వాస్తవ సంఘటనతో... | Bangari Balaraju movie shooting complete Archives | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనతో...

Published Mon, Apr 23 2018 12:35 AM | Last Updated on Mon, Apr 23 2018 12:35 AM

Bangari Balaraju movie shooting complete Archives - Sakshi

రాఘవ్, కరోణ్య కత్రిన్‌

రాఘవ్, కరోణ్య కత్రిన్‌ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. నంది క్రియేషన్స్‌ పతాకంపై కె.యండి. రఫి, రెడ్డెం. రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోటేంద్ర మాట్లాడుతూ–‘‘ కర్నూలు జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం కథ రాసుకున్నాను. హైదరాబాద్, కర్నూల్, అహోబిలంలో షూటింగ్‌ జరిపాం.

త్వరలో ఓ స్టార్‌ హీరో చేత ఆడియో రిలీజ్‌ చేయిస్తాం. మే చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. చెప్పినట్టుగానే తెరకెక్కించారు. మా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రెడ్డెం రాఘవేంద్ర. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: చక్రవర్తి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement