పరువు హత్యల నేపథ్యంలో... | bangari balaraju released on october 25 | Sakshi
Sakshi News home page

పరువు హత్యల నేపథ్యంలో...

Published Thu, Oct 4 2018 1:12 AM | Last Updated on Thu, Oct 4 2018 1:12 AM

bangari balaraju released on october 25 - Sakshi

రెడ్డం రాఘవేంద్ర రెడ్డి, కోటేంద్ర దుద్యాల, కేయండీ రఫీ

రాఘవ్, కరోణ్య కత్రిన్‌ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’.  కేయమ్‌డీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మా శ్రేయోభిలాషికి చూపించాను. అతను థియేటర్‌ నుంచి బయటకు రాగానే ఈ సినిమా ఒక నెల ముందు వచ్చి ఉంటే మిర్యాలగూడలో ప్రణయ్‌ పరువు హత్య జరిగి ఉండేది కాదేమోనని అనడంతో చాలా సంతోషమేసింది.

చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ పరువు హత్యను మా దర్శకుడు సినిమాటిక్‌గా చూపించిన విధానం చాలా బాగుంది’’ అన్నారు రఫి. ‘‘ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి రాఘవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి సినిమా అయినా మా అబ్బాయి బాగా నటించాడు’’ అన్నారు రెడ్డం రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement