farmer cm
-
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
Buddhadeb Bhattacharya: నేను బుద్ధదేవ్ మాట్లాడుతున్నా...!
లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి పారీ్టలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రచారం పర్వంలో కృత్రిమ మేధ (ఏఐ)తో ఇప్పటికే జోరుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశి్చబెంగాల్లో సీపీఎం కూడా ఇదే దారి పట్టింది. కొద్ది రోజుల క్రితం ఏఐ యాంకర్ ‘సమత’ను ప్రచారంలోకి దింపిన ఆ పార్టీ, తాజాగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య వీడియోను కూడా అలాగే తయారు చేసింది! ఏఐ సహాయంతో సరిగ్గా మాజీ బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్‌ను రూపొందించింది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో కూడిన వీడియో సందేశం సాయంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్‌పై ఏకకాలంలో దాడి చేసింది. ‘‘బెంగాల్లో ఉపాధి లేదు, మహిళలకు గౌరవం లేదు. రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశ్రమలొస్తాయని, వ్యవసాయం మెరుగుపడుతుందని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తృణమూల్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అంతా అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ కూడా జనాల జీవితాలతో ఆడుకుంటోంది. నోట్ల రద్దు నుంచి మొదలుకుని కార్పొరేట్ లూటీ దాకా సర్వం కొద్ది మంది కుబేరులకు మేలు చేసే నిర్ణయాలే. తాజాగా మోదీ సర్కారు ఎన్నికల బాండ్ల అవినీతికి పాల్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే పనిలో పడింది. ఈ ఆటలను సాగనీయొద్దు. అందుకు మన ముందున్న మార్గం పోరాటం ఒక్కటే. ఈ పోరాటంలో గెలవాలంటే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ సెక్యులర్ అభ్యర్థులనే గెలిపించండి’’ అంటూ వీడియోలో బుద్ధదేవ్ విజ్ఞప్తి చేశారు! ఇంటికే పరిమితం... తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బుద్ధదేవ్ కొంతకాలం కిందట ఆస్పత్రిలో చేరారు. కోలుకుని ఇంటికి తిరిగొచి్చన తర్వాత బయటికి కనిపించడమే లేదు. పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సీపీఎం ఇలా బుద్ధదేవ్‌తో కూడిన ఏఐ వీడియోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీడియోను రూపొందించిన తరువాత బుద్ధదేవ్ కుటుంబానికి వినిపించి, వారి అనుమతితోనే సామాజిక వేదికల్లో పోస్ట్ చేసింది పార్టీ. బుద్ధదేవ్ సందేశం వామపక్ష కార్యకర్తలకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందని సీపీఎం నమ్ముతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఓటర్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాదల్‌కు నేతల ఘన నివాళి
చండీగఢ్: పంజాబ్ రాజకీయ కురు వృద్ధుడు, ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కడసారి చూసేందుకు పార్టీలు, ప్రాంతాలకతీతంగా వందలాది మంది నేతలు, స్థానికులు చండీగఢ్‌కు తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద ఘన నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచిన తమ అభిమాననేతను చివరిసారి చూసేందుకు చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం బాదల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్: టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం
కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌లో తీవ్ర అనిశ్చితి ఏర్పడిన విషయం తెలిసిందే. పార్టీలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ అలా ఉండగా ఇప్పుడు గోవాలో కూడా పరిస్థితులు సమస్యగా మారాయి. ఆ పార్టీకి పెద్ద ఎత్తున నాయకులు బై బై చెప్పేశారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన నేతలు ఒక్కొక్కరిగా తిరిగి టీఎంసీలో చేరుతున్నారు. అయితే తాజాగా గోవాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం లుయిజిన్హో ఫలీరో టీఎంసీలో చేరారు. బుధవారం సీఎం మమతా బెనర్జీ, పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ సమక్షంలో లుయిజిన్హో టీఎంసీ కండువా కప్పుకున్నారు. లుయిజిన్హో తన అనుచరుల బృందంతో కలిసి కోల్‌కతాలో టీఎంసీలో చేరారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లుయిజిన్హో టీఎంసీలో చేరికపై సీఎం మమతా స్పందిస్తూ.. లుయిజిన్హోను టీఎంసీలోకి ఆహ్వానించటం గర్వంగా ఉందని తెలిపారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు టీఎంసీ స్వాగతం పలుకుతోందని తెలిపారు. తాము ప్రతి గోవా పౌరుడికి అండగా నిలబడతామని, అదేవిధంగా విభజన శక్తులతో పోరాడతామని పేర్కొన్నారు. సరికొత్త గోవాను రూపొందించటం కోసం కలిసి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శులు యతీష్ నాయక్, విజయ్ వాసుదేవ్ పోయి, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శులు మారియో పింటో డి సంతాన, ఆనంద్ నాయక్, మరో ఐదుగురు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత, కవి శివదాస్ సోను నాయక్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నాయకుడు లావూ మమ్లేదార్ లుయిజిన్హో ఫలీరో పాటు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. -
యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌కు ప్రధాని మోదీ నివాళి
లక్నో: యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. కల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు లక్నో చేరుకున్న ప్రధానికి మోదీకి.. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడైన కల్యాణ్ సింగ్ శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. 89 ఏళ్ల కల్యాణ్ సింగ్ జూలై 4 నుంచి సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐ)లో చికిత్స పొందుతున్నారు. చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ పలు అవయవాలు పనిచేయకుండా పోవడం, సెప్సిస్ (రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపై దాడి చేయడం)తో ఆయన మరణించారని ఎస్జీపీజీఐ తెలిపింది. -
రైతు నేస్తాలు
-
రాజధానిపై ప్రజలకు అపోహలున్నాయి
-మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కంబాలచెరువు : నూతన రాజధానిపై ప్రజలకు ఎన్నో అపోహలున్నాయని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాల రజతోత్సవానికి హాజరైన ఆయన సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలో ఉండగా రైతులకు లక్ష రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వగా చంద్రబాబు రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తాము పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించామని, ప్రస్తుతం ఆరు లక్షల ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు వారికిచ్చే రుణాలకు సంబంధించి రూ.1800 కోట్లు వడ్డీకే చెల్లించామన్నారు. చంద్రబాబు రుణాలు ఇస్తున్నా మహిళల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాలకూ ఉన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నీటిని సాధించుకోవాలని సూచించారు.