Environment Clearance
-
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
Reva Jhingan Malik: పర్యావరణ హితమైన జీవనశైలిలో.. మేడ మీద వంట!
మేడ మీద వడియాలు పెటుకున్నట్టే, మేడ మీద పంటలు కూడా ఇటీవల ఎక్కువైంది. బెంగళూరుకు చెందిన రేవా జింగాన్ మాలిక్ మాత్రం రోజూ ఉదయం తొమ్మిది గంటలకు మేడ మీదకెళ్లి వంట మొదలుపెడుతుంది. అదే సోలార్ కుకింగ్. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ హితమైన జీవనశైలిలో భాగంగా ఆమె ఈ సోలార్ కుకింగ్‌ని అనుసరిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ వాడకం వల్ల భూమికి జరిగే హానిని తనవంతుగా నిలువరించగలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. వండడానికి, ఎండబెట్టడానికి అనువుగా ఆమె డిజైన్ చేయించుకున్న సోలార్ ఎక్విప్మెంట్ గురించి...ప్రత్యామ్నాయ జీవనశైలి..ఎల్పీజీ వాడకం ఎక్కువైంది. గడచిన ఐదేళ్లలో మనదేశం దిగుమతులు కూడా ఆ మేరకు పెరిగి΄ోతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.4 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 2022–23 నాటికి 18.3 ఎమ్ఎమ్టీలకు చేరింది. మన ఉత్పత్తుల శాతం నాలుగుగా ఉంటే వినియోగ శాతం 22కి చేరింది. అందుకే సస్టెయినబుల్ లివింగ్ మాత్రమే అసలైన ప్రత్యామ్నాయం అనుకున్నాను. అదే విషయాన్ని పిల్లలకు, పెద్దలకు బోధిస్తున్నాను. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని ఎదురు చూడరాదు, మనవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి.కొన్ని దేశాల్లో సూర్యరశ్మి తగినంత ఉండదు, కానీ మనదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. ఇతర ఇంధనాల వలె వాడుకకు అనువుగా చేయడానికి ప్రాసెసింగ్ అవసరం, సోలార్ ఎనర్జీని వాడడానికి మనం ప్రత్యేకంగా శ్రమించాల్సింది ఏమీ లేదు. ఒకసారి సోలార్ కుకర్ని కొంటే సంవత్సరాలపాటు వినియోగించుకోవచ్చు. నాలుగేళ్ల కిందట 18వేల రూ΄ాయలకు కొన్నాను. శీతాకాలం, వర్షాకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది. 850 వాట్స్ సోలార్ ఇన్వర్టర్ అమర్చడం ద్వారా ఆ సమస్యనూ పరిష్కరించుకున్నాను.అన్నం, పప్పు, కూరగాయలకు మూడు అరల సోలార్ కుకర్ డిజైన్ చేయించుకున్నాను. ఉదయం ఎనిమిది గంటలకు బియ్యం, పప్పు కడిగి, నానబెట్టి, కూరగాయలు తరిగి తొమ్మిదింటికి మేడ మీదకు వెళ్లి కుకర్ ఆన్ చేసి వస్తాను. పదకొండు గంటలకల్లా వంట పూర్తవుతుంది. పాలు మరిగించడం నుంచి ప్రతిదీ ఇందులోనే చేస్తున్నాను. పప్పులు, గింజలు, రైజిన్స్, వేయించడం నుంచి ఎండబెట్టి పొడి చేసుకునే పసుపు, ఎండుమిర్చి వరకు అందులోనే చేస్తున్నాను. మంట లేని వంట మాది’’.ఇవి చదవండి: ప్లాస్టిక్ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్ -
ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...
‘30 అండర్ 30 ఆసియా’ తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ విభాగంలో మన దేశం నుంచి ఈవీ చార్జింగ్ కంపెనీ ‘స్టాటిక్’ ఫౌండర్స్ అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోర, ‘ది డిస్పోజల్ కంపెనీ’ ఫౌండర్ భాగ్యశ్రీ జైన్లు చోటు సాధించారు..బాల్యస్నేహితులైన అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరాలు పట్టణ వాయు కాలుష్యం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకునేవారు. కాలుష్య స్థాయిలను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ప్రధానపాత్రపోషించడంపై కూడా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)కి సంబంధించిన మౌలిక చార్జింగ్ సదు΄ాయాలపై దృష్టి పెట్టారు. తమ పొదుపు మొత్తాలను ఉపయోగించి 2019లో ఇంట్లో తొలి ఈవీ చార్జర్‌ను తయారుచేయడంతో ‘స్టాటిక్’ ప్రయాణంప్రారంభమైంది.వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడానికి సమీపంలోని చార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడానికి ‘స్టాటిక్’ యాప్ ఉపయోగపడుతుంది. అగ్రశ్రేçణి ఈవీ చార్జర్లు, అడ్వాన్స్డ్ మొబైల్ అప్లికేషన్లను కూడా ‘స్టాటిక్’ డెవలప్ చేసింది. ఈ స్టార్టప్ కార్పొరేట్ ఆఫీసులు, రెసిడెన్సెస్, హోటల్స్, సినిమా హాలు...మొదలైన వాటికి సంబంధించిన యజమానులతో టై అప్ అయింది. ఈప్రాపర్టీ వోనర్స్ను ‘చార్జర్ హోస్ట్స్’గా వ్యవహరిస్తారు.హరియాణాలోని హిసార్‌లో పుట్టి పెరిగిన అక్షిత్ బన్సాల్ మణి΄ాల్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో 2018లో ‘డెలాయిట్‌లో’ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్నేహితుడు రాఘవ్ అరోర అతడికి వెయ్యి ఏనుగుల బలం అయ్యాడు. ‘వి్ర΄ో’లో డేటా సైంటిస్ట్‌గా పనిచేసిన రాఘవ్ బాల్య స్నేహితుడికి తోడుగా నిలిచాడు. ఇద్దరి కృషి ‘స్టాటిక్’కు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.‘స్టాటిక్’ యూఎస్పీలలో ఒకటి...సింగిల్ రెవెన్యూ మోడల్‌పై మాత్రమే కంపెనీ దృష్టి పెట్టక΄ోవడం. సొంతంగా చార్జర్స్‌ను ఇన్స్టాల్ చేయడంతోపాటు. హెచ్‌పీసీఎల్, షెల్లాంటి పెద్ద కంపెనీల కోసం చార్జర్లను బిల్డ్ చేయడం, ఇన్స్టాల్, మెయింటెయిన్ చేయడం లాంటివి చేస్తోంది స్టాటిక్.వివిధ బ్రాండ్లు ‘ప్లాస్టిక్ న్యూట్రల్’గా మారడానికి తన స్టార్టప్ ‘ది డిస్పోజల్ కంపెనీ’తో సహాయపడుతోంది దిల్లీకి చెందిన భాగ్యశ్రీ జైన్. ఈ స్టార్టప్ ద్వారా ఏడాదికి 750 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేస్తున్నారు. నోయిడా యూనివర్శిటీలో బిబిఏ చేసిన భాగ్యశ్రీ కొన్ని సంవత్సరాలు వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసింది. వివాహానంతరం రాజస్థాన్‌కు మకాం మార్చింది. వేస్ట్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఒక్క రీసైక్లింగ్ యూనిట్ లేదనే విషయం గ్రహించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి పెట్టి ‘ది డిస్పోజల్ కంపెనీ’ అనే రీసైకిలింగ్ కంపెనీ మొదలుపెట్టింది.ఏదైనా బ్రాండ్ తమ కంపెనీలో క్లయింట్‌గా సంతకం చేసిన తరువాత ఆ బ్రాండ్‌కు సంబంధించిన ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్‌ను అంచనా వేయడానికి వన్–టైమ్ వేస్ట్ ఆడిట్ నిర్వహిస్తారు. ‘ది డిస్పోజల్ కంపెనీ’కి దేశవ్యాప్తంగా రీసైక్లర్పాట్నర్స్, రాగ్‌పికర్స్, ఆగ్రిగేటర్స్ ఉన్నారు. 75 లక్షల రూ΄ాయల పెట్టుబడితో ఈ రీసైక్లింగ్ యూనిట్నుప్రారంభించారు. ఎక్సెంచర్, సస్టైనబిలిటీ, యాక్సిలరేటర్ ్ర΄ోగ్రామ్కు ఎంపికైన ఈ స్టార్టప్‌కు 60 లక్షల రూ΄ాయల సీడ్ ఫండ్ లభించింది.పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం చూపుతున్న ప్రభావం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకునే పద్ధతుల గురించి రచనలు, ఉపన్యాసాల రూపంలో ప్రజలకు అవగాహన కలిగిస్తోంది భాగ్యశ్రీ జైన్. -
భూగర్భ గనులను కాపాడాలి
మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జి.లక్ష్మణ్ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, శ్రీరాంపూర్ డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నుంచి కే.సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్రావు, బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, హెచ్ఎమ్మెస్ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి, ఏరియా ఎస్ఓటు జీఎం రఘుకుమార్, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్మెంట్ హనుమాన్‌గౌడ్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం.. సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది. –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్ ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్ మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్ -
యూరప్ తగలబడి పొతుందెందుకని? హరిత గృహ ప్రభావమా! భూతాపమా!
యూరప్ తగలబడి పొతుందెందుకని ? హైదరాబాద్ ఉష్ణ మండల ప్రాంతం లో ఉంది. భూమధ్య రేఖ కు రెండు వేల కిలోమీటర్ ల దూరం . అదే యూరప్ దేశాలు సమ శీతోష్ణ మండలం లో ఉన్నాయి. ఉదాహరణకు పోర్చుగల్ భూమధ్య రేఖ నుంచి 4500 కిలోమీటర్ ల దూరం లో ఉంది . హైదరాబాద్ లో వేసవి లో 42 ,43 డిగ్రీ ల ఉష్ణోగ్రత రికార్డు అవుతుంటుంది . మరి మనం శీతల దేశాలుగా పిలుచుకునే యూరప్ లో వేసవిలో ఎంత ఉష్ణోగ్రత ఉండాలి ? 30?.. పోనీ ఎక్కువంటే 35 కదా ? మొన్న పోర్చుగల్ లో పిహవో అనే చోట రికార్డు అయిన ఉష్ణోగ్రత ఎంతో తెలుసా ? 47 డిగ్రీ లు .! రామగుండం, రెంటచింతల లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉష్ణోగ్రత అరుదుగానే రికార్డు అవుతుంది . ఏదో ఎడారి లో ఉన్నట్టు మంచు దేశాలయిన యురోపియన్ దేశాల్లో ఆ ఉష్ణోగ్రతలు ఏంటి ? రైలు పట్టాలు దెబ్బతింటున్నాయి . రవాణా వ్యవస్థ దెబ్బ తింది. మంటలు! మంటలు! .. అడవులే కాదు. ఊళ్లే తగలబడి పోతున్నాయి . లండన్, కెంట్ , కన్వేల్ల్, తూర్పు లండన్ గ్రామాలు.. ఎక్కడ చూసినా తగలబడి పోతున్న దృశ్యాలు . స్కూళ్లకు సెలవులిచ్చేశారు . అత్యయిక పరిస్థితి విధించారు . ఎండకు, వేడి కి జనాలు చచ్చి పోతున్నారు . ఒక్క స్పెయిన్ పోర్చుగల్ దేశాల్లోనే ఇప్పటిదాకా వెయ్యి మంది మరణించారు . ఎందుకిలా ? హరిత మందిర ప్రభావం .. భూతాపం . ఇదేనా ? ఆలా అనే ఇప్పటికీ అనుకొంటున్నా . ఇదే కారణమైతే తూతూమంత్రపు చర్యలు కాకుండా ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు చేపట్టాలి . హరితమందిర ప్రభావం వల్ల అనేక రకాల అనర్ధాలు జరుగుతాయి . వర్షాలు పడవు . అంటే కరువు . పడితే ఒక రోజులో అతి భారీ కుంభ వృష్టి . అంటే ఒక పక్క వరదలు, మరో పక్క క్షామం . ఏ విధంగా చూసినా బారీనష్టాలు . కొండచరియలు విరిగిపడడం , క్లౌడ్ బరస్ట్ , టైపూన్ , హరికేన్ , ఫ్లాష్ ఫ్లడ్స్ ఇలా అనేక విపత్తులు . మరి గేట్ల తాత మాటేంటి ? రెండేళ్ల నాటి మాట . ‘ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లయ్యింది . దీని వల్ల అనేక అనర్ధాలు . రాబొయ్యేది నాలుగో పారిశ్రామిక యుగం . రోబో లు రాజ్యమేలుతాయి . పారిశ్రామిక వ్యవస్థ సంగతి వేరు . పరిశ్రమల్లో పని చేయడానికి ఎక్కువ మంది కావాలి . కానీ కృత్రిమ మేధ యుగం లో ఇప్పుడున్న దానిలో మూడో వంతు చాలు .. ఇదీ గేట్ల తాత బృందం ఆలోచన . కాబట్టి జనాభా ను ఎలాగైనా లేపేయాలి ‘.. ఇదండీ .. రెండేళ్ల క్రితం నేను విన్నది . మెయిన్ మీడియా లో రాదు . ఇలాంటివి ఒక వర్గం లో బాగా సర్క్యూలేట్ అవుతున్నాయి వామ్మో .. ఇదేంటబ్బా .... మరీ స్కెజో పేర్నియా వ్యాధి గ్రస్తుల్లా, మతి భ్రమణం చెంది ఏదేదో ఊహించుకొని చెప్పేస్తున్నారు అనుకొన్నా. వాక్ సీన్ లు వేసుకోండి అని చెప్పా . తీరుబడి గా చూస్తే వాక్ సీన్ ల వల్ల జరిగిన నష్టం, అంతా ఇంతా కాదు . లక్షల మంది ఆరోగ్యం నాశనం అవుతుంటే వ్యవస్థలన్నీ దొంగ నాటకాలాడడం చూసి చూసి .. అసలు నేను కలకంటున్నానా ? అని ఇప్పటికీ నమ్మలేక నమ్మలేక బతుకుతున్నా. గత కొన్ని రోజులుగా కొంతమంది మిత్రులు కొన్ని లింక్స్ పంపుతున్నారు . పుంఖానుపుంఖాలుగా లింక్స్ . డాకుమెంట్స్ . వీటి సారంశం ఏమిటంటే తాత బృందం కేవలం వాక్సిన్ లను నమ్ముకొంటే లాభం లేదని ఇప్పుడు పర్యావరణం రూట్ పట్టింది .. కేం ట్రైల్స్ .. సూర్యుడ్ని కప్పేయడం .. ఇంకా చాలా చాలా ఉంది లెండి . ‘సర్.. మీరు చెబితే నలుగురికీ తెలుస్తుంది . చెప్పండి . తాత కొత్త ప్లాన్.. అందరికీ తెలియాలి‘ అని మెసెంజర్ ద్వారా కొంత మంది మిత్రులు అడుగుతున్నారు . ‘అయ్యా !.. వాక్సీన్ల విషయం లో నాకు అయ్యింది చాలు . కుక్కపని చేసి తన్నులు తిన్న గాడిద బతుకయ్యింది . కరోనా యుగం ముగిసింది . వాక్సీన్ అయితే... వద్దు అంటే కనీసం నలుగురు వింటారు . తాత నిజంగానే పర్యావరణ విపత్తు సృష్టిస్తే నేను జనాల్ని ఎడ్యుకేట్ చేసినా సముద్రం లో నీటి బొట్టు .. జనాలు తెలుసుకున్నా చేసేది ఏముంటుంది ? ఎక్కడో కూర్చొని ఆయనో పొర లో ఏదో మార్పులు చేస్తే ఇక్కడ మనం చేసేది ఏముంటుంది ? అయినా ఇలాంటి వాటి పట్ల పెద్ద పెద్ద నాయకులు వ్యవస్థలు స్పందించాలి . నేను ఈ బురద లో కాలు పెట్టను‘ అని చెబుతూ వస్తున్నా. మొన్న ఒక పోస్ట్ పెట్టా. యూరప్ లో ఇదిగో ఇలాంటి విపత్తులు వస్తున్నాయి .. దీని వెనుక కారణం హరితమందిర ప్రభావమేనా లేక ఇంకేదైనా ఉందా ? అని. కనీసం జనాల్లో చర్చ మొదలైతే ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుస్తుంది అని నా ఆశ . జనాలకు ఓపిక తక్కువ . కేవలం ఒక లైన్ చదివి నిర్ణయానికి వచ్చే రకం . ఆరోగ్య కరమైన చర్చలకు అవకాశం లేదు . నిందలు.. ఆరోపణలు .. తిట్లు .. ఆవేశాలు .. .. బూతులు .. ఇవీ సోషల్ మీడియా లో రాజకీయ చర్చలు . రాజకీయాలే సర్వం అనుకొనే స్థాయి వారిది . నేను చెప్పింది వేరు . అసలు పర్యావరణ కుట్ర జరుగుతోంది అని కూడా చెప్పలేదు . ఇక్కడ జరిగింది క్లౌడ్ బరస్ట్ అవునా ?కదా? చెప్పలేదు . కానీ చదివే ఓపిక ఎవరికీ ? ప్రపంచ పర్యావరణం మారి పోతోంది . ఎందుకు ?. చర్చ జరగని .. ఇదీ నా పోస్ట్ ల సారం . నా స్టూడెంట్స్ .. పోలీస్ కమిషనర్ , ఇన్కమ్ టాక్స్ కమిషనర్ అయితే వెళ్లి ఒక సారి గ్రీటింగ్ చెప్పలేదు . చెప్పకూడదని కాదు . నా పని నాది . ఎప్పుడైనా సందర్భం వస్తే ఓకే. అంతే కానీ నా పనులు వదిలి పెట్టి వెళ్ళ. నేను .. నా స్కూల్ .. నా పిల్లలు .. క్లాసులు .. జిం .. ఇదే నా ప్రపంచం . ఏదో కరోనా యుగం లో ఫేస్బుక్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం మొదలెట్టా . అది కొనసాగిస్తా . కానీ అక్కినేనికి మిక్కిలినేని తేడా తెలియదా? అని ఏదో సినిమా లో చెప్పినట్టు ఆరోరాల్ రీసెర్చ్ ప్రోగ్రాం కు ఇక్కడ జరిగిందో లేదో తెలియని క్లౌడ్ బరస్ట్ కు తేడా తెలియని జనాలకు జనాలకు చెప్పే ఓపిక/ అవసరం లేదు . వాక్ సీన్ ల గురించి చెప్పాల్సింది అంతా చెప్పేశా . ఇక పర్యావరణ్ కుట్ర నిజమో కాదో .. నేనే డిసైడ్ చేసుకోలేక ఉన్నా. ఇక నేను ఈ విషయం లో చెప్పేది ఏముంది ? ఒక వేళ . చెప్పినా చాలా మందికి అర్థం కాదు . అవన్నీ మీకు అనవసరం కదా .. పోనీలే ! మీరు మీ స్విమ్మింగ్ కొనసాగించండి . మీకు ఏ విధంగా విరోధి కాని / వైరం లేని ఆ మాటకు వస్తే మీ హితం కోరే వ్యక్తి పై ఏదో కాలక్షేపానికో / అహం దెబ్బ తినో బట్ట కాల్చి నెత్తిన వేయకండి . అది ధర్మంకాదు . ధర్మో రక్షతి రక్షితః ! - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
శభాష్ రమ్య.. నీ ప్రాజెక్ట్ అదిరింది!
సాక్షి,వీరఘట్టం(శ్రీకాకుళం): ఎక్కడ చూసినా ప్లాస్టిక్.. ఏది కొన్నా ప్లాస్టిక్. అంతరించిపోదని తెలిసినా, కీడు చేస్తుందని ప్రచారం చేసినా జనం దీన్ని వదలడం లేదు. కారణం సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం. సరి గ్గా ఈ ఆలోచనే వీరఘట్టం కేజీబీవీ విద్యార్థి ప్రాజెక్టును జాతీయ స్థాయికి పంపించింది. ప్లాస్టిక్‌కు బదులు బయో డీగ్రేడబుల్ కప్పులు వాడవచ్చని విద్యార్థి చేసిన ప్రదర్శన ఆమెను దేశ రాజధానికి పంపిస్తోంది. ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ వర్చువల్ ఎగ్జిబిషన్లో వీరఘట్టం కేజీబీవీ టెన్త్ విద్యార్థిని కె.రమ్య ప్రదర్శించిన గడ్డి కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయి సెమినార్‌కు ఎంపికైందని ఎస్ఓ రోజా తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్లో తమ విద్యార్థి పాల్గొంటుందని, ఇది తమకు గర్వకారణమని ఆమె తెలి పారు. ప్రాజెక్టు రూపొందించడంలో సహకరించిన గైడ్ టీచర్లు ఎల్.సునీత, కె.స్నేహలత, జి.సృజనలను అభినందించారు. ఏంటీ ప్రత్యేకత..? జిల్లా నుంచి 223 ప్రాజెక్టులు పోటీ పడితే ఈ ప్రాజెక్టు ఒక్కటే జాతీయ స్థాయి వరకు వెళ్లగలిగింది. కేజీబీవీ విద్యార్థిని రమ్య రూపొందించిన ప్రాజెక్టు పేరు బయో డీగ్రేడబుల్ కప్స్(గడ్డితో తయారు చేసే కప్పులు). ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ప ర్యావరణం కలుషితమవుతోంది. ముఖ్యంగా సిటీల్లో పానీపూరీ బడ్డీల వద్ద వీటి వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ప్లాస్టిక్ కప్పుల బదులు బయోడీగ్రేడబుల్ కప్పులు వాడితే ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చునని రమ్య తన ప్రాజెక్టులో స్పష్టంగా చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కప్పుల తయారీ ఇలా.. విద్యార్థిని చెప్పిన వివరాల ప్రకారం.. ఈ బయోడీగ్రేడబుల్ కప్పులు కాలుష్య రహితం. వీటిని తయారు చేయడం చాలా సులభం. మనకు అందుబాటులో ఉండే ఎండుగడ్డిని కొంత తీసుకుని దాన్ని పౌడర్‌గా చేయాలి. ఈ పౌడర్‌ను తగినంత నీటిలో కలపి ఈ ద్రావణాన్ని ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. ద్రావణాన్ని వేడి చేశాక అందులో తగినంత కార్న్‌ఫ్లోర్, వెనిగర్ వేసి ముద్దగా తయారు చేయాలి. ఈ ముద్దను కప్పులుగా తయారు చేసి ఎండబెడితే బయోడీగ్రేడబుల్ కప్పులు తయారవుతాయి. ఈ కప్పుల్లో వేడి పదార్థాలు తిన్నా ఎలాంటి హాని ఉండదు. ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ఆనందంగా ఉంది నేను రూపొందించిన బయోడీగ్రేడబుల్ కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వ డం ఎంతో ఆనందంగా ఉంది. మా ఎస్ఓ మేడమ్, గైడ్ టీచర్ల సలహాలు, సూచనలతో ఈ ప్రాజెక్టు రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ కప్పులను సులువుగా తయారు చేసుకోవచ్చు. పానీపూరీ బడ్డీల వద్ద, మనం నిత్యం ఇంటిలో వాడే ప్లాస్టిక్ కప్పుల బదులు వీటిని వాడితే పర్యావరణాన్ని కాపాడినవాళ్లమవుతాం. ఢిల్లీలో త్వరలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్ పాల్గొనేందుకు మరింతగా సిద్ధమవుతున్నాను. – కె.రమ్య, పదో తరగతి విద్యార్థిని, కేజీబీవీ, వీరఘట్టం చదవండి: ఇల వైకుంఠపురంలో..! ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు -
కడప స్టీల్‌ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు
వైఎస్సార్ కడప: కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులను ఇచ్చింది. దీంతో 3,591 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. కడప స్టీల్ ప్లాంట్.. ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
అమర్‌రాజాను ప్రత్యేకంగా టార్గెట్ చేశామన్నది అవాస్తవం
-
ఎలన్ మస్క్ కంపెనీకి యూఎస్ గట్టి హెచ్చరిక...!
వాషింగ్టన్: ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంగారక గ్రహం, చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో తహతహలాడుతున్నాడు. అందుకోసం ఇప్పటికే మానవులను ఇతరగ్రహలపైకి రవాణాచేసే అంతరిక్షనౌక స్టార్‌షిప్ ప్రయోగాలను స్పేస్ఎక్స్ కంపెనీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనేక పరాజయాల తరువాత అంతరిక్షనౌక స్టార్‌షిప్.. నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసి గాల్లో చక్కర్లు కొడుతూ హై ఆల్టిట్యూడ్ టెస్ట్‌ను విజయవంతంగా స్పేస్ఎక్స్ సంస్థ పరీక్షించింది. తాజాగా స్టార్‌షిప్‌ను తొలిసారిగా భూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలని స్పేస్ ఎక్స్ ప్రణాళిక చేస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ప్రయోగానికి ఫెడరల్ ఏవియేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నుంచి ఆమోదం రాలేదు. ఎఫ్ఏఏ నుంచి ఆమోదం రాకపోయినా స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ భూ నిర్ణీత కక్ష్యలోకి పంపే ప్రయోగాన్ని కొనసాగిస్తుంది. టెక్సాస్‌లోని బోకా చికా ప్రయోగ స్థలంలో పర్యావరణ సమీక్ష అసంపూర్తిగా ఉందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) స్పేస్ఎక్స్ సంస్థను హెచ్చరించింది. ప్రస్తుతం స్పేస్ఎక్స్ ప్రతిపాదిత రాకెట్ అసెంబ్లీ "ఇంటిగ్రేషన్ టవర్" పై ఏజెన్సీ పర్యావరణ సమీక్ష చేస్తోందని ఎఫ్ఎఎ ప్రతినిధి బుధవారం పేర్కొన్నారు. కాగా కంపెనీ రిస్క్ తీసుకొని టవర్ నిర్మాణం చేపడుతుందనీ ఎఫ్ఏఏ ప్రతినిధి ఆరోపించారు.ఒకవేళ పర్యావరణ సమీక్షలో స్పేస్ఎక్స్ ఫెయిల్ ఐతే స్టార్‌షిప్ రాకెట్ అసెంబ్లీ లాంఛింగ్ టవర్‌ను కూల్చివేయడానికి ఎఫ్ఏఏ ఆదేశాలను ఇవ్వొచ్చును. అంతేకాకుండా ప్రయోగ సమయంలో పర్యారణానికి హాని చేకూరితే కఠిన చర్యలను తీసుకోవడానికి ఎఫ్ఏఏ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మే ఆరో తేదీనా ఎఫ్ఏఏ ప్రతినిధులు చేస్తోన్న పర్యావరణ సమీక్ష స్టార్‌షిప్ ప్రయోగ ప్రక్రియను క్లిష్టతరం చేస్తాయని స్పేస్ఎక్స్ తన లేఖలో పేర్కొంది. కాగా ఈ ప్రయోగానికి పర్యావరణ అనుమతులు తొందరలోనే వస్తాయని స్పేస్ఎక్స్ సంస్థ అధ్యక్షురాలు గ్విన్నే షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతమైతే ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. -
చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి
పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ పొంగులేటి ఖమ్మం: పర్యావరణం అనుమతుల పేరుతో గ్రానైట్ పరిశ్రమలపై ఆంక్షలు విధించడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదు హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న గ్రానైట్ పరిశ్రమలను పర్యావరణ అనుమతుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పార్లమెంట్లో ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం పరిశ్రమలు తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమల ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాధి మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో చిన్నతరహా పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని, పరిశ్రమలు సక్రమంగా నడవడం లేదన్నారు. మేజర్ ఖనిజా లు, మైనింగ్ ప్రాజెక్టుల లీజు ప్రాంతం 5 హెక్టార్లలోపు ఉంటే సుప్రీం కోర్టు పరిధిలో సడలించే అవకాశం ఉందన్నారు. అందువల్ల నిబంధనలు సడలించి గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు. ప్రశ్నలు సంధించిన ఎంపీ మందులు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాల పర్యవేక్షణకు ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఆ వివరాలను వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ పలు ప్రశ్నలను లిఖితపూర్వకంగా సంధిం చారు. దేశంలో నకిలీ మందుల ప్రభావం ఎక్కువ గా ఉండటం వల్ల వాటి తయారీ కేంద్రాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగారు. వాటిని పర్యవేక్షించడానికి ఎన్ని కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయన్నారు. వాటిలో ఎన్నింటికి అనుమతులిచ్చారో వివరించాలని కోరారు. అలాగే పై పరిణామం వల్ల పరిశ్రమల నుంచి ఉత్పత్తి ఏమైనా తగ్గిందా..? తగ్గితే వాటి వివరాలు వెల్లడించాలని అడిగారు. కంపెనీలు దరఖాస్తు చేసుకునే ముందు డ్రగ్ రెగ్యులారిటీ అథారిటీ- వినియోగదారులకు మధ్య ఏమైనా చర్చలు జరుపుతుందా... అని ప్రశ్నించారు. దరఖాస్తులను పరిశీలించి త్వరతగతిన ఆమోదించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరారు. సంబంధిత శాఖామంత్రి జగత్ ప్రకాశ్ అడ్డా సమాధానమిస్తూ 2012లో 480 దరఖాస్తులకు ప్రభుత్వం 253 ఆమోదించిందని, 2013లో 207 దరఖాస్తులకు 73కి ఆమోదం తెలిపిందని, 2014లో 230 దరఖాస్తులకు గాను 198కి అనుమతిచ్చిందని, ప్రస్తుత ఏడాదికి సంబంధించి 17 దరఖాస్తులు రాగా గత ఏడాది పెండింగ్‌లో ఉన్న వాటితో సహా మొత్తం 27 దరఖాస్తులను ఆమోదించిందని తెలిపారు. సెంట్రల్ డ్రగ్స్ అథారిటీ అసోసియేషన్ ద్వారా ఒక వెబ్‌సైట్‌ను నడుపుతున్నామని, అందులో దరఖాస్తు దారులకు పూర్తి సమాచారం లభ్యమవుతుందని వివరించారు. అలాగే మందుల తయారీ పరిశీలకులుగా చాలామంది అనుభవజ్ఞులను ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్స్ అథారిటీలోకి చేర్చుకుందన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలేంటి.? ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కంపెనీల విధి విధానాల గురించి వివరించాలని ఎంపీ పొంగులేటి కోరారు. కంపెనీల విధి విధానాల పర్యవేక్షణలో భాగంగా ఏమైనా రివ్యూలు నిర్వహించడానికి ప్రతిపాదనలు చేశారా..? చేస్తే వాటి వివరాలను వెల్లడించాలని అడిగారు. కంపెనీల పనివిధానం మెరుగుపడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని కోరారు. సంబంధిత శాఖామంత్రి జయంత్ సిన్హా సమాధానమిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం విధివిధానాలను పొందుపరిచిందన్నారు. అందులో సెక్షన్ 20 ఐఆర్డీఏ యాక్ట్ ప్రకారం లైఫ్, జనరల్, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను సంవత్సరాల వారీగా పొందుపరుస్తున్నామన్నారు. అప్రైజల్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్‌పైన, అథారిటీ ఇన్సూరెన్స్, అనాథరిటీ ఇన్సూరెన్స్‌లతోపాటు మార్కెట్ డెవలప్మెంట్ విధివిధానాలు పొందుపరచడం జరిగిందన్నారు. ఐఆర్డీఏ ఆధ్వర్యంలో అవగాహన పెంపొందించి వినియోగదారులను పెంచడానికి వివిధ రకాల విధివిధానాలను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. వాణిజ్య పరంగా ఏయే దేశాలతో సంబంధాలున్నాయి..? వాణిజ్యపరంగా ఏయే దేశాలతో భారతదేశం సత్సంబంధాలను కొనసాగిస్తుందో తెలపాలని ఎంపీ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రాధాన్యత వాణిజ్యాలకు సంబంధించి ఏఏ దేశాలతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారో... ప్రస్తుత సంవత్సరంతోపాటు గత మూడేళ్ల సమాచారం అందించాలని కోరారు. అలాగే ఇజ్రాయల్‌తోపాటు మరే దేశాల్లో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందా..? అలాగే దేశానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే వాటి వివరాలను వెల్లడించాలని, చర్చలు జరిపేటప్పుడు స్థానిక వ్యాపారవేత్తల ప్రమేయం ఎంతవరకు ఉంటుందన్నారు. సంబంధిత శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ గత మూడేళ్లలో భారతదేశంలో ఎలాంటి వ్యాపారాలకు అగ్రిమెంట్లు కాలేదన్నారు. ఏషియన్ దేశాలతో మాత్రం 2014 సెప్టెంబర్ 9న ఒక అగ్రిమెంట్ జరిగిందని, దాన్ని 2015 జూలై 1న అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఇజ్రాయల్‌తో పాటు మరిన్ని దేశాలతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం నిరంతర ప్రక్రియ కాబట్టి దానికి అగ్రిమెంట్ ఉండదన్నారు. అలాగే చర్చలు జరిపే ముందు స్థానిక వ్యాపారవేత్తలను సంప్రదిస్తున్నామన్నారు. ఏదైనా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు ? రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని, దేశ వ్యాప్తంగా వాహనాల ఫిట్నెస్ తనిఖీ కేంద్రాల వివరాలు వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేవనెత్తారు. కొత్తగా వాహనాల ఫిట్నెస్ తనిఖీ కేం ద్రాలకోసం ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయా..? అని ప్రశ్నించారు. ఈ అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి రాధాకృష్ణ సమాధానమిస్తూ ఫిట్నెస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని వివరించారు. అందులో ఆంధ్రప్రదేశ్, బీహార్, చంఢీఘర్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మ హారాష్ట్ర, మిజోరాం ఒ డిస్సా, పంజాబ్, తమిళనాడు, పశ్చిబెంగాల్ రాష్ట్రాల నుంచి సమాధానం వచ్చిందన్నారు. కానీ తెలంగాణ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానమూ రాలేదన్నారు. సెంట్రల్ మానిటరింగ్ వెహికిల్ రూల్62 ప్రకారం ఫిట్నెస్ తనిఖీ కేంద్రాల ద్వారా రహదారుల ఫిట్నెస్ కూడా పరిశీలిస్తామని చెప్పారు.