sukhbir singh badal
-
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ రాజీనామా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి, పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘శిరోమణి అకాలీదళ్ అధక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నేడు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారని, పార్టీకి కొత్త అధ్యక్షుడిని అందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తనకు మద్దతు, సహాకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్బీర్ సింగ్ బాదల్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుం. కాగా అకాలీదళ్ అధ్యక్ష పదవి, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గానికి డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. -
పంజాబ్ సీఎంపై సంచలన ఆరోపణలు... ఆయన ఫుల్‌గా తాగింది నిజమేనా?
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జర్మనీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన ఢిల్లీలోని ఆప్ జాతీయ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా...సమయానికి పర్యటన ముగించుకుని రాలేకపోయారు. అంతేకాదు ఆయన అనారోగ్యంతో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం అయ్యిందని సీఎం కార్యాలయం కూడా వెల్లడించింది. ఐతే సీఎం భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నందునే ఆలస్యమైందని, ఆయన్ను ఫ్లైట్ నుంచి దించేశారంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అందువల్లే ఆయన ఢిల్లీకి రావడం ఆలస్యమైందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆప్‌ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు భగవంత్ మాన్ సహా ప్రయాణికుడు ఆయన ఫుల్ తాగి ఉండటం వల్ల లుఫ్తానా ఎయిర్ పోర్టులో భగవంత్ మాన్‌ను విమానం నుంచి దించేశారని, పైగా ఆయన నడవలేకపోవడంతో భార్య, భద్రతా సిబ్బంది సాయం కూడా తీసుకున్నారని ట్విట్టర్లో పేర్కోన్నాడు. ఈ పోస్ట్‌ని కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తూ ఆప్‌ని ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. ఈ క్రమంలో అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ భగవంత్ మాన్‌పై విమర్శలతో విరుచుకుపడ్డాడు. భగవంత్ మాన్ తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేసిందన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంపై జోక్యం చేసుకుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అంతేగాదు జర్మనీ దేశాన్ని ఈ విషయమై విచారించాలంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఐతే ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్‌సింగ్ కాంగ్ మాట్లాడుతూ....సీఎం సెప్టెంబర్ 19న షెడ్యూల్ ప్రకారం తిరిగి వచ్చారు. మాన్ తన విదేశీ పర్యటనలతో విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారన్న అక్కసుతో ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతగా కావలనుకుంటే లుఫ్తాన్స్ ఎయిర్‌లైన్స్‌లో తనిఖీ చేసుకోండి అని సవాలు విసిరారు. A Big Shame!! Punjab Chief Minister Bhagwant Mann deplaned because he was heavily Drunk pic.twitter.com/7PaPSiVDtb — Delhi Congress (@INCDelhi) September 19, 2022 (చదవండి: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో సిట్) -
పంజాబ్‌లో ఆప్ సంచలనం.. 5 సార్లు సీఎంగా చేసిన నేతకూ తప్పని ఓటమి
చంఢీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. స్థానాలు ఉన్న పంజాబ్‌లో జాతీయ పార్టీలను వెనక్కి నెట్టిన ఆప్ విజయం వైపు దూసుకెళ్లింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది. భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్ అవతరించింది. అయితే ఆప్ చేతిలో రాష్ట్రంలోని హేమాహేమీలు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల చేతులో ఘోర ఓటమిని చవిచూశారు. ఈ జాబితాలోకి మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా చేరారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు. చదవండి: హోలీ ముందుగానే వచ్చింది, 2024లోనూ ఇదే రిపీట్ అవుద్ది: మోదీ అదే విధంగా మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, కురు వృద్ధుడు అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక వయస్సున్న వ్యక్తిగా నిలిచారు. ఇక ప్రకాష్ సింగ్ బాదల్ తన 65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా అయిదు సార్లు సేవలు అందించారు. 1969 నుంచి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. ఇలా ఎంతోమంది ప్రముఖులను ఆప్ అభ్యర్థులు మట్టి కరిపించారు. చదవండి: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు ప్రకాష్ సింగ్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ దాదాపు 30,000 తేడాతో ఆప్ అభ్యర్థి జగ్దీప్ కాంబోజ్ చేతిలో జలాలాబాద్ అసెంబ్లీలో ఓడిపోయాడు. పంజాబ్ ఆర్థిక మంత్రి, సుఖ్బీర్ బాదల్ బంధువు అయిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి బటిండా అర్బన్ సీటులో ఆప్‌కి చెందిన జగ్రూప్ సింగ్ గిల్ చేతిలో ఓడిపోయారు. కాగా బాదల్ కుటుంబమే కాదు, బాదల్ కుటుంబానికి చెందిన చాలా మంది బంధువులు కూడా ఆప్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. చదవండి: ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే.. సుఖ్బీర్ బాదల్ బావమరిది అయిన బిక్రమ్ సింగ్ మజిథియా, అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓడిపోయారు. అయితే, బిక్రమ్ సింగ్ భార్య గనీవ్ కౌర్ తన భర్త సొంతగడ్డ అయిన మజితా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పోటీ చేసేందుకు మజితియా తన స్థానాన్ని వదిలిపెట్టారు. అయితే సిద్ధూ, బిక్రమ్ సింగ్ మజితియాను ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. ప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు ఆదైష్ పర్తాప్ సింగ్ కైరోన్ తర్న్ తరణ్ జిల్లాలోని పట్టి అసెంబ్లీ స్థానంలో ఆప్‌కి చెందిన లల్జిత్ సింగ్ భుల్లర్ చేతిలో ఓడిపోయారు. మిస్టర్ కైరాన్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పర్తాప్ సింగ్ కైరాన్ మనవడు. -
వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం!
వందేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైప శిరోమణి అకాలీదళ్ తర్వాత శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (గురుద్వారాల పాలనా వ్యవహారాలు చూసే సంస్థ) అవసరాల నిమిత్తం రాజకీయ పార్టీగా అవతరించింది. గత ఏడాది డిసెంబర్ 14న 101 వార్షికోత్సవాన్ని జరుపుకొన్న ఈ పార్టీ ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో అత్యంత కఠిన పరిస్థితులకు ఎదురీదుతోంది. సిక్కుల పార్టీగా దశాబ్దాలు హవా చలాయించిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కి ఈ పరిస్థితి రావడానికి 2007 నుంచి 2017 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. అధికారం కోల్పోయి ఐదేళ్లవుతున్నా.. ఆ కాలంలో పడిన ముద్రను తొలగించుకోవడానికి ఇప్పటికీ ఎస్ఏడీ గింజుకుంటూనే ఉంది. మరోవైపు పంజాబ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల పాటు అకాలీదళ్– కాంగ్రెస్‌ల మధ్యే ద్విముఖ పోరు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం. బీజేపీ-అమరీందర్ కూటమి, రైతు సంఘాలతో కూడిన సంయుక్త సమాజ్ మోర్చాలతో ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. అకాలీదళ్ స్వయం కృతాపరాధానికి కారణాలేమిటి, వాటి నుంచి బయటపడటానికి ఎస్ఏడీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రస్తుత పార్టీ పరిస్థితిపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం.. ముందు నుంచే దిద్దుబాటు చర్యలు ► జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్... ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ పోయారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు చోటిచ్చారు. ► మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం రగిలిపోతుండటాన్ని గ్రహించిన సుఖ్బీర్ బీజేపీతో రెండు దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకొని... ఎన్డీయే నుంచి బయటికి వచ్చేశారు. ► భారత్‌లో మరే రాష్ట్రంలో లేనంతగా... పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుఖ్బీర్ 2021 జూన్‌లోనే బీఎస్పీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 నియోజకవర్గాలను కేటాయించారు. 2007లో 4.17 ఓట్ల శాతాన్ని, 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 ఓట్ల శాతాన్ని సాధించిన బీఎస్పీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి దారుణంగా దెబ్బతింది. 1.59 శాతం ఓట్లు మాత్రమే పొందింది. ► అకాలీదళ్ అధికారంలోకి వస్తే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, ఇందులో ఒకటి బీఎస్పీకి కేటాయిస్తామని సుఖ్బీర్ ప్రకటించారు. దళిత ఓట్లను సాధ్యమైనంతగా ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎంను బీఎస్పీకి ఆఫర్ చేశారు. ఎన్నెన్నో కారణాలు... ► ఏఎస్డీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయింది. ► ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ► పంజాబ్ డ్రగ్స్ వాడకానికి భారత్‌లో కేంద్ర స్థానంగా మారిపోయింది. ‘ఉడ్తా పంజాబ్ (నిషాలో తేలిపోయే పంజాబ్)’గా పేరు స్థిరపడిపోయే స్థాయిలో ఇక్కడి యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ► 2015 ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం.. ఎయిమ్స్, మరో స్వచ్చంద సంస్థతో కలిపి నిర్వహించిన సర్వేలో పంజాబ్‌లో 2.32 లక్షల మంది డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలయ్యారని తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో (మైనారిటీ తీరిన వారిలో) 1.2 శాతం మంది డ్రగ్స్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న వారి సంఖ్య 8.6 లక్షలుగా ఉందని తేలింది. ► 2015లో అక్టోబరులో సిక్కుల పవిత్రగ్రంధం... గురు గ్రంధ్ సాహిబ్‌ను కొందరు దుండగులు అపవిత్రం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సిక్కులపైకి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన శిరోమణి అకాలీదళ్‌పై ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా పెంచేసింది. ► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎస్డీ కేవలం 15 స్థానాలు మాత్రమే సాధించి... అవమానకరంగా మూడోస్థానానికి పడిపోయింది. సిక్కుల ఆత్మగౌరవ నినాదం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్నా... పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారపర్వంలో చురుకుగా పాల్గొనడం లేదు. ఇక ఆమె పంజాబ్‌పై దృష్టి సారించడంపై అకాలీదళ్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. పైగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెచ్చిన సమయంలో శిరోమణి అకాలీదళ్ నరేంద్ర మోదీ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పదేపదే లేవనెత్తుతూ ఎస్ఏడీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. రైతుల్లో ఆగ్రహం తగ్గి అకాలీదళ్‌ను పూర్వస్థాయిలో ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రకాశ్‌సింగ్ బాదల్ హయాంలో అయితే రైతుల్లో అనేక మంది తరతరాలుగా అకాలీదళ్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ నేటితరం ఆలోచన మారుతోంది. రాజకీయాల్లో వారు కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఫలితంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే సుఖ్బీర్ తండ్రిపై రైతుల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచుకోవాలనే ఉద్దేశంతో 94 ఏళ్ల వయసులో ఆయన్ను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తున్నారు. గతంలో ఐదుసార్లు పంజాబ్ సీఎంగా వ్యవహరించిన ప్రకాశ్ సింగ్ బాదల్ భారత్‌లో అత్యధిక వయసులో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గడం, కొత్త ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నామనే అంశాన్ని గ్రహించిన సుఖ్బీర్ సిక్కుల ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు. బెంగాల్‌ను బెంగాలీలే పాలించుకుంటారని, బయటివారు ఇక్కడ అక్కర్లేదంటూ ప్రచారం చేసి బీజేపీని మట్టికరిపించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందిన సుఖ్బీర్ ఇప్పుడు అకాలీదళ్‌కు ఏకైక పంజాబీ ప్రాంతీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అకాలీదళ్ ప్రస్తుతం ఎదురీదుతోంది. పంజాబ్‌లో ఈనెల 20 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కెడ (అకాలీదళ్ ఎన్నికల గుర్తు కూడా) ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.! -
సిద్దూపై సుఖ్బీర్ బావ పోటీ
చండీగఢ్: పంజాబ్‌లో ఎన్నికల రంగం రసకందాయంలో పడుతోంది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాళీదళ్ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడి తూర్పు అమృత్సర్ నియోజకవర్గంలో సిద్దూపై సీనియర్ నేత, తన బావ విక్రమ్‌సింగ్ మజీతియా పోటీ చేయనున్నట్టు అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రకటించారు. బుధవారం ఆయన అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడారు. తూర్పు అమృత్సర్ నియోజకవర్గంలో మజీతియా రంగంలోకి దిగడంతో సిద్దూ తన డిపాజిట్ కోల్పోక తప్పదని వ్యాఖ్యానించారు. అలాగే పంజాబ్ మాజీ సీఎం, తన తండ్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ (94 ఏళ్లు) లంబి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అకాళీదళ్, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 సీట్లు ఉండగా.. అకాళీదళ్ 97 చోట్ల, బీఎస్పీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కోర్టు కేసుల మధ్య.. సిద్దూపై పోటీకి దిగుతున్న విక్రమ్‌సింగ్ మజీతియాపై గత నెలలోనే డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల కింద పంజాబ్–హరియాణా హైకోర్టు మజీతియాకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా మూడు రోజుల పాటు పోలీసులు అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించింది. ఈ కేసులో ఆయన ఎప్పుడైనా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దూపై పోటీకి దిగుతుండటం ఆసక్తిగా మారింది. -
పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..
వచ్చే నెలలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు ఈసారి సేఫ్‌గేమ్ ఆడుతున్నారు. అన్ని పార్టీల్లోని పెద్ద నేతలంతా ఒకరిపై ఒకరు పోటీ చేయొద్దన్న ధోరణితో బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సహా అనేకమంది బాదల్ కుటుంబంపై పోటీ చేసేందుకు ముందుకు వచ్చి చేతులు కాల్చుకోవడంతో ఈసారి మాత్రం ఒకరిపై ఒకరు పోటీచేసేందుకు వెనక్కి తగ్గారు. మిగతా కొందరి ప్రముఖుల స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు ఎక్కడి నుంచి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పాత సీటు అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సిద్ధూ మజీఠా సీటులో బిక్రమ్ మజీఠియాపై లేదా పాటియాలా స్థానంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పోటీ చేస్తారని ముందుగా ఊహించారు. బిక్రమ్ మజీఠియా: మజీఠా సిట్టింగ్ ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్ యువనేత అయిన బిక్రమ్ మజీఠియాకు పోటీగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు పెద్ద నేతలను నిలబెట్టలేదు. ఇక్కడ నుంచి ఆప్ తరఫున లాలీ మజీఠియా, కాంగ్రెస్ నుంచి జగ్గా మజీఠియాలు బరిలో ఉన్నారు. చరణ్‌జిత్ చన్నీ: చమ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి సీఎం చరణ్‌జిత్ చన్నీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసేలా చర్చలు జరిగినా, పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. చదవండి: (Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్) కెప్టెన్ అమరీందర్ సింగ్: కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నుం చి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన తన సొంత జిల్లా పాటియాలాను వదిలి వేరే దగ్గర పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే కెప్టెన్ అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూపై పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. సుఖ్బీర్ బాదల్: అకాలీదళ్–బీఎస్పీ కూటమి సీఎం అభ్యర్థి అయిన సుఖ్బీర్ బాదల్ ఈసారి కూడా జలాలాబాద్ నుంచి పోరాడుతున్నారు. ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 2017 ఎన్నికల్లో సుఖ్బీర్ బాదల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. భగవంత్ మాన్: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ధురి నుంచి ఆధిక్యం సాధించారు. అందుకే ఆయనకు ఎలాంటి ఆటంకం రాకుండా పార్టీ అధిష్టానం సేఫ్ సీటు ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దల్బీర్ గోల్డీ, అకాలీదళ్ నుంచి ప్రకాశ్ చంద్ గార్గ్‌లను ఆ రెండు పార్టీలు రంగంలోకి దింపాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్
తండ్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ నుంచి వచ్చిన వారసత్వం, సిక్కుల నుంచి సంప్రదాయంగా వచ్చే మద్దతు, పంజాబ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను చదివిన ఎంబీఏకి సార్థకత వచ్చేలా పారిశ్రామికంగా చేసిన అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు.. ఇవన్నీ సుఖ్బీర్ సింగ్ బాదల్ని కీలక నేతని చేశాయి. కానీ గత ఎన్నికల్లో ఘోరపరాజయం, శిరోమణి అకాలీదళ్ నుంచి వలసలు, పార్టీ నేతలపై డ్రగ్స్ కేసులు వంటివన్నీ ఆయనపై భారాన్ని పెంచుతున్నాయి. ఆత్మరక్షణలో పడాల్సిన అంశాలనే ఎన్నికల్లో అస్త్రాలుగా మార్చుకునే వ్యూహాలు రచించడంలో దిట్టయిన బాదల్‌కి ఈసారి పంజాబ్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ►ప్రకాశ్‌సింగ్ బాదల్, సురీందర్ కౌర్ బాదల్ దంపతులకు జూలై 9, 1962లో జన్మించారు. ►చండీగఢ్ యూనివర్సిటీలో డిగ్రీ, అమెరికా లాస్‌ఏంజెలిస్‌లో ఎంబీఏ చేశారు. ►హర్సిమ్రత్ కౌర్‌ని పెళ్లాడారు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ►1996లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో కూడా పార్లమెంటుకు ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ►2001 నుంచి 2004 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ► 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఫరీద్‌కోట నుంచి ఎన్నికయ్యారు. ► 2008 జనవరిలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడయ్యారు ►పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా 2009–2017 వరకు సేవలందించారు ► ఎంబీఏ చదవడంతో రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి కోసం కృషి చేశారు. ► 2019లో పంజాబ్ ఫిరోజ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు ►కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఆ పార్టీతో పొత్తుని తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బాదల్ భార్య హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసి తన నిరసన తెలిపారు. ►ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతున్న శిరోమణి అకాలీదళ్‌లో చాలా మంది సిక్కు నేతలు, సుఖ్బీర్ సింగ్ బాదల్‌కి అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడి బీజేపీలో చేరడం కలవరపెడుతోంది. ►అకాలీదళ్‌లో సీనియర్ నేత మంజీదర్ సింగ్ సిర్సా బీజేపీలో చేరడంతో బాదల్‌పై మరింత భారం పడినట్టయింది. పార్టీని వీడుతున్న నాయకుల్ని కాపాడుకోలేకపోతున్నారన్న విమర్శలు బాదల్‌పై ఎక్కువయ్యాయి. ►సిక్కులకు పరమ పవిత్రమైన గురుద్వారాలు లక్ష్యంగా జరుగుతున్న దాడులు, సిక్కుల మత గ్రంథాలను కించపరిచే ఘటనలే ఈసారి ఎన్నికల అంశాలుగా లేవనెత్తుతున్నారు. . ►అకాలీదళ్‌లో పలువురు నేతలపై మాదకద్రవ్యాల కేసులు నమోదయ్యాయి. వారిలో బాదల్ బావమరిది విక్రమ్ మజితాయ్ కూడా ఉన్నారు. కేసులు నమోదైనప్పుడు ఆత్మరక్షణలో పడినప్పటికీ ఎన్నికల సమయంలో బాదల్ వాటినే అస్త్రాలుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే తమపై కేసులు పెడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ►గత ఎన్నికల్లో కేవలం 15 స్థానాలతో మూడో స్థానంలో నిలిచిన పార్టీని ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు గట్టెక్కిస్తారనేది బాదల్ నాయకత్వ సమర్థతకి అగ్నిపరీక్ష. ► 94 ఏళ్ల వయసులో కూడా ప్రకాశ్‌సింగ్ బాదల్ కుమారుడికి అండగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండడంతో కలిసొచ్చే అంశం. – నేషనల్ డెస్క్, సాక్షి -
ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేలా వివిధ ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రాంతీయ పక్షాలన్నీ కలిసి బలీయమైన నేషనల్ ఫ్రంట్‌గా ఏర్పడుతాయని విశ్వాసముందన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాబోదన్నారు. తాము ఏర్పాటు చేయబోయే నేషనల్ ఫ్రంటే బీజేపీని ఎదుర్కొంటుందని తెలిపారు. బీజేపీతో తమ పార్టీ మైత్రీ బంధం కథ ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. మాయావతికి చెందిన బహుజన సమాజ్ పార్టీతో తమ పొత్తు శాశ్వతమన్నారు. రైతులకు సంబంధించిన అంశాలే తమ పార్టీ మేనిఫెస్టోలో కీలకమని, ఈ విషయంలో రాజీకి తావులేదన్నారు. అందుకే, వ్యవసాయ చట్టాలపై కేంద్రం తీరుకు నిరసనగా దశాబ్దాల నాటి బీజేపీ మైత్రీ బంధాన్ని సైతం తెంచుకుని, ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్‌లో అమలు కానీయ బోమన్నారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బాదల్ భార్య హర్సిమ్రత్ కౌర్ సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
భారీ ఎత్తున నిరసనలు.. సీఎం నివాసం ముట్టడి
చండీగఢ్/సిస్వాన్: పంజాబ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శిరోమణి అకాళీదళ్ నేతలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసాన్ని మంగళవారం ముట్టడించారు. ఆరోగ్య మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకురావడంతో సీఎం ఇంటి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తుపానును ఆపలేరు ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ మాట్లాడుతూ... ‘‘తన బలగాన్నంతా ఉపయోగించినప్పటికీ.. ఇప్పుడు చెలరేగిన తుపానును కెప్టెన్ ఆపలేరు. వ్యాక్సినేషన్లో కుంభకోణం.. ఫతే కిట్ కిట్‌లో స్కాం.. ఎస్సీ స్కాలర్షిప్ విషయంలోనూ ఇదే తంతు... రైతుల నుంచి భూసేకరణ అంశంలోనూ ఇదే రకమైన వైఖరి’’ అంటూ అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.కాగా పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతన నిధుల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోమవారం సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆప్ ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమా నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సామాజిక సంక్షేమ మంత్రి సధూ సింగ్ ధరమ్‌సోత్‌ను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. తక్షణమే ఉపకార వేతన బకాయి నిధులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అణగారినవర్గాలకు అందాల్సిన స్కాలర్‌షిప్‌నకు సంబంధించిన 64 కోట్ల నిధులు దారి మళ్లాయంటూ గతేడాది అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన ఆదేశించారు. చదవండి: ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ -
నేను ఆయనలా దేశ ద్రోహిని కాదు: సీఎం
చంఢీఘడ్ : శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బిర్ సింగ్ బాదల్ తనపై చేసిన వ్యాఖ్యలను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రైతుల ఉద్యమం విషయంలో తనను ఓ ఉత్త బఫూన్ అనటమే కాకుండా తన కుటుంబంపై ఉన్న ఈడీ కేసులను ప్రస్తావించటంపై మండిపడ్డారు. శనివారం బాదల్‌పై తిరుగు దాడి చేశారు. ‘‘ నేను బాదల్ లాగా వెన్నెముక లేని వాడిని, దేశ ద్రోహిని కాను. రైతులకు వారు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. (బీజేపీతో స్నేహం.. మరోసారి సీఎం అవుతా) మీరు, మీ శిరోమణి అకాలీ దళ్ అధికార దాహంతో కళ్లు మూసుకుపోయి పాకిస్తాన్‌నుంచి మన రాష్ట్ర భద్రతకు పొంచి ఉన్న ముప్పును పట్టించుకోవటం లేదు. పంజాబ్ సరిహద్దుల వెంట భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, డ్రోన్లతో ఎలాంటి ప్రమాదం లేదని అంటారా?. నేను అకస్మాత్తుగా వణికిపోవటానికి నాపై ఎలాంటి ఈడీ కేసులు లేవు’’ అని అన్నారు. -
‘కేజ్రీవాల్.. మొసలి కన్నీళ్లు కార్చొద్దు‘
చండీఘర్: శిరోమణి అకాలీదల్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆప్ సర్కారుపై తీవ్ర స్థాయిలోమండిపడ్డారు. రైతు సమస్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. రైతుల నడ్డి విరిచేలా కేంద్రం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినా, రైతుల పక్షాన నిలవకుండా కేజ్రీవాల్ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వ చట్టాలను ఢిల్లీ అమలు చేస్తుండటం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసిన విషయాన్ని బాదల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. (చదవండి: గ్యాస్ ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు.) మొసలి కూడా కేజ్రీవాల్‌ను చూసి చాలా నేర్చుకోవాలని, మొసలి కన్నీళ్లు సామెతకు పేరు మార్చి ‘కేజ్రీవాల్ కన్నీళ్లు’ అంటే సరిగ్గా ఉంటుందని బాదల్ ఎద్దేవా చేశారు. రైతులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్న ఢిల్లీ సర్కారు తీరుతో కేజ్రీవాల్ మనస్తత్వం, ఆప్ వైఖరి ఏంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను తాము అమలు చేయబోమని చెప్పిన కేజ్రీవాల్ వాటికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేశారని బాదల్ ప్రశ్నించారు. ఆయనకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే ఆ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన మిత్రపక్షం
చండీగఢ్: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ అత్యవసర సమావేశం అనంతరం పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించడంతోపాటుగా, జమ్మూకశ్మీర్‌లో పంజాబీని రెండో అధికారి భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రైతుల ఆకాంక్షలను గౌరవించడంలో కేంద్రం విఫలమైనందునే..బీజేపీతో తమ పార్టీ చిరకాల మైత్రికి ఫుల్స్టాప్ పెట్టాల్సివచ్చిందన్నారు. -
భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయేలో కీలక మిత్రపక్షంగా ఉన్న శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్‌కౌర్ బాదల్ కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుల (వ్యవసాయ)కు వ్యతిరేకంగా రాజీనామా సమర్పిస్తున్నట్లు బాదల్ ప్రకటించారు. అంతకుముందు పార్లమెంట్లో ప్రసంగించిన ఆమె భర్త అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సైతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ కోర్ కమిటీలో చర్చించి ఎన్డీయేలో కొనసాగాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బాదల్ అనుహ్య నిర్ణయంపై జాతీయ రాజకీయాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా అంశాన్ని రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు విశ్లేషిస్తున్నాయి. గతకొంత కాలంగా బీజేపీ, శిరోమణీ అకాలీదళ్ (ఎస్ఏడీ) భేదాభిప్రాయాలు వస్తున్నాయని, అవి తాజాగా తారాస్థాయికి చేరాయని అభిప్రాయపడుతున్నారు. (బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!) వారి అంచనా ప్రకారం.. మరో 18 నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-ఎస్ఏడీ మధ్య సీట్ల పంపకాలపై ఇదివరకే చర్చలు ప్రారంభం అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను బీజేపీ 23, ఎస్ఏడీ 94 స్థానాల్లో బరిలోకి దిగాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే బాదల్ నాయకత్వంపై బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఆయనతో పొత్తు కారణంగానే బీజేపీకి తీవ్ర నష్టం జరిగిందని, తమకున్న సాంప్రదాయ ఓటు బ్యాంకును సైతం కోల్పోవల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. (కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా) ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో 50-50 ఫార్మాలాను బీజేపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. 50శాతం సీట్లు ఇస్తేనే పొత్తు కుదురుతుందని ఇదివరకే తేల్చిచెప్పారు. స్థానిక బీజేపీ నేతల తీరు అకాలీదళ్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇక వివాదాస్పద చట్టాలైనా సీఏఏ, ఎన్ఆర్సీపై కూడా సుఖ్బీర్ సింగ్ బాదల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ వేదికగా నిరసన స్వరం వినిపించారు. తాజా బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ నేతలకు విప్‌సైతం జారీచేశారు. అనంతరం ఓ అడుగు ముందుకేసి ఆ పార్టీ నుంచి చోటుదక్కించుకున్న ఏకైక కేంద్రమంత్రి, సుఖ్బీర్ సింగ్ భార్య హర్సిమ్రత్ కౌర్ బాదల్ చేత రాజీనామా చేయించారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండటం తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో, బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎస్ఏడీకి నెలకొన్నది. ఎన్డీఏలో ఎస్ఏడీ కొనసాగేది, లేదని త్వరలో నిర్ణయిస్తామని సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. అయితే ఇదంతా సుఖ్బీర్ సింగ్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతుల మెప్పు కోసమే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాము ఇక ఎన్డీయే కూటమిలో సాగేదిలేదని అకాలీదళ్ నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. కాగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన శిరోమణీ అకాలీదళ్ బీజేపీకి తొలినుంచీ మిత్రపక్షంగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఎన్డీయేతో ఇక కొనసాగలేం : అకాలీదళ్ చీఫ్
సాక్షి, ఢిల్లీ : రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదని ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. పార్టీ కోర్ కమిటీ దీనిపై సమీక్ష జరిపి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన శిరోమణి అకాలీదళ్.. బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయరంగ బిల్లులపై విపక్షాల నుంచే కాక మిత్రపక్షాల నుంచి కూడా వ్యతిరేక వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు, ఆ బిల్లులను ఎస్ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు. (హర్సిమ్రత్ కౌర్ రాజీనామా ఆమోదం) 'హర్సిమ్రత్ కౌర్ రాజీనామా ఓ జిమ్మిక్కు' గత రెండు నెలలుగా ఈ బిల్లులపై చర్చించినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం భాదాకరమన్నారు. రైతుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వ ధోరణి ఉందంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదని అయితే దీనిపై పార్టీ కోర్ కమిటీతో చర్చించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామన్నారు. రైతుల కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.ప్రతిపక్ష పార్టీలు సైతం కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. కాంగ్రెస్, డీఎంకె తదితర సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేవరకు బిల్లులను నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ అకాలీదళ్ చర్యలపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఇప్పటికీ బీజేపీతోనే భాగస్వామిగా ఉందని, హర్సిమ్రత్ కౌర్ రాజీనామా సైతం ఓ బూటకమేనన్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!) -
సీఎం హత్య కేసు: మరణశిక్షను రద్దు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బల్వంత్ సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ.. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. 1995, ఆగస్టు 31న పంజాబ్ సెక్రటేరియట్లో అప్పటి ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో బియాంత్‌సింగ్‌తో పాటు మరో 17 మంది మరణించారు. ఈ కేసులో బల్వంత్ సింగ్ దోషిగా తేల్చితూ 2007లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఆయనకు విధించిన శిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనిపై అమిత్ షా ఏవిధంగా స్పందించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
ఎన్డీఏ పక్షాల ఐక్యతకు పిలుపు..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి విపక్షాలకు దీటుగా వ్యవహరించాలని శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పిలుపు ఇచ్చారు. బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం బాదల్ మీడియాతో మాట్లాడుతూ పాలక పార్టీకి తమ పార్టీ శాశ్వత మిత్రపక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ, అకాలీ దళ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి విపక్షాలపై పోరాడాల్సిన అవసరం ఉందని బాదల్ వ్యాఖ్యానించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా మిత్రపక్షాలతో పాటు పలువురు సెలబ్రిటీలు, ఆయా రంగాల్లో దిగ్గజాలను కలుస్తూ నాలుగేళ్ల మోదీ హయాంలో సాధించిన విజయాలను వివరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా బుధవారం ముంబయిలో శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా థాక్రేను షా కోరారు. ఇరువురు నేతల మధ్య సమావేశం ఫలవంతమైందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రభుత్వంపై విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న క్రమంలో బీజేపీ అగ్రనేతల వైఖరిలో మార్పునకు ఈ భేటీలు సంకేతమని భావిస్తున్నారు. -
ఈ సిద్ధూ ఉన్నాడే..
సాక్షి, చండీగర్ : కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూపై పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ విరుచుకుపడ్డారు. సిక్కుల స్మారకచిహ్నాలను అవమానించిన సిద్ధూను ఆయన కోతితో పోల్చారు. సిద్ధూ కోతి మాదిరిగా వ్యవహరిస్తూ తాము నిర్మించిన సిక్కు మెమోరియల్స్‌ను తెల్ల ఏనుగులని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. సిక్కు చరిత్రకు చిహ్నమైన విరాసత్ ఈ ఖల్సా తెల్ల ఏనుగని ఆయన భావిస్తున్నారా అంటూ అకాలీదళ్ నేత ప్రశ్నించారు. సిక్కుల చరిత్రకు, మత, సంస్కృతికీ ప్రతీకైన విరాసత్ ఈ ఖల్సాపై సిద్ధూ ప్రకటన ఆమోదయోగ్యం కాదన్నారు. దీన్ని వాణిజ్య సంస్థగా తీర్చిదిద్దేందుకు పాలక కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి బాదల్ ఇటీవల దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిక్కు వ్యతిరేక అల్లర్లను రాజీవ్ స్వయంగా పర్యవేక్షించారని ఆరోపించారు. -
నో డౌట్.. అధికారం మాదే!!
గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు మళ్లీ తమదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ సరళీ అధికార పార్టీలకు అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నాయి. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో మరోసారి బీజేపీదే అధికారమని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు. అటు పంజాబ్‌లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అధికార శిరోమణి అకాలీ దళ్ కూడా మరోసారి తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసింది. పంజాబ్‌లో తాము మరోసారి గెలిచితీరుతామని అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్‌ది డ్రామా అని, ఆయనకు డిపాజిట్ కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ఆప్ మూడోస్థానానికి పరిమితమవుతుందని బాదల్ జోస్యం చెప్పారు. మరోవైపు పంజాబ్, గోవాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
‘చంద్రమండలంపై ఉద్యోగాలిస్తామంటారేమో’
చండీగఢ్: పంజాబ్ శిరోమణి అకాళీదల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది. ఆ పార్టీ మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని ప్రజలను హెచ్చరించింది. తమకు మరోసారి అధికారం ఇస్తే అమెరికా, కెనడాల్లో ఉన్న పంజాబీలకు, అక్కడికి వెళ్లి స్థిరపడాలనుకునేవారికి అక్కడే పొలాలు కొని ఇస్తామంటూ ఉప ముఖ్యమంత్రి సుఖబీర్ సింగ్ బాదల్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం జలాలాబాద్‌లో నిర్వహించిన సభలో ఆప్ ప్రచారక కమిటీ చైర్మెన్ భగవత్ మాన్.. ‘సుఖబీర్ ఈసారి అమెరికా ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ యువతకు చంద్ర మండలంపై ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. తన అవినీతి సొమ్ముతో వలసదారుల పేరు మీద అమెరికా, కెనడాల్లో వ్యవసాయ భూములు ఆయన కొంటారు కూడా. ఇలాంటి అర్థంలేని హామీలను పంజాబ్ ప్రజలు నమ్మరు’ అన్నారు. పేదలు, ఎన్నారైల భూములు లాక్కున్నవారు (పంజాబ్ ప్రభుత్వం) తిరిగి వలసదారులకు సహాయం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుఖబీర్ గురించి తెలిసిన వారందరికీ ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని అర్థమవుతుందన్నారు. బాదల్ కుటుంబం విదేశాల్లో పెద్ద మొత్తంలో భూములు కొన్నట్లు ఆయన ఆరోపించారు. -
'ఉడ్తా పంజాబ్‌లో ఆ మాటలకు షాక్ అయ్యా..'
పంజాబ్: ఉడ్తా పంజాబ్ చిత్రంపై తొలిసారి ప్రభుత్వం తరుపున స్పందించారు. ఈ చిత్రంలో కొన్ని మాటలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. కొన్ని కులాలను, వ్యవస్థలను తప్పుబట్టేలా ఎన్నో మాటలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కంజర్, బంజర్ లాంటి పదాలు విని తాను షాక్ అయ్యానని చెప్పారు. ఈ చిత్రానికి అనుమతిని ఇచ్చి ప్రశాంతంగా ఉన్న పంజాబ్ వాతావరణాన్ని ఎలా చెడగొట్టమని అంటారని ప్రశ్నించారు. కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా చాలా సినిమాలు వస్తుంటాయని, అలాంటి చిత్రాల్లో ఇదొకటి అని, దీనిని అనుమతిస్తే పంజాబ్‌లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్థానంలో ఉన్న, రాజకీయాల్లో ఉన్నా, ఒక అధికారిగా ఉన్నా లేక మరింకేదైన స్థాయిలో ఉన్నా సరే.. ఒక ఏవగింపు కలిగించేలా, ఒకరిని కించపరిచేలా రూపొందించిన ఒక అంశాన్ని ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పంజాబ్ సమాజంలోకి ఎలా వదలమని పెట్టమంటారు అని ప్రశ్నించారు. ఈ చిత్రంపై తమకు ఏవిధమైన రాజకీయ కక్ష సాధింపు లేదని అన్నారు. -
'ఆయనకు భారతరత్న ఇవ్వాలి'
చండీఘడ్: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌కు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడిగా ఉన్న బాదల్.. భగత్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలనీ కోరుతూ త్వరలో తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు భగత్‌సింగ్‌ను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కాగా భగత్ సింగ్ పూర్వికుల గ్రామమైన కట్కార్‌కలన్ జలంధార్ - చండీఘడ్ హైవే సమీపంలో ఉంది. అమరవీరుడు భగత్ సింగ్ నడియాడిన ఈ గ్రామంలో ఆయన తాత నివాసం భగత్‌సింగ్ స్మారక చిహ్నం, మ్యూజియంగా మారింది. -
సొంతంగా కమాండో యూనిట్ ఏర్పాటు
- పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం - సరిహద్దులో భద్రత పెంచాల్సిందిగా కేంద్రానికి వినతి చండీగఢ్: సరిహద్దులో అవసరమైన మేరకు భద్రతా దళాలను మోహరించకపోవటం వల్లే ఉగ్రవాదులు పంజాబ్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు భద్రతకు సొంతంగా కమాండో యూనిట్ ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. జమ్ముకశ్మీర్ లాగే పంజాబ్ సరిహద్దులోనూ భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆదివారం సాయంత్రం విలేకరులకు ఈ విషయాలు చెప్పారు. 'ఇటీవలి వరుస దాడులతో పంజాబ్ సరిహద్దులోనూ పటిష్ఠభద్రత అవసరమని భావిస్తున్నాం. ఆ మేరకు పఠాన్ కోట్ లో స్వాట్ బలగాల శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కమాండో యూనిట్ ఏర్పాటు చేస్తాం. ఈ బలగాలు రెండో రక్షణ పంక్తి(సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్)గా ఉపయోగపడుతుంది' అని సుఖ్బీర్ పేర్కొన్నారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడులు, భారత భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు జవాన్లుకాగా, ఐదుగురు ముష్కరులు. ఎయిర్ బేస్ లో నక్కిఉన్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. -
'ఐఎస్ఐతో కాంగ్రెస్ పార్టీకి లింకులు'!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ సంస్థగా వ్యవహరిస్తున్నదని, ఆ పార్టీకి పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి, అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఆ పార్టీకి ధ్వజమెత్తారు. '1980లలో పంజాబ్‌లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. దాదాపు 15 ఏళ్లు మిలిటెన్సీ ప్రబలి తీవ్ర అశాంతి, అలజడి చెలరేగింది. వందలమంది పంజాబీలు చనిపోయారు. మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ అల్లకల్లోలం అయింది' అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 'ఈ అలజడి ఎలా ప్రారంభమైందో అందరికీ తెలిసిందే. అకాలీ దళ్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని శక్తులను ప్రోత్సహించింది. ఆ శక్తులు అదుపుతప్పి పంజాబ్‌లో 15 ఏళ్ల పాటు అశాంతిని సృష్టించాయి. దేశ సమగ్రతకు భంగం వాటిల్లింది. పంజాబ్‌లో ఆనాటి అశాంతి వాతావరణాన్ని మరోసారి సృష్టించడానికి ఈ రోజు రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది' అని ఆయన ఆరోపించారు. ఐఎస్ఐతో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిందని, ఆ పార్టీ ప్రస్తుతం తన అసలు రంగు బయటపెడుతూ.. దేశద్రోహ సంస్థగా వ్యవహరిస్తుందని సుఖ్బీర్ తీవ్రంగా ధ్వజమెత్తారు.