former Chief Minster
-
మొహాలీ ఆసుపత్రికి ప్రకాశ్‌సింగ్ బాదల్
చండీగఢ్: అనారోగ్యంతో బాధపడుతున్న శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్(94)ను ముక్తసర్ జిల్లా నుంచి మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రకాశ్‌సింగ్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ గత నెలలో కరోనా వైరస్ బారినపడ్డారు. లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. -
సిద్ధరామయ్య, కుమారస్వామిలపై దేశద్రోహం కేసు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మల్లికార్జున అనే కార్యకర్త ఫిర్యాదు మేరకు సిటీ కోర్టు వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చింది. కుట్రపన్నడం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం లేవనెత్తడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్, మాజీ డీసీపీ రాహుల్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. -
లొంగిపోయిన హర్యానా మాజీ సీఎం చౌతులా
న్యూఢిల్లీ: ఐఎన్ఎల్డీ అధినేత, హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా శనివారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈరోజు జైల్లో లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో బెయిల్‌ను పొందిన ఆయన దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బెయిల్ పొందిన అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని చౌతులాపై ఆరోపణలు రావడంతో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.