Bollywood Senior Actor Shiv Subramaniam Died, Celebrities Pay Tributes - Sakshi
Sakshi News home page

Actor Shiv Subramaniam Death: 2స్టేట్స్‌ నటుడు శివ సుబ్రమణియన్‌ కన్నుమూత

Published Mon, Apr 11 2022 10:11 AM | Last Updated on Mon, Apr 11 2022 11:16 AM

2 States Actor Shiv Subramaniam Passes Away - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ నటుడు, స్క్రీన్‌ రైటర్‌ శివ సుబ్రమణియన్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు దృవీకరించారు. అయితే సుబ్రమణియన్‌ మరణానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక సుబ్రమణియన్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ ఆశోక్‌ పండిత్‌ ట్వీట్‌ చేస్తూ.. 'నా స్నేహితుడు, గొప్ప నటుడు, అంతకంటే మంచి మనిషి  శివ సుబ్రమణియన్‌ మరణవార్త విని చాలా షాక్‌ అయ్యాను. ఆయన భార్య దివ్యకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.ఈ విషాదాన్ని తట్టుకునేంత శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. 

1989లో పరిండా సినిమాతో తెరంగేట్రం​ చేసిన ఆయన పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. స్టాన్లీ కా డబ్బా, తు హై మేరా సండే, ఉంగ్లీ, నెయిల్ పాలిష్ మరియు 2 స్టేట్స్‌లో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. స్క్రీన్‌ రైటర్‌గానే కాకుండా పలు టీవీ షోలలో కూడా నటించారు. చివరగా కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో వచ్చిన మీనాక్షి సుందరేశ్వర్ సినిమాలో ఆయన కనిపించారు. ఇందులో సన్యా మల్హోత్రా తండ్రిగా నటించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement