Prakash Singh Badal
-
ప్రకాష్ సింగ్ బాదల్ కు కన్నీటి వీడుకోలు
-
బాదల్‌కు నేతల ఘన నివాళి
చండీగఢ్: పంజాబ్ రాజకీయ కురు వృద్ధుడు, ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కడసారి చూసేందుకు పార్టీలు, ప్రాంతాలకతీతంగా వందలాది మంది నేతలు, స్థానికులు చండీగఢ్‌కు తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద ఘన నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచిన తమ అభిమాననేతను చివరిసారి చూసేందుకు చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం బాదల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ప్రకాష్ సింగ్ బాదల్‌కు అస్వస్థత.. అమిత్ షా ఆరా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్(95) అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. బాదల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశ్ సింగ్ బాదల్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబసభ్యులు ఆయనను మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బాదల్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలిసిన వెంటనే అమిత్ షా.. ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నాకు చాలా బాధ కలిగిస్తోంది. ప్రకాశ్ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి నేను సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నా” అని షా ట్వీట్ చేశారు. Concerned to know that the veteran leader Shri Parkash Singh Badal Ji is unwell and admitted to hospital. Had a telephone discussion about his health with Shri Sukhbir Singh Badal Ji. I pray to God for his speedy recovery. — Amit Shah (@AmitShah) April 21, 2023 ఇదిలా ఉండగా.. గతేడాది కూడా ప్రకాష్ సింగ్ బాదల్ శ్వాస నాళాల ఆస్తమా కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఇక, 2022లో కోవిడ్ బారినపడ్డారు. అనంతరం, కరోనా నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, ప్రకాష్ సింగ్ బాదల్.. ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక, -
పంజాబ్‌లో ఆప్ సంచలనం.. 5 సార్లు సీఎంగా చేసిన నేతకూ తప్పని ఓటమి
చంఢీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. స్థానాలు ఉన్న పంజాబ్‌లో జాతీయ పార్టీలను వెనక్కి నెట్టిన ఆప్ విజయం వైపు దూసుకెళ్లింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది. భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్ అవతరించింది. అయితే ఆప్ చేతిలో రాష్ట్రంలోని హేమాహేమీలు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల చేతులో ఘోర ఓటమిని చవిచూశారు. ఈ జాబితాలోకి మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా చేరారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు. చదవండి: హోలీ ముందుగానే వచ్చింది, 2024లోనూ ఇదే రిపీట్ అవుద్ది: మోదీ అదే విధంగా మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, కురు వృద్ధుడు అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక వయస్సున్న వ్యక్తిగా నిలిచారు. ఇక ప్రకాష్ సింగ్ బాదల్ తన 65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా అయిదు సార్లు సేవలు అందించారు. 1969 నుంచి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. ఇలా ఎంతోమంది ప్రముఖులను ఆప్ అభ్యర్థులు మట్టి కరిపించారు. చదవండి: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు ప్రకాష్ సింగ్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ దాదాపు 30,000 తేడాతో ఆప్ అభ్యర్థి జగ్దీప్ కాంబోజ్ చేతిలో జలాలాబాద్ అసెంబ్లీలో ఓడిపోయాడు. పంజాబ్ ఆర్థిక మంత్రి, సుఖ్బీర్ బాదల్ బంధువు అయిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి బటిండా అర్బన్ సీటులో ఆప్‌కి చెందిన జగ్రూప్ సింగ్ గిల్ చేతిలో ఓడిపోయారు. కాగా బాదల్ కుటుంబమే కాదు, బాదల్ కుటుంబానికి చెందిన చాలా మంది బంధువులు కూడా ఆప్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. చదవండి: ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే.. సుఖ్బీర్ బాదల్ బావమరిది అయిన బిక్రమ్ సింగ్ మజిథియా, అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓడిపోయారు. అయితే, బిక్రమ్ సింగ్ భార్య గనీవ్ కౌర్ తన భర్త సొంతగడ్డ అయిన మజితా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పోటీ చేసేందుకు మజితియా తన స్థానాన్ని వదిలిపెట్టారు. అయితే సిద్ధూ, బిక్రమ్ సింగ్ మజితియాను ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. ప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు ఆదైష్ పర్తాప్ సింగ్ కైరోన్ తర్న్ తరణ్ జిల్లాలోని పట్టి అసెంబ్లీ స్థానంలో ఆప్‌కి చెందిన లల్జిత్ సింగ్ భుల్లర్ చేతిలో ఓడిపోయారు. మిస్టర్ కైరాన్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పర్తాప్ సింగ్ కైరాన్ మనవడు. -
మొహాలీ ఆసుపత్రికి ప్రకాశ్‌సింగ్ బాదల్
చండీగఢ్: అనారోగ్యంతో బాధపడుతున్న శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్(94)ను ముక్తసర్ జిల్లా నుంచి మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రకాశ్‌సింగ్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ గత నెలలో కరోనా వైరస్ బారినపడ్డారు. లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. -
Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్
తండ్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ నుంచి వచ్చిన వారసత్వం, సిక్కుల నుంచి సంప్రదాయంగా వచ్చే మద్దతు, పంజాబ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను చదివిన ఎంబీఏకి సార్థకత వచ్చేలా పారిశ్రామికంగా చేసిన అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు.. ఇవన్నీ సుఖ్బీర్ సింగ్ బాదల్ని కీలక నేతని చేశాయి. కానీ గత ఎన్నికల్లో ఘోరపరాజయం, శిరోమణి అకాలీదళ్ నుంచి వలసలు, పార్టీ నేతలపై డ్రగ్స్ కేసులు వంటివన్నీ ఆయనపై భారాన్ని పెంచుతున్నాయి. ఆత్మరక్షణలో పడాల్సిన అంశాలనే ఎన్నికల్లో అస్త్రాలుగా మార్చుకునే వ్యూహాలు రచించడంలో దిట్టయిన బాదల్‌కి ఈసారి పంజాబ్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ►ప్రకాశ్‌సింగ్ బాదల్, సురీందర్ కౌర్ బాదల్ దంపతులకు జూలై 9, 1962లో జన్మించారు. ►చండీగఢ్ యూనివర్సిటీలో డిగ్రీ, అమెరికా లాస్‌ఏంజెలిస్‌లో ఎంబీఏ చేశారు. ►హర్సిమ్రత్ కౌర్‌ని పెళ్లాడారు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ►1996లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో కూడా పార్లమెంటుకు ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ►2001 నుంచి 2004 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ► 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఫరీద్‌కోట నుంచి ఎన్నికయ్యారు. ► 2008 జనవరిలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడయ్యారు ►పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా 2009–2017 వరకు సేవలందించారు ► ఎంబీఏ చదవడంతో రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి కోసం కృషి చేశారు. ► 2019లో పంజాబ్ ఫిరోజ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు ►కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఆ పార్టీతో పొత్తుని తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బాదల్ భార్య హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసి తన నిరసన తెలిపారు. ►ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతున్న శిరోమణి అకాలీదళ్‌లో చాలా మంది సిక్కు నేతలు, సుఖ్బీర్ సింగ్ బాదల్‌కి అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడి బీజేపీలో చేరడం కలవరపెడుతోంది. ►అకాలీదళ్‌లో సీనియర్ నేత మంజీదర్ సింగ్ సిర్సా బీజేపీలో చేరడంతో బాదల్‌పై మరింత భారం పడినట్టయింది. పార్టీని వీడుతున్న నాయకుల్ని కాపాడుకోలేకపోతున్నారన్న విమర్శలు బాదల్‌పై ఎక్కువయ్యాయి. ►సిక్కులకు పరమ పవిత్రమైన గురుద్వారాలు లక్ష్యంగా జరుగుతున్న దాడులు, సిక్కుల మత గ్రంథాలను కించపరిచే ఘటనలే ఈసారి ఎన్నికల అంశాలుగా లేవనెత్తుతున్నారు. . ►అకాలీదళ్‌లో పలువురు నేతలపై మాదకద్రవ్యాల కేసులు నమోదయ్యాయి. వారిలో బాదల్ బావమరిది విక్రమ్ మజితాయ్ కూడా ఉన్నారు. కేసులు నమోదైనప్పుడు ఆత్మరక్షణలో పడినప్పటికీ ఎన్నికల సమయంలో బాదల్ వాటినే అస్త్రాలుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే తమపై కేసులు పెడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ►గత ఎన్నికల్లో కేవలం 15 స్థానాలతో మూడో స్థానంలో నిలిచిన పార్టీని ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు గట్టెక్కిస్తారనేది బాదల్ నాయకత్వ సమర్థతకి అగ్నిపరీక్ష. ► 94 ఏళ్ల వయసులో కూడా ప్రకాశ్‌సింగ్ బాదల్ కుమారుడికి అండగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండడంతో కలిసొచ్చే అంశం. – నేషనల్ డెస్క్, సాక్షి -
పద్మవిభూషణ్ వాపస్
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్ సింగ్ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు... మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్‌పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
పద్మ విభూషణ్ వెనక్కి ఇస్తున్న: మాజీ సీఎం
చండీఘర్: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నా విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకను పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా. తాజాగా పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు తనకు భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. బాదల్ తన లేఖలో.. రైతుల పట్ల కేంద్రం తీసుకున్న చర్య పట్ల తను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైతుల వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కారణంగా అలాంటి రైతులు బాధ పడుతుంటే.. ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషన్ పురస్కారం వల్ల వచ్చిన గౌరవం తనకు అవసరం లేదని బాదల్ రాసుకోచ్చారు. కాగా 2015లో భారత ప్రభుత్వం బాదల్‌ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేటి కేంద్ర మంత్రుల భేటీలో రైతులు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు. -
వారణాసిలో మోదీ నామినేషన్
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీతోపాటు ఎన్డీఏ పక్షాల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువారమే ఇక్కడికి చేరుకున్న మోదీ.. శుక్రవారం ఉదయం బూత్‌స్థాయి నేతలు, కార్యకర్తలతో సమావేశమై, ఆపై కాలభైరవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఆయన వెంట అధికార ఎన్డీఏ పక్షానికి చెందిన బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఎల్జేపీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే, శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్‌తోపాటు బీజేపీ చీఫ్ అమిత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా స్వరాజ్ ఉన్నారు. వారణాసి కలెక్టరేట్లో మోదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మోదీ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన వారిలో బనారస్ హిందూ వర్సిటీ మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణ శుక్లా, కాశీలోని మణికర్ణిక దహన వాటిక ప్రధాన నిర్వాహకుడు జగదీశ్ చౌధరి, బీజేపీ కార్యకర్త సుభాష్ గుప్తా, మోదీ బాల్య మిత్రుడు, వ్యవసాయ శాస్త్రవేత్త శంకర్ పటేల్ ఉన్నారు. నామినేషన్ దాఖలుకు ముందుగా ప్రధాని మోదీ.. బాదల్, అన్నపూర్ణ శుక్లా పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్రమత్తంగా ఉండండి బూత్ స్థాయి నేతలు, కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘వారణాసిలో మోదీ ఇప్పటికే గెలిచినట్లు వాతావరణం సృష్టించి, ఓటు వేయకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వారి ఉచ్చులో పడకండి’ అని ప్రజలకు ఉద్బోధించారు. మునుపెన్నడూ లేని విధంగా, ఈసారి అధికార పక్షానికి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. ‘ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు వంటి విషయాలపై చర్చిస్తూ సమయం వృథా చేయవద్దు. అతి విశ్వాసం, దురుసుతనం పనికి రావు’ అని కార్యకర్తలకు హితవు పలికారు. ‘ప్రతి అభ్యర్థీ గౌరవనీయుడే, అతడు మన శత్రువు కాదు. ఎన్నికల సందర్భంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం కనిపిస్తోంది’ అని అన్నారు. ప్రధాని ఆస్తులు రూ. 2.5 కోట్లు 2014 ఎన్నికల అఫిడవిట్లో రూ.1.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించిన మోదీ.. రూ.2.5 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తాజా అఫిడవిట్లో పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రూ.1.1 కోట్ల విలువైన ఇల్లు, రూ.1.27 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.38,750 నగదు, రూ.1.13 లక్షల విలువైన 45 గ్రాముల బరువైన 4 ఉంగరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందే వేతనం, బ్యాంకు వడ్డీల ద్వారా ఆదాయం సమకూరుతోందని వివరించారు. 1967లో పదో తరగతి, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందినట్లు తెలిపారు. జెశోదాబెన్ను భార్యగా పేర్కొన్న మోదీ.. ఆమె ఆదాయ వనరులు, వృత్తి వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని, ప్రభుత్వానికి ఎటువంటి బకాయి పడలేదని తెలిపారు. అంతకుముందు జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నామినేషన్ పత్రాల్లో భార్య కాలమ్‌ను నింపకుండా ఖాళీగా వదిలి వేసేవారు. అయితే, నామినేషన్ పత్రాల్లో ఎటువంటి ఖాళీలున్నా అధికారులు తిరస్కరించవచ్చని ఈసీ తెలపడంతో 2014 ఎన్నికల నుంచి సంబంధిత కాలమ్‌లో వివాహితుడినంటూ భార్య పేరు జశోదాబెన్గా పేర్కొంటున్నారు. నామినేషన్ వేసేముందు బాదల్ ఆశీర్వాదం తీసుకుంటున్న మోదీ వారణాసి కలెక్టర్ ఆఫీసులో అమిత్ షాతో ముచ్చటిస్తున్న మోదీ -
‘మోదీకి, రాహుల్‌కు ఉన్న తేడా అదే’
లక్నో : వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం కాలభైరవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. మోదీ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నాయకులు వారణాసికి బయల్దేరి వెళ్లారు. నామినేషన్ వేయడానికి ముందు కలెక్టరేట్ ఆఫీస్‌లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్, ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం, అప్నాదళ్, నార్త్–ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ నేతలతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 93 ఏళ్ల ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు నరేంద్ర మోదీ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన నామినేషన్లో ప్రపోజర్స్‌లో ఒకరైన 92 ఏళ్ల అన్నపూర్ణ శుక్లా కాళ్లకు కూడా నమస్కరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేసిన మోదీ అభిమానులు.. ‘ భారతీయ సంస్కృతికి అద్దం పట్టారు. మోదీజీ ప్రకాశ్ సింగ్ బాదల్‌కు పాదాభివందనం చేస్తే.. రాహుల్, సోనియాలు మాత్రం వయస్సులో తమకంటే పెద్దవారైన నాయకులు తమ కాళ్లు మొక్కడాన్ని ఆస్వాదిస్తారు. ఇదే రాహుల్‌కు, మోదీకి ఉన్న తేడా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వారణాసిలో నామినేషన్ వేసేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. కాలభైరవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా స్థానిక మహిళలతో మోదీ కరచాలనం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. #DeshModiKeSaath Today @narendramodi ji touched feet of 93 yrs old Prakash Singh Badal before filing his nomination. And see what Rahul and Sonia does ,they get their feets touched by their senior leaders !! pic.twitter.com/LOU8WbX7Qs — Amith Hegde (@AmithHegde1) April 26, 2019 -
జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట!
-
జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట!
అక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయినా అది సరిపోదని, తమకు మరింత భద్రత కావాలని అంటున్నారు. పంజాబ్‌లోని అకాలీదళ్ ప్రభుత్వం ఈ తరహా వింత కోరికలతో కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కొడుకు, ఉప ముఖ్యమంత్రి అయిన సుఖ్బీర్ బాదల్, మంత్రివర్గంలో కీలక సభ్యుడు బిక్రమ్ సింగ్ మజీతియా.. ఈ ముగ్గురికీ ఇప్పటికే జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉంది. వీళ్లలో మజీతియా.. ఉపముఖ్యమంత్రికి బావమరిది. భద్రత పెంచాలంటూ గత వారమే అభ్యర్థన వచ్చిందని, అయితే.. దేశంలో అత్యున్నత స్థాయి భద్రత అయిన జడ్ ప్లస్ తర్వాత ఇంక ఏమివ్వాలో అర్థం కావడం లేదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. 88 ఏళ్ల ముఖ్యమంత్రికి నేషనల్ సెక్యూరిటీ గార్డులు భద్రత ల్పిస్తారు. ఆయన కొడుకును, అతడి బావమరిదిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది రోజుకు 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. జడ్ ప్లస్ భద్రత కింద దాదాపు 30-40 మంది కేంద్ర భద్రతా సిబ్బంది, రెండు ఎస్కార్ట్ వాహనాలు ఇస్తారు. ముఖ్యమంత్రి కుటుంబీకులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని, అందులోనూ ఇటీవలే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ నాయకుడి మీద దాడి జరిగిన నేపథ్యంలో భద్రతను పెంచాలని అకాలీదళ్ వర్గాలు అంటున్నాయి. పంజాబ్ ఆర్ఎస్ఎస్ డిప్యూటీ చీఫ్, రిటైర్డ్ బ్రిగెడియర్ జగదీష్ గగ్నేజాపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. -
సారీ.. ఆమెను తోసేసిన బస్సు మాదే!
పంజాబ్ రాష్ట్రంలో అమ్మాయిని లైంగికంగా వేధించి.. బస్సులోంచి తోసేసి.. ఆమె చనిపోయిన ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఖండించారు. అయితే.. ఆ బస్సు తమ కుటుంబ కంపెనీకి చెందినదేనని ఆయన అంగీకరించారు. అయినా సరే, నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు మోగాలో నిరసన ప్రదర్శన చేశాయి. 14 ఏళ్ల వయసున్న బాలికను కొంతమంది ఈవ్ టీజర్లు కదులుతున్న బస్సులోంచి కిందకు తోసేశారు. తీవ్రగాయాలతో ఆమె మరణించగా, ఆమె తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. మోగా జిల్లాలో తమ గ్రామం నుంచి గురుద్వారాకు వెళ్లేందుకు ఆ బాలిక, ఆమె తల్లి కలిసి ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించబోగా.. వాళ్లు అడ్డుకున్నారు. దాంతో వాళ్లామెను బస్సులోంచి కిందకు తోసేశారు. బస్సులో ఆ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆమెను వేధించినవాళ్లు బస్సు డ్రైవర్, కండక్టర్ల స్నేహితులని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికి ఇద్దరిని అరెస్టు చేశారు. -
జాడ తెలిసింది.. క్షేమంగా తెస్తాం
* ఇరాక్‌లో కిడ్నాపైన భారతీయులపై కేంద్రం హామీ * పరిస్థితిని సమీక్షిస్తున్న సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలో సున్నీ తిరుగుబాటుదారుల చేతిలో అపహరణకు గురైన 40 మంది భారతీయుల ఆచూకీ తెలిసిందని, వారంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం ప్రకటించారు. ఒక కాటన్ మిల్లులోను, మరో ప్రభుత్వ భవనంలోనూ వారిని ఉంచారని తెలిపారు. కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబసభ్యులతో కలిసి పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ గురువారం సుష్మాస్వరాజ్‌తో సమావేశమైన సందర్భంలో సుష్మా ఈ విషయం చెప్పారని బాదల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అపహరణకు గురైన వారిని సురక్షితంగా తెచ్చేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని సుష్మ మీడియాకు తెలిపారు. కాగా, ఇరాక్‌లో కిడ్నాపైన భారతీయులు సురక్షితంగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రధాని మోడీకి గురువారం లేఖ రాశారు. ప్రభుత్వ ఖర్చుతో భారత్‌కు..! కిడ్నాపైన వారు పంజాబ్ సహ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి తారిఖ్ నూర్ అల్ హుడా అనే నిర్మాణ సంస్థ తరఫున ఇరాక్ వెళ్లారు. కిడ్నాపైన వారితో సహా ఇరాక్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 120 మంది భారతీయులు ఉన్నారని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సుష్మాస్వరాజ్ గురువారం సంక్షోభ నిర్వహణ బృందాలతో రెండు దఫాలు చర్చలు జరిపారు. కిడ్నాపైన భారతీయులు క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా వెనక్కుతీసుకువచ్చే ఏ అవకాశాన్ని వదలబోమని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. వారితోపాటు, ఇరాక్‌లోని హింసాత్మక ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరినీ, అక్కడ పరిస్థితి చక్కపడగానే తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇరాక్‌లో సాధారణ పరిస్థితులున్న ప్రాంతం నుంచి కూడా ఎవరైనా భారతీయులు ఇండియాకు రావాలనుకుంటే వారిని కూడా ప్రభుత్వ ఖర్చుతో తీసుకువస్తామన్నారు. పరిస్థితిని తాను స్వయంగా సమీక్షిస్తున్నానని సుష్మా తెలిపారు. ఇరాక్‌లో దాదాపు 20 వేలమంది భారతీయులున్నారని ఆమె వెల్లడించారు. వారెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సుష్మా సూచించారు. ఇరాక్‌లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన కేరళకు చెందిన 45 మంది నర్సులు సురక్షితంగా ఉన్నారన్నారు. కాగా, పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఇరాక్‌లో భారత రాయబారిగా పనిచేసిన సురేశ్ రెడ్డి బాగ్దాద్ వెళ్లి, అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. 9వ రోజుకు అంతర్యుద్ధం: ఇరాక్‌లో అంతర్యుద్ధం గురువారానికి 9వ రోజుకు చేరింది. పలు ప్రాంతాల్లో సున్నీ తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ సాయుధ బలగాలకు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇప్పటికే వందలాది మంది చనిపోగా, హింసాత్మక ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బాగ్దాద్ దిశగా దూసుకొస్తున్న సున్నీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయాలన్న ఇరాక్ అభ్యర్థనపై అమెరికా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వైమానిక దాడుల రూపంలో చేసిన సహాయానికి ప్రతిగా ప్రధాని పదవికి రాజీనామా చేయమంటే.. ఆ డిమాండ్‌కు తలొగ్గబోనని ఇరాక్ ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి స్పష్టం చేశారు. మాలికిని రాజీనామా చేయాల్సిందిగా కోరాలని ఒబామాపై అమెరికాలోని సీనియర్ నేతల ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో మాలికి పై వ్యాఖ్య చేశారు. ఇరాకీ సైన్యానికి శిక్షణనిచ్చేందుకు అమెరికా కోట్లాది డాలర్లను ఖర్చు చేసింది. అయినా, సున్నీ జీహాదీలను వారు సమర్థంగా ఎదుర్కోలేకపోతుండటం గమనార్హం. రెబల్స్‌ను చూడగానే భద్రతదళాలు యూనీఫామ్‌లను, ఆయుధాలను, వాహనాలను వదిలేసి పారిపోతున్నారు. కాగా, అవసరమైతే ఇరాక్‌లో నిర్దేశిత లక్ష్యాలపై సైనికచర్యకు సిద్ధంగా ఉన్నామని ఒబామా ప్రకటించారు. ఇరాక్‌కు పంపించేందుకు 300 మంది సైనిక సలహాదారులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. -
గొప్ప తండ్రికి గొప్ప బిడ్డ జగన్ మోహన్ రెడ్డి: పంజాబ్ సీఎం బాదల్
జగన్ మోహన్ రెడ్డి గొప్ప తండ్రికి పుట్టిన గొప్ప బిడ్డ అని, ఆయనతో మాట్లాడుతుంటే అచ్చం తన బిడ్డ సుర్జీత్‌తో మాట్లాడుతున్నట్లే అనిపించిందని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అన్నారు. 'రెడ్డి సాహెబ్'ను కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. తామిద్దరం కలవడం ఇదే తొలిసారని, అయినా అలా ఏమాత్రం అనిపించలేదని సంతోషంగా అన్నారు. రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు జాతీయ నాయకుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బాదల్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వారి భేటీ అనంతరం బాదల్ మీడియాతో మాట్లాడారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించే ముందు తప్పనిసరిగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న జగన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఈ సందర్భంగా బాదల్ చెప్పారు. చివరకు పంచాయతీలలో కూడా ఇలా చేస్తున్నారని, వాళ్లయినా సరే మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం చేయాల్సిందేనని తెలిపారు. అందువల్ల కేంద్రప్రభుత్వమైనా మరోటైనా దీని గురించి ఆలోచించాల్సిందేనని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని పంజాబ్ ముఖ్యమంత్రిని జగన్ కోరారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పంజాబ్ సీఎం బాదల్‌తో జగన్ భేటీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని తెలియచేశారు. ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జగన్‌తో పాటు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్వీందర్ బాదల్, వైఎస్ఆర్ సీపీ బృందంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, బాలశౌరి పాల్గొన్నారు. బాదల్‌తో భేటీ అనంతరం జగన్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవుతారు. కాగా ఈరోజు సాయంత్రం బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను పాట్నాలో కలవటానికి జగన్ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి పాట్నా వెళ్లనున్నారు.