ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'... | Raghav Arora, Akshit Bansal And Bhagyashree Jain In Latest 30 Under 30 Asia Environmental List | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...

Published Fri, May 17 2024 10:07 AM | Last Updated on Fri, May 17 2024 10:07 AM

Raghav Arora, Akshit Bansal And Bhagyashree Jain In Latest 30 Under 30 Asia Environmental List

రాఘవ్‌ అరోర, అక్షిత్‌ బన్సాల్‌, భాగ్యశ్రీ జైన్‌

‘30 అండర్‌ 30 ఆసియా’ తాజా జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేషన్, ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండస్ట్రీస్‌ విభాగంలో మన దేశం నుంచి ఈవీ చార్జింగ్‌ కంపెనీ ‘స్టాటిక్‌’ ఫౌండర్స్‌ అక్షిత్‌ బన్సాల్, రాఘవ్‌ అరోర, ‘ది డిస్పోజల్‌ కంపెనీ’ ఫౌండర్‌ భాగ్యశ్రీ జైన్‌లు చోటు సాధించారు..

బాల్యస్నేహితులైన అక్షిత్‌ బన్సాల్, రాఘవ్‌ అరోరాలు పట్టణ వాయు కాలుష్యం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకునేవారు. కాలుష్య స్థాయిలను తగ్గించడంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ) ప్రధానపాత్రపోషించడంపై కూడా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఈవీ)కి సంబంధించిన మౌలిక చార్జింగ్‌ సదు΄ాయాలపై దృష్టి పెట్టారు. తమ పొదుపు మొత్తాలను ఉపయోగించి 2019లో ఇంట్లో తొలి ఈవీ చార్జర్‌ను తయారుచేయడంతో ‘స్టాటిక్‌’ ప్రయాణంప్రారంభమైంది.

వినియోగదారులు తమ ఎలక్ట్రిక్‌ వాహనాలను చార్జ్‌ చేయడానికి సమీపంలోని చార్జింగ్‌ స్టేషన్‌ను గుర్తించడానికి ‘స్టాటిక్‌’  యాప్‌ ఉపయోగపడుతుంది. అగ్రశ్రేçణి ఈవీ చార్జర్లు, అడ్వాన్స్‌డ్‌ మొబైల్‌ అప్లికేషన్‌లను కూడా ‘స్టాటిక్‌’ డెవలప్‌ చేసింది. ఈ స్టార్టప్‌ కార్పొరేట్‌ ఆఫీసులు, రెసిడెన్సెస్, హోటల్స్, సినిమా హాలు...మొదలైన వాటికి సంబంధించిన యజమానులతో టై అప్‌ అయింది. ఈప్రాపర్టీ వోనర్స్‌ను ‘చార్జర్‌ హోస్ట్స్‌’గా వ్యవహరిస్తారు.

హరియాణాలోని హిసార్‌లో పుట్టి పెరిగిన అక్షిత్‌ బన్సాల్‌ మణి΄ాల్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో 2018లో ‘డెలాయిట్‌లో’ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్నేహితుడు రాఘవ్‌ అరోర అతడికి వెయ్యి ఏనుగుల బలం అయ్యాడు. ‘వి్ర΄ో’లో డేటా సైంటిస్ట్‌గా పనిచేసిన రాఘవ్‌ బాల్య స్నేహితుడికి తోడుగా నిలిచాడు. ఇద్దరి కృషి ‘స్టాటిక్‌’కు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.

‘స్టాటిక్‌’ యూఎస్పీలలో ఒకటి...సింగిల్‌ రెవెన్యూ మోడల్‌పై మాత్రమే కంపెనీ దృష్టి పెట్టక΄ోవడం. సొంతంగా చార్జర్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయడంతోపాటు. హెచ్‌పీసీఎల్, షెల్‌లాంటి పెద్ద కంపెనీల కోసం చార్జర్లను బిల్డ్‌ చేయడం, ఇన్‌స్టాల్, మెయింటెయిన్‌ చేయడం లాంటివి చేస్తోంది స్టాటిక్‌.

వివిధ బ్రాండ్‌లు ‘ప్లాస్టిక్‌ న్యూట్రల్‌’గా మారడానికి తన స్టార్టప్‌ ‘ది డిస్పోజల్‌ కంపెనీ’తో సహాయపడుతోంది దిల్లీకి చెందిన భాగ్యశ్రీ జైన్‌. ఈ స్టార్టప్‌ ద్వారా ఏడాదికి 750 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌ చేస్తున్నారు. నోయిడా యూనివర్శిటీలో బిబిఏ చేసిన భాగ్యశ్రీ కొన్ని సంవత్సరాలు వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీలో పనిచేసింది. వివాహానంతరం రాజస్థాన్‌కు మకాం మార్చింది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఒక్క రీసైక్లింగ్‌ యూనిట్‌ లేదనే విషయం గ్రహించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలపై దృష్టి పెట్టి ‘ది డిస్పోజల్‌ కంపెనీ’ అనే రీసైకిలింగ్‌ కంపెనీ మొదలుపెట్టింది.

ఏదైనా బ్రాండ్‌ తమ కంపెనీలో క్లయింట్‌గా సంతకం చేసిన తరువాత ఆ బ్రాండ్‌కు సంబంధించిన ప్లాస్టిక్‌ ఫుట్‌ ప్రింట్‌ను అంచనా వేయడానికి వన్‌–టైమ్‌ వేస్ట్‌ ఆడిట్‌ నిర్వహిస్తారు. ‘ది డిస్పోజల్‌ కంపెనీ’కి దేశవ్యాప్తంగా రీసైక్లర్‌పాట్నర్స్, రాగ్‌పికర్స్, ఆగ్రిగేటర్స్‌ ఉన్నారు. 75 లక్షల రూ΄ాయల పెట్టుబడితో ఈ రీసైక్లింగ్‌ యూనిట్‌నుప్రారంభించారు. ఎక్సెంచర్, సస్టైనబిలిటీ,  యాక్సిలరేటర్‌ ్ర΄ోగ్రామ్‌కు ఎంపికైన ఈ స్టార్టప్‌కు 60 లక్షల రూ΄ాయల సీడ్‌ ఫండ్‌ లభించింది.

పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై ప్లాస్టిక్‌ కాలుష్యం చూపుతున్న  ప్రభావం, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించుకునే పద్ధతుల గురించి రచనలు, ఉపన్యాసాల రూపంలో ప్రజలకు అవగాహన  కలిగిస్తోంది భాగ్యశ్రీ జైన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement