
ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడిగుడ్లలో బలం ఎక్కువగా ఉంటుందని కొందరిలో ఓ అపోహ ఉంటుంది. కానీ పోషక విలువల విషయంలో నాటు గుడ్లయినా, ఫారం గుడ్లయినా ఒకటే. రెండింటిలోనూ పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు గుడ్లు ఫారం గుడ్ల కంటే కాస్తంత చిన్నగా ఉంటాయి, మరికాస్త ఎక్కువ ముదురురంగుతో కాస్త గోధుమరంగు అనిపించేలా ఉంటాయి. అంతేతప్ప పోషకాలతో పాటు మరింకే విషయంలోనూ తేడా ఉండదు. కాబట్టి అధిక ధర పెట్టి నాటు కోడిగుడ్లు కొనడమన్నది జేబుకు నష్టం తప్ప... ఒంటికి చేకూరేలా మరే లాభమూ ఉండదు.
ఇవి చదవండి: కాటేసిన కార్ఖానా
Comments
Please login to add a commentAdd a comment