
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. విదేశాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా సితార తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పంపిన దుస్తులను పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది.
(ఇది చదవండి: వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాం: సితార)
ఆలియా భట్ గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కుమారులకు దుస్తులు పంపి సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా మరోసారి మహేశ్- నమ్రతల గారాలపట్టి సితారకు దుస్తులు పంపింది. వాటి ఫోటోలను సితార తన ఇన్‌స్టాలో పంచుకుంది. మీ కుటుంబంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.. మీ అందరి నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్ పెళ్లాడిన ఆలియా భట్‌కు ఓ కూతురు జన్మించింది. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment