నా కొంగులో నా గుండెలో.... | Bhuma Akhila Priya & Dil Raju launch Bangari Balaraju songs | Sakshi
Sakshi News home page

నా కొంగులో నా గుండెలో....

Published Sat, May 26 2018 5:30 AM | Last Updated on Sat, May 26 2018 5:30 AM

Bhuma Akhila Priya & Dil Raju launch Bangari Balaraju songs - Sakshi

రాఘవ్, ‘దిల్‌’ రాజు

రాఘవ్, కరాణ్య కత్రీన్‌ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలు. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వర పరచిన ఈ చిత్రంలోని ‘నా కొంగులో నా గుండెలో....’ అంటూ సాగే పాటను నిర్మాత ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. ‘చెలియా నీ కోసం’ అనే మరో పాటను మంత్రి భూమా అఖిలప్రియ రిలీజ్‌ చేశారు.

హీరో రాఘవ్‌ మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్‌ సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌ ‘దిల్‌’ రాజుగారు మా చిన్న సినిమా పాటని పెద్దమనసుతో రిలీజ్‌ చేసి, మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందిన చిత్రమిది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. ‘దిల్‌’రాజుగారు, భూమా అఖిలప్రియగారు, బిజ్జం పార్థసారధిరెడ్డిగారు మా చిత్రంలోని పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement