
చండీగఢ్: అనారోగ్యంతో బాధపడుతున్న శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్(94)ను ముక్తసర్ జిల్లా నుంచి మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రకాశ్‌సింగ్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ గత నెలలో కరోనా వైరస్ బారినపడ్డారు. లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు.