కలత చెందడం లేదు | Alia Bhatt not upset about jokes on her general knowledge | Sakshi
Sakshi News home page

కలత చెందడం లేదు

Published Wed, May 14 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

కలత చెందడం లేదు

కలత చెందడం లేదు

 తన జనరల్ నాలెడ్జ్‌పై సామాజిక అనుసంధాన వేదికల్లో చక్కర్లు కొడుతున్న జోక్‌లపై కలత చెందడం లేదంటోంది బాలీవుడ్ అమ్మడు అలియా భట్. హైవే, టూ స్టేట్స్ సినిమాలో మంచి నటనతో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన ఈ భామ... ‘కాఫీ విత్ కరణ్’ చాట్ షోలో కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పింది. అప్పటి నుంచి అలియా భట్‌పై సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో జోరుగా సెటైర్లు కనబడుతున్నాయి. అయితే తాను తప్పు సమాధానం చెప్పినందుకు నిరాశ చెందలేదన్న ఈ ముద్దుగుమ్మ మొదట ఆ జవాబుకు నవ్వింది తానేనని మంగళవారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాకు తెలిపింది.
 
 కాగా, ఇటీవల కాఫీ విత్ కరణ్ చాట్ షోలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలో పాటు అలియాభట్ కూడా పాల్గొంది. భారత రాష్ట్రపతి ఎవరు అనే ప్రశ్నకు భట్, వరుణ్ తప్పుడు సమాధానం చెప్పారు. మన్మోహన్ సింగ్ అని వరుణ్ , పృథ్వీరాజ్ సింగ్ అని భట్ తెలిపారు. సిద్ధార్థ్ ఒక్కడే ప్రణబ్ ముఖర్జీ అని చెప్పాడు. దీని తర్వాతే భట్... జనరల్ నాలెడ్జ్‌పై సామాజిక అనుసంధాన వేదికలో అనేక జోక్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిపై కలత చెందడం లేదన్న భట్ వాటిని చూసి ఇంకా నవ్వుకుంటున్నానని అంటోంది. ‘ఇంటర్వ్యూ: మోడీ తొలి పేరు ఏంటి?. భట్: అబ్కిబార్’ ఇలాంటి జోక్‌లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో హల్‌చల్ చేస్తున్నాయని తెలిపింది. తాను తెలివి తక్కువ దాన్ని కాబట్టే ఆ రకంగా ప్రచారం జరుగుతోందంది. తాను నటించిన హైవే, టూ స్టేట్స్ సినిమాలు బాగానే ఉన్నాయని తెలిపింది. ఇతరులు చేసే ఆరోపణల గురించి తానేమీ పెద్దగా పట్టించుకోనని భట్ అంటోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement