చంఢీగడ్: పంజాబ్ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 23న పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్ రావత్ సహా పలువురు ప్రముఖలకు ఆయన ఆహ్వానం పంపారు. ఇదిలా ఉంటే, సీఎం అమరీందర్‌పై సిద్దూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, అంతవరకు సిద్దును సీఎం కలిసే అవకాశమే లేదని ప్రభుత్వ మీడియా సలహాదారుడు రవీన్ తుక్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిద్దూ కోసం అమరీందర్ సింగ్ ఎలాంటి సమయాన్ని కేటాయించలేదనినాయన అన్నారు. మరోవైపు సిద్దూ ఇవాళ 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అమృత్‌సర్‌లోని తన నివాసంలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి స్వర్ణ దేవాలయంతో పాటు పలు ఆథ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment