Raghav
-
ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...
‘30 అండర్ 30 ఆసియా’ తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ విభాగంలో మన దేశం నుంచి ఈవీ చార్జింగ్ కంపెనీ ‘స్టాటిక్’ ఫౌండర్స్ అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోర, ‘ది డిస్పోజల్ కంపెనీ’ ఫౌండర్ భాగ్యశ్రీ జైన్లు చోటు సాధించారు..బాల్యస్నేహితులైన అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరాలు పట్టణ వాయు కాలుష్యం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకునేవారు. కాలుష్య స్థాయిలను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ప్రధానపాత్రపోషించడంపై కూడా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)కి సంబంధించిన మౌలిక చార్జింగ్ సదు΄ాయాలపై దృష్టి పెట్టారు. తమ పొదుపు మొత్తాలను ఉపయోగించి 2019లో ఇంట్లో తొలి ఈవీ చార్జర్‌ను తయారుచేయడంతో ‘స్టాటిక్’ ప్రయాణంప్రారంభమైంది.వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడానికి సమీపంలోని చార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడానికి ‘స్టాటిక్’ యాప్ ఉపయోగపడుతుంది. అగ్రశ్రేçణి ఈవీ చార్జర్లు, అడ్వాన్స్డ్ మొబైల్ అప్లికేషన్లను కూడా ‘స్టాటిక్’ డెవలప్ చేసింది. ఈ స్టార్టప్ కార్పొరేట్ ఆఫీసులు, రెసిడెన్సెస్, హోటల్స్, సినిమా హాలు...మొదలైన వాటికి సంబంధించిన యజమానులతో టై అప్ అయింది. ఈప్రాపర్టీ వోనర్స్ను ‘చార్జర్ హోస్ట్స్’గా వ్యవహరిస్తారు.హరియాణాలోని హిసార్‌లో పుట్టి పెరిగిన అక్షిత్ బన్సాల్ మణి΄ాల్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో 2018లో ‘డెలాయిట్‌లో’ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్నేహితుడు రాఘవ్ అరోర అతడికి వెయ్యి ఏనుగుల బలం అయ్యాడు. ‘వి్ర΄ో’లో డేటా సైంటిస్ట్‌గా పనిచేసిన రాఘవ్ బాల్య స్నేహితుడికి తోడుగా నిలిచాడు. ఇద్దరి కృషి ‘స్టాటిక్’కు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.‘స్టాటిక్’ యూఎస్పీలలో ఒకటి...సింగిల్ రెవెన్యూ మోడల్‌పై మాత్రమే కంపెనీ దృష్టి పెట్టక΄ోవడం. సొంతంగా చార్జర్స్‌ను ఇన్స్టాల్ చేయడంతోపాటు. హెచ్‌పీసీఎల్, షెల్లాంటి పెద్ద కంపెనీల కోసం చార్జర్లను బిల్డ్ చేయడం, ఇన్స్టాల్, మెయింటెయిన్ చేయడం లాంటివి చేస్తోంది స్టాటిక్.వివిధ బ్రాండ్లు ‘ప్లాస్టిక్ న్యూట్రల్’గా మారడానికి తన స్టార్టప్ ‘ది డిస్పోజల్ కంపెనీ’తో సహాయపడుతోంది దిల్లీకి చెందిన భాగ్యశ్రీ జైన్. ఈ స్టార్టప్ ద్వారా ఏడాదికి 750 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేస్తున్నారు. నోయిడా యూనివర్శిటీలో బిబిఏ చేసిన భాగ్యశ్రీ కొన్ని సంవత్సరాలు వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసింది. వివాహానంతరం రాజస్థాన్‌కు మకాం మార్చింది. వేస్ట్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఒక్క రీసైక్లింగ్ యూనిట్ లేదనే విషయం గ్రహించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి పెట్టి ‘ది డిస్పోజల్ కంపెనీ’ అనే రీసైకిలింగ్ కంపెనీ మొదలుపెట్టింది.ఏదైనా బ్రాండ్ తమ కంపెనీలో క్లయింట్‌గా సంతకం చేసిన తరువాత ఆ బ్రాండ్‌కు సంబంధించిన ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్‌ను అంచనా వేయడానికి వన్–టైమ్ వేస్ట్ ఆడిట్ నిర్వహిస్తారు. ‘ది డిస్పోజల్ కంపెనీ’కి దేశవ్యాప్తంగా రీసైక్లర్పాట్నర్స్, రాగ్‌పికర్స్, ఆగ్రిగేటర్స్ ఉన్నారు. 75 లక్షల రూ΄ాయల పెట్టుబడితో ఈ రీసైక్లింగ్ యూనిట్నుప్రారంభించారు. ఎక్సెంచర్, సస్టైనబిలిటీ, యాక్సిలరేటర్ ్ర΄ోగ్రామ్కు ఎంపికైన ఈ స్టార్టప్‌కు 60 లక్షల రూ΄ాయల సీడ్ ఫండ్ లభించింది.పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం చూపుతున్న ప్రభావం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకునే పద్ధతుల గురించి రచనలు, ఉపన్యాసాల రూపంలో ప్రజలకు అవగాహన కలిగిస్తోంది భాగ్యశ్రీ జైన్. -
యాక్షన్.. థ్రిల్
రజత్ రాఘవ్, ఐశ్వర్యా రాజ్ బకుని జంటగా రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషల్ థ్రిల్లర్ అండ్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘మహర్ యోధ్ 1818’. సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో మొదలైంది. భద్రకాళీ పీఠం పీఠాధీశ్వరి డా. సింధు మాతాజీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీయస్సీ సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘చక్కని కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!
బిగ్ బాస్ ఫేమ్, బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. బాలీవుడ్లో సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది. అయితే షెహనాజ్ గిల్ బిగ్ బాస్- 13లో తన సహ-కంటెస్టెంట్, బాలికా వధు నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఊహించని విధంగా సిద్ధార్థ్ శుక్లా కథ విషాదాంతంగా మారింది. అనుకోని విధంగా సిద్ధార్థ మరణించాడు. ఆ తర్వాత షెహనాజ్ గిల్ మరొకరితో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స వినిపించాయి. మరో నటుడు రాఘవ్ జుయల్‌తో డేటింగ్లో ఉందని బీటౌన్‌లో గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు రాఘవ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా షెహనాజ్‌తో రిలేషన్‌పై నోరు విప్పారు. రాఘవ్ మాట్లాడుతూ..'రాబోయే కొద్ది నెలల్లో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పనులతోనే నేను బిజీగా ఉన్నా. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నా. ఎవరితోను రిలేషన్లో లేను. నాకు ఒకరిని ప్రేమించేందుకు, రిలేషన్లో కొనసాగించేంత టైం కూడా లేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్ మరణం తర్వాత షెహనాజ్ రెండు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'తో రీ ఎంట్రీ ఇచ్చింది. కాగా.. షెహనాజ్, రాఘవ్ జుయల్ ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ పలుసార్లు జంటగా కనిపించారు. దీంతో వీరిపై డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున ఊపందుకున్నాయి. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) -
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు అందజేశారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపాలని ‘ఆప్’ నిర్ణయించడంతో ఎమ్మెల్యే పదవిని రాఘవ్ చద్దా వదులుకున్నారు. ‘ఢిల్లీ విధానసభకు నేను రాజీనామా చేశాను. సభాపతితో సహా సభ్యులందరూ నన్ను ఎంతో ఆదరించారు. పంజాబ్ తరపున రాజ్యభలో బలంగా గళం వినిపిస్తాను. పంజాబ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాన’ని రాఘవ్ చద్దా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ఐదుగురు అభ్యర్థులు రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థులుగా మార్చి 21న ప్రకటించింది. పంజాబ్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నారు. (క్లిక్: పంజాబ్ సీఎం సంచలన ప్రకటన) యంగెస్ట్ ఎంపీ! 33 ఏళ్ల రాఘవ్ చద్దా.. రాజ్యసభలో అతి పిన్న వయస్కుడైన సిట్టింగ్ సభ్యునిగా గుర్తింపు పొందనున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా ఆయన వ్యవహరించారు. వృత్తిరీత్యా చార్టెట్ అకౌంటెంట్ అయిన చద్దా.. ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేటైన చద్దాకు ఆ రాష్ట్రంలో గట్టి పట్టుంది. (క్లిక్: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు) -
సిద్ధూపై ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవసాయ చట్టాల అంశంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. శిరోమణి అకాలీదళ్ చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆప్ కూడా రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విరుచుకు పడ్డారు. దీంతో ఆప్ సిద్ధూపై ఎదురుదాడికి దిగింది. సిద్ధూ రాజకీయాల్లో రాఖీసావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన సిద్ధూని కాంగ్రెస్ హైకమాండ్ మందలించింది. సీఎం అమరీందర్‌ను నిరంతరం దూషిస్తున్న సిద్ధూకి కళ్లెం వేసింది. అందుకే మార్పు కోసం ఆయన కేజ్రివాల్‌ని అంటున్నారు. రేపటి వరకు వేచి చూడండి. సిద్దూ మళ్లీ కెప్టెన్‌పై విరుచు కుపడతారు’’ అని రాఘవ్ ట్వీట్ చేశారు. (చదవండి: Cadbury: 1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..) -
‘నాకు కరెంట్ వద్దు.. ఎమ్మెల్యే కావాలి’ మహిళా ట్వీట్ వైరల్
అమృత్సర్: కొన్ని నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటినుంచే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అయితే ఈసారి అధికారమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో కాంగ్రెస్‌కు గట్టిపోనిచ్చిన ఆప్ ఈసారి అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో అప్పుడే హామీల వర్షం మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రధాన హామీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై ఆప్ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఉచిత విద్యుత్ వద్దు.. నాకు ఎమ్మెల్యే రాఘవ్ కావాలి’ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌ను చూసిన ఆ ఎమ్మెల్యే స్పందించి ‘నేను మేనిఫెస్టోలో లేను’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సంభాషణ ట్విటర్లో వైరల్‌గా మారింది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను చూసిన కృతి ఠాకూర్ స్పందిస్తూ ‘కరెంట్ వద్దు.. రాఘవ్ కావాలి’ అని కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించింది. ఈ కామెంట్‌ను చూసిన రాఘవ్ చద్దా స్పందించారు. ‘మేనిఫెస్టోలో నేను లేను.. ఉచిత విద్యుత్ ఉంది’ అని రిప్లయ్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు ఓటేయండి. 24 గంటలు ఉచిత విద్యుత్ మీకు ఇస్తామని నేను హామీ ఇస్తున్నా. నా విషయంలో మాత్రం హామీ ఇవ్వలేను’ అంటూ రాఘవ్ కామెంట్ చేశారు. వీరి సంభాషణ ట్విటర్లో వైరలయ్యింది. 32 ఏళ్ల రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజేందర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన అతి చిన్న వయస్కుడు. ఆ ట్వీట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నాడు. ‘కేజ్రీవాల్ గ్యారంటీ’ అంటూ చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను రిఫర్ చేశారు. ఢిల్లీ జల్ బోర్డు అధ్యక్షుడిగా కూడా రాఘవ్ కొనసాగుతున్నారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆప్‌కు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఎలాగైనా 55 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఆప్ వ్యూహం రచిస్తోంది. -
48 వేల ఇళ్ల తొలగింపు; నోటీసుల చించివేత
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గల మురికివాడల్లోని ఇళ్లను మూడు నెలల్లోగా తొలగించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఇరు వర్గాలు రెచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా మురికివాడల్లో నివసించే ప్రజలను రోడ్డుపడేసేందుకు కేంద్రం నోటీసులు ఇచ్చిందంటూ ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా ఆరోపించారు. వాళ్ల ఇళ్లు కూల్చివేస్తామంటూ బెదిరింపులకు దిగిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలతో ఉండగా.. పేద ప్రజలకు అన్యాయం జరగనివ్వబోరని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చేతిలో ఉన్న నోటీసులను చించివేశారు.(చదవండి: రుణగ్రహీతలకు ‘సుప్రీం’ ఊరట!) ‘‘మురికివాడల్లోని ప్రజల బాగోగుల కోసం అరవింద్ కేజ్రీవాల్ ఒక కార్యాచరణ రూపొందించారు. తద్వారా ఎవరి ఇళ్లు కూల్చివేయాల్సిన అవసరం ఉండదు. మీ అందరిని నిరాశ్రయులు చేయాలనుకుంటున్న బీజేపీ కుట్రలు ఫలించవు. ఈ విషయంపై ఒకవేళ అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం. వీధుల్లో పోరాటానికి సిద్ధమవుతాం. పునరావాసం, ఇళ్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా ఢిల్లీలో ఒక్క ఇల్లు కూడా కూల్చివేసే ప్రసక్తే లేదు. నోటీసులు ఇవ్వడం అక్రమం, అమానుషం. రాజ్యాంగం పౌరులకు కల్పించిన జీవించే హక్కును కాలరాసేలా ఉన్నాయి’’ అని చద్దా మండిపడ్డారు. ఇక రాఘవ్ చద్ధా వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్.. 48 వేల ఇళ్ల గురించి ఢిల్లీ సర్కారు ఒక్కసారి కూడా కోర్టులో వాదనలు వినిపించలేదని విమర్శించారు. రాజీవ్ రతన్ హౌజింగ్ పథకంలో భాగంగా ఖాళీగా ఉన్న 50 వేల గృహాలకు వీరిని తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు. రాఘవ్ చద్ధా లాంటి వాళ్లు ప్రజల క్షేమం గురించి ఆలోచించకుండా కేవలం వారిని తప్పుదారి పట్టించి, చట్టపరంగా సమస్యల్లో నెట్టివేసేందుకే పనికివస్తారని ఘాటుగా విమర్శించారు. -
ప్రేమను అర్థం చేసుకోవాలి
‘‘రాయలసీమలో జరిగిన ఒక వాస్తవ పరువు హత్య నేపథ్యంలో ‘బంగారి బాలరాజు’ ఉంటుంది. ఈ మధ్య పరువు కోసం తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడడం లేదు. అయితే.. ప్రేమలో ఉండే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి’’ అని రాఘవ్ అన్నారు. ఆయన హీరోగా, కరోణ్య కత్రిన్ హీరోయిన్గా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. రాఘవ్ మాట్లాడుతూ– ‘‘ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణవ్ పరువు హత్య అనేక చర్చలకు దారి తీసింది. ఇలాంటి హత్యలకు సరైన రీతిలో ముగింపు మా సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. ఇటు ప్రేమికులు.. అటు తల్లిదండ్రుల సమస్యలను చర్చించాం. నిర్మాతల్లో ఒకరైన రెడ్డం రాఘవేంద్రరెడ్డి గారి కొడుకుని నేను. రఫీ, కోటేంద్రగార్ల ప్రోత్సాహం మరచిపోలేనిది’’ అన్నారు. -
పరువు హత్యల నేపథ్యంలో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కోటేంద్ర దుద్యాలను దర్శకునిగా పరిచయం చేస్తూ, కె.ఎం.డి.షఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. పరువు హత్యల నేపథ్యంలో ఉంటుంది. ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి. తాజాగా జరిగిన పరువు హత్య ప్రణయ్ విషయంలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన పద్ధతిలో ముగింపు ఎలా ఉండాలో మావంతు ప్రయత్నంగా ఈ సినిమాలో చూపించాం. మంచి ప్రేమ కథ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్ మరువలేనిది’’ అన్నారు. -
పరువు హత్యల నేపథ్యంలో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కేయమ్డీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మా శ్రేయోభిలాషికి చూపించాను. అతను థియేటర్ నుంచి బయటకు రాగానే ఈ సినిమా ఒక నెల ముందు వచ్చి ఉంటే మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య జరిగి ఉండేది కాదేమోనని అనడంతో చాలా సంతోషమేసింది. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ పరువు హత్యను మా దర్శకుడు సినిమాటిక్‌గా చూపించిన విధానం చాలా బాగుంది’’ అన్నారు రఫి. ‘‘ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి రాఘవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి సినిమా అయినా మా అబ్బాయి బాగా నటించాడు’’ అన్నారు రెడ్డం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. -
బాలరాజు త్వరలో వస్తాడు
‘‘బంగారి బాలరాజు’ పాటలన్నీ చాలా బాగున్నాయి. చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు కొత్తవారైనా చక్కని సంగీతం అందించారు ’’ అని నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ సినిమా ట్రైలర్‌ని అంబికా కృష్ణ రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను సురక్ష కంపెనీస్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ పద్మజ మానేపల్లి విడుదల చేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘4 కోట్ల లోపు నిర్మించే ప్రతి చిత్రానికి 10 లక్షల సబ్సిడీతో పాటు పన్ను రాయితీ కూడా ఉంటుంది. అయితే.. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించాలి’’ అన్నారు. కోటేంద్ర దుద్యాల, కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ∙కరోణ్య, రాఘవ్ -
నా కొంగులో నా గుండెలో....
రాఘవ్, కరాణ్య కత్రీన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలు. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వర పరచిన ఈ చిత్రంలోని ‘నా కొంగులో నా గుండెలో....’ అంటూ సాగే పాటను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ‘చెలియా నీ కోసం’ అనే మరో పాటను మంత్రి భూమా అఖిలప్రియ రిలీజ్ చేశారు. హీరో రాఘవ్ మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుగారు మా చిన్న సినిమా పాటని పెద్దమనసుతో రిలీజ్ చేసి, మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందిన చిత్రమిది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. ‘దిల్’రాజుగారు, భూమా అఖిలప్రియగారు, బిజ్జం పార్థసారధిరెడ్డిగారు మా చిత్రంలోని పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి. -
ఈ బ్యానర్లో మరెన్నో చిత్రాలు రావాలి
‘‘బంగారి బాలరాజు’ సినిమాలోని మొదటి పాట నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్లో మరెన్నో చిత్రాలు రావాలి. యూనిట్ మొత్తానికి మంచి పేరు రావాలి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కె.యండి. రఫి, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఆడియోలోని తొలి పాటను కల్యాణ్ రామ్ విడుదల చేశారు. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్‌గారు మా సినిమాకు సపోర్ట్ ఇవ్వడం మా యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. మొదటి పాటను కల్యాణ్ రామ్‌గారు విడుదల చేయగా, మిగిలిన పాటలను వేరే ప్రముఖులతో రిలీజ్ చేయిస్తాం’’ అన్నారు రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి. రాఘవ్, కరోణ్య కత్రిన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి, సంగీతం: చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు. -
వాస్తవ సంఘటనతో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. నంది క్రియేషన్స్ పతాకంపై కె.యండి. రఫి, రెడ్డెం. రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోటేంద్ర మాట్లాడుతూ–‘‘ కర్నూలు జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం కథ రాసుకున్నాను. హైదరాబాద్, కర్నూల్, అహోబిలంలో షూటింగ్ జరిపాం. త్వరలో ఓ స్టార్ హీరో చేత ఆడియో రిలీజ్ చేయిస్తాం. మే చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. చెప్పినట్టుగానే తెరకెక్కించారు. మా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రెడ్డెం రాఘవేంద్ర. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: చక్రవర్తి. -
రాయలసీమ ప్రేమకథ
రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’. రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, ‘దూకుడు’ శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు ప్రధాన పాత్రల్లో కోటేంద్ర దుద్యాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ – ‘‘పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అహోబిలంలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. శాంతాబాయ్ పాటతో ఆకట్టుకున్న హాట్ బాంబ్ రాధికా పాటిల్‌తో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిపాం. మా చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక మరింత గ్లామర్ తీసుకొచ్చారు. ఈ నెలాఖరులో విడుదల చేసే టీజర్‌తో హీరో, హీరోయిన్లను పరిచయం చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘అనుకున్న టైమ్ కంటే త్వరగా పూర్తయింది. ఔట్పుట్ చూశాం. హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత రఫీ. ఈ చిత్రానికి సంగీతం : చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: జి.ఎల్. బాబు. -
ఇలాంటి రోడ్ ఫిల్మ్ తెలుగులో రాలేదు!
‘‘స్వతహాగా నేను రచయితను. దర్శకుడు కావాలనే ఆకాంక్షతో సినిమా పరిశ్రమకు వచ్చాను. తొలి ప్రయత్నంగా ‘విలేజ్‌లో వినాయకుడు’, ఆ తర్వాత ‘కుదిరితే కప్పు కాపీ’ చిత్రాలు నిర్మించాను. ఆ చిత్రాలతో 24 శాఖలపై అవగాహన ఏర్పడింది. అందుకే ‘పాఠశాల’ చిత్రానికి దర్శకత్వం వహించాను’’ అని మహి వి. రాఘవ్ చెప్పారు. కాలేజీ ముగిసిన తర్వాత ఐదుగురు స్నేహితులు.. వారి వారి ఇంటికి తమ స్నేహితులను తీసుకెళ్లినప్పుడు ఎదురయ్యే సంఘటనల సమాహారంతో సాగే ‘పాఠశాల’ ఈ నెల 10న విడుదల కానుంది. మహి మాట్లాడుతూ - ‘‘పాఠశాల అనేది సంస్కృత పదం. పాఠ అంటే పాఠం.. శాల అంటే రహదారి అని అర్థం. తెలుగులో ఇలాంటి రోడ్ ఫిల్మ్ రాలేదు. ఈ చిత్రానికి కథే ప్రత్యేక ఆకర్షణ. తెలుగులో ‘హ్యాపీ డేస్’ తర్వాత స్నేహితుల నేపథ్యంలో వచ్చిన చిత్రం ఇదే. సరికొత్త అనుభూతికి గురిచేసే చిత్రం అవుతుంది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే, మరిన్ని మంచి చిత్రాలు తీయాలనే ప్రోత్సాహం కలుగుతుంది’’ అని చెప్పారు.