణయం - మహారాష్ట్ర, కర్ణాటకలతో కలసి ఏపీపై ఒత్తిడిపెంచే వ్యూహం - తమ వాటా నీటితోనే ప్రాజెక్టులు చేపడుతున్నట్లు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్యా జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. గత ఏడాది ప్రాజెక్టుల్లో నీటి పంపకాలపై తగవులాడుకున్న రెండు రాష్ట్రాలు ఈ ఏడాది రెండు నదుల బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరకముందే జల జగడానికి దిగాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(కురుమూర్తి), డిండి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యూనల్, బోర్డుల అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతుండగా.. పట్టిసీమకు ఎలాంటి ముందస్తు అనుమతులున్నాయో తెలపాలంటూ టీ-సర్కారు అదేస్థాయిలో ప్రతిస్పందిస్తోంది. ఎగువ రాష్ట్రాలతో కలసి పోరాటం.. కృష్ణా నదిలో 90 టీఎంసీల వరద జలాలను వినియోగించుకునే ప్రణాళికతో చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతలకు ఏపీ అడ్డుపడితే పట్టిసీమ ప్రాజెక్టులో నీటి వాటాలపై పట్టుబట్టాలని టీ-సర్కారు భావిస్తోంది. పట్టిసీమ వద్ద 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి గోదావరి బోర్డు అనుమతి లేకుండా, కనీససమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులివ్వడంపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే అయితే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకున్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఏపీకి సంబంధించినది. 45 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణ 58:42 నిష్పత్తిలో పంచాల్సి వస్తే.. తెలంగాణకు 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందనేది తెలంగాణ నీటిపారుదల శాఖ వాదన. ఒకవేళ పాలమూరుపై ఏపీ కొర్రీలు పెడితే పట్టిసీమలో తమకు దక్కాల్సిన వాటాతో పాటు ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలపై ఆ రాష్ట్రాలతో కలసి ఉమ్మడిగా పోరాడాలని టీ-సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. వాటాలను ఎక్కడ వాడుకుంటే ఏంటీ? కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటి వినియోగంలో ప్రాజెక్టువారీ కేటాయింపులున్నా, అవేవీ ప్రస్తుతం పూర్తికాకకపోవడంతో, తనకున్న నీటి వాటాను రాష్ర్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటానని చెబుతూ టీ-సర్కారు ఆ మేరకు నీటిని వాడుకుంటోంది. ఉమ్మడి ఏపీకి క్యారీఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పూడిక కారణంగా వాడుకోలేకపోతున్న 170 టీఎంసీలు, పట్టిసీమలో భాగంగా ఉమ్మడి ఏపీకిచ్చిన 45 టీఎంసీల్లో తమకు దక్కే వాటాల నీటితోనే పాలమూరు, డిండి ప్రాజెక్టులను చేపట్టామని బలంగా చెబుతోంది. దీనిపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ’ట్రిబ్యూనల్ కేవలం ఎవరి వాటాలు ఎంత అని మాత్రమే నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి జరిపిన వాటా మేరకు నీటిని వాడుకోవాలంటే ముందుగా దాన్ని నిల్వ చేయాలి. అది చేయాలంటే ప్రాజెక్టు కట్టాలి. అందులో భాగంగానే పాలమూరు, డిండి కడుతున్నాం. ట్రిబ్యునల్ సైతం వాటాలు నిర్ణయిస్తుంది కానీ, ప్రాజెక్టులు కట్టాలా? వద్దా? అన్నది నిర్ణయించదు కదా‘ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ ఏర్పాటును ‘గాయం’గా భావించొద్దు
⇒ ముందు ఆ భావనను తొలగించుకోండి ⇒ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పిలుపు ⇒ ఇరు రాష్ట్రాల తెలుగు వారికి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ⇒ ఇక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ⇒ తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా‘సాక్షి’తో ముఖాముఖి సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును గాయంగా భావించవద్దని, ఒకవేళ ఆ భావన మనస్సుల్లో ఉంటే తొలగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని, అన్నదమ్ముళ్లలా విడిపోయి కలసి ఉండొచ్చని చెప్పారు. ఇక్కడి తెలుగువారి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ తొలి అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇరు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్రాలు విడిపోవడం మాయని గాయంగా మిగిలిపోతుందన్న అభిప్రాయాన్ని, భావాన్ని మనస్సుల్లోంచి తొలగించుకోండి. రెండు రాష్ట్రాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమాభిమానాలను, నమ్మకాన్ని పెంచాలి. హైదరాబాద్, ముంబైలాంటి నగరాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రజల సమాహారంవంటివి. ఈ బంధాన్ని ఎప్పటికీ తెంపవద్దు. గణనీయమైన అభివృద్ధి సాధించి దేశానికే చక్కటి సంకేతాన్ని అందించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలపై ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు జరిగినా మహారాష్ట్రలో మాత్రం తెలుగు వారంతా కలసిమెలసి ఉంటున్నారు’ అని సందేశాన్నిచ్చారు. తెలుగు భవనం కోసం... రాష్ట్రంలో తెలుగు భవనం ఏర్పాటుకు, కులధ్రువీకరణ పత్రాల జారీలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని విద్యాసాగర్ రావు తెలిపారు. ‘ రాష్ట్రంలోని శ్రమ శక్తి అంటే తెలుగువారే. అయితే అనేక మంది సమస్యలు బాధాకరం. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా నేత కార్మికులు, కూలీలు, శ్రామికులు, తదితరులపై మారిన పరిస్థితుల ప్రభావం పడింది. కొన్ని ప్రాంతా ల్లో వలస వచ్చిన ప్రజలే మళ్లీ వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో షోలాపూర్, భివండీ తదితర ప్రాంతాల్లో తెలుగువారి జనాభా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చాం. వాటిని అంచెలంచెలుగా పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సన్నద్ధవుతుంది అని ఆయన అన్నారు. చెరగిపోని చరిత్ర... ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో తెలుగు వారి చరిత్ర ఎన్నటికీ చెరిగిపోనిదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఇక్కడి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం చెమటోడ్చిన చరిత్ర తెలుగువారిదని అభివర్ణించారు. సం యుక్త మహారాష్ట్ర కోసం తెలుగు ప్రజలు చేసి న సుధీర్గమైన పోరాటం మరచిపోలేదని అన్నా రు. మహారాష్ట్ర కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల్లో మనవారు కూడా ఉన్నారన్నారు. ఉద్యమ సమిధలను స్మరించుకోవాలి... తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన వారందిరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ రావు తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డల త్యాగం మరచిపోలేనిదని, ఆత్మగౌరవం కోసం గళం విప్పిన కళాకారులు, కదం తొక్కిన కలం యోధులకు అభినందినలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్లో సంత్ గాడ్గేబాబా విగ్రహం స్వచ్ఛత అభియాన్ గురించి సంత్ గాడ్గేబాబా చేసిన కృషి మరవలేనిదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఆయన విగ్రహాన్ని త్వరలోనే తెలంగాణలోని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. రజకుడైన ఆయన చేపట్టిన ఉద్య మం ద్వారా లక్షలాది మంది ప్రజల మన్ననలు పొందిందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ వంటి వారిని కూడా ప్రభావితం చేశారన్నారు. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఘటనలు..
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ఇటువంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో మంగళవారం రెండు భారీ స్థాయి ఎదురు కాల్పుల ఘటనలు జరిగాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలనొప్పిగా తయారైన ఎర్రచందనం దొంగ రవాణాకు సంబంధించిన ఘటన ఇందులో ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం భారతదేశాన్నీ, ఆ మాటకొస్తే ప్రపంచాన్నే చికాకు పరుస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు సంబం ధించిన ఘటన రెండవది. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం శేషాచలం అడవులలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకంగా 20 మందిని చంపేశారు. ఇం తకూ, ఆ చనిపోయినవారు ఎవరు అన్న విషయం నిర్ధారణ కావలసి ఉంది. ఆంధ్ర ప్రభుత్వానికి మచ్చ ఎవరిని చంపుతున్నామో తెలియకుండానే చంపేసి, ఇంకా నిర్ధారణ కావలసి ఉంది అంటే అర్థం ఏమిటి? చనిపోయిన వారిలో ఎవరు కూలీలో, ఎవరు స్మగ్లర్లో ఇంకా నిర్ధారణ కాలేదని సామాన్యులెవరో అనలేదు. ఆ మాటలు అన్నది ఏదో మీడియా వారు అయినా ఫరవాలేదు. ఇంకా పూర్తి సమాచారం తెలిసి ఉండకపోవచ్చునని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆ మాటలు అన్నది సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు. వాళ్లు కూలీలా, స్మగ్లర్లా అన్నది నిర్ధారణ కాకుండా ఇరవై మందిని ఏకబిగిన ఎట్లా కాల్చి చంపారు? స్మగ్లర్లు తలనొప్పిగా మారారు, నిజమే. వారి ఆగడాలను అరికట్టవలసిందే. ఇప్పటికే చాలామంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో వారికి రాజభోగాలు కల్పిస్తున్నారన్న నింద మోస్తున్న వారు ఇప్పుడు తాజా ఎన్కౌంటర్ ఘటనలో ఇరవైమంది మృతికి కారణమై మరింత అప్ర తిష్ట మూటకట్టుకోబోతున్నార న్నది నిజం. శేషాచలం అడవులలో జరిగిన ఈ భారీ ఎదురుకాల్పులలో చనిపోయిన వారు స్మగ్లర్లు నియమించిన కూలీలే అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వమూ, పోలీసు బాసులూ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? పొట్టకూటి కోసం వచ్చిన కూలీలను పొట్టన పెట్టుకున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. మిగి లిన ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనను ఖండించాయి. పొరుగు రాష్ట్రం తమిళ నాడు రాజకీయ పార్టీలు కూడా నిరసన తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ చర్చించుకుని పరిష్కరించవలసిన అంశమని అంటున్నారు. మొత్తం మీద గోరుచుట్టు మీద రోకటిపోటులా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. వీటిలో అత్యంత ముఖ్యమైనది రాజ ధాని నిర్మాణం. దీనితో మిగిలిన సమస్యలన్నీ పక్కకు పోయాయి. అదే క్రమంలో శాంతిభద్రతలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యాల నుంచి తప్పు కున్నట్టు కనిపిస్తోంది. టీ హోంమంత్రి ప్రకటన హాస్యాస్పదం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోను ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొని ఉందని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రెండుమూడు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటనలో ఈ రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహా రెడ్డి, పోలీస్ డెరైక్టర్ జనరల్ అనురాగ్ శర్మ చేసిన ప్రకటన, శేషాచలం అడవుల ఘటన మీద ఆంధ్ర డీజీపీ చేసిన ప్రకటన కంటే హాస్యాస్పదం. సూర్యాపేట బస్టాండ్ దగ్గర పోలీసుల మీద కాల్పులు జరిపినవారు దోపిడీ దొంగలేననీ, ఉగ్రవాదులు కానేకారనీ ఆ ఇద్దరూ ప్రకటించారు. పూర్తి సమా చారం లేకుండానే బాధ్యత గల పదవులలో ఉన్నవారు మీడియా ముందు ఇలా మాట్లాడడం క్షమించరాని విషయం. ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ఇటు వంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి. సరే, ప్రస్తుత సంఘటనల దగ్గరకొద్దాం! ప్రహసన ప్రాయమైన ఎదురుకాల్పుల కథలు మంగళవారం వరంగల్ నుంచి ఖైదీలను హైదరాబాద్ కోర్టుకు తీసుకు వస్తుం డగా ఘర్షణ జరిగి విచారణలో ఉన్న ఐదుగురు ఖైదీలు పోలీసుల ‘ఎదురు కాల్పులలో చనిపోయారు’. నిజానికి పోలీసులూ, వారు జరిపే ఎదురు కాల్పులూ పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయాయి. వీటిని సమాజం నమ్మే స్థితి ఎప్పుడో పోయింది. నిజానికి మంగళవారం పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న విచారణ ఖైదీలలో ఒకడు వికారుద్దీన్. గతంలో కూడా ఇదే మార్గంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈసారి కూడా నిజంగానే ఆ ఐదుగురు తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చునని కాసేపు అనుకుందాం. కానీ తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ నవీన్‌చంద్ చెబుతున్నట్టుగానే ఆ ఖైదీలు ఐదుగురు, పోలీసులు పదిహేనుమంది. పోలీసుల దగ్గర ఆయుధాలు ఉంటాయి. వీళ్ల చేతులకు బేడీలు ఉంటాయి. ఎట్లా తిరగబడతారు? ఎట్లా పోలీసుల చేతులలో నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేస్తారు? లేదా పారిపోయే సాహసం చేస్తారు? ఇదంతా నమ్మశక్యంగా ఉండదు. దీనికితోడు ఎన్కౌంటర్ అనగానే పోలీసులే చంపి ఉంటారులేనన్న భావన. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని వికారుద్దీన్ అనే విచారణ ఖైదీ తండ్రి అంటూనే ఉన్నాడు. శనివారం నల్లగొండ జిల్లా సూర్యా పేటలో జరిగిన ఘటన, దాని కొనసాగింపుగా జానకీపురం దగ్గర ఎన్ కౌంటర్, మళ్లీ మంగళవార ం అదే జిల్లాలోని ఆలేరు దగ్గర విచారణలో ఉన్న ఖైదీలు ఎదురుకాల్పులలో చనిపోవడం వరుసగా పేర్చి చూస్తే - సూర్యాపేట ఘటనకు సంబంధించి పోలీస్‌శాఖ మీద వచ్చిన విమర్శల పర్యవసానమే ఆలేరు పరిణామమన్న అనుమానం కలగక తప్పదు. ఆలేరు ఎదురుకాల్పుల ఘటన ఎలా జరిగింది? ఏమిటి? అనే వివ రాలన్నీ తరువాత తప్పక వెల్లడవుతాయి. కానీ ఈ వార్తా లేఖ రాస్తున్న సమ యానికే జానకీపురం ఘటనలో గాయపడిన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య మరణించిన వార్త వచ్చింది. దీనితో నలుగురు పోలీసులు ఈ ఘటనలలో మరణించినట్టయింది. ఆ నలుగురు లింగయ్య, మహేశ్, నాగరాజు, సిద్ధయ్య - ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డ్. జానకీపురం దగ్గర జరిగిన ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు విజయవాడవైపు వెళ్లినట్టు కూడా అనుమానం. హైదరాబాద్ ప్రశాంతమేనా? సూర్యాపేట బస్టాండ్‌లో జరిగిన సంఘటన నుంచి, జానకీపురంలో ఉగ్ర వాదులతో జరిగిన ఘర్ణణ నుంచి మన పోలీసుశాఖ, ప్రభుత్వం ఏం నేర్చుకు న్నాయి. ఏం తెలుసుకున్నాయి? నిన్నటికి నిన్న కూడా తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి హైదరాబాద్ ప్రశాంతంగా ఉందనీ, అనవ సరంగా ఒక మతస్థులను నిందించవద్దనీ అన్నారు. నిజంగానే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందా? లేకపోతే హోమంత్రి చెబుతున్నట్టు వినిపిస్తున్నవన్నీ నిందలేనా? వాటిలో నిజాలే లేవా? అంతే అయితే హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని దేశమంతా కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు పథకాలు రచిస్తు న్నారంటూ కేంద్ర స్థాయి పరిశోధనా సంస్థలు, నిఘా సంస్థలు ఇస్తున్న నివేదికలకు అర్థం ఏమిటి? ఆలేరు ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్‌లో సోదాలు ఎందుకు మొదలయ్యాయి? భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రశ్నల న్నింటికీ బయటకు జవాబులు చెప్పకపోయినా, ప్రభుత్వం వీటన్నిటి మీదా దృష్టి పెడితే మంచిది. ఇక గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు సివిల్ పోలీసులకు కూడా కొంత మెరుగైన శిక్షణ ఇవ్వడం, మెలకువలు నేర్పడం వంటివి చేసి ఉంటే సూర్యాపేట, జానకీపురాలలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పినట్టు ఆయుధాలు ఉపయోగించడంలో తరచూ పోలీసుల ప్రావీణ్యాన్ని మెరుగు పరచాలి. శరీర దారుఢ్యాన్ని పెంచుకునే వ్యాయామాలు కూడా మరచిపోతున్నారట మన పోలీసులు. రాజకీయ నాయకులకు రక్షణ కల్పిం చడం ఒక్కటే కాదు, తమను తాము రక్షించుకునే నేర్పు కూడా పోలీసు వ్యవస్థకు ఉండాలి. నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే ఆ నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న మాట వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక వాహనాలు సమకూరిస్తే సరిపోదు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించే వైపుగా కూడా దృష్టి సారించవలసి ఉంది. datelinehyderabad@gmail.com -
హైకోర్టుకు విభజన సెగ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజణ జరిగి ఇప్పటికే ఏడు నెలలైనా ఇప్పటికీ చాలా విభాగాలు ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. అందులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఇన్నాళ్లైనా హైకోర్టు విభజన ప్రకియ ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌనంగా తమ నిరసన తెలియజేశారు. -
ఉమ్మడి సంస్థల నిధుల స్తంభన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని 7, 9, 10వ షెడ్యూళ్లలోని సంస్థలకు చెందిన నిధులను స్తంభింపజేయాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా.. తమకు తెలియజేయకుండా ఎటువంటి లావాదేవీలను కొనసాగించరాదంటూ బ్యాంకులకు సర్క్యులర్లు జారీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఏకపక్ష ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్ర నిధులకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించరాదని, విషయం ఏదైనా తమకు తెలియజేయాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీ సర్కార్ తన సర్క్యులర్‌లో పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టంలోని పలు షెడ్యూళ్లలో పేర్కొన్న పలు సంస్థలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవైనందున వాటి నిధులు కూడా ఉమ్మడి రాష్ట్రం కిందకే వస్తాయని, అందువల్ల ఆ నిధులను ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేయకుండా ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను కోరింది. దీనిపై బ్యాంకులు ఏపీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ బ్యాంకులకు మరో సర్క్యులర్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని, యధాప్రకారం ఆయా సంస్థల అథారిటీల ఆదేశాల మేరకు ఆర్థిక లావాదేవీలను కొనసాగించాలని పేర్కొంది. ఈ విషయంలో టీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వివాదాలను పరిష్కరించుకుని, బ్యాంకింగ్ కార్యకలాపాలపై సంయుక్తంగా ఆదేశాలు ఇస్తేనే అమలు చేయాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఉమ్మడి సంస్థల్లోని నిధులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్‌కు చెందిన రూ.35 కోట్లను ఏపీ ప్రభుత్వానికి చెప్పకుండా బదిలీ చేసుకోవడంతో.. ఏపీ ప్రభుత్వం స్పేస్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌కు చెందిన రూ.22.50 కోట్ల నిధులను తెలంగాణకు సమాచారం ఇవ్వకుండానే విజయవాడకు బదిలీ చేసుకుంది. అలాగే కార్మిక సంక్షేమ నిధికి చెందిన నిధులను కూడా బదిలీ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు సర్క్యులర్లు జారీ చేశాయి. ఆయా సంస్థల్లో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన డిపాజిట్లు గానీ, నిధులు గానీ సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారుల అంచనా. ఈ నిధులను స్తంభింపజేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వేర్వేరుగా జారీ చేసే ఆదేశాల మేరకు వాటిని విడుదల చేయరాదని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలూ ఒక అంగీకారానికి రావాల్సి ఉందని, త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా?
దాదాపు రెండు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న చెలిమి చెడిపోయినా.. ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రంలో గట్టిగానే ప్రచారం చేశారు. 288 స్థానాలున్న మరాఠా పీఠాన్ని దక్కించుకుంటే తర్వాత రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గం సుగమం అవుతుందన్నది ఆయన దీర్ఘకాల ఆలోచన. ఇక 90 స్థానాలున్న హర్యానాను కూడా మోదీ వదల్లేదు. అక్కడ ఏకంగా 11 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రాన్ని కూడా వశం చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బ్రాండ్ పనిచేసిందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. 19వ తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన అభ్యర్థి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించాలంటే తగినంత స్థాయిలో అసెంబ్లీల బలం కూడా మోదీకి అవసరం. అందుకే ముందుగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఒకదశలో గొంతు సహకరించకపోయినా కూడా అలాగే ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత బోర్డర్ ఔట్‌పోస్టులపై దాడులు చేస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏం చేస్తారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే మాత్రం మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం కష్టమనే తెలుస్తోంది. అక్కడ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చని, అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం బీజేపీయే అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. -
అమ్మానాన్నలకు అలియా గిఫ్ట్
ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో అందరూ ప్రత్యేకించి చెప్పుకుంటున్న పేరు - అలియా భట్. టు స్టేట్స్’ చిత్రంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారామె. ఆమె నటించిన తాజా చిత్రం ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ కూడా మంచి ప్రారంభ వసూళ్ళు సంపాదించుకుంది. ప్రస్తుతం అలియా ఆ ఆనందంలో ఉన్నారు. దానికి తీపిగుర్తుగా తల్లితండ్రులు మహేశ్‌భట్, సోనీ రజ్దాన్లకు ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆమె భావిస్తున్నారు. అమ్మా నాన్నలకు ఒకేలా ఉండే రెండు లగ్జరీ కార్లను బహూకరించాలని ఈ యువ నటి అనుకుంటున్నట్లు భోగట్టా. ‘‘ఆడపిల్లలందరి లాగానే నేనూ మా అమ్మానాన్నకు ఏదైనా ప్రత్యేకంగా అందజేయాలని అనుకుంటున్నా. అయితే, ఏం కొనాలన్నది మాత్రం నిర్ణయించుకోలేదు’’ అని 21 ఏళ్ళ అలియా అన్నారు. అన్నట్లు ఇటీవలే ఆమె ఏకంగా రూ. 5 లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు చేశారు. ‘‘వరుస విజయాలు అందుకుంటున్న సందర్భంగా ఇది నాకు నేను ఇచ్చుకున్న బహుమతి’’ అన్నారు అలియా. ఎప్పుడూ బ్రాండ్లపై దృష్టి పెట్టని ఈ యువతి ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారట. అన్నట్లు, రేపు తల్లితండ్రులకు బహుమతి విషయంలో కూడా అలియా విలాసవంతమైన బ్రాండ్ వైపే మొగ్గుచూపుతారని ఊహించవచ్చు. -
కలత చెందడం లేదు
తన జనరల్ నాలెడ్జ్‌పై సామాజిక అనుసంధాన వేదికల్లో చక్కర్లు కొడుతున్న జోక్‌లపై కలత చెందడం లేదంటోంది బాలీవుడ్ అమ్మడు అలియా భట్. హైవే, టూ స్టేట్స్ సినిమాలో మంచి నటనతో హీరోయిన్గా ప్రేక్షకులను అలరించిన ఈ భామ... ‘కాఫీ విత్ కరణ్’ చాట్ షోలో కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పింది. అప్పటి నుంచి అలియా భట్‌పై సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్బుక్, ట్విట్టర్లో జోరుగా సెటైర్లు కనబడుతున్నాయి. అయితే తాను తప్పు సమాధానం చెప్పినందుకు నిరాశ చెందలేదన్న ఈ ముద్దుగుమ్మ మొదట ఆ జవాబుకు నవ్వింది తానేనని మంగళవారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాకు తెలిపింది. కాగా, ఇటీవల కాఫీ విత్ కరణ్ చాట్ షోలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలో పాటు అలియాభట్ కూడా పాల్గొంది. భారత రాష్ట్రపతి ఎవరు అనే ప్రశ్నకు భట్, వరుణ్ తప్పుడు సమాధానం చెప్పారు. మన్మోహన్ సింగ్ అని వరుణ్ , పృథ్వీరాజ్ సింగ్ అని భట్ తెలిపారు. సిద్ధార్థ్ ఒక్కడే ప్రణబ్ ముఖర్జీ అని చెప్పాడు. దీని తర్వాతే భట్... జనరల్ నాలెడ్జ్‌పై సామాజిక అనుసంధాన వేదికలో అనేక జోక్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిపై కలత చెందడం లేదన్న భట్ వాటిని చూసి ఇంకా నవ్వుకుంటున్నానని అంటోంది. ‘ఇంటర్వ్యూ: మోడీ తొలి పేరు ఏంటి?. భట్: అబ్కిబార్’ ఇలాంటి జోక్‌లు ఫేస్బుక్, ట్విట్టర్లలో హల్చల్ చేస్తున్నాయని తెలిపింది. తాను తెలివి తక్కువ దాన్ని కాబట్టే ఆ రకంగా ప్రచారం జరుగుతోందంది. తాను నటించిన హైవే, టూ స్టేట్స్ సినిమాలు బాగానే ఉన్నాయని తెలిపింది. ఇతరులు చేసే ఆరోపణల గురించి తానేమీ పెద్దగా పట్టించుకోనని భట్ అంటోంది. -
ఒక తెలివైన ప్రేమ కథ
ప్రేమ గుడ్డిది.. అని అంటుంటారు. అన్ని ప్రేమల సంగతి ఏమిటో కానీ కొన్ని ప్రేమలు చాలా తెలివైనవి. అలాంటి ప్రేమ కథల్లో ఒకటి ‘టూ స్టేట్స్’. సంస్కృతి, సంప్రదాయాలపరమైన తేడాను, కులం గోడలను దాటి ప్రేమను విజయవంతం చేసుకొన్న ఒక తెలివైన జంట కథ ఇది. అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో మొదలై నవలగా, ఇప్పుడు ‘2స్టేట్స్’ సినిమాగా థియేటర్లలో సందడి చేస్తున్న కథ ఇది. ప్రపంచమంతా ప్రేమ పెళ్లిళ్లు సులభంగా జరిగిపోతాయి. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొంటారు. భారతదేశంలో మాత్రం ఇంకొన్ని మెట్లు ఉంటాయి. అబ్బాయి అమ్మాయిని, అబ్బాయిని అమ్మాయి ప్రేమించిన తర్వాత అమ్మాయి కుటుంబం అబ్బాయిని ప్రేమించాల్సి ఉంటుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమించాల్సి ఉంటుంది. ఇలాంటి దశల వారీ ప్రక్రియలా జరిగే ప్రేమ కథే 2 స్టేట్స్. చేతన్‌భగత్ నవలగా రచించిన తన సొంత ప్రేమ కథ ఇప్పుడు సినిమాగా మారింది. అర్జున్ కపూర్, ఆలియాభట్‌లు జంటగా వచ్చిన ఈ సినిమా కమ్ నవల కథ మన సంస్కృతిలో ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించే జంటలకు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమించడానికి రెండు మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కలవాలి. అలా కలవని సందర్భాల్లో... ఒకవైపు పరువు హత్యలు మరోవైపు పెద్దలను ఎదురించి చేసుకొని పెళ్లిళ్లు చేసుకొనే జంటలు.. ఇటువంటి పరిణామాల మధ్య పెద్దలను ఒప్పించి, రెండు కుటుంబాలను కలిపి ఒక్కటయ్యే జంట కమ్మని కథ ఇది. తన నవల 90 శాతం వినోదాన్ని 10 శాతం సొసైటీ రీఫార్మింగ్కోసం సందేశాన్ని ఇస్తుందని చేతన్‌భగత్ అంటాడు. కాలేజీలో ఎంపిక చేసుకొన్న అమ్మాయికి ఎదురుపడితే ఎలా ఉంటుంది? అది కూడా తరచూ! ఆ ఎదురుపడటం యాదృచ్ఛికంగా జరిగిందని అవతలి వారికి అనిపించి కళ్లూకళ్లూ కలిశాయంటే సమ్మోహనం మొదలయినట్టే. ఇలాంటి సమ్మోహనమే మొదలవుతుంది అనన్య, క్రిష్‌ల మధ్య. ఐఐఎమ్‌లో ఇంటరాక్షన్ క్లాస్‌లోనే వారి పరిచయం మొదలవుతుంది. మనిషి మనసులో ప్రేమ పుట్టడం అనేది హార్మోన్ల ప్రభావం అని, లవ్ ఈజ్ కెమిస్ట్రీ అని అంటారు శాస్త్రజ్ఞులు అయితే ఒక అమ్మాయి, అబ్బాయి చూపుల మధ్య ఒకేసారి అలాంటి కెమిస్ట్రీ వర్కవుటవ్వడం మాత్రం చాలా కష్టమైన పని. దాన్ని సాధించాలంటే చాలా కష్టమే ఉంటుంది. దానికి చొరవ కూడా ముఖ్యం. క్రిష్‌లో చొరవ ఉన్న దాన్ని ఎప్పటికప్పుడు రెసిస్ట్ చేస్తూ వచ్చిన ఆమె అప్పటికప్పుడు కన్విన్స్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకేముంది వర్సిటీ డార్మ్రూమ్లోనే రొమాన్స్ మొదలు! అంత వరకూ వాళ్లిద్దరికీ ఉన్న పరిచయం వేరు, పెళ్లి ఆలోచన వచ్చాక కలిగే పరిచయం వేరు. అబ్బాయి పంజాబీ హిందూ, అమ్మాయి తమిళ బ్రాహ్మణకుటుంబానికి చెందిన యువతి... సంప్రదాయాల్లోని సవాలక్ష తేడాలు. ఇరు కుటుంబాల పెద్దల అభ్యంతరాలు. కుటుంబాల మధ్య స్పర్థలతో పెళ్లి వద్దు, అనుకొనేంత వరకూ వెళుతుందామె. కానీ చివరకు తమ పెళ్లిని కాదన్న పెద్దలను ఒప్పించి, మెప్పించి పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. మనది కులాల, మతాల, సంప్రదాయాల తేడాతో రంగురంగులుగా మెరిసే సీతాకోకచిలుక లాంటి సమాజం. ఇలాంటి వ్యవస్థలో ప్రేమ వ్యవహారాలు రక్తసిక్తవర్ణాలకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కులాంతర, ప్రాంతాంతర వివాహం చేసుకొని ఆ విషయాన్ని తన వాళ్ల చేత ఒప్పించి, దాన్ని నవలగా గ్రంథస్థం చేసి సమాజం చేత కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడు చేతన్‌భగత్. ఆ ప్రయత్నం సినిమాగా కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇలాంటి కథలు కొన్ని పరువు హత్యలను నివారించినా, కొందరు ప్రేమికులను తెలివైన వారిగా తీర్చిదిద్దినా మంచిదే కదా! - జీవన్ రెడ్డి.బి -
రాష్ట్ర బడ్జెట్‌ను 2 రాష్ట్రాలకు విభజించండి
అన్ని శాఖలకు ఆర్థికశాఖ సర్క్యులర్ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను.. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రెండు రాష్ట్రాలకు విభజించాల్సిందిగా ఆర్థికశాఖ బుధవారం అన్ని శాఖలు, విభాగాల అధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ప్రత్యేకంగా సర్క్యులర్ జారీచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 1,83,129 కోట్లుగా ఆర్థికశాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపధ్యంలో ఇందులో తొలి ఆరు నెలల వ్యయానికి మాత్రమే అసెంబ్లీ నుంచి ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెలల్లో బడ్జెట్ కేటాయింపులో ఆరో వంతు అంటే.. రూ. 30,521 కోట్లు మాత్రమే ఆయా శాఖలు వ్యయం చేసేందుకు ఆర్థికశాఖ అనుమతించింది. ఏ శాఖ ఎంత వ్యయం చేయాలనే విషయాన్ని కూడా ఆర్థికశాఖ స్పష్టం చేయనుంది. బడ్జెట్లో పథకాలు, కార్యక్రమాల అమలు, జీతభత్యాలు, పెన్షన్లతో పాటు అన్ని రంగాలకు కేటాయించిన నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఎంత, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో తెలియజేస్తూ ఈ నెల 15వ తేదీలోగా ఆర్థికశాఖ వెబ్సైట్లో ఆన్లైన్లో నమోదు చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధిని కూడా రెండు రాష్ట్రాలకు విభజించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం బుధవారం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్‌కు లేఖ రాశారు. -
ఈ నెలాఖరే గడువు
ఫైళ్ల విభజన పనులపై శాఖాధిపతులకు సీఎస్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, భవనాలు, ఇతర వస్తువుల పంపిణీలపై తుది నిర్ణయం గవర్నర్, కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి స్పష్టం చేశారు. విభజన పనులకు సంబంధించి పలు శాఖల అధికారులు, ఉద్యోగులు రూపొందిస్తున్న సమాచారాన్ని అపెక్స్ కమిటీ , అనంతరం గవర్నర్, కేంద్రం ఎదుట ఉంచుతామన్నారు. రాష్ట్ర విభజనలో కీలకాంశాలైన ఫైళ్ల విభజన, రికార్డులు, డిస్పోజల్స్ విభజన, స్థిర, చరాస్తుల విభజన, రాష్ట్ర, మల్టీ జోనల్ పోస్టుల విభజన, కోర్టు కేసులు, కాంట్రాక్టులు, చట్టాలు, నిబంధనలు, నోటిఫికేషన్లు తదితర అంశాలపై సీఎస్ బుధవారం సచివాలయంలో శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ఫైళ్ల విభజనను ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి విభజించడంతోపాటు వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. అయితే విభజన వివరాల సేకరణకు సంబంధించి ఇదే అంతిమం కాదన్నారు. గవర్నర్, కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతి కార్యాలయంలో ఫైళ్లను స్కానింగ్ చేయడానికి త్వరలోనే స్కానర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. స్కానర్లు ప్రై వేట్ ఏజెన్సీలకు చెందినవి అయినందున ఫైళ్లు స్కాన్ చేసే చోట కచ్చితంగా ప్రభుత్వానికి చెందిన ఉద్యోగిని అక్కడ ఉంచాలని ఆదేశించారు. ఆ సమయంలో పెన్‌డ్రై వ్, డిస్క్ ఆప్షన్స్ లేకుండా చూడాలని సూచించారు. అన్ని ఫైళ్లు ఐటీ విభాగంలోని ప్రధాన సర్వర్‌కు వస్తాయని, అనంతరం ఫైళ్లు చూసేందుకు ఆయా శాఖలకు పాస్వర్డ్ ఇస్తామని వివరించారు. మొత్తం విభజన ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. విభజన పనులకు సంబంధించి అంశాలవారీగా అన్ని శాఖలకు గడువును సీఎస్ నిర్దేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి ఫైళ్లే అత్యధికం సచివాలయంలో అన్ని శాఖల్లో 1.80 లక్షల ఫైళ్లు ఉన్నట్లు గుర్తించారు. గత ఐదేళ్ల నాటి ప్రధానమైన ఫైళ్లు, రికార్డులు, డిస్పోజల్స్‌ను స్కానింగ్ చేసి భద్రపరచాల్సి ఉంది. 1.80 లక్షల ఫైళ్లలో అత్యధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధికి చెందినవే 40 వేల ఫైళ్లు ఉన్నాయి. రెవెన్యూకు చెందినవి 20 వేల ఫైళ్లు, మున్సిపల్‌కు చెందినవి 16 వేల ఫైళ్లు ఉన్నాయి. -
వచ్చే ఏడాదీ ఉమ్మడి సెట్స్!
రెండు రాష్ట్రాలకు ప్రస్తుత ఉన్నత విద్యామండలి సేవలే సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది కూడా రెండు రాష్ట్రాల్లో ఒకే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఎంసెట్ వంటి వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్న అధికారులు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఆలోచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అపాయింటెడ్ డే అయిన వచ్చే జూన్ 2 నుంచి 2015 జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థలు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలు అందించాలి. అందులో ఉన్నత విద్యా మండలి కూడా ఒకటి. ఈ విద్యా, శిక్షణ సంస్థల సేవల కొనసాగింపుపై 2015 జూన్ 2వ తేదీలోగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ అవగాహనకు రావాల్సి ఉంటుంది. అంటే 2015 జూన్ 2 వరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రెండు రాష్ట్రాలకు కచ్చితంగా సేవలు అందించాల్సిందే. ఈ లెక్కన ఇపుడే కాదు వచ్చే ఏడాది కూడా వివిధ సెట్స్ నిర్వహణకు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. నిర్ణీత వ్యవధిలోగానే (2015 జూన్ 2లోగా) ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ప్రవేశపరీక్షల నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి పూర్తవుతుందని చెబుతున్నారు. వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అన్నీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే జరుగున్నాయి. సాధారణంగా వాటి షెడ్యూలును డిసెంబర్ నెలలోనే మండలి ఖరారు చేస్తోంది. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో పరీక్ష నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తోంది. ఆయా వర్సిటీలు జనవరిలో నోటిఫికేషన్లను జారీ చేసి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలను నిర్వహించి, మే నెలాఖరుకల్లా ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది కోసం కూడా 2014 డిసెంబర్లోనే షెడ్యూలు ఖరారు కానుంది. కౌన్సిల్ నేతృత్వంలో నిర్వహణ: ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి మండలి(కౌన్సిల్) సేవలు వినియోగించుకునే అవకాశం అపాయింటెడ్ డే నుంచి ఏడాది పాటు ఉంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే జూన్ 2న ఏర్పడిన వెంటనే కౌన్సిల్‌ను విభజించే అవకాశాలు తక్కువ. ఒకవేళ కౌన్సిల్ విభజన జరిగినా పరీక్ష నిర్వహణ వేర్వేరు రాష్ట్రాల్లో కష్టం అవుతుంది. కాబట్టి ప్రస్తుత కౌన్సిల్ నేతృత్వంలోనే వచ్చే ఏడాది ప్రవేశాల కోసం సెట్స్ నిర్వహించే అవకాశం ఉంది. -
అదనపు సిబ్బంది కావాల్సిందే!
రెండు రాష్ట్రాలకూ అవసరమన్న ఐపీఎస్‌లు హోం శాఖ కార్యదర్శి గోస్వామితో భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందిని చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలకూ పంచినప్పటికీ రెండుచోట్లా అదనపు సిబ్బంది అవసరమవుతారని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి వివరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన గోస్వామితో డీజీపీ బి.ప్రసాదరావు నేతృత్వంలో విభజన ప్రక్రియలో పాలు పంచుకుంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ తదితర విభాగాలకు ప్రస్తుతం ఒక అధిపతే ఉండగా.. విభజన తర్వాత ఇద్దరు ఉండాల్సి వస్తుందని, ఈ రకంగానే మరికొన్ని కీలక పోస్టుల్నీ పెంచాల్సి ఉందని చెప్పారు. అదనపు బందోబస్తు అవసరమైన సమయంలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బలగాలను తరలిస్తున్నారని, విభజన తర్వాత ఇది సాధ్యం కాదు కనుక ఆ మేరకు సిబ్బంది సంఖ్యనూ పెంచాల్సి ఉంటుందని వివరించారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగే హైదరాబాద్‌కు అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయించాల్సిన అవసరాన్నీ అధికారులు గోస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. ‘గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. ఈ విభాగాలకు కేంద్రం ఏటా ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్‌కూ అదనంగా ఇవ్వాలి..’ అని సూచించారు. గ్రేహౌండ్స్ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి: గ్రేహౌండ్స్ విభాగాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం అధీనంలోకి తీసుకునే అంశాన్ని గోస్వామి ప్రస్తావించారు. దీన్ని రాష్ట్ర అధికారులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దేశంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన విభాగంగా పేరొందిన, అనేక రాష్ట్రాల్లో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించిన గ్రేహౌండ్స్ కమెండో దళంతో పాటు దాని శిక్షణ విభాగాన్ని కచ్చితంగా రాష్ట్ర పరిధిలోనే ఉంచాలన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు ఇతర విభాగాలకూ కేంద్రం విడుదల చేసే నిధుల వినియోగంపై పర్యవేక్షణకు మాత్రమే కేంద్రం పరిమితం కావాలని సూచించారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారులందరికీ ఆప్షన్లు ఇచ్చే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని గోస్వామి చెప్పారు. సమావేశానంతరం అధికారులు ఆయనకు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో విందు ఇచ్చారు. ఇలావుండగా బుధవారం గోస్వామి జాతీయ పోలీసు అకాడమీని సందర్శించారు. వసతులపై నేడు గవర్నర్ సమీక్ష: ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగనున్న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొనసాగడానికి అవసరమైన వసతులపై గవర్నర్ నరసింహన్ గురువారం సంబంధిత కమిటీ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. -
అన్నీ సాఫీగా సాగితే నెలాఖరుకు రెండు రాష్ట్రాలు
-
సాఫీగా సాగితే నెలాఖరుకల్లా రెండు రాష్ట్రాలు!
బిల్లుకు రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి గెజిట్ కీలకం ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ నుంచే రెండు రాష్ట్రాలు మనుగడలోకి నేడో, రేపో రాజ్యసభలో బిల్లు ఆమోదిస్తే నెలాఖరులోగా గెజిట్ ప్రకటన లేదంటే.. ఎన్నికలు పూర్తయ్యాక రెండు రాష్ట్రాలు ఏర్పడేలా నిర్ణయం సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014’ను లోక్‌సభ ఆమోదించటంతో.. ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటు దాదాపు ఖాయమైంది. దీంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సాంకేతికంగా ఎప్పటి నుంచి వేరుపడతాయన్న అంశంపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ యథాతథంగా ఆమోదిస్తే.. ఈ నెలాఖరులోగానే రెండు రాష్ట్రాలు వేరుపడే అవకాశాలున్నాయి. అయితే రాజ్యసభ ఆమోదం, దానిపై రాష్ట్రపతి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగానే రాష్ట్రాలు ఏ రోజు నుంచి వేరుపడతాయన్నది తేలనుంది. త్వరలో లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడనున్న పరిస్థితుల్లో.. ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయా? లేక ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడి.. తర్వాత వేరువేరుగా రెండు శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయా? అనే కోణాల్లో చర్చ సాగుతోంది. రాజ్యసభ ఆమోదించిన తర్వాత విభజన బిల్లు కేంద్ర హోంశాఖకు అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. రాష్ట్రపతి దానిని ఆమోదించాక.. రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ ముందుగానే జారీ అయినప్పటికీ.. అందులో పేర్కొన్న రోజు (అపాయింటెండ్ డే) నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు బుధ లేక గురువారాల్లో రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ ఎలాంటి సవరణలు చేయకుండా బిల్లును యథాతథంగా ఆమోదించిన పక్షంలో ఈ నెలాఖరులోగానే అది కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయటానికి అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభలో బిల్లులోని ఏవైనా అంశాలపై సవరణ ప్రతిపాదించి ఆమోదించిన పక్షంలో.. దాన్ని మళ్లీ లోక్‌సభ ముందు ఆమోదానికి పెట్టాల్సి ఉంటుంది. గతంలో మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే బిల్లుపై 2000 జూలై 31న లోక్‌సభ ఆమోదించగా.. అదే ఏడాది ఆగస్టు 9న రాజ్యసభలో దానికి కొన్ని సవరణలు చేసి ఆమోదించారు. రాజ్యసభలో కొత్తగా ఆమోదించిన సవరణలకు లోక్‌సభ ఆమోదం కూడా అవసరమైంది. దాంతో మరుసటి రోజు అంటే 2000 ఆగస్టు 10న మళ్లీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి కొత్త సవరణలను ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఎలాంటి సవరణలకు ఆమోదం తెలిపే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. గెజిట్‌లోని తేదీయే కీలకం ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు 21వ తేదీతో ముగుస్తుండగా.. ఈలోగా జరగాల్సినవి అన్నీ సాఫీ గా జరిగితే సమావేశాలు ముగియగానే విభజన బిల్లును హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది. ఆ లెక్కన ఈ నెల 22 లేదా 24న రాష్ట్రపతి భవన్‌కు ఫైలు చేరుకోవచ్చని అధికారవర్గాలు చెప్తున్నాయి. కీలకమైన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ సాధారణ ఎన్నికలకు ఈ నెలాఖరు రోజున లేదా మార్చి 3న షెడ్యూలు వెలువడుతుందని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్లో ఏ తేదీని ఖరారు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అంతా సాఫీగా సాగితే ఈ నెల 28 లోగా రాష్ట్రపతి రెండు రాష్ట్రాల ఏర్పాటు చట్టాన్ని ఆమోదించటంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అందులో 28వ తేదీ తోనే రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయని ఆ వర్గాలు అంచనావేస్తున్నాయి. లేదంటే ప్రస్తుత శాసనసభ కాలపరిమితి జూన్ 2తో ముగుస్తుండగా.. జూన్ 1 నుంచి.. అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వా లు వేరువేరు రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే విధంగా గెజిట్ జారీ కావొచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. -
కొత్త రాష్ట్రాలకు సీఎంలు ఎవరన్నదానిపై ఆసక్తి