KMD Rafi
-
పరువు హత్యల నేపథ్యంలో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కేయమ్డీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మా శ్రేయోభిలాషికి చూపించాను. అతను థియేటర్ నుంచి బయటకు రాగానే ఈ సినిమా ఒక నెల ముందు వచ్చి ఉంటే మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య జరిగి ఉండేది కాదేమోనని అనడంతో చాలా సంతోషమేసింది. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ పరువు హత్యను మా దర్శకుడు సినిమాటిక్‌గా చూపించిన విధానం చాలా బాగుంది’’ అన్నారు రఫి. ‘‘ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి రాఘవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి సినిమా అయినా మా అబ్బాయి బాగా నటించాడు’’ అన్నారు రెడ్డం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. -
లవ్ ఈజ్ బ్యాక్
‘రైల్వేట్రాక్’ టెలీ ఫిల్మ్‌తో తొలి చిత్ర ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో చల్లా క్రియేషన్స్ సమర్పణలో కె.ఎం.డి. రఫీ నిర్మిస్తోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’(లవ్ ఈజ్ బ్యాక్’ అన్నది ట్యాగ్ లైన్). తొలి సన్నివేశానికి హీరో నాగ అన్వేష్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శక–నిర్మాత సాగర్ క్లాప్ ఇచ్చారు. ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి స్క్రిప్ట్‌ను దర్శక–నిర్మాతలకు అందించారు. ‘‘రోమియో–జూలియట్, సలీం–అనార్కలి, దేవదాసు–పార్వతి, లైలా–మజ్ను ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచారు. మరి బంగారి–బాలరాజు తమ ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోతారా? లేక ప్రేమను గెలిపించుకుని చరిత్ర సృష్టిస్తారా? అన్నదే చిత్ర కథ’’ అన్నారు దర్శకుడు.