మేడ మీద వడియాలు పెటుకున్నట్టే, మేడ మీద పంటలు కూడా ఇటీవల ఎక్కువైంది. బెంగళూరుకు చెందిన రేవా జింగాన్ మాలిక్ మాత్రం రోజూ ఉదయం తొమ్మిది గంటలకు మేడ మీదకెళ్లి వంట మొదలుపెడుతుంది. అదే సోలార్ కుకింగ్. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ హితమైన జీవనశైలిలో భాగంగా ఆమె ఈ సోలార్ కుకింగ్‌ని అనుసరిస్తోంది. ఎల్‌పీజీ గ్యాస్ వాడకం వల్ల భూమికి జరిగే హానిని తనవంతుగా నిలువరించగలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. వండడానికి, ఎండబెట్టడానికి అనువుగా ఆమె డిజైన్ చేయించుకున్న సోలార్ ఎక్విప్‌మెంట్ గురించి...
ప్రత్యామ్నాయ జీవనశైలి..
ఎల్‌పీజీ వాడకం ఎక్కువైంది. గడచిన ఐదేళ్లలో మనదేశం దిగుమతులు కూడా ఆ మేరకు పెరిగి΄ోతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.4 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 2022–23 నాటికి 18.3 ఎమ్‌ఎమ్‌టీలకు చేరింది. మన ఉత్పత్తుల శాతం నాలుగుగా ఉంటే వినియోగ శాతం 22కి చేరింది. అందుకే సస్టెయినబుల్ లివింగ్ మాత్రమే అసలైన ప్రత్యామ్నాయం అనుకున్నాను. అదే విషయాన్ని పిల్లలకు, పెద్దలకు బోధిస్తున్నాను. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని ఎదురు చూడరాదు, మనవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి.
కొన్ని దేశాల్లో సూర్యరశ్మి తగినంత ఉండదు, కానీ మనదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. ఇతర ఇంధనాల వలె వాడుకకు అనువుగా చేయడానికి ప్రాసెసింగ్ అవసరం, సోలార్ ఎనర్జీని వాడడానికి మనం ప్రత్యేకంగా శ్రమించాల్సింది ఏమీ లేదు. ఒకసారి సోలార్ కుకర్‌ని కొంటే సంవత్సరాలపాటు వినియోగించుకోవచ్చు. నాలుగేళ్ల కిందట 18వేల రూ΄ాయలకు కొన్నాను. శీతాకాలం, వర్షాకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది. 850 వాట్స్ సోలార్ ఇన్వర్టర్ అమర్చడం ద్వారా ఆ సమస్యనూ పరిష్కరించుకున్నాను.
అన్నం, పప్పు, కూరగాయలకు మూడు అరల సోలార్ కుకర్ డిజైన్ చేయించుకున్నాను. ఉదయం ఎనిమిది గంటలకు బియ్యం, పప్పు కడిగి, నానబెట్టి, కూరగాయలు తరిగి తొమ్మిదింటికి మేడ మీదకు వెళ్లి కుకర్ ఆన్ చేసి వస్తాను. పదకొండు గంటలకల్లా వంట పూర్తవుతుంది. పాలు మరిగించడం నుంచి ప్రతిదీ ఇందులోనే చేస్తున్నాను. పప్పులు, గింజలు, రైజిన్స్, వేయించడం నుంచి ఎండబెట్టి పొడి చేసుకునే పసుపు, ఎండుమిర్చి వరకు అందులోనే చేస్తున్నాను. మంట లేని వంట మాది’’.
ఇవి చదవండి: ప్లాస్టిక్ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment