Gopi Mohan
-
తండ్రిగా ప్రమోషన్ పొందిన తెలుగు సినీ రచయిత, ఫోటో వైరల్
ప్రముఖ సినీ రచయిత గోపీ మోహన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య ప్రవీణ శుక్రవారం నాడు పండంటి బాబుకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. తన కొడుకును చేతుల్లోకి తీసుకుని ముచ్చటపడిపోతున్న గోపీ మోహన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, సాయి రాజేశ్, నటుడు రాహుల్ రవీంద్రన్, వరుణ్ సందేశ్ సహా పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా సినిమాల మీద ఆసక్తితో మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు గోపీ మోహన్. నువ్వునేను సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంతోషం చిత్రానికి తనే స్వయంగా స్క్రీన్‌ప్లే అందించాడు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్షా, లక్ష్యం, ఝుమ్మంది నాదం, గ్రీకు వీరుడు, ఓ బేబీ వంటి సినిమాలకు రచయితగా పని చేశాడు. రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు, బాద్షా చిత్రాలకు కథ అందించింది కూడా ఆయనే. Thank you so much brother @itsvarunsandesh 😊❤️ https://t.co/djiBMdBKq6 — Gopi Mohan (@Gopimohan) February 25, 2023 -
‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’
రచయితలుగా ఘనవిజయాలు సాధించిన చాలా మంది సినీ ప్రముఖులు దర్శకులుగానూ సత్తా చాటుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి వారు టాప్ డైరెక్టర్స్‌గా ఎదిగారు. తాజాగా మరో స్టార్ రైటర్ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన పలు విజయవంతమైన చిత్రాలకు కోన వెంకట్‌తో కలిసి రచయితగా పనిచేసిన గోపీమోహన్ దర్శకుడి తొలి సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. చాలా కాలంగా దర్శకుడిగా తొలి ప్రయత్నం చేసేందుకు రెడీ అవుతున్న గోపీమోహన్ ప్రేమికుల రోజు సందర్భంగా మరో అప్ డేట్ ఇచ్చారు. గతంలోనే సినిమా టైటిల్ ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’ అని ప్రకటించిన గోపీమోహన్ ‘ఈ కథని ఇష్టంగా సంతోషంగా ఆనందంగా మీకు చెప్పాలని నా మనసు కోరుకుంటోంది. అతి త్వరలో మీకు నచ్చిన తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాను. నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకు ,నా ప్రియమైన భాగస్వామికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ కథని ఇష్టంగా సంతోషంగా ఆనందంగా మీకు చెప్పాలని నా మనసు కోరుకుంటోంది. అతి త్వరలో మీకు నచ్చిన తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాను. నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకు ,నా ప్రియమైన భాగస్వామికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. Celebrate Friendship & Love. Happy Valentines Day 💕💐 pic.twitter.com/UeWPqN15PO — Gopi Mohan (@Gopimohan) 14 February 2018 -
ముగ్గురు హీరోలు... ముగ్గురు హీరోయిన్లు... ఛలో అమెరికా
ప్రేమంటే ఇద్దరి వ్యక్తుల హృదయానుబంధం.. స్నేహమంటే ఇష్టకష్టాలు పంచుకోవడం... ఆనందమంటే పది మందితో సంతోషాలను పంచుకోవడం. స్నేహం, ప్రేమ, భావోద్వేగాల పరిచయంతోనే ప్రతి వ్యక్తీ జీవిత ప్రయాణం చేస్తారు. ఇప్పుడీ మూడు అంశాలు మేళవించి రచయిత గోపీమోహన్ ఓ కథ రాశారు. దీని ప్రత్యేకత ఏంటంటే... ఈ కథతోనే ఆయన మెగాఫోన్ పట్టనున్నారు. టైటిల్ ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారుతున్నట్టు గోపీమోహన్ ఏడాది క్రితమే ప్రకటించారు. అయితే స్క్రిప్ట్ వర్క్ మాత్రం ఇప్పుడు పూర్తయింది. పలు కమర్షియల్ చిత్రాలకు కథలు అందించిన మీకు ఈ కథ రాయడానికి ఏడాది ఎందుకు పట్టింది? అని గోపీమోహన్‌ని ‘సాక్షి’ అడిగితే.. ‘‘రచయితగా పనిచేసినప్పుడు దర్శకుల అభిరుచికి తగ్గట్టు రాయడం జరుగుతుంది. అదే ఓ రచయిత.. దర్శకునిగా మారుతున్నాడంటే ప్రేక్షకులు అతడి నుంచి కొత్తదనం ఆశిస్తారు. అందులోనూ సున్నితమైన భావోద్వేగాలు గల చిత్రమిది. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. అందుకే కొంచెం టైమ్ పట్టింది. అమెరికా నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు’’ అని చెప్పారు. ఈ వారంలో టాలీవుడ్ యువ హీరోలను కలసి గోపీమోహన్ కథ చెప్పనున్నట్లు వినికిడి. -
ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా..
తెలుగు సినీరంగంలో రచయితలుగా సక్సెస్ సాధించి చాలామంది ఆ తర్వాత మెగాఫోన్ పట్టి విజయాలనందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నడవడానికి మరో స్టార్ రైటర్ రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల, వినాయక్ లాంటి దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసిన గోపి మోహన్ త్వరలోనే దర్శకత్వం వహించనున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించాడు గోపి మోహన్. సునీల్ హీరోగా, అనీల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కే సినిమాతో గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సునీల్‌తో చేయాల్సి సినిమా ఆలస్యం కావటం, ఈలోగా సునీల్ కూడా వీరు పోట్లతో మరో సినిమా అంగీకరించటంతో, ఇప్పుడు మరో సినిమాకు దర్శకత్వం వహించే ప్రయత్నాల్లో ఉన్నాడు గోపిమోహన్. ఈ సినిమాకు 'ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా' అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేశాడు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రచయితగా భారీ విజయాలను అందించిన గోపిమోహన్ దర్శకుడిగా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
ఆ ఇద్దరు విడిపోయినట్టేనా..?
కోన వెంకట్, గోపి మోహన్... ఈ రెండు పేర్లు ఒకప్పుడు టాలీవుడ్లో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయటంలో తమ మార్క్ స్పష్టంగా చూపించిన ఈ జోడీ భారీ విజయాలతో ఇండస్ట్రీ ఫేట్ మార్చేసింది. ఒకే కథను మళ్లీ మళ్లీ రాస్తారన్న పేరున్నా, అదే కథను అన్నిసార్లు ఒప్పించటంలోనూ సక్సెస్ అయ్యారు కోన వెంకట్, గోపి మోహన్. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ మ్యాజిక్ పెద్దగా వర్కవుట్ కావటం లేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. షాడో, అల్లుడు శీను, బ్రూస్ లీ లాంటి సినిమాలతో ఫ్లాప్ టాక్ రావటమే కాదు.. ఈ ఇద్దరి పెన్ను పవర్ తగ్గిపోయిందన్న అపవాదు కూడా తీసుకొచ్చాయి. ప్రస్తుతం కోన వెంకట్ రచన మీద కన్న నిర్మాణ రంగం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. త్వరలోనే దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే బాటలో గోపి మోహన్ కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కలిసి పనిచేస్తున్న ఈ ఇద్దరు స్టార్ రైటర్లు పెన్ను పక్కన పెట్టి మెగాఫోన్ పట్టుకోవటంతో ఇక మీదట వీరి కాంబినేషన్ కొనసాగుతుందా అన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలను వేదిస్తుంది. ఒక్కసారి దర్శకుడిగా మారిన తర్వాత తిరిగి రచయితలుగా పనిచేసే ప్రయత్నం చేయరు కనుక.. ఇక కోన వెంకట్, గోపి మెహన్ల జోడీ విడిపోయినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. -
సినిమా రివ్యూ: లౌక్యం
దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం(సెప్టెంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. వరంగల్‌లో బాబ్జీ(మిర్చి ఫేం సంపత్), కేశవరెడ్డి(ముఖేశ్ రుషి)లు బద్దశత్రువులు. వీళ్లు ఓ కారణంగా వీరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న కేశవ్ రెడ్డి... బాబ్జీ చిన్న చెల్లెలు చంద్రకళ(రకుల్ ప్రీత్ సింగ్)ను చంపాలని ప్లాన్ వేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా బాబ్జీ పెద్ద చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన వెంకీ(గోపిచంద్) హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్‌లో చంద్రకళను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే తాను ప్రేమించింది బాబ్జీ చిన్న చెల్లెల్ని అని వెంకీ తెలుసుకోవడం ఈ కథలో ట్విస్ట్. అయితే చంద్రకళతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చడానికి బాబ్జీ ఎలా ఒప్పించాడు? పెద్ద చెల్లెలి పెళ్లి చెడగొట్టాడానే పీకల్లోతు కోపంలో ఉన్న బాబ్జీని వెంకీ ఎలా కన్విన్స్ చేశాడు? బాబ్జీని ఒప్పించడానికి ఎలాంటి డ్రామా ప్లే చేశాడు? బాబ్జీ, కేశవరెడ్డిల మధ్య శత్రత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే లౌక్యం చిత్ర కథ. డైలాగ్స్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బ్రహ్మానందం, పృథ్వీ కామెడి సెకండాఫ్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, కథనాలు మ్యూజిక్ నటీనటుల పెర్ఫార్మెన్స్: గోపిచంద్‌కు వెంకీ పాత్ర రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్‌తోనే కొంత నటనతోనూ ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం. సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. సాంకేతికవర్గాల పనితీరు: అనూప్ రూబెన్ సంగీతంలో ప్రత్యేకత ఏమి కనిపించలేదు. ‘సుర్ సుర్ సూపర్..’, ‘నిన్ను చూడగానే’ పాటలు రొటిన్‌గానే ఉన్నా.. పర్వాలేదనిపించాయి. శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కోన వెంకట్ అందించిన విజయవంతమైన చిత్రాల కథల్ని, స్క్రీన్‌ప్లే ఫార్మూలానే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఏలా ఉంటుందనే భయం అణువణువునా వెంటాడిని కనిపిస్తుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. మూస చిత్రాలకే ఓటేసినట్టు దర్శకుడి తీరు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా తప్ప కొత్తగా ఆలోచించకుండా కోన వెంకట్, గోపి మోహన్ల మార్కు కామెడీతో శ్రీవాసు లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి ప్రత్యేకతలేని ఈ చిత్రంలో బ్రహ్మనందం, పృథ్వీల కామెడీయే విజయరహస్యంగా దర్శకుడు భావించారు. అయితే దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్రహ్మనందం రొటిన్ కామెడీకి, పృథ్వీ సరికొత్త యాంగిల్లో హాస్యం బాగానే సహాయపడ్డాయి. ముగింపు: కొత్త కథలపై నమ్మకం లేని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ పాతకథనే అటు ఇటు మార్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాలు చెబుతున్నాయి. కథ అదే కాని టైటిల్, హీరో మారాడనే టాక్ లౌక్యంపై బాహాటంగా విమర్శలు వినిపించడం ఖాయం. అయితే రొటిన్ కథకు వినోదాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్ చేయాలని చేసిన ప్రయత్నంగా 'లౌక్యం' రూపొందింది. బ్రహ్మనందంను కాస్తా వెనక్కినెట్టి బాయిలింగ్ స్టార్ పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, హంసానందిని ఎపిసోడ్ లౌక్యం చిత్రానికి బలంగా మారాయి. పాత చింతకాయ పచ్చడేనా అని అనిపించే ప్రతిసారి వినోదంతో ఆ సంతృప్తిని తగ్గించేలా కథనం సాగింది. ఓవరాల్ గా తొలి భాగంలో నిరసపడ్డ ప్రేక్షకుడికి సెకండాఫ్ లో పృథ్వీ, బ్రహ్మనందంల కామెడీ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. -రాజబాబు అనుముల