Shiromani Akali Dal
-
మూడో రోజుకు చేరిన సుఖ్బీర్ ప్రాయశ్చిత్త దీక్ష
చండీగఢ్: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో బయటపడిన పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రాయశ్చిత్త దీక్షను వరుసగా మూడో రోజు యథాతథంగా కొనసాగించారు. ఆయన గురువారం రూప్‌నగర్ జిల్లాలోని తఖ్త్ శ్రీకేస్‌గఢ్ సాహిబ్ గురుద్వారా బయట కాపలాదారుడిగా(సేవాదార్) విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన సుఖ్బీర్సింగ్ ఉదయం 9 గంటలకు చక్రాల కురీ్చలో గురుద్వారాకు చేరుకున్నారు. కాపలాదారుడి దుస్తులు ధరించి, చేతిలో ఈటెతో విధుల్లో చేరారు. తర్వాత కొంతసేపు సిక్కు కీర్తనలు విన్నారు. ఇక్కడి వంటశాలలో పాత్రలు శుభ్రంచేశారు. సుఖ్బీర్ సింగ్‌తో ఆయన భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుమారుడు అనంత్బీర్ సింగ్ బాదల్, కుమార్తెలు హర్కీరత్కౌర్ బాదల్, గుర్లీన్ కౌర్ బాదల్ సైతం వంటశాలలో సేవలందించారు. 2007 నుంచి 2017 దాకా పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా సిక్కు అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ సుఖ్బీర్ సింగ్‌కు మతపరమైన శిక్ష విధించిన సంగతి తెలిసిందే. స్వర్ణ దేవాలయంలోపాటు మొత్తం ఐదు గురుద్వారాల్లో రెండు రోజుల చొప్పున పది రోజులపాటు సేవాదారుడిగా పనిచేయాలని అకల్ తఖ్త్ ఆదేశించింది. స్వర్ణ దేవాలయంలో రెండో రోజు బుధవారం ప్రాయశ్చిత్త దీక్షల ఉండగా సుఖ్బీర్ సింగ్‌పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది నారాయన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. -
పాత్రలు కడిగి, షూస్ శుభ్రం చేసిన మాజీ డిప్యూటీ సీఎం.. కారణం ఇదే
అమృత్సర్ : సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ విధించిన శిక్షను పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటిస్తున్నారు.అకాల్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా మంగళవారం అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ నీలిరంగు ‘సేవాదర్’ దుస్తులు ధరించారు. కాలికి గాయం కావడంతో కాలికి గాయం కావడంతో వీల్ చైర్లో కూర్చొని పాత్రల్ని కడిగారు. షూస్‌ను శుభ్రం చేశారు. అకాల్ తఖ్త్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతలకు సైతం ఈ శిక్షను అనుభవిస్తున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో పాటు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియా సైతం పాత్రల్ని కడిగారు. ఈ శిక్షను అనుభవించే సమయంలో అకాలీదళ్ నేతల మెడలో వారు ఏ తప్పులు చేశారు. అందుకు గాను అకాల్ తఖ్త్ ఏ శిక్షలు విధించిందో తెలిపేలా ఓ పలకను కూడా ఉంచింది. అధికారంలో ఉండగా అనేక తప్పిదాలుపంజాబ్లో బీజేపీతో దశాబ్ద కాలంగా పొత్తు పెట్టుకున్న సమయంలో శిరోమణి అకాలీదళ్ అనేక మతపరమైన తప్పిదాలకు కారణమని అకాల్ తఖ్త్ పేర్కొంది. ఆ సమయంలో సుఖ్ బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనలకు పాల్పడ్డారని ఈ ఏడాది ఆగస్ట్‌లో అకాల్ తఖ్త్ తేల్చింది. డేరా బాబాకు మద్దతుగా నిలిచారని సుఖ్ బీర్ సింగ్ బాదల్ పలు నేరాలకు పాల్పడిన డేరా బాబాకు మద్దతుగా నిలిచారని తెలిపింది. చేసిన తప్పులకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ శిక్ష విధించింది. శిక్షలో భాగంగా స్వర్ణ మందిర్ సహా పలు గురుద్వారాల్లో సేవాదార్లుగా పని చేయాలంటూ శిక్ష ఖరారు చేసింది. సేవాదార్లుగా మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తుడవాలని ఆదేశించింది. అయితే,వారు చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పినా అకాల్ తఖ్త్ అంగీకరించలేదు. దీంతో అకాత్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్‌గా పనిచేశారు. VIDEO | Punjab: Shiromani Akali Dal leader Sukhbir Singh Badal serves as a 'sewadar' at Golden Temple in Amritsar.#PunjabNews (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/c6lRVUbRX6— Press Trust of India (@PTI_News) December 3, 2024 -
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ రాజీనామా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి, పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘శిరోమణి అకాలీదళ్ అధక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నేడు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారని, పార్టీకి కొత్త అధ్యక్షుడిని అందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తనకు మద్దతు, సహాకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్బీర్ సింగ్ బాదల్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుం. కాగా అకాలీదళ్ అధ్యక్ష పదవి, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గానికి డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. -
Punjab: ఎన్డీయే కూటమిలోకి శిరోమణి అకాలీదళ్!
చంఢీగఢ్: సార్వత్రిక ఎన్నికలు బీజేపీ 400 సీట్లలో గెలిచి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు జాబితాల్లో 267 మంది అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించి.. ప్రచారంలో సైతం స్పీడ్ పెంచింది. మరోవైపు బీజేపీ.. ఎన్డీయే కూటమి విస్తరణపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడానికి చర్చలు జరగుతున్నాయని బీజేపీ పార్టీ సీనియర్ నేత ఎస్ఎస్ చన్నీ తెలిపారు. ‘ఇరుపార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మరికొంత సమయం పడుతుంది. శిరోమణి అకాలీదళ్ మార్చి 22న కోర్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. అనంతరం వాళ్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఇరు పార్టీల మర్యాదపూర్వక సమావేశం జరగనుంది. ఇరుపార్టీల పొత్తుకు సంబంధించి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని ఎస్ఎస్ చన్నీ వెల్లడించారు. శిరోమణి అకాలీదళ్ కోర్ కమిటీ సమావేశం ఛండీగఢ్‌లో జరుగనుంది. ఎస్ఏడీ పార్టీ జనరల్ సెక్రటరీ దల్జీత్ సింగ్ చీమా తమ కోర్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యహరించాల్సిన వ్యూహాలు, పొత్తులపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కోర్ కమిటీలో మీటింగ్‌లో దేశం, రాష్ట్రంలోని అన్ని విషయాలపై చర్చిస్తామని తెలిపారు. అదేవిధంగా తమతో భావ సారూప్యత ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే బీజీపీతో మళ్లీ పొత్తు విషయంలో శిరోమణి అకాలీదళ్ ముందు నుంచి వెనకడుగు వేస్తోంది. అయితే రైతుల పంటలకు మద్దతు ధర, సిక్కు ఖైదీల విడుదల విషయంలో ఎస్ఏడీ బీజేపీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పొత్తు వ్యవహారంపై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ.. శిరోమణి అకాలీదళ్ ఆసక్తికే వదిలేస్తున్నామని తెలిపారు. ఎందుకంటే వారిది రైతు సమస్యలపై పోరాడే, మత సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ అని అన్నారు. ఇక.. ఎస్ఏడీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటే బీజేపీ బలపడుతుంది. కానీ.. రైతుల సమస్యలపై పోరాటం చేసే ఎస్ఏడీకి ఈ పొత్తు నష్టం కలిగిస్తుందన్నారు. ఇక.. 2020లో కేంద్ర తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదోలగింది. అయినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చే పలు చట్టాలకు ఎస్ఏడీ మద్దతు ఇస్తూ వస్తోంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’, పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం ఎస్ఏడీ బహిరంగానే వ్యతిరేకించింది. చదవండి: CAAపై స్టేకు సుప్రీం నిరాకరణ.. పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు -
BJP Punjab : బీజేపీకి భారీ షాక్
సాక్షి, చండీగఢ్ : పంజాబ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ).. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. పంజాబ్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ 13 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. అదే సమయంలో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బీజేపీతో పొత్తు పెట్టుకుటుందంటూ వచ్చిన ఊహాగానాలను ఖండించారు. పొత్తు గురించి నాకే తెలియదు అకాలీదళ్ 2019 ఎన్నికల్లో ఎన్డీఏలో బీజేతో పొత్తు పెట్టుకుంది. ఆ లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీజేపీలు రెండేసి స్థానాల్లో గెలుపొందాయి. అయితే, ఈ సారి లోక్ సభ నేపథ్యంలో బీజేపీ- అకాలీదళ్ కూటమి, సీట్లపై ప్రకటన ఉందన ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే అంశంపై ఎస్ఏడీ అధినేత పొత్తు, సీట్ల ఒప్పందాల గురించి తనకే తెలియదని స్పష్టం చేశారు. బీఎస్పీతోనే మా పొత్తు ఇలాంటి ఊహాగానాలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అన్న ఆయన రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు కొనసాగించేందుకు తమ పార్టీ ఆసక్తిగా ఉందని అన్నారు. బీజేపీతో తెగదెంపులు కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అకాలీదళ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. సెప్టెంబర్ 2020లో ఎన్డీఏ నుండి నిష్క్రమించింది. ఆ తర్వాత వ్యవసాయ చట్టాల్ని కేంద్రం రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ రెండు పార్టీల కూటమి అంశం తెరపైకి వచ్చింది. మరి దీనిపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
పంజాబ్ సర్కార్ కీలక ముందడుగు.. ఇక ఉచితంగా గుర్బానీ ప్రసారాలు
అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసేలా ‘సిక్కు గురుద్వారాస్ (సవరణ) బిల్లు 2023’ను పంజాబ్ అసెంబ్లీ ఆమోదించింది. రాజకీయంగా వివాదాల నడుమ ఈ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోద ముద్ర పడింది. సెక్షన్ 125ఏ సవరణ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. గుర్బానీ ప్రసారాన్ని అందరికీ ఉచితంగా అందించడమే ఈ బిల్లు లక్ష్యమని, దీనికి టెండర్ అవసరం లేదని తెలిపారు. ఇకపై గుర్భానీని ప్రసారాలను ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ఛానల్ నుంచి అయినా ఉచితంగా వినవచ్చు, చూడవచ్చని సీఎం పేర్కొన్నారు. బాదల్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ తను సొంతంగా ఎలాంటి ఛానల్ నిర్వహించడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘నా ఛానల్‌కు టెలికాస్ట్ హక్కులు ఇవ్వాలని నేను అడగడం లేదు. అలాంటప్పుడు బాదల్‌కు ఎందుకు సమస్య’ అని ప్రశ్నించారు. ఇకపై గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి.. కాగా, గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. సిక్కు గురువులు, రైటర్లు కంపోజ్ చేసిన పవిత్ర కీర్తనలను గుర్బానీ అంటారు. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. 2007 నుంచి రాజకీయంగా శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీకి ప్రతి ఏడాది రూ. 2 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఈ ప్రసార హక్కులను ఒక ఛానల్‌కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు బ్రిటిష్‌కాలంనాటి సిక్కు గురుద్వారాస్ చట్టం 1925 సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి సోమవారమే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. హర్యానాకు ప్రత్యేక గురుద్వారా కమిటీ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని, ఇది రాష్ట్ర పరిధిలోనిదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) మండిపడుతోంది. 1925 చట్టాన్ని పార్లమెంట్ చేసిందని దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శిస్తోంది. మరోవైపు పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది . -
బాదల్‌కు నేతల ఘన నివాళి
చండీగఢ్: పంజాబ్ రాజకీయ కురు వృద్ధుడు, ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కడసారి చూసేందుకు పార్టీలు, ప్రాంతాలకతీతంగా వందలాది మంది నేతలు, స్థానికులు చండీగఢ్‌కు తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద ఘన నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచిన తమ అభిమాననేతను చివరిసారి చూసేందుకు చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం బాదల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ప్రకాష్ సింగ్ బాదల్‌కు అస్వస్థత.. అమిత్ షా ఆరా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్(95) అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. బాదల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశ్ సింగ్ బాదల్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబసభ్యులు ఆయనను మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బాదల్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలిసిన వెంటనే అమిత్ షా.. ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నాకు చాలా బాధ కలిగిస్తోంది. ప్రకాశ్ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి నేను సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నా” అని షా ట్వీట్ చేశారు. Concerned to know that the veteran leader Shri Parkash Singh Badal Ji is unwell and admitted to hospital. Had a telephone discussion about his health with Shri Sukhbir Singh Badal Ji. I pray to God for his speedy recovery. — Amit Shah (@AmitShah) April 21, 2023 ఇదిలా ఉండగా.. గతేడాది కూడా ప్రకాష్ సింగ్ బాదల్ శ్వాస నాళాల ఆస్తమా కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఇక, 2022లో కోవిడ్ బారినపడ్డారు. అనంతరం, కరోనా నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, ప్రకాష్ సింగ్ బాదల్.. ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక, -
ఎస్పీ, ఆప్‌కు ఎదురుదెబ్బ! ఆజంఖాన్ అడ్డాలో వికసించిన కమలం..
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ ఇచ్చింది. ఎస్పీ సిట్టింగ్ స్థానమైన రాంపూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి జయకేతనం ఎగురవేశారు. 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ లోక్‌సభ స్థానం ఇప్పటివరకు ఆజంఖాన్ కంచుకోటగా ఉంది. ఇక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ 8,679 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆప్‌కు ఎదురుదెబ్బ పంజాబ్‌లో అధికార ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్ నేత సిమ్రన్ జీత్ మాన్ విజయం సాధించారు. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆప్ నేత దినేశ్ పాఠక్ 55 శాతానికి పైగా ఓట్లు దక్కించుకుని విజయఢంకా మోగించారు. కాగా.. రాజ్యసభ ఎంపీగా గెలుపొందిన రాఘవ్ చద్దా.. రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి. చదవండి👉పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు! నాలుగింటిలో మూడు బీజేపీవే ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. టౌన్ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన అగర్తలాలో కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్ గెలుపొందారు. ► ఝార్ఖండ్‌లోని మందార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ గెలుపొందారు. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. చదవండి👉మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు మోదీ, యోగి కృతజ్ఞతలు తాజా ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. బీజేపీకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆజంగఢ్, రాంపుర్ ఫలితాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. The by-poll wins in Azamgarh and Rampur are historic. It indicates wide-scale acceptance and support for the double engine Governments at the Centre and in UP. Grateful to the people for their support. I appreciate the efforts of our Party Karyakartas. @BJP4UP — Narendra Modi (@narendramodi) June 26, 2022 ఎస్పీకి కంచుకోటలైన రాంపూర్, ఆజంగఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడటంతో పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. -
పంజాబ్‌లో ఆప్ సంచలనం.. 5 సార్లు సీఎంగా చేసిన నేతకూ తప్పని ఓటమి
చంఢీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. స్థానాలు ఉన్న పంజాబ్‌లో జాతీయ పార్టీలను వెనక్కి నెట్టిన ఆప్ విజయం వైపు దూసుకెళ్లింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది. భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్ అవతరించింది. అయితే ఆప్ చేతిలో రాష్ట్రంలోని హేమాహేమీలు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల చేతులో ఘోర ఓటమిని చవిచూశారు. ఈ జాబితాలోకి మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా చేరారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు. చదవండి: హోలీ ముందుగానే వచ్చింది, 2024లోనూ ఇదే రిపీట్ అవుద్ది: మోదీ అదే విధంగా మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, కురు వృద్ధుడు అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక వయస్సున్న వ్యక్తిగా నిలిచారు. ఇక ప్రకాష్ సింగ్ బాదల్ తన 65 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా అయిదు సార్లు సేవలు అందించారు. 1969 నుంచి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. ఇలా ఎంతోమంది ప్రముఖులను ఆప్ అభ్యర్థులు మట్టి కరిపించారు. చదవండి: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు ప్రకాష్ సింగ్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ దాదాపు 30,000 తేడాతో ఆప్ అభ్యర్థి జగ్దీప్ కాంబోజ్ చేతిలో జలాలాబాద్ అసెంబ్లీలో ఓడిపోయాడు. పంజాబ్ ఆర్థిక మంత్రి, సుఖ్బీర్ బాదల్ బంధువు అయిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి బటిండా అర్బన్ సీటులో ఆప్‌కి చెందిన జగ్రూప్ సింగ్ గిల్ చేతిలో ఓడిపోయారు. కాగా బాదల్ కుటుంబమే కాదు, బాదల్ కుటుంబానికి చెందిన చాలా మంది బంధువులు కూడా ఆప్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. చదవండి: ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే.. సుఖ్బీర్ బాదల్ బావమరిది అయిన బిక్రమ్ సింగ్ మజిథియా, అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో ఓడిపోయారు. అయితే, బిక్రమ్ సింగ్ భార్య గనీవ్ కౌర్ తన భర్త సొంతగడ్డ అయిన మజితా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పోటీ చేసేందుకు మజితియా తన స్థానాన్ని వదిలిపెట్టారు. అయితే సిద్ధూ, బిక్రమ్ సింగ్ మజితియాను ఆప్‌కి చెందిన జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. ప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు ఆదైష్ పర్తాప్ సింగ్ కైరోన్ తర్న్ తరణ్ జిల్లాలోని పట్టి అసెంబ్లీ స్థానంలో ఆప్‌కి చెందిన లల్జిత్ సింగ్ భుల్లర్ చేతిలో ఓడిపోయారు. మిస్టర్ కైరాన్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పర్తాప్ సింగ్ కైరాన్ మనవడు. -
ఎగ్జిట్ పోల్స్ మేం నమ్మం.. మేమే అధికారంలోకి వస్తాం
చండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను శిరోమణి అకాలీదళ్ కొట్టిపారేసింది. బీఎస్పీతో కలిసి తమ పార్ట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అవసరమైతే బీజేపీతో చేతులు కలుపుతామని శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఎగ్జిట్ పోల్స్‌ను తాము విశ్వసించబోమని చెప్పారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకుందని దల్జిత్ సింగ్ గుర్తు చేశారు. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్‌కు తమ పార్టీ ఎప్పుడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ‘ఎన్నికల సమయంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రజల మధ్య ఉన్న వారికి మాత్రమే తెలుసు. మాకు మంచి ఫలితాలు వస్తాయని, అకాలీదళ్-బీఎస్పీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము నమ్ముతున్నాం. మేం మెజారిటీ సాధిస్తామ’ని దల్జిత్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా.. ‘అలాంటి ప్రశ్న అప్రస్తుతం. ఎన్నికల తుది ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేము పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం రాదని ఆశిస్తున్నామ’ని అన్నారు. (క్లిక్: పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు) -
ఆప్‌కి ‘ఒక్క చాన్స్’ ఇస్తారా!
అన్ని పార్టీలనూ అంతర్గత సమస్యలు వేధిస్తున్నాయ్. ప్రతీ స్థానంలోనూ బహుముఖ పోటీ నెలకొని గుబులు పుట్టిస్తోంది. పంజాబ్‌లో మార్పు కోసమేనంటూ పోటాపోటీగా ఇచ్చిన హామీలు ఎవరికెంత లాభం చేకూరుస్తాయి? ఢిల్లీ మోడల్ పాలన అంటున్న ఆప్‌కు పంజాబీలు ‘ఒక్క చాన్స్’ ఇస్తారా! దళిత కార్డుతో రాజకీయం చేస్తున్న హస్తం పార్టీకే వరుసగా రెండోసారి అధికారపీఠం అప్పగిస్తారా? పంజాబ్‌లో ఇప్పుడు అందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఎప్పుడైతే గెలుచుకుందో అప్పట్నుంచి ఢిల్లీకి వెలుపల ఆ పార్టీ విస్తరణ మొదలైంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా 20 సీట్లు , 23.72% ఓటు షేరుతో పంజాబ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడిపోయినా.. ఇప్పుడు బలం పుంజుకొని అధికార కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచి గట్టి సవాల్ విసురుతోంది. ఢిల్లీ మోడల్ పరిపాలన, అధికారంలోకి వస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆప్‌కున్న క్లీన్ ఇమేజ్, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీలో ఆప్ చేస్తున్న అభివృద్ధి పంజాబ్‌లోని దిగువ మధ్యతరగతిని ఆకర్షిస్తోంది. తప్పుల్ని సరిదిద్దుకుంటూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ప్రాంతీయ పార్టీ కాకపోవడంతో బయటవాళ్లు అన్న ముద్ర, ప్రత్యర్థులందరూ ఇదే అంశాన్ని పదే పదే ఎత్తిచూపిస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆప్ తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. మరే రాజకీయ పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్ ద్వారా పార్టీ రాజ్యసభ సభ్యుడు భగవంత్ మన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది. పంజాబ్ ఓటర్లలో 45 శాతం ఉన్న.. 96 లక్షల మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. 12 మంది విద్యాధికులైన మహిళలకు టికెట్లు ఇచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలపైనే ఆప్ ప్రధానంగా దృష్టి సారించింది. అక్రమ ఇసుక తవ్వకాలను అరికడితే రాష్ట్రానికి 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని, దానిని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చునని కేజ్రివాల్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఇసుక మాఫియాలో సీఎం చన్నీ సహా కాంగ్రెస్ మంత్రులందరూ ఉన్నారని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్, లేదంటే అకాలీల పాలనే గత కొన్ని దశాబ్దాలుగా చూసిచూసి విసిగెత్తిన ప్రజలకు ఆప్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పంజాబ్ యువత కూడా ఆప్‌వైపే చూస్తున్నారు. అయినప్పటికీ ఆ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. గత అయిదేళ్లలో 20 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. సంస్థాగతంగా పార్టీ బలంగా లేదు. కార్యకర్తల బలం కనిపించడం లేదు. సీఎం అభ్యర్థి భగవంత్ మన్ సమర్థుడు కాదన్న వాదనలు ఉన్నాయి. కేజ్రివాల్ క్రేజ్‌తోనే ఆ పార్టీ గట్టిగా నిలబడుతోంది. కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే శత్రువు కాంగ్రెస్‌లో ముఠా తగాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూయే ఆ పార్టీకి ప్లస్ అవుతారో, మైనస్‌గా మారుతారో తలపండిన రాజకీయ నాయకులకి సైతం అర్థం కావడం లేదు. ‘కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు’ అని ఇటీవల బహిరంగంగా చెప్పిన సిద్ధూ సీఎం అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి పక్కలో బల్లెంలా ఉన్నారు. అయితే చన్నీ దళితుడు కావడం, రాష్ట్ర జనాభాలో 32 శాతం వారే ఉండటంతో కాంగ్రెస్‌కి కాస్త అనుకూలంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎం పదవిలోకి వచ్చిన చన్నీ కొద్ది కాలంలోనే తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల్ని ఆకర్షించేలా ఉన్నాయి. స్వల్పకాలంలోనే చన్నీ ప్రభుత్వం 60 నిర్ణయాలను అమలు చేసింది దానికి సంబంధించిన రిపోర్ట్ కార్డుని కూడా విడుదల చేసింది. అసంఘటిత కార్మికులకు వేతనాలు, పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు పే కమిషన్, నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేక సాయం, పదో తరగతి వరకు పంజాబీ భాష తప్పనిసరి, 2 కిలోవాట్ల లోడ్ వరకు గృహ వినియోగదారుల విద్యుత్ బకాయిల మాఫీ , లక్ష కొత్త రేషన్ కార్డుల జారీ వంటివెన్నో చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మాదకద్రవ్యాలు, ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టడానికి మిషన్ క్లీన్‌ని కాంగ్రెస్ ప్రారంభించింది. నోట్ దిస్ పాయింట్స్ ► బీజేపీతో పొత్తు ఉండబట్టి రెండుసార్లు అధికారం చేపట్టింది కానీ గత ఇరవై ఏళ్లలో ఏ ఎన్నికలను తీసుకున్నా.. అకాలీదళ్‌కు సొంతంగా వచ్చిన ఓట్లు 35 శాతం దాటలేదు. ► మరోవైపు బీజేపీని తీసుకుంటే హిందువులు మెజారిటీగా ఉన్న నాలుగు జిల్లాలు, పట్టణ ప్రాంతాలకే ఆ పార్టీ పరిమితమైంది. అకాలీదళ్‌తో పొత్తు ఉన్నందువల్ల బీజేపీ గ్రామీణ పంజాబ్‌లోని 94 స్థానాల్లో (మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు) ఏనాడూ పోటీచేయలేదు. ► బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో గరిష్టంగా 7.8 శాతం ఓట్లు వచ్చాయి. కొత్త పొత్తులతో లాభం ‘ఇల్లె’! ఈసారి ఎన్నికల కోసం శిరోమణి అకాలీదశ్, బీఎస్పీలు 2021 జూన్‌లోనే కూటమి కట్టాయి. అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్ చాలాముందు నుంచే టికెట్లు ఖరారు చేశారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు టిక్కెట్లిచ్చారు. అయితే బీఎస్సీ అధినేత్రి పంజాబ్‌పై దృష్టి పెట్టకపోవడం.. ఇక్కడ ప్రచారానికి రాకపోవడం అకాలీదళ్ అవకాశాలను బాగా దెబ్బతీసే అంశమే. ఇక బీజేపీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి ప్రభావం నామమాత్రంగానే ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం!
వందేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైప శిరోమణి అకాలీదళ్ తర్వాత శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (గురుద్వారాల పాలనా వ్యవహారాలు చూసే సంస్థ) అవసరాల నిమిత్తం రాజకీయ పార్టీగా అవతరించింది. గత ఏడాది డిసెంబర్ 14న 101 వార్షికోత్సవాన్ని జరుపుకొన్న ఈ పార్టీ ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో అత్యంత కఠిన పరిస్థితులకు ఎదురీదుతోంది. సిక్కుల పార్టీగా దశాబ్దాలు హవా చలాయించిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కి ఈ పరిస్థితి రావడానికి 2007 నుంచి 2017 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. అధికారం కోల్పోయి ఐదేళ్లవుతున్నా.. ఆ కాలంలో పడిన ముద్రను తొలగించుకోవడానికి ఇప్పటికీ ఎస్ఏడీ గింజుకుంటూనే ఉంది. మరోవైపు పంజాబ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల పాటు అకాలీదళ్– కాంగ్రెస్‌ల మధ్యే ద్విముఖ పోరు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం. బీజేపీ-అమరీందర్ కూటమి, రైతు సంఘాలతో కూడిన సంయుక్త సమాజ్ మోర్చాలతో ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. అకాలీదళ్ స్వయం కృతాపరాధానికి కారణాలేమిటి, వాటి నుంచి బయటపడటానికి ఎస్ఏడీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రస్తుత పార్టీ పరిస్థితిపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం.. ముందు నుంచే దిద్దుబాటు చర్యలు ► జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్... ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ పోయారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు చోటిచ్చారు. ► మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం రగిలిపోతుండటాన్ని గ్రహించిన సుఖ్బీర్ బీజేపీతో రెండు దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకొని... ఎన్డీయే నుంచి బయటికి వచ్చేశారు. ► భారత్‌లో మరే రాష్ట్రంలో లేనంతగా... పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుఖ్బీర్ 2021 జూన్‌లోనే బీఎస్పీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 నియోజకవర్గాలను కేటాయించారు. 2007లో 4.17 ఓట్ల శాతాన్ని, 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 ఓట్ల శాతాన్ని సాధించిన బీఎస్పీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి దారుణంగా దెబ్బతింది. 1.59 శాతం ఓట్లు మాత్రమే పొందింది. ► అకాలీదళ్ అధికారంలోకి వస్తే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, ఇందులో ఒకటి బీఎస్పీకి కేటాయిస్తామని సుఖ్బీర్ ప్రకటించారు. దళిత ఓట్లను సాధ్యమైనంతగా ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎంను బీఎస్పీకి ఆఫర్ చేశారు. ఎన్నెన్నో కారణాలు... ► ఏఎస్డీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయింది. ► ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ► పంజాబ్ డ్రగ్స్ వాడకానికి భారత్‌లో కేంద్ర స్థానంగా మారిపోయింది. ‘ఉడ్తా పంజాబ్ (నిషాలో తేలిపోయే పంజాబ్)’గా పేరు స్థిరపడిపోయే స్థాయిలో ఇక్కడి యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ► 2015 ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం.. ఎయిమ్స్, మరో స్వచ్చంద సంస్థతో కలిపి నిర్వహించిన సర్వేలో పంజాబ్‌లో 2.32 లక్షల మంది డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలయ్యారని తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో (మైనారిటీ తీరిన వారిలో) 1.2 శాతం మంది డ్రగ్స్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న వారి సంఖ్య 8.6 లక్షలుగా ఉందని తేలింది. ► 2015లో అక్టోబరులో సిక్కుల పవిత్రగ్రంధం... గురు గ్రంధ్ సాహిబ్‌ను కొందరు దుండగులు అపవిత్రం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సిక్కులపైకి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన శిరోమణి అకాలీదళ్‌పై ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా పెంచేసింది. ► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎస్డీ కేవలం 15 స్థానాలు మాత్రమే సాధించి... అవమానకరంగా మూడోస్థానానికి పడిపోయింది. సిక్కుల ఆత్మగౌరవ నినాదం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్నా... పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారపర్వంలో చురుకుగా పాల్గొనడం లేదు. ఇక ఆమె పంజాబ్‌పై దృష్టి సారించడంపై అకాలీదళ్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. పైగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెచ్చిన సమయంలో శిరోమణి అకాలీదళ్ నరేంద్ర మోదీ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పదేపదే లేవనెత్తుతూ ఎస్ఏడీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. రైతుల్లో ఆగ్రహం తగ్గి అకాలీదళ్‌ను పూర్వస్థాయిలో ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రకాశ్‌సింగ్ బాదల్ హయాంలో అయితే రైతుల్లో అనేక మంది తరతరాలుగా అకాలీదళ్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ నేటితరం ఆలోచన మారుతోంది. రాజకీయాల్లో వారు కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఫలితంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే సుఖ్బీర్ తండ్రిపై రైతుల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచుకోవాలనే ఉద్దేశంతో 94 ఏళ్ల వయసులో ఆయన్ను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తున్నారు. గతంలో ఐదుసార్లు పంజాబ్ సీఎంగా వ్యవహరించిన ప్రకాశ్ సింగ్ బాదల్ భారత్‌లో అత్యధిక వయసులో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గడం, కొత్త ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నామనే అంశాన్ని గ్రహించిన సుఖ్బీర్ సిక్కుల ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు. బెంగాల్‌ను బెంగాలీలే పాలించుకుంటారని, బయటివారు ఇక్కడ అక్కర్లేదంటూ ప్రచారం చేసి బీజేపీని మట్టికరిపించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందిన సుఖ్బీర్ ఇప్పుడు అకాలీదళ్‌కు ఏకైక పంజాబీ ప్రాంతీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అకాలీదళ్ ప్రస్తుతం ఎదురీదుతోంది. పంజాబ్‌లో ఈనెల 20 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కెడ (అకాలీదళ్ ఎన్నికల గుర్తు కూడా) ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.! -
సీఎం చన్నీని పక్కన పెడతారు
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దళిత ముఖ్యమంత్రిని వాడుకుంటోందని ధ్వజమెత్తారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగానే దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ అధికారాన్ని నిలబెట్టుకున్నా చరణ్‌జీత్ సింగ్ చన్నీని పక్కన పెడతారని జోస్యం చెప్పారు. హిమాచల్ గుడికి వెళ్లే బదులు సంత్ రవిదాస్ ఆశీస్సులు తీసుకోవడానికి సీఎం చన్నీ వెళితే బాగుండేదన్నారు. ఆయన ఆలయాన్ని సందర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దళితులకు కూడా సానుకూల సందేశం పంపి ఉండాల్సిందని మాయావతి అభిప్రాయపడ్డారు. బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్దపు హామీలతో ఓటర్లకు గాలం వేస్తోందని ఆరోపించారు. (క్లిక్: పంజాబ్‌లో ఆప్ టెన్ పాయింట్ అజెండా) బీఎస్పీ-ఎస్ఏడీ కూటమికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేస్తామని హామీయిచ్చారు. పంజాబ్‌లో బీఎస్పీ-ఎస్ఏడీ కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా సుఖ్బీర్ బాదల్‌ను ఎన్నుకుంటామని మాయావతి ప్రకటించారు. (క్లిక్: పంజాబ్‌లో మోదీ చరిష్మా పనిచేసేనా!) -
మొహాలీ ఆసుపత్రికి ప్రకాశ్‌సింగ్ బాదల్
చండీగఢ్: అనారోగ్యంతో బాధపడుతున్న శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్(94)ను ముక్తసర్ జిల్లా నుంచి మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రకాశ్‌సింగ్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ గత నెలలో కరోనా వైరస్ బారినపడ్డారు. లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. -
సిద్దూపై సుఖ్బీర్ బావ పోటీ
చండీగఢ్: పంజాబ్‌లో ఎన్నికల రంగం రసకందాయంలో పడుతోంది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాళీదళ్ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడి తూర్పు అమృత్సర్ నియోజకవర్గంలో సిద్దూపై సీనియర్ నేత, తన బావ విక్రమ్‌సింగ్ మజీతియా పోటీ చేయనున్నట్టు అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రకటించారు. బుధవారం ఆయన అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడారు. తూర్పు అమృత్సర్ నియోజకవర్గంలో మజీతియా రంగంలోకి దిగడంతో సిద్దూ తన డిపాజిట్ కోల్పోక తప్పదని వ్యాఖ్యానించారు. అలాగే పంజాబ్ మాజీ సీఎం, తన తండ్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ (94 ఏళ్లు) లంబి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అకాళీదళ్, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 సీట్లు ఉండగా.. అకాళీదళ్ 97 చోట్ల, బీఎస్పీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కోర్టు కేసుల మధ్య.. సిద్దూపై పోటీకి దిగుతున్న విక్రమ్‌సింగ్ మజీతియాపై గత నెలలోనే డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల కింద పంజాబ్–హరియాణా హైకోర్టు మజీతియాకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా మూడు రోజుల పాటు పోలీసులు అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించింది. ఈ కేసులో ఆయన ఎప్పుడైనా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దూపై పోటీకి దిగుతుండటం ఆసక్తిగా మారింది. -
Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్
తండ్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ నుంచి వచ్చిన వారసత్వం, సిక్కుల నుంచి సంప్రదాయంగా వచ్చే మద్దతు, పంజాబ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను చదివిన ఎంబీఏకి సార్థకత వచ్చేలా పారిశ్రామికంగా చేసిన అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు.. ఇవన్నీ సుఖ్బీర్ సింగ్ బాదల్ని కీలక నేతని చేశాయి. కానీ గత ఎన్నికల్లో ఘోరపరాజయం, శిరోమణి అకాలీదళ్ నుంచి వలసలు, పార్టీ నేతలపై డ్రగ్స్ కేసులు వంటివన్నీ ఆయనపై భారాన్ని పెంచుతున్నాయి. ఆత్మరక్షణలో పడాల్సిన అంశాలనే ఎన్నికల్లో అస్త్రాలుగా మార్చుకునే వ్యూహాలు రచించడంలో దిట్టయిన బాదల్‌కి ఈసారి పంజాబ్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ►ప్రకాశ్‌సింగ్ బాదల్, సురీందర్ కౌర్ బాదల్ దంపతులకు జూలై 9, 1962లో జన్మించారు. ►చండీగఢ్ యూనివర్సిటీలో డిగ్రీ, అమెరికా లాస్‌ఏంజెలిస్‌లో ఎంబీఏ చేశారు. ►హర్సిమ్రత్ కౌర్‌ని పెళ్లాడారు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ►1996లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో కూడా పార్లమెంటుకు ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ►2001 నుంచి 2004 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ► 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఫరీద్‌కోట నుంచి ఎన్నికయ్యారు. ► 2008 జనవరిలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడయ్యారు ►పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా 2009–2017 వరకు సేవలందించారు ► ఎంబీఏ చదవడంతో రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి కోసం కృషి చేశారు. ► 2019లో పంజాబ్ ఫిరోజ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు ►కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఆ పార్టీతో పొత్తుని తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బాదల్ భార్య హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసి తన నిరసన తెలిపారు. ►ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతున్న శిరోమణి అకాలీదళ్‌లో చాలా మంది సిక్కు నేతలు, సుఖ్బీర్ సింగ్ బాదల్‌కి అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడి బీజేపీలో చేరడం కలవరపెడుతోంది. ►అకాలీదళ్‌లో సీనియర్ నేత మంజీదర్ సింగ్ సిర్సా బీజేపీలో చేరడంతో బాదల్‌పై మరింత భారం పడినట్టయింది. పార్టీని వీడుతున్న నాయకుల్ని కాపాడుకోలేకపోతున్నారన్న విమర్శలు బాదల్‌పై ఎక్కువయ్యాయి. ►సిక్కులకు పరమ పవిత్రమైన గురుద్వారాలు లక్ష్యంగా జరుగుతున్న దాడులు, సిక్కుల మత గ్రంథాలను కించపరిచే ఘటనలే ఈసారి ఎన్నికల అంశాలుగా లేవనెత్తుతున్నారు. . ►అకాలీదళ్‌లో పలువురు నేతలపై మాదకద్రవ్యాల కేసులు నమోదయ్యాయి. వారిలో బాదల్ బావమరిది విక్రమ్ మజితాయ్ కూడా ఉన్నారు. కేసులు నమోదైనప్పుడు ఆత్మరక్షణలో పడినప్పటికీ ఎన్నికల సమయంలో బాదల్ వాటినే అస్త్రాలుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే తమపై కేసులు పెడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ►గత ఎన్నికల్లో కేవలం 15 స్థానాలతో మూడో స్థానంలో నిలిచిన పార్టీని ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు గట్టెక్కిస్తారనేది బాదల్ నాయకత్వ సమర్థతకి అగ్నిపరీక్ష. ► 94 ఏళ్ల వయసులో కూడా ప్రకాశ్‌సింగ్ బాదల్ కుమారుడికి అండగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండడంతో కలిసొచ్చే అంశం. – నేషనల్ డెస్క్, సాక్షి -
కెప్టెన్ గేమ్‌ప్లాన్ ఏమిటో..!
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాయని కమలదళం పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్‌లోని తన అనుయాయులను సొంత పార్టీలోకి లాగుతారని, ఎన్నికలు సమీపించేకొద్దీ... వలసలు పెరుగుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జంపింగ్‌లు మొదలయ్యాయి కానీ... ఆశ్చర్యకరంగా కెప్టెన్ అనుంగు అనుచరులు బీజేపీలోకి దూకేస్తున్నారు. ఇది పలువురి భృకుటి ముడిపడేటట్లు చేస్తోంది. అమరీందర్ గేమ్‌ప్లాన్ ఏమిటి? సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా అనుమతిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెవరు వెళ్లారంటే.. మాజీ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి (గురుహర్ సహాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే) డిసెంబరు 21న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గుర్మీత్ నాలుగుసార్లు ఎమ్మెల్యే. సెప్టెంబరు దాకా అమరీందర్ కేబినెట్లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. కెప్టెన్‌కు బాగా సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ కారణంగానే చన్నీ కేబినెట్లో ఈయనకు చోటివ్వలేదు. ఖాదియాన్ ఎమ్మెల్యే ఫతేజంగ్ బజ్వా, శ్రీహరిగోవింద్పూర్ ఎమ్మెల్యే బల్విందర్ సింగ్ లడీలు 22న కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బజ్వాకు కాంగ్రెస్ టిక్కెట్ రావడానికి అమరీందర్ సహాయపడ్డారు. ఇలా కెప్టెన్‌కు సన్నిహితులు కాషాయ కండువా కప్పుకోవడంతో... సమీప భవిష్యత్తులో అమరీందర్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరూ ఉండరని, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రధాని నరేంద్ర మోదీ పేరిటే ఎన్నికలకు వెళతామని షెకావత్ ప్రకటించారు. కూటమిలో బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని, పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాల్లో సగానికి పైగా తామే పోటీచేస్తామని షెకావత్ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చినా... అమరీందర్ శిబిరం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాంగ్రెస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నష్టపర్చడమే ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడి ప్రథమ లక్ష్యమని, అందుకే బీజేపీ అభీష్టం మేరకే నడుచుకుంటున్నారనే వాదన ఉంది. పరస్పర అవగాహనతోనేనా..! కెప్టెన్ పార్టీని బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలను లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిన్స్ ఖుల్లర్ తోసిపుచ్చారు. బీజేపీకి పట్టున్న పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలనుకున్న వారు కాషాయదళంలోకి వెళుతున్నారని.. అమరీందర్‌తో సంప్రదించే చేరికలు జరుగుతున్నాయని ఖుల్లర్ చెప్పారు. రాణా గుర్మీత్ సోధి ఫిరోజ్‌పూర్ నుంచి, ఫతేజంగ్ బజ్వా హిందూ బెల్ట్ నుంచి బరిలోకి దిగాలని కోరుకున్నారని... ఇవి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకున్న, చాలా ఏళ్లుగా ఆ పార్టీ పోటీచేస్తున్న సీట్లు కావడంతో వారు అటువైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే... పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతిమంగా కూటమికి లబ్ధి చేకూరేలా అమరీందర్, బీజేపీలు అవగాహనకు వచ్చినట్లు కనపడుతోంది. సన్నిహితులు ’సేఫ్‌జోన్’ను (విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాల నుంచి) కోరుకోవడం... ఏ పార్టీలో ఉన్నా తన మనుషులే, కూటమి ఎమ్మెల్యేలుగానే ఉంటారనే లెక్కతో కెప్టెన్ వీరికి పచ్చజెండా ఊపి ఉండొచ్చు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూటమి భాగస్వామ్యపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, అదే సమయంలో సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీలకు నియోజకవర్గాల కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాయని పీఎల్సీ అధికార ప్రతినిధి ఖుల్లర్ చెప్పారు. ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కానున్నా... పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త) పార్టీలు గ్రామీణ నియోజకవర్గాల నుంచి, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తులో భాగంగా 23 చోట్ల పోటీచేసి మూడింటిలో మాత్రమే నెగ్గిన బీజేపీ.. కెప్టెన్ అండతో ఈసారి గట్టికూటమిని ఏర్పాటు చేసింది. పంజాబ్ ఎన్నికలను ఈ కొత్త కూటమి చతుర్ముఖ (శిరోమణి అకాలీదళ్– బీఎస్పీ కూటమి, కాంగ్రెస్, ఆప్‌లు మిగతా మూడు) పోరుగా మార్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Amarinder Singh: కెప్టెన్ ప్రభావమెంత?
పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి నెల రోజుల క్రితం అవమానకర రీతిలో తప్పుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కడానికి శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, తదితర పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అమరీందర్ పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. అమరీందర్ పార్టీ బీజేపీతో, శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉన్నట్లు సంకేతాలిస్తోంది. పంజాబ్‌లో కొత్త పార్టీతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ మొదలయ్యింది. అమరీందర్ ఎత్తుగడలను బీజేపీ స్వాగతిస్తుండగా, అధికార కాంగ్రెస్ ఆయన కొత్తగా పార్టీ పెట్టి, సాధించేది ఏమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకే అమరీందర్ కొత్త కుంపటి పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. కెప్టెన్ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు! అమరీందర్ గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో విభేదాలు, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మంత్రాంగం వల్ల ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బలమైన అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కూడా అమరీందర్‌కు పంజాబ్ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మొత్తం 117 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 77 మంది సభ్యుల బలముంది. ఇందులో 12 మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అమరీందర్ సింగ్ మద్దతుదారులుగానే కొనసాగుతున్నారని, కొత్త పార్టీ స్థాపించగానే వారంతా వచ్చి, ఎన్నికల ముందు అందులో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఎంతమంది ఎమ్మెల్యేలు కెప్టెన్ వెంట నడుస్తారన్నది ఇప్పుడే తేలకపోయినా కాంగ్రెస్‌కు మాత్రం ఎంతోకొంత నష్టం తప్పదని చెప్పొచ్చు. అంటే అమరీందర్ కొత్త పార్టీతో మొదట నష్టపోయేది కాంగ్రెస్సే. మరోవైపు సిద్ధూతో కాంగ్రెస్ అధిష్టానానికి నిత్యం ఏదో ఒక తలనొప్పి ఎదురవుతూనే ఉంది. తన అనుచరుడే అయినప్పటికీ కొత్త దళిత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సైతం సిద్ధూకు పొసగడం లేదు. ఈ అంతర్గత కుమ్ములాటలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. విసిగివేసారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించినా.. ఆఖరి నిమిషంలో అమరీందర్ పార్టీలోకి జంప్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలిసినప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చతుర్ముఖ పోరు... సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లో అధికారం ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ కూటముల మధ్యే చేతులు మారుతోంది. మరో కూటమికి అవకాశం దక్కడం లేదు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శక్తిమేర పోరాడి 23.7 శాతం ఓట్లు, 20 సీట్లతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పంజాబ్‌లో తమకు అవకాశాలుంటాయని భావిస్తున్న ఆప్ చాలాకాలంగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. మరోవైపు పంజాబ్ జనాభాలో ఏకంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిరోమణి అకాలీదళ్... బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 20 సీట్లను బీఎస్పీకి వదిలి... 97 స్థానాల్లో పోటీచేయనుంది. ఇప్పటికే సింహభాగం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది కూడా. ఈసారి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతోపాటు శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలైన రంజిత్ సింగ్ బ్రహ్మపురా, సుఖ్‌దేవ్ ధిండ్సాతో చేతులు కలిపితే.. రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజకీయ కూటములు తెరపైకి వస్తాయి. అప్పుడు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. గతంలో సొంత కూటమి ఫెయిల్ అమరీందర్ కొత్త రాజకీయ కూటమి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన 1984లో కాంగ్రెస్‌ను వీడి శిరోమణి అకాలీదళ్‌లో చేరారు. 1992లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు. శిరోమణి అకాలీదళ్(పాంథిక్) పేరిట సొంతంగా ఒక పొలిటికల్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 1997లో తన కూటమిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలో రెండు సార్లు (2002–07, 2017–22) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వెనుక కీలక పాత్ర పోషించారు. తనను అవమానించిన కాంగ్రెస్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవాలని అమరీందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయం జీవితం ముగింపునకొచ్చినట్లేనని, ఇదే చివరి అవకాశమని పరిశీలకులు చెబుతున్నారు. కొత్త పొత్తు పొడిచేనా! అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ పట్ల సానుకూల ధోరణి కనబర్చారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్ భూభాగంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్‌తోపాటు సరిహద్దుల్లో ఇటీవల బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం మంచి పరిణామం అని కితాబిచ్చారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. బీజేపీతో కలిసి కూటమి కట్టడానికి అమరీందర్‌కు ఉన్న ఏకైక అభ్యంతరం మూడు నూతన వ్యవసాయ చట్టాలు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. రైతు సంఘాలతో చర్చలు జరపాలని, సాగు చట్టాల విషయంలో రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్ర సర్కారు కొంత దిగివచ్చినా తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. మితవాది అనే పేరు, సైనిక నేపథ్యం ఉండడం అమరీందర్‌కు బీజేపీతో జట్టు కట్టడానికి కలిసి వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, ఇతర పక్షాలను కలుపుకొని భారీ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమరీందర్ ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి ఎన్డీయేలోనే భాగస్వామ్య పక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ గత ఏడాది నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాగు చట్టాలపై బ్లాక్ ఫ్రైడే నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచి్చన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, శిరోమణి అకాలీదళ్ బ్లాక్ ఫ్రై డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. సాగు చట్టాలు గతేడాది సెపె్టంబర్ 17న లోక్‌సభ ఆమోదం పొంది సంవత్సరం అయిన సందర్భంగా సెప్టెంబర్ 17 వ తేదీని బ్లాక్ డేగా శిరోమణి అకాలీదళ్ జరుపుకుంది. రైతులతో పాటు పార్టీ కార్యకర్తలు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటుకు నిరసన కవాతు చేపట్టారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటుచేసి వారి ప్రణాళికలను అడ్డుకున్నారు. కాగా శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌లతో పాటు నిరసనలో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగు చట్టాలను విపక్షాలతో పాటు ఎన్డీఎ భాగస్వామి శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించింది. హర్సిమ్రత్ కౌర్ కేంద్రంలో మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. దీంతో రెండు పారీ్టల 27 ఏళ్ల మైత్రి విచి్ఛన్నమైంది. చట్టలు రద్దు చేయాలి: అమరీందర్ కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలను వెంటనే రద్దు చేయడంతో పాటు రైతులతో చర్చలు జరపాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ శుక్రవారం డిమాండ్ వ్యాఖ్యానించారు. -
సిద్ధూపై ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవసాయ చట్టాల అంశంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. శిరోమణి అకాలీదళ్ చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆప్ కూడా రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విరుచుకు పడ్డారు. దీంతో ఆప్ సిద్ధూపై ఎదురుదాడికి దిగింది. సిద్ధూ రాజకీయాల్లో రాఖీసావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన సిద్ధూని కాంగ్రెస్ హైకమాండ్ మందలించింది. సీఎం అమరీందర్‌ను నిరంతరం దూషిస్తున్న సిద్ధూకి కళ్లెం వేసింది. అందుకే మార్పు కోసం ఆయన కేజ్రివాల్‌ని అంటున్నారు. రేపటి వరకు వేచి చూడండి. సిద్దూ మళ్లీ కెప్టెన్‌పై విరుచు కుపడతారు’’ అని రాఘవ్ ట్వీట్ చేశారు. (చదవండి: Cadbury: 1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..) -
20 రౌండ్ల కాల్పులు: శిరోమణి అకాలీ దళ్ యూత్ వింగ్ నేత హత్య
మొహాలి: శిరోమణి అకాలీ దళ్ యూత్ వింగ్ నేత విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా అలియాస్ విక్కీ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో మృతి చెందారు. ఈ ఘటన మొహాలీలోని సెక్టార్ 71లో చేటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్యూవీ కారులో కూర్చున్న విక్కీనిపై మాస్కులు ధరించిన నాలుగురు దుండగుల్లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కారు నుంచి పరుగులు తీశాడు. దుండగులు వెంబడించి మరీ 20 రౌండ్ల కాల్పులు జరపడంతో విక్కీ మృతి చెందాడు. ఈ ఘటనపై శిరోమణి అకాలీ దళ్ నేత దల్జిత్ సింగ్ చీమా స్పందిస్తూ.. దుండగులు జరిపిన కాల్పుల్లోయూత్ లీడర్ విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా మృతి చెందినట్లు తెలిపారు. ఆయన సోదరుడు స్థానిక మున్సిపల్ ఎన్నికలు పార్టీ తరఫున పోటీ చేసినట్లు పేర్కొన్నారు. విక్కీ వద్ద లైసెన్స్ తుపాకీ ఉన్నప్పటికీ దుండగలు జరిపిన భీకర కాల్పుల్లో తనను రక్షించుకోలేకపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే విక్కీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేలా వివిధ ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రాంతీయ పక్షాలన్నీ కలిసి బలీయమైన నేషనల్ ఫ్రంట్‌గా ఏర్పడుతాయని విశ్వాసముందన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాబోదన్నారు. తాము ఏర్పాటు చేయబోయే నేషనల్ ఫ్రంటే బీజేపీని ఎదుర్కొంటుందని తెలిపారు. బీజేపీతో తమ పార్టీ మైత్రీ బంధం కథ ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. మాయావతికి చెందిన బహుజన సమాజ్ పార్టీతో తమ పొత్తు శాశ్వతమన్నారు. రైతులకు సంబంధించిన అంశాలే తమ పార్టీ మేనిఫెస్టోలో కీలకమని, ఈ విషయంలో రాజీకి తావులేదన్నారు. అందుకే, వ్యవసాయ చట్టాలపై కేంద్రం తీరుకు నిరసనగా దశాబ్దాల నాటి బీజేపీ మైత్రీ బంధాన్ని సైతం తెంచుకుని, ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్‌లో అమలు కానీయ బోమన్నారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బాదల్ భార్య హర్సిమ్రత్ కౌర్ సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
భారీ ఎత్తున నిరసనలు.. సీఎం నివాసం ముట్టడి
చండీగఢ్/సిస్వాన్: పంజాబ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శిరోమణి అకాళీదళ్ నేతలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసాన్ని మంగళవారం ముట్టడించారు. ఆరోగ్య మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకురావడంతో సీఎం ఇంటి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తుపానును ఆపలేరు ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ మాట్లాడుతూ... ‘‘తన బలగాన్నంతా ఉపయోగించినప్పటికీ.. ఇప్పుడు చెలరేగిన తుపానును కెప్టెన్ ఆపలేరు. వ్యాక్సినేషన్లో కుంభకోణం.. ఫతే కిట్ కిట్‌లో స్కాం.. ఎస్సీ స్కాలర్షిప్ విషయంలోనూ ఇదే తంతు... రైతుల నుంచి భూసేకరణ అంశంలోనూ ఇదే రకమైన వైఖరి’’ అంటూ అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.కాగా పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతన నిధుల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోమవారం సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆప్ ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమా నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సామాజిక సంక్షేమ మంత్రి సధూ సింగ్ ధరమ్‌సోత్‌ను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. తక్షణమే ఉపకార వేతన బకాయి నిధులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అణగారినవర్గాలకు అందాల్సిన స్కాలర్‌షిప్‌నకు సంబంధించిన 64 కోట్ల నిధులు దారి మళ్లాయంటూ గతేడాది అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన ఆదేశించారు. చదవండి: ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ -
పంజాబ్‌లో కొత్త పొత్తు పొడిచింది
చండీగఢ్: పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించారు. మిగిలిన 97 స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేస్తుంది. పంజాబ్ రాజకీయాల్లో ఇది చరిత్రాత్మకమైన రోజని ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహాలను రచించడానికి త్వరలోనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీదళ్ కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసింది. పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడంతో మోదీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క అకాలీదళ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ఎస్ఏడీతో పొత్తును బీఎస్పీ చీఫ్ మాయావతి సరికొత్త సామాజిక ముందడుగు అని అభివర్ణించారు. పొత్తుతో సమాఖ్య ప్రజాస్వామ్య విప్లవం ప్రారంభమవుతుందని ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. దళిత ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 32 శాతం ఓట్లు దళితులవే కావడంతో వారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీఎస్పీతో అకాలీదళ్ చేతులు కలిపింది. జలంధర్, హోషియార్పూర్, నవాన్షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితులు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. డోవుబా ప్రాంతంలో బీఎస్పీకి మంచి ఆదరణ ఉంది. వచ్చే ఎన్నికల్లో మాల్వా ప్రాంతంలో ఏడు సీట్లు, మాజాలో అయిదు, డోవుబాలో ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి పోటీచేసి 13 ఎంపీ స్థానాలకు గాను 11 సీట్లను కొల్లగొట్టి తమ పొత్తుకి ఎదురులేదని నిరూపించాయి. అప్పట్లో మూడు స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ అన్నింట్లోనూ విజయం సాధించింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఆ పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్నాయి. చదవండి: బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఇరకాటంలో చీఫ్