శిరోమణి అకాలీదళ్ అభ్యర్థుల జాబితా విడుదల | Akali Dal releases list of four candidates for Delhi | Sakshi
Sakshi News home page

శిరోమణి అకాలీదళ్ అభ్యర్థుల జాబితా విడుదల

Published Tue, Jan 20 2015 11:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Akali Dal releases list of four candidates for Delhi

న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మంజీత్‌సింగ్ వెల్లడించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మంజీందర్‌సింగ్ సిర్సా, కల్కాజీ నియోజకవర్గం నుంచి  హర్మీత్‌సింగ్ కల్కా. షహధార నుంచి జితేందర్‌సింగ్ షంటీ , హరినగర్ నుంచి శ్యామ్‌శర్మలను ఎస్‌ఏడీ తరఫున బరిలోకి దించుతున్నామన్నారు. కాగా సిర్సా... ఎస్‌ఏడీ గుర్తయిన తూకంతో, మిగతా అభ్యర్థులు కమలం గుర్తుతోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement