Screen writer
-
తండ్రిగా ప్రమోషన్ పొందిన తెలుగు సినీ రచయిత, ఫోటో వైరల్
ప్రముఖ సినీ రచయిత గోపీ మోహన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య ప్రవీణ శుక్రవారం నాడు పండంటి బాబుకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. తన కొడుకును చేతుల్లోకి తీసుకుని ముచ్చటపడిపోతున్న గోపీ మోహన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, సాయి రాజేశ్, నటుడు రాహుల్ రవీంద్రన్, వరుణ్ సందేశ్ సహా పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా సినిమాల మీద ఆసక్తితో మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు గోపీ మోహన్. నువ్వునేను సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంతోషం చిత్రానికి తనే స్వయంగా స్క్రీన్‌ప్లే అందించాడు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్షా, లక్ష్యం, ఝుమ్మంది నాదం, గ్రీకు వీరుడు, ఓ బేబీ వంటి సినిమాలకు రచయితగా పని చేశాడు. రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు, బాద్షా చిత్రాలకు కథ అందించింది కూడా ఆయనే. Thank you so much brother @itsvarunsandesh 😊❤️ https://t.co/djiBMdBKq6 — Gopi Mohan (@Gopimohan) February 25, 2023 -
సీనియర్ నటుడు కన్నుమూత, ప్రముఖుల సంతాపం
బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రమణియన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు దృవీకరించారు. అయితే సుబ్రమణియన్ మరణానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక సుబ్రమణియన్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఆశోక్ పండిత్ ట్వీట్ చేస్తూ.. 'నా స్నేహితుడు, గొప్ప నటుడు, అంతకంటే మంచి మనిషి శివ సుబ్రమణియన్ మరణవార్త విని చాలా షాక్ అయ్యాను. ఆయన భార్య దివ్యకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.ఈ విషాదాన్ని తట్టుకునేంత శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. 1989లో పరిండా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. స్టాన్లీ కా డబ్బా, తు హై మేరా సండే, ఉంగ్లీ, నెయిల్ పాలిష్ మరియు 2 స్టేట్స్లో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. స్క్రీన్ రైటర్‌గానే కాకుండా పలు టీవీ షోలలో కూడా నటించారు. చివరగా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో వచ్చిన మీనాక్షి సుందరేశ్వర్ సినిమాలో ఆయన కనిపించారు. ఇందులో సన్యా మల్హోత్రా తండ్రిగా నటించాడు. Extremely shocked and pained to know about the tragic demise of our dear friend, a great actor and a brilliant human being Shiv Subramaniam. My heartfelt condolences to his wife Divya. May God give you enough energy to face this tragedy . ॐ शान्ति ! 🙏 pic.twitter.com/LvTM0mZhFi — Ashoke Pandit (@ashokepandit) April 11, 2022 Terrible news to wake up to. Shiv Subramaniam gone. Heartbreaking. — Hansal Mehta (@mehtahansal) April 11, 2022 -
బొద్దు... బంధం
హృదయం క్రిస్టీ రాబర్ట్సన్ గురించి చెప్పేముందు... ఆమె ప్రియుడు కాస్పర్ లూయిస్ గురించి, అతనికున్న ఓ చిత్రమైన అభిరుచి గురించి తెలుసుకోవాలి. స్క్రీన్ రైటర్ అయిన ఈ లడ్డుబాబుకు బొద్దుగా ఉండే అమ్మాయిలంటే భలే ఇష్టం. జీరో సైజు అమ్మాయిల్ని చూస్తే ‘వ్యాక్’ అంటాడు. అలాంటి వాళ్ల జోలికే వెళ్లడు. సన్నగా ఉన్న అమ్మాయులు ఎముకల గూళ్లు అన్నది అతని అభిప్రాయం. అతని తొలి గర్ల్‌ఫ్రెండ్ తాను కోరుకున్న విధంగా లావవ్వలేదని ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు కాస్పర్. ఇలాంటి సమయంలో ఓ పబ్‌లో పరిచయమైంది క్రిస్టీ రాబర్ట్సన్. లూయిస్‌ను చూడగానే పడిపోయింది క్రిస్టీ. తర్వాత అతనికి ప్రపోజ్ చేసింది. కానీ అతను ఒప్పుకోలేదు. కారణం... క్రిస్టీ అప్పటికి నాజూగ్గా ఉండటమే. ఈ విషయమే ఆమెకు చెప్పాడు. ఇంకొకరైతే నవ్వి ఊరుకునేవాళ్లు. కానీ క్రిస్టీ మాత్రం... లూయిస్ కోసం తనను తాను మార్చుకోవడానికి సిద్ధమైంది. ఆ రోజు వరకూ క్రిస్టీ జీవనశైలే వేరు. ఆమెకు మోడల్ కావాలన్నది లక్ష్యం. అందుకోసం రోజూ జిమ్‌కు వెళ్లి గంటలకొద్దీ కసరత్తులు చేయడం, డైటింగ్ నియమాలు పాటించడం, ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం... ఇదీ ఆమె లైఫ్ స్టైల్. సన్నగా ఉండటానికి ఇంత కష్టపడుతున్న ఆమె, లూయిస్ కోసం మొత్తం అవన్నీ వదిలేసింది. అంటే చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు తెగ తినడం మొదలుపెట్టింది. ఎక్సర్సైజులు మానేసి, గంటలకొద్దీ పడుకోవడం అలవాటు చేసుకుంది. దీంతో కొన్ని నెలల్లోనే క్రిస్టీ రూపంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించడం మొదలైంది. ఆమె బాగా లావైంది. ఒంటి కొలతలు మారిపోయాయి. అప్పటిదాకా ఆమె వాడుతున్న డ్రెస్సులన్నీ టైట్ అయిపోయాయి. అన్నీ కొత్త డ్రెస్సులు కొనుక్కోవాల్సి వచ్చింది. తనకోసం క్రిస్టీ పడుతున్న కష్టం చూసి, లూయిస్ కరిగిపోయాడు. పెరుగుతున్న ఆమె బరువుతో పాటు ఆమెపై అతని ప్రేమ కూడా పెరిగింది. ఇద్దరూ కలిసి షికార్లు మొదలుపెట్టారు. ఐతే ఎక్కడికెళ్లినా క్రిస్టీకి కడుపు నిండా తినిపించడమే లూయిస్ పని. ఆమెకిచ్చే బహుమతులన్నీ కూడా తిండికి సంబంధించినవే అయి ఉంటాయి. బాయ్‌ఫ్రెండ్ కోసం సన్నబడేవాళ్లను చూసుంటారు కానీ, ఇలా లావవ్వడం చిత్రమైన విషయం కదా! అందుకే క్రిస్టీని అందరూ తిట్టిపోశారు. క్రిస్టీ తల్లిదండ్రులైతే, తమ కూతురికేమైనా పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. స్నేహితులు కూడా ఇది మంచిది కాదన్నారు. కానీ క్రిస్టీ వినలేదు. తను లావవ్వడం లూయిస్‌కు ఎంత ఆనందాన్నిచ్చిందో ఆమెకు తెలుసు. ఒకప్పుడు సన్నబడటానికి అనేక కష్టాలు పడ్డానని, వాటితో పోలిస్తే ఇది పెద్ద కష్టం కాదని అంటోందామె. సాధారణంగా బాయ్‌ఫ్రెండ్స్ అయినా, భర్తలైనా సన్నబడమని పోరుపెడతారని, కానీ కడుపు నిండా తిని లావవ్వమని చెప్పే బాయ్‌ఫ్రెండ్ దొరకడం తన అదృష్టమని కూడా చెబుతోంది క్రిస్టీ. ఎవరేమన్నా లూయిస్, తాను కలిసి ఆనందంగా ఉండటమే ముఖ్యమని అంటోందామె. ఐతే క్రిస్టీ కథ తెలుసుకున్న వైద్యులు... ఆమె లైఫ్ స్టైల్ ప్రమాదకరమని, ఇలాగే తింటూ మరీ లావెక్కిపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇదే విషయం క్రిస్టీ దగ్గర ప్రస్తావిస్తే... ఆరోగ్యం విషయంలో మరీ అజాగ్రత్తగా ఏమీ లేనని, ఇంకొన్నాళ్లు శృంగార జీవితం అనుభవించిన తర్వాత కాస్త సన్నబడే ప్రయత్నం చేస్తానని, ప్రస్తుతానికైతే తన ప్రియుణ్ని సంతృప్తి పరచడమే తన పని అంటోంది.