పాత్రలు కడిగి, షూస్‌ శుభ్రం చేసిన మాజీ డిప్యూటీ సీఎం.. కారణం ఇదే | Ex Deputy Cm Sukhbir Badal To Wash Dishes, Clean Shoes | Sakshi
Sakshi News home page

పాత్రలు కడిగి, షూస్‌ శుభ్రం చేసిన మాజీ డిప్యూటీ సీఎం.. కారణం ఇదే

Published Tue, Dec 3 2024 4:53 PM | Last Updated on Tue, Dec 3 2024 5:28 PM

Ex Deputy Cm Sukhbir Badal To Wash Dishes, Clean Shoes

అమృత్‌సర్‌ : సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్‌ తఖ్త్‌ విధించిన శిక్షను పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పాటిస్తున్నారు.

అకాల్‌ తఖ్త్‌ విధించిన శిక్షలో భాగంగా మంగళవారం అమృత్‌సర్‌లో గోల్డెన్‌ టెంపుల్‌లో సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ నీలిరంగు ‘సేవాదర్’ దుస్తులు ధరించారు. కాలికి గాయం కావడంతో కాలికి గాయం కావడంతో వీల్ చైర్‌లో కూర్చొని పాత్రల్ని కడిగారు. షూస్‌ను శుభ్రం చేశారు.  

అకాల్ తఖ్త్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌తో పాటు శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నేతలకు సైతం ఈ శిక్షను అనుభవిస్తున్నారు. సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌తో పాటు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియా సైతం పాత్రల్ని కడిగారు. ఈ శిక్షను అనుభవించే సమయంలో అకాలీదళ్‌ నేతల మెడలో వారు ఏ తప్పులు చేశారు. అందుకు గాను అకాల్‌ తఖ్త్‌ ఏ శిక్షలు విధించిందో తెలిపేలా ఓ పలకను కూడా ఉంచింది. 

అధికారంలో ఉండగా అనేక తప్పిదాలు
పంజాబ్‌లో బీజేపీతో దశాబ్ద కాలంగా పొత్తు పెట్టుకున్న సమయంలో శిరోమణి అకాలీదళ్ అనేక మతపరమైన తప్పిదాలకు కారణమని అకాల్ తఖ్త్ పేర్కొంది. ఆ సమయంలో సుఖ్ బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనలకు పాల్పడ్డారని ఈ ఏడాది ఆగస్ట్‌లో  అకాల్ తఖ్త్ తేల్చింది.

 డేరా బాబాకు మద్దతుగా నిలిచారని 
సుఖ్ బీర్ సింగ్ బాదల్ పలు నేరాలకు పాల్పడిన డేరా బాబాకు మద్దతుగా నిలిచారని తెలిపింది. చేసిన తప్పులకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ శిక్ష విధించింది. శిక్షలో భాగంగా స్వర్ణ మందిర్ సహా పలు గురుద్వారాల్లో సేవాదార్లుగా పని చేయాలంటూ శిక్ష ఖరారు చేసింది. సేవాదార్లుగా మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తుడవాలని ఆదేశించింది. అయితే,వారు చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పినా అకాల్ తఖ్త్ అంగీకరించలేదు. దీంతో అకాత్‌ తఖ్త్‌ విధించిన శిక్షలో భాగంగా సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్‌గా పనిచేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement