చంఢీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్‌ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. స్థానాలు ఉన్న పంజాబ్‌లో జాతీయ పార్టీలను వెనక్కి నెట్టిన ఆప్ విజయం వైపు దూసుకెళ్లింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది. భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్ అవతరించింది. అయితే ఆప్ చేతిలో రాష్ట్రంలోని హేమాహేమీలు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.
ఇప్పటికే పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల చేతులో ఘోర ఓటమిని చవిచూశారు. ఈ జాబితాలోకి మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా చేరారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు.
చదవండి: హోలీ ముందుగానే వచ్చింది, 2024లోనూ ఇదే రిపీట్ అవుద్ది: మోదీ
అదే విధంగా మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, కురు వృద్ధుడు అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక వయస్సున్న వ్యక్తిగా నిలిచారు. ఇక ప్రకాష్ సింగ్ బాదల్ తన 65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా అయిదు సార్లు సేవలు అందించారు. 1969 నుంచి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. ఇలా ఎంతోమంది ప్రముఖులను ఆప్ అభ్యర్థులు మట్టి కరిపించారు.
చదవండి: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు
ప్రకాష్ సింగ్ కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ దాదాపు 30,000 తేడాతో ఆప్ అభ్యర్థి జగ్‌దీప్ కాంబోజ్ చేతిలో జలాలాబాద్ అసెంబ్లీలో ఓడిపోయాడు. పంజాబ్ ఆర్థిక మంత్రి, సుఖ్‌బీర్ బాదల్ బంధువు అయిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి బటిండా అర్బన్ సీటులో ఆప్‌కి చెందిన జగ్రూప్ సింగ్ గిల్ చేతిలో ఓడిపోయారు. కాగా బాదల్ కుటుంబమే కాదు, బాదల్ కుటుంబానికి చెందిన చాలా మంది బంధువులు కూడా ఆప్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
చదవండి: ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే..
సుఖ్‌బీర్ బాదల్ బావమరిది అయిన బిక్రమ్ సింగ్ మజిథియా, అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓడిపోయారు. అయితే, బిక్రమ్ సింగ్ భార్య గనీవ్ కౌర్ తన భర్త సొంతగడ్డ అయిన మజితా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పోటీ చేసేందుకు మజితియా తన స్థానాన్ని వదిలిపెట్టారు. అయితే సిద్ధూ, బిక్రమ్ సింగ్ మజితియాను ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. ప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు ఆదైష్ పర్తాప్ సింగ్ కైరోన్ తర్న్ తరణ్ జిల్లాలోని పట్టి అసెంబ్లీ స్థానంలో ఆప్‌కి చెందిన లల్జిత్ సింగ్ భుల్లర్ చేతిలో ఓడిపోయారు. మిస్టర్ కైరాన్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పర్తాప్ సింగ్ కైరాన్ మనవడు.
Comments
Please login to add a commentAdd a comment