
ప్రముఖ సినీ రచయిత గోపీ మోహన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య ప్రవీణ శుక్రవారం నాడు పండంటి బాబుకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. తన కొడుకును చేతుల్లోకి తీసుకుని ముచ్చటపడిపోతున్న గోపీ మోహన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, సాయి రాజేశ్, నటుడు రాహుల్ రవీంద్రన్, వరుణ్ సందేశ్ సహా పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
కాగా సినిమాల మీద ఆసక్తితో మొదట డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు గోపీ మోహన్. నువ్వునేను సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంతోషం చిత్రానికి తనే స్వయంగా స్క్రీన్‌ప్లే అందించాడు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్‌షా, లక్ష్యం, ఝుమ్మంది నాదం, గ్రీకు వీరుడు, ఓ బేబీ వంటి సినిమాలకు రచయితగా పని చేశాడు. రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు, బాద్‌షా చిత్రాలకు కథ అందించింది కూడా ఆయనే.
Thank you so much brother @itsvarunsandesh 😊❤️ https://t.co/djiBMdBKq6
— Gopi Mohan (@Gopimohan) February 25, 2023
Comments
Please login to add a commentAdd a comment