
హైకోర్టుకు విభజన సెగ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజణ జరిగి ఇప్పటికే ఏడు నెలలైనా ఇప్పటికీ చాలా విభాగాలు ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. అందులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా ఉంది.
రాష్ట్ర విభజన జరిగి ఇన్నాళ్లైనా హైకోర్టు విభజన ప్రకియ ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌనంగా తమ నిరసన తెలియజేశారు.