Bangari Balaraju
-
పరువు హత్యల నేపథ్యంలో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కేయమ్డీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మా శ్రేయోభిలాషికి చూపించాను. అతను థియేటర్ నుంచి బయటకు రాగానే ఈ సినిమా ఒక నెల ముందు వచ్చి ఉంటే మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య జరిగి ఉండేది కాదేమోనని అనడంతో చాలా సంతోషమేసింది. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ పరువు హత్యను మా దర్శకుడు సినిమాటిక్‌గా చూపించిన విధానం చాలా బాగుంది’’ అన్నారు రఫి. ‘‘ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి రాఘవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి సినిమా అయినా మా అబ్బాయి బాగా నటించాడు’’ అన్నారు రెడ్డం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. -
బాలరాజు త్వరలో వస్తాడు
‘‘బంగారి బాలరాజు’ పాటలన్నీ చాలా బాగున్నాయి. చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు కొత్తవారైనా చక్కని సంగీతం అందించారు ’’ అని నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ సినిమా ట్రైలర్‌ని అంబికా కృష్ణ రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను సురక్ష కంపెనీస్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ పద్మజ మానేపల్లి విడుదల చేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘4 కోట్ల లోపు నిర్మించే ప్రతి చిత్రానికి 10 లక్షల సబ్సిడీతో పాటు పన్ను రాయితీ కూడా ఉంటుంది. అయితే.. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించాలి’’ అన్నారు. కోటేంద్ర దుద్యాల, కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ∙కరోణ్య, రాఘవ్ -
నా కొంగులో నా గుండెలో....
రాఘవ్, కరాణ్య కత్రీన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలు. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వర పరచిన ఈ చిత్రంలోని ‘నా కొంగులో నా గుండెలో....’ అంటూ సాగే పాటను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ‘చెలియా నీ కోసం’ అనే మరో పాటను మంత్రి భూమా అఖిలప్రియ రిలీజ్ చేశారు. హీరో రాఘవ్ మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుగారు మా చిన్న సినిమా పాటని పెద్దమనసుతో రిలీజ్ చేసి, మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందిన చిత్రమిది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. ‘దిల్’రాజుగారు, భూమా అఖిలప్రియగారు, బిజ్జం పార్థసారధిరెడ్డిగారు మా చిత్రంలోని పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి. -
ఈ బ్యానర్లో మరెన్నో చిత్రాలు రావాలి
‘‘బంగారి బాలరాజు’ సినిమాలోని మొదటి పాట నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్లో మరెన్నో చిత్రాలు రావాలి. యూనిట్ మొత్తానికి మంచి పేరు రావాలి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కె.యండి. రఫి, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఆడియోలోని తొలి పాటను కల్యాణ్ రామ్ విడుదల చేశారు. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్‌గారు మా సినిమాకు సపోర్ట్ ఇవ్వడం మా యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. మొదటి పాటను కల్యాణ్ రామ్‌గారు విడుదల చేయగా, మిగిలిన పాటలను వేరే ప్రముఖులతో రిలీజ్ చేయిస్తాం’’ అన్నారు రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి. రాఘవ్, కరోణ్య కత్రిన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి, సంగీతం: చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు. -
వాస్తవ సంఘటనతో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. నంది క్రియేషన్స్ పతాకంపై కె.యండి. రఫి, రెడ్డెం. రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోటేంద్ర మాట్లాడుతూ–‘‘ కర్నూలు జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం కథ రాసుకున్నాను. హైదరాబాద్, కర్నూల్, అహోబిలంలో షూటింగ్ జరిపాం. త్వరలో ఓ స్టార్ హీరో చేత ఆడియో రిలీజ్ చేయిస్తాం. మే చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. చెప్పినట్టుగానే తెరకెక్కించారు. మా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రెడ్డెం రాఘవేంద్ర. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: చక్రవర్తి. -
సైరా దర్శకుడి చేతుల మీదుగా..!
నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఎం.డి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా ‘బంగారి బాలరాజు’ చిత్రం తో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర గ్లిట్టర్ ను ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... బంగారి బాలరాజు టీజర్ చూసాను. చాలా బాగుంది. కొత్తగా వస్తున్న ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ రఫి గారికి, రాఘవేంద్రరెడ్డి గారికి డైరెక్టర్ కోటేంద్రకి, హీరో రాఘవ్ కు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అంటూ చిత్రయూనిట్‌కి అల్ ద బెస్ట్ చెప్పారు. చిత్ర నిర్మాతలు కె.ఎం.డి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ... సురేందర్ రెడ్డి గారి లాంటి ప్రముఖ దర్శకులు చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఆయన సైరా మూవీ లో బిజీ గా ఉన్నా మాకు టైమ్ కేటాయించి టీజర్ ని విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు. డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మా బంగారి బాలరాజు మూవీ గ్లిట్టర్ ని పెద్ద మనసుతో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలాంటి కొత్త దర్శకులకు సురేందర్ రెడ్డి గారు ఆదర్శంగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్ ని ఫిబ్రవరి 14 న, సినిమాని మార్చి లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము’ అని తెలిపారు. -
రాయలసీమ ప్రేమకథ
రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’. రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, ‘దూకుడు’ శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు ప్రధాన పాత్రల్లో కోటేంద్ర దుద్యాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ – ‘‘పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అహోబిలంలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. శాంతాబాయ్ పాటతో ఆకట్టుకున్న హాట్ బాంబ్ రాధికా పాటిల్‌తో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిపాం. మా చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక మరింత గ్లామర్ తీసుకొచ్చారు. ఈ నెలాఖరులో విడుదల చేసే టీజర్‌తో హీరో, హీరోయిన్లను పరిచయం చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘అనుకున్న టైమ్ కంటే త్వరగా పూర్తయింది. ఔట్పుట్ చూశాం. హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత రఫీ. ఈ చిత్రానికి సంగీతం : చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: జి.ఎల్. బాబు. -
లవ్ ఈజ్ బ్యాక్
‘రైల్వేట్రాక్’ టెలీ ఫిల్మ్‌తో తొలి చిత్ర ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో చల్లా క్రియేషన్స్ సమర్పణలో కె.ఎం.డి. రఫీ నిర్మిస్తోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’(లవ్ ఈజ్ బ్యాక్’ అన్నది ట్యాగ్ లైన్). తొలి సన్నివేశానికి హీరో నాగ అన్వేష్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శక–నిర్మాత సాగర్ క్లాప్ ఇచ్చారు. ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి స్క్రిప్ట్‌ను దర్శక–నిర్మాతలకు అందించారు. ‘‘రోమియో–జూలియట్, సలీం–అనార్కలి, దేవదాసు–పార్వతి, లైలా–మజ్ను ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచారు. మరి బంగారి–బాలరాజు తమ ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోతారా? లేక ప్రేమను గెలిపించుకుని చరిత్ర సృష్టిస్తారా? అన్నదే చిత్ర కథ’’ అన్నారు దర్శకుడు.