సాక్షి, చండీగఢ్ : పంజాబ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఏడీ).. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
పంజాబ్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ 13 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. అదే సమయంలో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బీజేపీతో పొత్తు పెట్టుకుటుందంటూ వచ్చిన ఊహాగానాలను ఖండించారు.
పొత్తు గురించి నాకే తెలియదు
అకాలీదళ్ 2019 ఎన్నికల్లో ఎన్‌డీఏలో బీజేతో పొత్తు పెట్టుకుంది. ఆ లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీజేపీలు రెండేసి స్థానాల్లో గెలుపొందాయి. అయితే, ఈ సారి లోక్ సభ నేపథ్యంలో బీజేపీ- అకాలీదళ్ కూటమి, సీట్లపై ప్రకటన ఉందన ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే అంశంపై ఎస్‌ఏడీ అధినేత పొత్తు, సీట్ల ఒప్పందాల గురించి తనకే తెలియదని స్పష్టం చేశారు.
బీఎస్‌పీతోనే మా పొత్తు
ఇలాంటి ఊహాగానాలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అన్న ఆయన రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)తో పొత్తు కొనసాగించేందుకు తమ పార్టీ ఆసక్తిగా ఉందని అన్నారు.
బీజేపీతో తెగదెంపులు
కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అకాలీదళ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. సెప్టెంబర్ 2020లో ఎన్‌డీఏ నుండి నిష్క్రమించింది. ఆ తర్వాత వ్యవసాయ చట్టాల్ని కేంద్రం రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ రెండు పార్టీల కూటమి అంశం తెరపైకి వచ్చింది. మరి దీనిపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment