అమ్మానాన్నలకు అలియా గిఫ్ట్ | Alia Bhatt's luxurious gift for her mum and dad | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలకు అలియా గిఫ్ట్

Published Tue, Jul 15 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

అమ్మానాన్నలకు అలియా గిఫ్ట్

అమ్మానాన్నలకు అలియా గిఫ్ట్

 ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో అందరూ ప్రత్యేకించి చెప్పుకుంటున్న పేరు - అలియా భట్. టు స్టేట్స్’ చిత్రంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారామె. ఆమె నటించిన తాజా చిత్రం ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ కూడా మంచి ప్రారంభ వసూళ్ళు సంపాదించుకుంది. ప్రస్తుతం అలియా ఆ ఆనందంలో ఉన్నారు. దానికి తీపిగుర్తుగా తల్లితండ్రులు మహేశ్‌భట్, సోనీ రజ్దాన్‌లకు ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆమె భావిస్తున్నారు. అమ్మా నాన్నలకు ఒకేలా ఉండే రెండు లగ్జరీ కార్లను బహూకరించాలని ఈ యువ నటి అనుకుంటున్నట్లు భోగట్టా.
 
 ‘‘ఆడపిల్లలందరి లాగానే నేనూ మా అమ్మానాన్నకు ఏదైనా ప్రత్యేకంగా అందజేయాలని అనుకుంటున్నా. అయితే, ఏం కొనాలన్నది మాత్రం నిర్ణయించుకోలేదు’’ అని 21 ఏళ్ళ అలియా అన్నారు. అన్నట్లు ఇటీవలే ఆమె ఏకంగా రూ. 5 లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు చేశారు. ‘‘వరుస విజయాలు అందుకుంటున్న సందర్భంగా ఇది నాకు నేను ఇచ్చుకున్న బహుమతి’’ అన్నారు అలియా. ఎప్పుడూ బ్రాండ్‌లపై దృష్టి పెట్టని ఈ యువతి ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారట. అన్నట్లు, రేపు తల్లితండ్రులకు బహుమతి విషయంలో కూడా అలియా విలాసవంతమైన బ్రాండ్ వైపే మొగ్గుచూపుతారని ఊహించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement