చండీగఢ్: పంజాబ్ రాజకీయ కురు వృద్ధుడు, ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కడసారి చూసేందుకు పార్టీలు, ప్రాంతాలకతీతంగా వందలాది మంది నేతలు, స్థానికులు చండీగఢ్‌కు తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద ఘన నివాళులర్పించారు.
తీవ్ర అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచిన తమ అభిమాననేతను చివరిసారి చూసేందుకు చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం బాదల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment