న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవసాయ చట్టాల అంశంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. శిరోమణి అకాలీదళ్ చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆప్ కూడా రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విరుచుకు పడ్డారు. దీంతో ఆప్ సిద్ధూపై ఎదురుదాడికి దిగింది.
సిద్ధూ రాజకీయాల్లో రాఖీసావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన సిద్ధూని కాంగ్రెస్ హైకమాండ్ మందలించింది. సీఎం అమరీందర్‌ను నిరంతరం దూషిస్తున్న సిద్ధూకి కళ్లెం వేసింది. అందుకే మార్పు కోసం ఆయన కేజ్రివాల్‌ని అంటున్నారు. రేపటి వరకు వేచి చూడండి. సిద్దూ మళ్లీ కెప్టెన్‌పై విరుచు కుపడతారు’’ అని రాఘవ్ ట్వీట్ చేశారు.
(చదవండి: Cadbury: 1990లలో తీసిన క్యాడ్‌బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..)
Comments
Please login to add a commentAdd a comment